కలియుగాంతాన్ని సూచించే శివలింగం కేదారేశ్వర స్వామి ఆలయం | Harishchandragad History In Telugu | MaharashtraKedareshwar Cave Temple
కలియుగాంతం గురించి మీరు తెలుసుకోవచ్చు
మహా శివుడి లీలలు మానవమాత్రుడికి వర్ణింప తరమా.. దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో లింగాకారంలో కొలువుదీరి భక్తుల పూజలను అందుకుంటున్నాడు పరమశివుడు. మనదేశంలో పకృతి లో కొండాకోనల నడుమ వెలసిన అనేక దేవాలయాలు..
యుగాంతం. ఈ పదాన్ని ఆధారంగా చేసుకొన్ని ఎన్నో కథలు, నవలలు, చివరికి సినిమాలు కూడా వచ్చాయి. ఇక పరిశోధనలకు లెక్కలేదు. ఈ యుగాతం విషయమై ధార్మిక, వేద భూమిగా పేరొందిన భారతదేశంలో పరిశోధనలకు లెక్కలేదు. లయకారకుడైన పరమేశ్వరుడి ఆదేశం మేరకు ఈ యుగాంతం అనే ప్రక్రియ జరుగుతుందని చెబుతారు.
ఇక కలియుగం అంతం తర్వాత ఈ భూ మండలం పై జీవంఉండదని కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది. ఒక్క భారత దేశంలోనేకాకుండా కలియుగానికి సంబంధించిన కథలు, పరిశోధనలు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన విషయాల పైఅప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి.
అలా కలియుగాన్ని 24 గంటలు మందే చెప్పే ఒక గుహాలయం భారతదేశంలోనే ఉంది. మీరు అక్కడికి చేరుకొంటే యుగాంతం గురించిముందుగా తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం మీ కోసం.
ప్రస్తుతం మనం నివశిస్తున్నది కలియుగం. ఈ యుగం తర్వాత ఈ ప్రపంచం మొత్తం అంతమై పోతుందని భారతపురాణాలే కాకుండా ఇతర దేశాల్లోని చాలా మంది నమ్ముతున్నారు.
శాస్త్రవేత్తలు కూడా చాలా ఏళ్లుగా ఈ విషయం పై పరిశోధనలు చేస్తున్నారు. భారత పురాణాలను అనుసరించి ఈ మొత్తం ప్రపంచాన్ని క`తయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని విభజించారు.
ప్రతి యుగం తర్వాత భయంకర ప్రళయం ఏర్పడుతుందని అటు పై మరుసటి యుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతాయి.
అయితే కలియుగం తర్వాత అటువంటి ధర్మం పునరావ`తం కాదని ఈ స`ష్టి నాశనం తప్పదని చెబుతారు. ఇక ఈ స`ష్టి నాశనాన్ని ముందుగా తెలియజేసే కొన్ని ఘటనలు మనకు గోచరిస్తాయి.
ఆ ఘటనల్లో చాలా వరకూ దేవాలయాల్లో జరుగుతాయి. అటు వంటి దేవాలయం మహారాష్ట్రలో ఉంది.
ప్రతి దేవాలయం ఏదొక రహస్యాన్ని దాచుకున్నవే.. అలాంటి ఆలయంలో ఒకటి కేధారేశ్వర స్వామీ ఆలయం.
అపురూప మైన .. చూపరులను ఆకట్టుకునే అద్భుతమైన కట్టడం.. అహమద్ నగర్ లో హరిచంద్ర కోట లో ఉన్న కేదారేశ్వర స్వామి ఆలయం.
ఈ మందిరం పై ఉంది ఒక పెద్ద బండరాయి. కింద 4 స్థంబాలు పైన శివయ్య కోసం గుడి నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు.
ఈ ఆలయంలో 4 యుగాలికి సంకేతాలు గా 4 స్థంబాలు వున్నాయి. సత్య యుగం,త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగాలకి గుర్తులుగా భావిస్తారు భక్తులు.
ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు ఒక్కో యుగంతనికి ఒక స్థంభం విరిగిపోతుంది. ఒక్కొక్క యుగాంతం సమయంలో సరిగ్గా 24 గంటల ముందు ఒక్కో స్తంభం విరిగి పోయిందని స్థానిక కథనం.
