కేదార్‌నాథ్ ఆలయ రహస్యం వినడమే అధృష్ణం | Kedarnath Temple History In Telugu | bhakthi margam | భక్తి మార్గం


కేదార్‌నాథ్ ఆలయ రహస్యం వినడమే అధృష్ణం 

6 నెలలు మనుషులు , 6 నెలలు దేవతలు పూజించే ఏకైక ఆలయం

కేదార్‌నాథ్ మహా పుణ్య క్షేత్రాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి  తప్పక మోక్షం కలుగుతుంది. “కేదార్‌నాథ్” అనే పేరుకు “క్షేత్ర ప్రభువు” అని అర్ధం వస్తుంది: ఇది కేదర (“క్షేత్రం”) మరియు నాథ (“ప్రభువు”) అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది నామం.

కేదార్‌నాథ్‌ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం (పుణ్యక్షేత్రం). మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్‌నాథ్ భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ఏప్రిల్ (అక్షయ తృతీయ), నవంబరు (కార్తీక్ పూర్ణిమ, శరదృతువు పౌర్ణమి) మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. 

శీతాకాలంలో కేదార్‌నాథ్‌ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలలవరకు పూజలు నిర్వహిస్త్తారు. కేదార్‌నాథ్‌ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు. ఈ ప్రాంతం చారిత్రక పేరు కేదార్‌ఖండ్ ప్రభువు. 

ఆలయ ప్రత్యేకత:

ఇది మొత్తం ’12 జ్యోతిర్లింగాల్లో ఈ ఆలయం ఒకటి. కేదార్‌నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం.  ఇది హిమాలయాల్లోని చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఇక్కడ ఈశ్వరుని సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత.  ఇక్కడ కేదారనాధుడు ఆరు నెలలు మనుషుల పూజలు అందుకుంటే ఇంకో ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారని శాస్త్రాల్లో పేర్కొనబడింది.

అత్యుతన్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటిగా వెలుగొందుతున్నది. కేదార్ నాథ్ ఆలయం ఆది శంకరులచే 8వ శతాబ్దంలో పేనర్ నిర్మించబడిన శివాలయం. సుమారు 1000సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయాన్ని దీర్ఘచతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు.

త్రిగుణాకారుడైన ఈ స్వామిని దర్శించినంతనే గర్భలయానికి మధ్యలో సుమారు 8 అడుగుల చదరంగా ఉన్న పానవట్టంలో కేదారేశ్వరుని లింగమూర్తి ఉన్నది. స్వామి త్రిగుణాకారంలో స్వయంభువుగా లింగరూపంలో కేదారేశ్వరుడిగా కొలువై పూజింపబడుతున్నారు. ఈ విగ్రహమూర్తి ఆకారం కొంచెం మార్పుగా ఉంటుంది. మామూలుగా మనం చూసే శివాలయాలలో లింగాకారంలా ఉండదు.3 అడుగుల ఎత్తు ఉండి, ఉపరితలం నున్నగా కాకుండా, గరుకుగా ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించిన తర్వాత కుడిపక్కన గణేషుడు, ఎడమపక్క పార్వతీదేవి వెనుకవైపు శ్రీ కేదారేశ్వరస్వామి వారు ఉన్నారు. త్రిగుణాకారుడైన ఈ స్వామిని దర్శించినంతనే అన్ని కష్టాలు మరిచిపోతారు. ఈ యాత్ర వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఆలయ చరిత్ర

దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరుపొందిన 12వ శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్ నాథ్. కేదార్ నాత్ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపైన గాంధీసరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడి నుండి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్ నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్చుకుంటాయి. అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. ఈ శివాలయంలో ఎద్దు పృష్ఠభాగం రూపంలో ఉండే శివలింగం అత్యంత పవిత్రమైనది.

