శక్తిపీఠాల్లో ఒకటైన నైనా దేవి ఆలయ రహస్యం | Uttarakhand Naina Devi temple History In Telugu | bhakthi margam | భక్తి మార్గం
నైనా దేవి ఆలయం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠాల్లో ఒకటైన నైన దేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు.
ఆలయ చరిత్ర
నైనా దేవి ఆలయ చరిత్ర 15వ శతాబ్దానికి చెందినది, ఈ ప్రాంతాన్ని కట్యూరి రాజవంశం పరిపాలించింది. పురాణాల ప్రకారం, శివుడు ఆమె శరీరాన్ని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత సతీ దేవి (శక్తి దేవి యొక్క అవతారం) కళ్ళు పడిపోయిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం మొదట్లో ఒక చిన్న పుణ్యక్షేత్రంగా ఉంది, కానీ తరువాత చాంద్ రాజులు, గూర్ఖాలు మరియు బ్రిటీష్ వారితో సహా వివిధ పాలకులచే విస్తరించబడింది మరియు పునరుద్ధరించబడింది
దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం హిమాచల్ ప్రదేశ్ లోని నయనాదేవి ఆలయం. నయనాదేవి ఆలయం భారత దేశంలో ఉన్న ప్రసిద్ధ సతీదేవి పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ' బిలాస్ పూర్ ' జిల్లాలో రాష్ట్ర రాజ్యమార్గం 21 మీద ఆనందపూర్ సాహెబ్ కు ఉత్తరంగా 15 కి.మీ. దూరంలో ఈ నైనాదేవి ఆలయం ఒక చిన్న పర్వతశిఖరంపై ఉంది.
కొండ క్రింద నైనాదేవి అనే పేరుతోనే ఒక చిన్న గ్రామం కూడా ఉంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సతీదేవి యొక్క కళ్ళు ఈ ప్రదేశంలోనే పడటం వల్ల ఇక్కడ ఉన్న ఈ అమ్మవారి పేరు నయనాదేవి అని పిలువబడుతుంది. ఈ దేవి కండ్లకి స్వస్థత కలిగించే దేవిగా ప్రసిద్ధిచెందింది.
నైనాదేవి ఆలయం మహిష పీఠంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే మహిసాసురుడనే రాక్షసుడిని ఈ ప్రాంతంలోనే సంహరించినట్లు కథనం. పురాణ గాథల ప్రకారం మహిసాసురుడు బ్రహ్మ వల్ల వివాహిత కాని స్త్రీ వల్ల మరణం పొందేటట్లు వరాన్ని పొందుతాడు. ఈ వరం వల్ల మహిసాసురుడు ప్రజలను హింసిస్తుంటాడు.
ఈ సంఘటనతో మహిసాసురుడిని అంతమొందించుటకు అందరు దేవతలు వారి శక్తులను కలిపి దుర్గ అనే దేవతను సృష్టిస్తారు. ఈ దేవతకు అనేక రకాల ఆయుధాలను దేవతలు బహూకరిస్తారు. మహిసాసురుడు ఆ దేవత యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహమాడవలసినదిగా కోరుతాడు. ఆమె తన కంటే శక్తివంతుడిని వివాహమాడతానని చెబుతుంది.
జరిగిన యుద్ధంలో ఆమె రాక్షసుడిని ఓడించి ఆయన కళ్ళను తొలగిస్తుంది. ఈ చర్య దేవతలకు సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషంతో ఆరు "జై నైనా" అనే నినాదాలనిస్తారు. అందువలన ఆ ప్రాంతం నైనా గా స్థిరపడింది.
Comments
Post a Comment