తొలి ఏకాదశి రోజున ఈ మంత్రం జపిస్తే | Tholi Ekadasi Mtram In Telugu | Toli Ekadasi Importance In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం
ఏ మంచి పని ప్రారంభించినా దశమి, ఏకాదశి కోసం ఎదురుచూడటం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆదివారం ఏకాదశి పండుగను ప్రజలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు.
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి...శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు..
పురాణ నేపథ్యం
ఇక పురాణ నేపథ్యంలో ఆషాఢమాసం, శుక్లపక్షం ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి రోజునే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం, రాత్రికి జాగారం చేసి, మరుసటి రోజు ద్వాదశినాడు విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించాకే భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు సమసిపోతాయని నమ్ముతారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట!రుక్మాంగదుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి, పొందుకోరిన రంభను తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు, సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగు నెలలపాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామ క్రోధాదులను విసర్జిస్తారు.
నిజానికి పంభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం. ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది.
చాతుర్మాస్య దీక్షతోపాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి.
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు మాంసాహారం, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి, వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచంపై కూడా శయనించరాదు.ఏకాదశి అంటే పదకొండు అని అర్థం.
ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్య్మం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి. మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు.
ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆంటకాలు ఎదురవకూడదని వేడుకుంటారు. తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి, అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు.
ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తిచేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు.
చాలా వైష్ణవ దేవాలయాల్లో ఈ రోజున ‘విష్ణు శయనోత్సవం’ జరుపుతారు.
తొలి ఏకాదశి రోజున ఈ మంత్రం జపిస్తే :
ఆదిశేషుని వాహనంగా కలిగిన నారాయణుని లక్ష్మీసమేతంగా పూజ చేయడం వలన సకల శ్రేయస్సు కలుగును. ఈ రోజున ఉపవాసాదులు, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం సర్వ శ్రేష్ఠం.ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు నామ స్మరణ వల్ల అంత్యమున వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని పురాణవచనం. శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి పవిత్రమైన కృష్ణనామాలను కనీసం 108 సార్లు జపించాలి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే.. రామ రామ రామ హరే హరే ॥
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags: తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు ?, Tholi Ekadasi Pooja Vidhanam, Tholi Ekadashi Special, Tholi Ekadasi 2023 , Tholi Ekadasi Pooja Vidhanam & Mantram In telugu ,Pelala Pindi Recipe in Telugu,జొన్న పేలాల పిండి, Tholi Ekadasi Special Recipe, Jowar Pops Recipe, Things To Do On Tholi Ekadasi , The Story Of Toli Ekadasi , Tholi Ekadasi 2023 ,Tholi Ekadasi 2023 date in telugu, 2023 tholi ekadasi,tholi ekadasi 2023 date and time, toli ekadashi, toli ekadasi 2023, bhakthimargam, bhakthi margam , bhakthi margam telugu, telugu bhakthi margam, bhakti margam telugu, telugu bhakti margam, tholi ekadasi mantram in telugu, Toli Ekadasi , Toli ekadasi in Telugu,
Comments
Post a Comment