ఈ ఆలయం గంగా నదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉన్న రిషికేశ్ నుండి, 3,583 మీ. (11,755 అ.) లేదా 223 కి.మీ. (732,000 అ.) దూరంలో రాతితో నిర్మించిన దేవాలయం అసలు కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారనే ఖచ్చితమైన వివరాలు తెలియవు. "కేదార్‌నాథ్" అనే పేరు "క్షేత్ర ప్రభువు" అని అర్ధాన్ని సూచిస్తుంది. ఇది కేదారా ("క్షేత్రం"), నాథ ("ప్రభువు") అనే సంస్కృత పదాల నుండి వచ్చింది. "విముక్తి పంట" ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని అలా పిలుస్తారు అని కాశీ కేదర మహాత్మ్య వచనం పేర్కొంది. 

ఒక వేదాంత వృత్తాంతం ప్రకారం, శివుడు, నరనారాయణులు కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం. కురుక్షేత్ర యుద్ధం తరువాత, వ్యాస ముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరటానికి ఇక్కడకు వచ్చారని కథనం. అది ముందుగా గ్రహించి, శివుడు వారిని క్షమించటానికి ఇష్టపడక, ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు. 

పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడుని గుర్తించే సమయంలో, ఆ రూపం నేలమీద పరుండి మునిగిపోయి అదృశ్యమైంది. పాండవ సోదరులలో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోకను పట్టుకుని, వారి ముందు హాజరుకావాలని, వారిని క్షమించమని బలవంతం చేశాడు. 

దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేధార్‌నాథ్‌లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం. శివుడి శరీర భాగాలు తరువాత మరో నాలుగు ప్రదేశాలలో కనిపించాయి. కావున సమిష్టిగా, ఈ ఐదు ప్రదేశాలను ఐదు కేదారాలు ("పంచ కేదార్") అని పిలుస్తారు. ఆ ఎద్దు తల పశుపతినాథ్ దేవాలయం ఉన్న ప్రదేశంలో కనిపించింది. 

పాండవుల గురించి, కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించే మహాభారతం, కేదార్‌నాథ్ అనే ఏ ప్రదేశాన్ని ప్రస్తావించలేదు. కేదార్‌నాథ్ గురించి మొట్టమొదటి ప్రస్తావనల్లో ఒకటి స్కంద పురాణంలో (సుమారు 7వ -8వ శతాబ్దం) కనిపిస్తుంది. ఇందులో గంగా నది మూలాన్ని వివరించే కథ ఉంది. శివుడు తన జడలుకట్టిన జుట్టు నుండి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగా కేధారా (కేదార్‌నాథ్) అనే వచన పేర్లు ఉన్నాయి.

మాధవ సంక్షేప-శంకర-విజయ ఆధారంగా హేజియోగ్రఫీల ప్రకారం, 8 వ శతాబ్దపు తత్వవేత్త ఆది శంకరాచార్యులు కేదార్‌నాథ్ వద్ద మరణించారు. ఆనందగిరి ప్రాచినా-శంకర-విజయ ఆధారంగా ఇతర హేజియోగ్రఫీలు, అతను కంచిలో మరణించాడని పేర్కొంది. శంకరాచార్యుడు మరణించిన ప్రదేశాన్ని గుర్తించే స్మారక శిధిలాలు కేధార్‌నాథ్‌లో ఉన్నాయి.  కేదార్‌నాథ్ 12 వ శతాబ్దం నాటికి ముఖ్య పుణ్యక్షేత్రంగా ఉందని, గహదవాలా మంత్రి భట్టా లక్ష్మీధర రాసిన కృత్య-కల్పతరులో ప్రస్తావించారు. 

ఎరిక్ షిప్టన్ (1926) అనే ఆంగ్ల పర్వతారోహకుడు నమోదు చేసిన ఒక సంప్రదాయం ప్రకారం, కేదార్‌నాథ్ ఆలయానికి స్థానిక పూజారి లేరని, బద్రీనాథ్ ఆలయ పూజారే వాటి మధ్య ఒకే రోజూ ప్రయాణించి రెండు దేవాలయాలలో సేవలను నిర్వహించేవారని తెలిపారు.

ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగం. నరనారయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలపై బదరీక్షేత్రమున తపస్సు చేసినప్పుడు ద్యోతకముయిన శివలింగము. కేదారము నందు ఉన్న శివలింగంను దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే.

ప్రత్యక దర్శనం :-

ఇక్కడ ఆ కేదారేశ్వరుని దర్శనం సైతం ఒక పద్దతిలో చేసుకోవాలి అని చెప్తారు. కేదార లింగానికి ఎదుగా మనం చూడకుండా ఒక వలయంలో నుండి స్వామిని చూడాలని చెప్తారు. చేతికి వేసుకున్న కంకణం లాంటి ఒక గుండ్రటి రింగ్ లాంటి వస్తువు నుండి చూడాలని అక్కడి వారు చెప్తారు.

గర్భ గుడిలో కి ప్రవేశించిన వెంటనే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకొని మొదటగా దానిలో నుండి స్వామిని దర్శించి ఆ తర్వాత మామూలుగా దర్శించుకోవాలి. ఇలా దర్శనం చేయడాన్ని అంతర ద్వార దర్సనం అంటారు  ఆ పరమేశ్వరున్ని దర్శించుకోవడం అని ప్రతీకగా తెలుపుతారు. అలా చూసిన కంకణాన్ని ఆ ప్రాంతంలోనే వదిలి పెట్టి వచ్చేయాలి అని చెప్తారు.

ఆ కేదారేశ్వరుని లింగానికి కొద్దిగా నెయ్యి రాసి మొక్కుకుంటే వాళ్ళు చేసిన పాపాలు పోయి కోరికలు తీరతాయి అని వాళ్ళ నమ్మకం. కేదారేశ్వరుని మహత్యం గురించి చెప్తూ ఈ విషయాన్ని స్వయంగా ఆ పరమేశ్వరుడే ఒకసారి పార్వతి దేవికి చెప్పాడట. అలా శివ లింగానికి నెయ్యి రాసి కోరికలని కోరడానికి ఒక పురాణ కథనం కూడా ఉంది.

ద్వాపర యుగంలో పాండవులు మహిషం రూపంలో ఉన్న శివుని వెనకేటప్పుడు వారు తోక పట్టుకుని లాగడంతో బృష్ఠ భాగం అంతా కమిలి పోయిందట. అప్పుడు ఆ కమిలి పోయిన బృష్ఠా భాగానికి కొద్దిగా నెయ్యి రాసి సేద తీర్చారని శాస్త్రాల్లో పేర్కొనబడినది.

అందుకే స్వామికి నెయ్యి రాసి నేతితో అభిషేకం చేయడం ఆనవాయితీగా మారింది. ఆ విధంగా అభిషేకం చేసిన నెయ్యిని ప్రసాదం గా ఇంటికి తెచ్చుకుంటే ఇంటికి శుభం కలుగుతుంది అని చెప్తారు. మన శరీరంలో ఎలాంటి నొప్పులు ఉన్న అక్కడ ఆ నెయ్యిని రాస్తే ఆనొప్పి నుండి త్వరగా విముక్తి కలుగుతుంది.

కేదార్ నాథ్ గుడి అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రం. ఇది గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ మొదలుకొని దీపావళి వరకూ భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఆ తర్వాత ఆరు నెలల పాటు మూసి ఉంచుతారు. ఆ సమయంలో దేవతలు ఆ కేదారేశ్వరుని పూజిస్తారు.

వాతావరణ మార్పు మరియు అత్యంత మంచు కారణంగా శీతాకాలంలో కేదార్ నాథ్ ఆలయం మూసి వేయబడుతుంది. ఆరు నెలలు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు కేదార్ నాథ్  యొక్క ఉత్సవ మూర్తి (విగ్రహం) తో ఉన్న పాల్కీని గుప్తాకాషికి సమీపంలో ఉన్న ఉఖిమత్ అనే ఒక  ప్రదేశానికి తీసుకువస్తారు.

