శ్రావణ వరలక్ష్మి వ్రత విధానం
భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి.
స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.
శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామగ్రి :-
పసుపు 100 గ్రాములు
కుంకుమ100 గ్రాములు.
ఒక డబ్బ గంధం విడిపూలు,
పూల దండలు - 6
తమల పాకులు -30 వక్కలు
వంద గ్రాముల ఖర్జూరములు
50 గ్రాముల అగరవత్తులు
కర్పూరము - 50 గ్రాములు
౩౦ రూపాయి నాణాలు
ఒక తెల్ల టవల్
జాకెట్ ముక్కలు
మామిడి ఆకులు
ఒక డజన్ అరటిపండ్లు
ఇతర ఐదు రకాల పండ్లు
అమ్మవారి ఫోటో
కలశం కొబ్బరి కాయలు
తెల్లదారము లేదా పసుపు రాసిన కంకణం
2 స్వీట్లు
బియ్యం 2 కిలోలు
కొద్దిగా పంచామృతం లేదా ఆవుపాలు
దీపాలు
గంట
హారతి ప్లేటు
స్పూన్స్ ట్రేలు
ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనే,
వత్తులు
అగ్గిపెట్టె
గ్లాసులు
బౌల్స్
వ్రత విధానం
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును తయారుచేసి అమర్చు కోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.
తోరం తయారు చేసుకోవడం
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.
ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}
వినాయకుని శ్లోకం:
శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
***
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః
{అని నమఃస్కారం చేసుకోవాలి}
***
ఏకాహారతి వెలిగించాలి:
{ఏకాహారతి వెలిగించి దానికి పసుపు, కుంకుమ, అక్షంతలు & పూల తో అలంకరించవలెను.}దీపారాధన వెలిగించేటప్పుడు శ్లోకం:
{యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి దీపం వెలిగించాలి}భోదీప దేవి రూపస్త్వం,
కర్మ సాక్షిహ్య విఘ్ణకృత్,
యావత్ పూజాం కరిష్యామి,
తావత్వం సుస్థిరో భవ.
దీపారాధన ముహూర్తః సుమూహూర్తోస్తు
{పై శ్లోకం చదువుకుంటూ దీపారాధన కుంది కి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలతో పూజ చెయ్యాలి.}
***
ఆచమనం:
{చెయ్యి అలివేణి (ప్లేటు)లో కడుగుకోవాలి}ఓం కేశవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
{మళ్లీ చెయ్యి కడుగుకోవాలి}
ఓం గోవిందయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}
{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}
కేశవనామాలు:
ఓం గోవిందాయ నమఃఓం విష్ణవే నమః
ఓం మధుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం రిషీకేసాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అదోక్షజాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే శ్రీకృష్ఱాయ నమః
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీనరశ్యామో హృదయస్థో జనార్థనః ||
ఆపదామపహర్తారందాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే ||
{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
ఓం శచీపురందరాభ్యాం నమః
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ సితారామాభ్యాం నమః
||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||
భూశుద్ధి
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
{ప్రాణాయామము చేసి అక్షంతలను వెనుక వేసుకోవలెను.}
ప్రాణాయామం
ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||
***
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః ||
(అని నాలుగు దిక్కులా ఉద్ధరని తో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా.)
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం(కులదైవాన్ని సంభోదించుకోవాలి "పరశ్వరుని" బదులుగా)
శుభేశోభనే ముహూర్తే - శ్రీ మహావిష్ణో రాజ్ఞయా
ప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణః
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే
ప్రథమపాదే - జంబూద్వీపే
భరతవర్షే -భరతఖండే
(India లో వుంటే "భరతఖండే" అని చదవాలి, U.S లో వుంటే "యూరప్ఖండే" చదవాలి)
మేరోః దక్షిణ దిగ్భాగే
(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి)
(శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా / గోదావర్యోః మధ్యదేశే" )
కావేరి నదీ సమీపే
నివాసిత గృహే
(Own house అయితే "సొంత గృహే"అని చదవాలి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ ఖర నామ సంవత్సరే
ఉత్తరాయనే
(దక్షిణాయనే from 17th july / ఉత్తరాయనే from 15th jan --- -[6 months కి ఒక సారి మారుతుంది. See panchamgam])
గ్రీష్మ ఋతువే
('గ్రీష్మ ఋతువే' - / 'వర్ష ఋతువే' - / 'వసంత ఋతువే' - )
జ్యేష్ఠ మాసే
(తెలుగు నెల)(శ్రావణ, చైత్ర, జ్యేష్ఠ, )
శుక్ల పక్షే
(శుక్ల పక్షం / బహుళ పక్షం కృష్ణ పక్షం)
________ తిధౌ
(morning ఏ తిథి అయితే ఆ తిథే చదువుకోవాలి)
(Ex: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షస్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ or అమావాస్య.)
________ వాసరే
(ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి Ex: ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని.)
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరుణే,
ఏవం గుణవిశేషణ విశిష్టాయాం,
శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రా
(Ex: భారద్వాజస )
అహం __________ నామ ధేయా
(భర్త పేరు చదువు కోవాలి) (Ex: సత్య ప్రకాష్)
ధర్మ పత్ని ______________ నామ ధేయా,
(Ex: లక్ష్మీ శైలజ)
సకుటుంభాయాః సకుటుంబస్య - ఉపాత్త దురితక్షయ ద్వారా,
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం,
క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,
ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం,
సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం,
సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే,
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను.}
****
కలశారాధన
అదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజార్ధం తదంగ కలశారాధనం కరిష్యే.కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితోబ్రహ్మా
మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా
వసుంధరా ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః అంగైశ్చ
సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే చైవ
గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు.
{శిరస్సు పైన పూజా ద్రవ్యముల పైన నీరు చల్లవలెను}
ఆత్మానం సంప్రోక్ష్య, పూజ ద్రవ్యాణి సంప్రోక్ష్య.
గణపతి పూజ
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదనచేసి చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి).
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి.. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
అంభి కలశపూజ..
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.
అధాంగపూజ: పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి
చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.
(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి..
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః,
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః,
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః,
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః,
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
u
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః
తోరపూజ
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః ద్వితీయ గ్రంథిం పూజయామి,
లోకమాత్రేనమః తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః చతుర్థ గ్రంథిం పూజయామి,
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
ఈ మంత్రాలు అనంతరం వరలక్ష్మీ వ్రతం కథను వినాలి. అనంతరం అక్షతలు శిరస్సుపై చల్లుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి.
Comments
Post a Comment