ఇప్పుడు మనం కలియుగం లో వున్నాం కనుక ఈ పెద్ద బండరాయి ఒక స్థంభం పై న మాత్రమే వున్నది. ఎప్పుడు ఐతే ఈ స్థంభం కూడా పతనం అవుతుందో ఆ రోజు ఈ కలియుగాని కి ఆఖరి రోజు గా స్థానికుల కథనం
అంతటి మహాత్వమైన గోపురం ఉన్న ఈ ఆలయంలో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే...ఈ గుడి 4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది.. అందుకనే ఈ ఆలయం లోపల చాలా చల్లగా ఉంటుంది. ఇక లోపలికియు ఎవరూ వెళ్లరు. ఒక్క వర్ష కాలం లో మాత్రం గుడిలోపల ఒక్క చుక్క నీరు కూడా ఉండదు.. వేసవి, శీతాకాలం లో 5 అడుగుల ఎత్తున నీరు వుంటుంది .
ఇక కలియుగాంతం గురించిన కథలు కేవలం భారతీయ పురాణాల్లోనే కాకుండా అనేక ఇతర పాశ్చత్య దేశాల్లో కూడా ఉంది.
ముఖ్యంగా రష్యా, ఈజిప్టు, వంటి దేశాకు చెందిన గ్రంధాల్లో కూడా మనకు కనిపిస్తాయి. ఇక ఈ కేదారేశ్వర గుహకు దగ్గర్లోనే హరిశ్చంద్రేశ్వర గుడి ఉంది. ఇందులో ప్రధానంగా పూజలు అందుకునేది వినాయకుడు.
చరిత్ర :
కోట చాలా పురాతనమైనది. మైక్రోలిథిక్ మానవుని అవశేషాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. మత్స్యపురాణం, అగ్నిపురాణం మరియు స్కందపురాణం వంటి వివిధ పురాణాలు (ప్రాచీన గ్రంథాలు) హరిశ్చంద్రగడ్ గురించి అనేక సూచనలు ఉన్నాయి.
దీని మూలం 6వ శతాబ్దంలో కలచూరి రాజవంశం పాలనలో ఉన్నట్లు చెబుతారు . కోట ఈ యుగంలో నిర్మించబడింది. వివిధ గుహలు బహుశా 11వ శతాబ్దంలో చెక్కబడి ఉండవచ్చు. ఈ గుహలలో విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి.
కొండచరియలకు తారామతి మరియు రోహిదాస్ అని పేర్లు ఉన్నప్పటికీ, అవి అయోధ్యకు సంబంధించినవి కావు. గొప్ప జ్ఞాని చాంగ్‌దేవ్ ( తత్వసార్ అనే పురాణాన్ని సృష్టించినవాడు), 14వ శతాబ్దంలో ఇక్కడ ధ్యానం చేసేవారు.
గుహలు అదే కాలం నాటివి. కోటపై వివిధ నిర్మాణాలు మరియు పరిసర ప్రాంతంలో ఉన్నవి ఇక్కడ విభిన్న సంస్కృతుల ఉనికిని సూచిస్తున్నాయి. నాగేశ్వర్ (ఖిరేశ్వర్ గ్రామంలో), హరిశ్చంద్రేశ్వర్ ఆలయం మరియు కేదారేశ్వర్ గుహలో ఉన్న శిల్పాలు ఈ కోట మధ్యయుగ కాలానికి చెందినదని సూచిస్తున్నాయి , ఎందుకంటే ఇది మహాదేవ్ కోలి తెగల టోటెమ్‌గా మహాదేవకు సంబంధించినది .
వారు మొగల్స్ కంటే ముందు కోటను నియంత్రించారు . తరువాత కోట మొగల్ ఆధీనంలో ఉంది. 1747లో మరాఠాలు దీనిని స్వాధీనం చేసుకున్నారు.
అహ్మద్ నగర్ నుంచి ఈ కేదారేశ్వర గుహకు 146 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 3.48 గంటలు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎప్పుడైనా గుహను సందర్శించుకోవడానికి వీలవుతుంది.
ముంబై నుంచి హరిశ్చంద్ర ఘడ్ 144 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Comments
Post a Comment