అక్టోబర్ 23 /24 తేదీన దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి ? | Dasara 2023 Date in Telugu | vijayadashami 2023 date and time | Bhakthi Margam


అక్టోబర్ 23 /24 తేదీన దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి ?

ఈ సంవత్సరం విజయదశమి ఏ తేదీన జరుపుకుంటారు, ముహూర్తం, పూజావిధానం, చేయాల్సిన పనులు ఇవే..

విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ సంవత్సరంఅక్టోబరు 15 నుంచి అక్టోబరు 24 ఆశ్వియుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున మర్యాద పురుషోత్తముడు రాముడు లంకాపతి రావణుడిని సంహరించాడు దుర్గా దేవి మహిషాసురుడిని సంహరించారు.శరన్నవరాత్రి వేడుకలు ఈ ఏడాది అక్టోబరు 15 నుంచి అక్టోబరు 24 వరకూ జరగనున్నాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారాలు, ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితమో తెలుసుకుందాం..

అక్టోబరు 15 ఆదివారం - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి -  శ్రీ బాలా త్రిపురసుందరి దేవి

మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే అమ్మ అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజు రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి పూజిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.

అక్టోబరు 16  సోమవారం - ఆశ్వయుజ శుద్ధ విదియ - శ్రీ గాయత్రీ దేవి

సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.

అక్టోబరు 17 మంగళవారం - ఆశ్వయుజ శుద్ధ తదియ - అన్నపూర్ణాదేవి

అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో కనిపించే అన్నపూర్ణను దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. 

అక్టోబరు 18 బుధవారం- ఆశ్వయుజ శుద్ధ చవితి - శ్రీ మహాలక్ష్మీ దేవి 

ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ అలంకారాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి.

అక్టోబరు 19 గురువారం- ఆశ్వయుజ శుద్ధ  పంచమి- శ్రీ మహా చండీ దేవి

చండీ దేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరీ దేవి, జగన్మాత, భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గ, కాళి , శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పిలుస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోర్కె నెరవేరుతుందని చెబుతారు.

అక్టోబరు 20 శుక్రవారం - ఆశ్వయుజ శుద్ధ షష్టి - సరస్వతీ దేవి

సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవి దర్శనార్థం విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి వరకూ మరింత పుణ్యదినాలుగా భావిస్తారు.

అక్టోబరు 21 శనివారం - ఆశ్వయుజ శుద్ధ సప్తమి - లలితా త్రిపుర సుందరి

సాక్షాత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా  చిరుమందహాసంతో.. చెరుకుగడను చేతపట్టుకుని కూర్చున్న లలితా త్రిపుల సుందరిని దర్శించుకున్నవారికి ఎలాంటి కష్టమైనా తీరిపోతుంది

అక్టోబరు 22 ఆదివారం - ఆశ్వయుజ శుద్ధ అష్టమి - దుర్గాదేవి

లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయి. 

అక్టోబరు 23 సోమవారం- ఆశ్వయుజ శుద్ధ నవమి - మహిషాసుర మర్ధిని 

దుష్టుడైన మహిషాసురుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో  ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజాలు,అష్ట ఆయుధాలు, సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే.. భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 

అక్టోబరు 23 సోమవారం మధ్యాహ్నం - ఆశ్వయుజ శుద్ధ దశమి- రాజరాజేశ్వరి దేవి

వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి రోజు అమ్మవారి  రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. దశమి రోజు  ఆయుధ పూజ చేసేవారు అక్టోబరు 24 మంగళవారం సూర్యోదయానికి దశమి తిథి ఉండడంతో ఆ రోజు చేస్తారు.

విజయదశమికి సంబంధించిన ప్రసిద్ధ కథ 

మహిషాసురుడనే రాక్షసుడు మరియు దుర్గాదేవిది. కథప్రకారం, మహిషాసురుడనే రాక్షసుడు తరచూ గేదె రూపంలో ఉండేవాడంట. ఏ మనిషి లేదా దేవుడు తనని చంపలేడనే వరం కూడా కలిగిఉన్నాడు. ఈ వరం వల్ల తనకి చావే ఉండదని భావించేవాడు. 

అందుకని గర్వంతో మూడులోకాలను ముప్పతిప్పలు పెట్టేవాడు. ఈ మూడులోకాల ప్రాణులు ఈ రాక్షసుడి నుంచి విముక్తి కావాలని తపించాయి. దానికి ఫలితంగా, అమ్మవారు దుర్గాదేవి రూపంలో అవతరించింది. దుర్గ రూపం భయంకరంగా, అదే సమయంలో భయం తొలగించేదిగా కూడా ఉంది. ఆమె తన వాహనం సింహంపై కూర్చుని పది చేతుల్లో భయంకర ఆయుధాలతో కదిలి వెళ్ళింది. ఈ రూపంలో, మహిషాసురుడితో అమ్మవారు పోరాడింది. విజయదశమినాడే మహిషాసురుడు ఓడిపోయి చంపబడ్డాడు.

Related Postings:

1. Stotras In Telugu

tags: విజయదశమి, Vijayadasami Telugu ,Dussehra 2023, Dussehra 2023 Date, History, Wishes, Vijayadashami Puja vidhanam, devi navaratri 2023 dates, devi navaratri pooja vidhanam in telugu, devi navaratri prasadam list in telugu, navratri prasadam list for nine days 2023, devi navaratri story in telugu, devi navaratri pooja vidhanam in telugu pdf download, telugu pooja books pdf free download, devi navaratri book pdf, devi panchayatana puja pdf telugu, lalitha devi pooja vidhanam in telugu pdf, vijayawada devi pooja vidhanam in telugu, Sri Durga Devi Shodashopachara Puja Vidhanam, Sri Kanakadurga Pooja Vidhanam , Telugu Devotional Songs, nitya pooja vidhanam in telugu pdf, sri durga ashtottara shatanamavali in telugu pdf, sri lakshmi narasimha swamy pooja vidhanam in telugu pdf, bala pooja vidhanam in telugu pdf, pooja vidhanam book in telugu pdf, vastu pooja vidhanam in telugu pdf free download, Dasara vijayadashami history in telugu, about dasara in telugu, dasara festival story, dussehra festival 2023, Vijayadashami pooja vidhanam in telugu, dasara 2023 date in telugu/2023 dasara telugu date/2023 Dusshera date/2023 Dusshera eppudu,2023 october telugu calendar/2023 devi navaratrulu dates/2023 October important dates/2023 dasara,Dussehra or Vijayadashami is celebrated after the conclusion of the nine-day-long festival of Navratri.

Comments