పూజారులు మరియు ఇతర వేసవి కాల నివాసితులు కూడా తమ ఇళ్లను సమీప గ్రామాలకు తరలిస్తారు. 55 గ్రామాలు మరియు సమీపంలోని ఇతర గ్రామాలకు చెందిన తీర్థ పురోహిత్ యొక్క 360 కుటుంబాలు జీవనోపాధి కోసం కేదార్‌నాథ్‌పై ఆధారపడి ఉన్నాయి.

ఎలా వెళ్ళాలి?

వాయుమార్గం:

 కేదార్ నాథ్ కు సమీప ఎయిర్ పోర్టు సుమారు 183 కి. మీ. ల దూరం లోని డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. ఈ ఎయిర్ పోర్టు నుండి రుద్రప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి.

 రైలు మార్గం 

కేదార్ నాథ్ కు ఋషి కేష్ రైలు స్టేషన్ సమీపం. ఇక్కడకు కొన్ని రైళ్లు మాత్రమే వస్తాయి. అయితే 24 కి.మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు. 

రోడ్డు మార్గం 

కేదార్ నాథ్ కు నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గంలో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవిలో న్యూఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగానే వెళతాయి.

ప్రయాణ సౌకర్యాలు:-

కేదార్ నాథ్ వెళ్ళటానికి అక్కడి రోడ్డు కొన్ని కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు. ఇక్కడ రోజూ రాత్రుళ్లు 9 గం. కరెంట్ కొరత ఉంటుంది. ఇంకా ఆ కార్టేజ్స్ లో చీకట్లోనే నిద్రపోవాలి.  గౌరీకుండ్ నుండి కాలినడకతో  పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కేదారనాధుని గుడి ప్రతిష్టింపబడి ఉంటుంది. గౌరీకుండ్ ఒకఅతి చిన్న ప్రాంతం సుమారు 20 నుంచి 30 ఇళ్లున్న ఈ ప్రాంతం Kedarnath yatra కు వెళ్లేందుకు బేస్ పాయింట్ గా ఉంటుంది.

వందకు కు మించి వాహనాలు కూడా నిలపలేని చిన్న ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను వెనక్కు తిప్పి పంపిస్తారు. అంత సమయం వరకు ఇక్కడికి అటు నుంచి వచ్చే వాహనాలను అనుమతించరు. ఇక్కడకు ఎవ్వరూ నడిచి  వెళ్ళరు  ఎక్కడో ఒకరో ఇద్దరో ఈ ప్రాంతం గురించి తెలిసి ఉన్నవాళ్లు వెళ్తారేమో కానీ అంత సమయం వరకూ బయటనుంచి ఇతర వాహనాలను వేటినీ అనుమతించరు.

కేదార్ నాథ్ yatra చేసేవారికి గౌరీకుండ్ లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడకు   వెళ్ళే వాళ్ళకి రెండు మార్గాలు ఉన్నాయి వాటిలో ఒకటి డోలిలలో వెళ్ళడం రెండు గుర్రాలపై వెళ్ళడం. డోలి లో కూడా అందరు వెళ్ళడానికి వీలుపడదు. అవి చాలా చిన్నగా సున్నితం గా ఉంటాయి.

వాటిపైన సన్నగా ఉన్నవాళ్లు మాత్రమె ఎక్కుతారు వాళ్ళకి మాత్రమే ఆగుతుంది ఆ డోలి. మిగితా వాళ్ళు అంతా గుర్రాల మీద వెళ్ళాల్సిందే.  ఇక్కడ గుర్రాలను కూడా  అద్దెకు తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.1100 చొప్పున తీసుకుంటారు. ముందుగానే డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. గుర్రం పై వెళ్ళడానికి ప్రయాణం సుమారు నాలుగు గంటలు వరకూ సమయం పడుతుంది.

ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే రెండు గుర్రాలనూ  ఒక్కడే నడుపుతాడు. ఈ గుర్రాల మీద నుండి వెళ్తుంటే గుర్రం తిరిగేటపపుడు కొండ అంచు దగ్గరకు వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ గుర్రం కొద్దిగా కిందకు జారిందో అక్కడ వెతికే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు వెతికే సమస్య కూడా లేదు  ఎందుకంటే ఆ ప్రదేశం కొన్ని వేల అడుగుల నుండి కిందకు ఉంటుంది. 

ఇంత ఎత్తు నుంచి పడినవారు ఎవ్వరూ బ్రతకరు. కెదరం లో పడడం అంటే కైలాసం వెళ్ళాడు అంటారు. కాబట్టి ఆ కేదారం వెళ్ళేటపుడు పది రూ. ఇస్తే ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు disposable raincoat అది వేసుకొని ఆ గుర్రం వెక్కి వెళ్ళాలి .ఒక వైపు హోరున వర్షం కురుస్తుంది తడిచి ముద్ద అవుతాం అయినా ఎంత వాన కురిసినా దిగడానికి ఉండదు.

కేదరం వెళ్లి అక్కడి నుండి కిందికి దిగి వచ్చిన తర్వాత గుర్రం దిగిన వాడు నడుస్తుంటే అసలు వీడికి నడవడం వచ్చా అన్నటుగా అనిపిస్తుంది.  గోతుల రోడ్డులో  ఆ గుర్రం మీద కదలికకి వొల్లంతా పుండ్లు అయిపోయి పులిసిపోయి నొప్పులు చేసేస్తుంది.

గుర్రపు స్వారీ చేసేవారికి తప్ప మామూలు  వ్యక్తులెవ్వరికీ సాదారణంగా గుర్రం మీద ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా వరకూ ప్రయాణంలో కష్టపడాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో  కాళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. గుర్రం ద్వారా దాదాపు నాలుగు గంటల పాటు ప్రయాణం సాగుతుంది. 

ఓ వైపు పెద్ద పెద్ద లోయలుఉంటె ఇంకో వైపు  అడుగు వేస్తే జారిపోయే  అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. కానీ జీవితంలో కచ్చితంగా వెళ్ళాల్సిన యాత్ర . ఒక వైపు  కొన్ని వేల అడుగుల ఎత్తు అక్కడ మీరు పైనుండి కిందకు చూసారో కళ్ళు తిరుగినట్లు అనిపిస్తుంది . ఇటునుండి రుద్ర ప్రయోగ అటు నుండి దేవ ప్రయోగ రెండు వెళ్లి ఒక చోట కలుస్తాయి ఇక్కడ నుండి గంగా నది అక్కడ నుండి బదరీ లో అలకనంద నది రెండు ప్రవహిస్తూ ఉంటాయి.

ఆ నదుల చప్పుడులు పర్వతాల నుండి జలపాతాలు జారిపడుతూ ఉంటాయి వాటి చప్పుడు దడ్ దడ్ దడ్ మంటూ  వచ్చేసి చెవులకు జలపాతం వినసొంపుగా ఉంటాయి. అన్ని వేల అడుగులు అన్ని కొండలు  పైకి ఎక్కిన తర్వాత  ఆ స్వామి శిఖరం కనపడుతూ ఉంటుంది. పరుగు పరుగున లోపలికి వెళ్తే  లోపల పెద్ద అంతరాలయం అక్కడ కేదారేశ్వరుని గా వెలిశారు ఆ మహానుభావుడు పరమేశ్వరుడు.

అయితే కేదార్ నాథ్ లో ఉన్న ఆ మహా శివలింగ దర్శనం చేసుకునే వారికి మోక్షం కలుగుతుందాని  శివ మహా పురాణములో తెలపడం జరిగింది. ఆ ప్రాంతంలో అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోతే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని శివ పురాణంలో చెప్పబడింది.


official website

badrinath-kedarnath.gov.in

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu


Comments