ఈ ఊరి బావిలో నీరు తాగితే కవల పిల్లలు గ్యారంటీ | Doddigunta Village Well Water Mystery | Twins Village In AP | Bhakthi Margam
ఈ దొడ్డిగుంట ఊరి బావి కథ ఆంధ్ర ప్రదేశ్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ బావి నీరు తాగితే కవలలు పుడుతున్నారంటూ మీడియా కథనాలు రావడంతో దూర ప్రాంతాల వారు సైతం ఈ బావి నీటి కోసం ఎగబడుతున్నారు.
దొడ్డిగుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, రంగంపేట మండలంలోని గ్రామం. ఇది ఆంధ్రా ప్రాంతానికి చెందినది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకినాడ నుండి పశ్చిమాన 28 కిమీ దూరంలో ఉంది. రంగంపేట నుండి 1 కి.మీ.
ట్విన్స్ గ్రామంగా పాతదొడ్డుగుంట ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం పాతదొడ్డిగుంట గ్రామానికి కూడా ‘కవల ఊరు’ అనే పేరొచ్చింది.
కవలల గ్రామం:
సమాజంలో కవలలు అరుదుగా కనిపిస్తుంటారు. కొన్ని చోట్ల ఒకటి, రెండు జంటలు కనిపిస్తారు. కానీ, దొడ్డిగుంట పూర్తిగా భిన్నం. ఈ ఊరిలో పెద్ద సంఖ్యలో కవలలు కనిపించడమే విశేషంగా మారింది.
పాతదొడ్డిగుంట గ్రామానికి కూడా ‘కవల ఊరు’ అనే పేరొచ్చింది. అసలు ఈ గ్రామానికి ఎందుకా పేరు వచ్చింది..? దొడ్డుగుంటలోని ఆ బావి రహస్యమేంటి..? ఆ ఊరి నీరు తాగితే కవల పిల్లలు పుడతారా..? ఆ బావి నీటిలో ఔషద గుణాలు పుష్కలంగా ఉన్నాయా అంటే..? అవును ఇది నిజమే అంటున్నారు ఆ గ్రామస్తులు. గత 100 ఏళ్లుగా ఇదే.. అక్కడి ప్రజలు నమ్ముతున్న నమ్మకం. తాతల కాలం నాటి ఆ బావిలోని నీరు తాగితే కవల పిల్లలు పుడతారట. ఆ బావి నీటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారని ఆ ఊరి ప్రజలు అంటున్నారు. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి వచ్చి నీటిని తీసుకెళ్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
గ్రామంలో 150 నుండి 200 మందికి పైగా కవలలు ఉన్నారు. ఆ ఊరిలో ప్రతి ఇంట్లో కవల పిల్లలు ఉంటారంటే అతిశయోక్తి కాదు.
ఇక్కడ కవలలు ఎక్కువగా పుట్టడానికి ఊరి చివరిలో ఉన్న బావి నీరే కారణమని చెబుతుంటారు. ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకూ కవలలున్నారు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే ఈ ఊరికి గుర్తింపు వచ్చింది"
ఈ గ్రామంలో ఒక బావి ఉంది మరియు ఈ బావి నీటిని తాగడం వల్ల కవల పిల్లలు పుడతారని గ్రామస్తులు నమ్ముతారు. అలాగే పిల్లలు లేని వారు ఆ బావి నీరు తాగితే గర్భం దాల్చుతుందనే భావన కూడా ఉంది.
బావి నీరు తమ అనారోగ్యాన్ని నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది ప్రజలు మంచినీటి కోసం ఈ ప్రాంతానికి వస్తుంటారు.
బావి నీటికి అద్భుత శక్తులు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు .
గ్రామస్థులకు ఇతర గ్రామాలకు చెందిన వారితో వివాహాలు చేసిన సందర్భాలు కూడా కవలలకు జన్మనిస్తున్నాయని వారు పేర్కొన్నారు. వారు తమ వాదనకు మద్దతుగా ఇలాంటి అనేక ఉదంతాలను ఉటంకించారు.
సుమారు 30 ఏళ్ల క్రితం దొడ్డిగుంట ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు వచ్చిన ఓ మాస్టారు ద్వారానే ఈ గ్రామంలో కవలలు ఎక్కువగా ఉన్నారని ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకూ గ్రామస్థులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదట.
మాస్టారు జనాభా లెక్కల కోసం ఇంటింటికీ తిరుగుతుంటే చాలామంది కవలలు కనిపించారు. దాంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మాస్టారు మా దొడ్డిగుంటకే కాపురం వచ్చారు. ఆయనకు చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదని బాధపడేవారు. కానీ, ఈ ఊరు రావడం, ఆ బావి నీరు తాగడంతో ఆయన భార్య కూడా కవలలకు జన్మనిచ్చారు. దాంతో దొడ్డిగుంట బావి నీళ్లు తాగితే పిల్లలు పుడతారు, కవలలు పుడతారని ఆయన స్థానిక పత్రికల వారికి చెప్పడంతో మా ఊరి గురించి పేపర్లలో వచ్చింది"
సుదూర ప్రాంతాల నుంచి వైజాగ్ మరియు హైదరాబాద్, దేశం నాలు ములాలా నుండి కూడా ప్రజలు బావి నీరు తాగేందుకు ఇక్కడికి వస్తుంటారు.
మండలం పేరు : రంగంపేట
జిల్లా : తూర్పు గోదావరి
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్
ప్రాంతం : ఆంధ్ర
దొడ్డిగుంట ఎలా చేరుకోవాలి
రోడ్డు ద్వారా:
పెద్దాపురం దొడ్డిగుంటకు సమీప పట్టణం. దొడ్డిగుంట నుండి పెద్దాపురం 21 కి.మీ. పెద్దాపురం నుండి దొడ్డిగుంట వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంది.
రైలు ద్వారా:
బలభద్రపురం రైల్వే స్టేషన్, బిక్కవోలు రైల్వే స్టేషన్ దొడ్డిగుంటకు సమీపంలోని రైల్వే స్టేషన్లు. మీరు పెద్దాపురం పట్టణానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లను కూడా పరిగణించవచ్చు. సామర్లకోట్ జంక్షన్ రైల్వే స్టేషన్, గూడపర్తి రైల్వే స్టేషన్ పెద్దాపురం సమీపంలోని రైల్వే స్టేషన్లు. తర్వాత రోడ్డు మార్గంలో పెద్దాపురం నుండి దొడ్డిగుంట చేరుకోవచ్చు.
బస్సు ద్వారా:
వడిసలేరు APSRTC బస్ స్టేషన్, రాజనాగ్రామ్ APSRTC బస్ స్టేషన్, గండేపల్లి APSRTC బస్ స్టేషన్ దొడ్డిగుంటకు సమీపంలోని బస్ స్టేషన్లు ఉన్నాయి. APSRTC ప్రధాన నగరాల నుండి ఇక్కడికి బస్సుల సంఖ్యను నడుపుతుంది
Comments
Post a Comment