తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు ? | Tholi Ekadasi Significance | Tholi Ekadasi Pooja Vidhanam In Telugu | bhakthi margam | భక్తి మార్గం
తొలిఏకాదశి
మన మొట్టమొదటి పండగ తొలి ఏకాదశి. ఈ పండగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే పండగ ఇది.
హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ''తొలి ఏకాదశిగా'' గా పిలుస్తారు. దీనికే ''శయనైకాదశి'' అని ''హరి వాసరమని'' , ''పేలాల పండుగ'' అని పేరు.
హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది.పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు.
ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంది.. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ.
ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు... పర్వదినాలు ఎక్కువగా వస్తాయి.. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు,.
ఏకాదశి తిథి:
కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట.
నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు.
ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు నామ స్మరణ వల్ల అంత్యమున వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని పురాణవచనం. శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి పవిత్రమైన కృష్ణనామాలను కనీసం 108 సార్లు జపించాలి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే.. రామ రామ రామ హరే హరే ॥
ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి?
ఏకాదశి నాడు ఉపవాసం ఉంది.. ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి.. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది.. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే.. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.
పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం
తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత.
వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags: తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు ?, Tholi Ekadasi Pooja Vidhanam, Tholi Ekadashi Special, Tholi Ekadasi 2023 , Tholi Ekadasi Pooja Vidhanam & Mantram In telugu ,Pelala Pindi Recipe in Telugu,జొన్న పేలాల పిండి, Tholi Ekadasi Special Recipe, Jowar Pops Recipe, Things To Do On Tholi Ekadasi , The Story Of Toli Ekadasi , Tholi Ekadasi 2023 ,Tholi Ekadasi 2023 date in telugu, 2023 tholi ekadasi,tholi ekadasi 2023 date and time, toli ekadashi, toli ekadasi 2023, bhakthimargam, bhakthi margam , bhakthi margam telugu, telugu bhakthi margam, bhakti margam telugu, telugu bhakti margam, tholi ekadasi mantram in telugu,
Comments
Post a Comment