మహాలయ పక్షాలు 15 రోజులు విశిష్టత | Importance of Mahalaya Amavasya | Bhakthi Margam

మహాలయ పక్షాలు - విశిష్టత

భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. దీనినే మహాలయ పక్షం అన్నారు. 
ఈ పక్షం రోజులు (15 రోజులు ) నియమ పూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తి పరచాలి. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్తులైన మాతా పితరుల కోసం ప్రతివారూ ఈ పక్షాలలో విధింపబడ్డ పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.
ప్రతి యేడూ చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం రోజులూ చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి.

ఆఒక్కరోజు వారు అన్నశ్రాద్ధంపెట్టలేకపోతే, హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఈ మహాలయంలో ఒక విశేషం - వారి వారి జ్ఞాతి, బంధువు లందరికీ అర్ఘ్యోదక, పిండోదకాలు ఉండగలవు
మనది కర్మ భూమి ఈ కర్మ భూమిలో అనేక మంది మంచి పనులచే భగవంతుని అనుగ్రహం పొందినారు. అలాంటి కర్మలను మనం చాలా విస్మరిస్తున్నాము. పితృ కర్మలు అనగా ఆబ్దీకములు(శ్రాద్ధ కర్మలు, తద్దినములు) వదిలిపెట్టడము అంటే చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని, మన పిల్లల్ని, మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది.

నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలను ఆచరించే మనవులు తమ పితృ దేవతలను ఉద్దేసించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ. శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించ వలసినది. మృతులైన పిత్రాదులను ఉద్దేసించి శాస్త్రోక్తమైన కాలమందును, దేశమందును పక్వాన్నము గాని(భొక్తలకు భోజనము ), యామాన్నము గాని(బియ్యము, పచ్చి కూరలు, పప్పు దినుసులు మొదలగునవి), హిరణ్యము(బంగారము) గాని విధి ప్రకారము బ్రాహ్మణులకు దానము చేయుట శ్రాద్ధమనబడును.

పితృ దేవతలను ఉద్దేసించి మంత్ర పూర్వకముగా ఇచ్చే వస్తువులు ఏ రూపముగా ఇచ్చినను వారికి చేరును.
మనము శ్రాద్ధ కర్మ చేయునపుడు పితృ దేవతలు వాయురూపమున అతి త్వరగా వచ్చి భోజనము భుజింతురు అందుచే శ్రీ రామ చంద్రుడు శ్రాద్ధము చేయునపుడు సీతా దేవి బ్రాహ్మణుల యందు దశరధాదులను చూసెనని కధ ఉన్నది.

మహాలయపక్షం 15 రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ద తో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. 
వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపం లో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు.

మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు.
మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్నసంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వాసం.

ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణలు వదలడం, గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు, మనకు మనసు నిండుతాయి.

భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు.అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. 

ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ పితృ దేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు.ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృ దేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. 

ఈ పదిహేను రోజులూ నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి. లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు.ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం గనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం. 

అంతేకాక ఆషాఢంలో వచ్చే కర్కోటక సంక్రమణ నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు, బురద, చిమ్మచీకటితో భయంకరమవుతుంది. అశుభమనిపిస్తే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. 
కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణములు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు. అంతేకాక ఆషాఢం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితురులు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజూ శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు.పితురులను తృప్తి పరచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తులైన మాతాపితురుల కోసం ప్రతీవారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు. భాద్రపద పూర్ణిమతో అరంభమైన పితృపక్షం, మహాలయ పక్షమం ఆమాసపు అమావాస్యతో ముగుస్తుంది.
tags: mahalaya amavasya story in telugu, mahalaya amavasya significance, mahalaya amavasya good or bad, mahalaya amavasya pooja vidhanam in telugu, what is mahalaya amavasya, importance of mahalaya amavasya, mahalaya amavasya pitru paksha, how to do pitru paksha puja at home, mahalaya amavasya history in telugu, mahalaya amavasya 2023 date and time, mahalaya paksha 2023, mahalaya paksha amavasya 2023, mahalaya amavasya 2023 start and end date, mahalaya amavasya 2024

Comments