పూటకో రూపంలో దర్శనమిచ్చే ధారీ దేవి ఆలయ రహస్యం | Uttarakhand Dhari Devi Temple History in Telugu | bhakthi margam | భక్తి మార్గం


ధారీ దేవి దేవాలయం

ధారీ దేవి భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ మరియు రుద్రప్రయాగ్ మధ్య అలకనంద నది ఒడ్డున ఉన్న హిందూ దేవాలయం . ఈ ఆలయంలో ధారి దేవత విగ్రహం పైభాగం ఉంటుంది, అయితే విగ్రహం దిగువ భాగంలో కాళీమాతలో ఉంది , ఇక్కడ ఆమె కాళీ దేవి యొక్క అభివ్యక్తిగా పూజించబడుతుంది .

ఆలయ చరిత్ర

ఉత్తరాఖండ్ లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. ఈ గుడిలోని దేవి రూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధ స్త్రీగా మారుతూ పూజలందుకుంటుంది. ఈ ధారీదేవి యొక్క విగ్రహం క్రింది భాగం కాళీమఠ్ లో వున్నది. ధారీదేవి అత్యంత శక్తివంతురాలని అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం.

 తమ నమ్మకం నిజమని అందుకు అనేక నిదర్శనాలున్నాయని స్థానికులు చెబుతారు. ఈ దేవి ఆశీసులతోనే అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుందని అంటారు. ధారీదేవి ఆలయం దాదాపు 8 దశాబ్దాల నుండి వున్నట్లుగా చాలామంది భావిస్తున్నారు.

నిజానికి ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉనికిలో వుందని తెలుస్తోంది. ఈ ఆలయం ప్రస్తావన మహాభారతంలోనూ ఉంది.. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు..ఈ ప్రదేశంలో మహాకాళి యొక్క అవతారమైన ధారీదేవి వెలసిందని ఆ కారణం వలన ఈ ప్రాంతానికి అమోఘమైన మహత్యం ఏర్పడిందని మహాభాగవతంలో పేర్కొనబడినది.

 ఉగ్ర అంశం ఈ ధారీదేవి ఆదిశక్తి యొక్క ఉగ్రఅంశం అని చెబుతారు. ఈ శక్తిని భక్తితో కొలిచినవారికి ఎంత మేలు జరుగుతుందో ఈ శక్తిని ధిక్కరించిన వారికి అంత కీడు జరుగుతుందని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు.

15 జూన్ 2013 ఆలయ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా మారింది. ఈ రోజున మా ధారీ దేవి విగ్రహాన్ని అసలు ప్రదేశం నుండి తొలగించారు. డ్యాం నిర్మాణం కోసం దీనిని వేరే ప్రదేశానికి మార్చారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి అనేక మంది నాయకులు, రాష్ట్ర వాసులు మరియు స్థానికులు ఈ ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.

అలకనంద నదిలో వరదల కారణంగా కాళీ దేవి విగ్రహం ఒక పెద్ద బండరాయికి తగిలిందని ఒక ప్రసిద్ధ పురాణం చెబుతోంది. అప్పుడు ధరో గ్రామ ప్రజలు దేవత యొక్క దివ్య స్వరాన్ని విన్నారు మరియు వారు ఆలయం ఉన్న ఈ ప్రదేశంలో కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సంఘటన తరువాత, ఈ ఆలయాన్ని ధారీ దేవి ఆలయం అని పిలుస్తారు.

address

Kalyasaur, 
Uttarakhand 
246174
tags: dhari devi temple history in telugu, dhari devi temple distance,dhari devi temple timings, dhari devi temple uttarakhand, dhari devi temple significance,dhari devi temple accommodation,uttarakhand famous temples, bhakthimargam,bhaktimargam, bhakti margam, bhakthimargam.in bhakthi margam telugu The Miracle Story of Dhari Devi Temple Uttarakhand. Uttarakhand Dhari Devi Temple History in Telugu, Uttarakhand Dhari Devi Temple story

Comments