తిరుమల సుప్రభాత సేవ | Tirumala Suprabhata Seva tickets Full Information Telugu | TTD | Tirumala Arjitha Sevas Tickets | Bhakthi Margam


తిరుమల సుప్రభాత సేవ

కోరిన కోర్కెలు తీర్చే వేంకటేశ్వరుడు శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడు. ప్రతి హిందువు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని దర్శనం చేసుకోవాలని తాపత్రయపడుతుంటారు. స్వామి సేవలను వీక్షించాలని ఆరాటపడుతుంటారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిదినం జరిగే ఆర్జిత సేవల్లో 'సుప్రభాతం' ఒకటి. ఇది 'మేలుకొలుపు' సేవ. రోజువారీ నిర్వహించే పూజా కార్యక్రమాలు ఈ సేవతోనే ప్రారంభమై, బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. సంవత్సరంలో మార్గశిర మాసంలో తప్ప ప్రతీదినం ఈ సేవను నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో సుప్రభాతం స్థానంలో 'తిరుప్పావై' (గోదాదేవి రచించిన భక్తి పాటలు) పఠిస్తారు. ఈ తిరుప్పావై ఆర్జిత సేవ కాదు, ఏకాంతంగా నిర్వహిస్తారు.

సుప్రభాతం అంటే శుభోదయం అని అర్థం. స్వామివారు మేల్కొలుపుతో భక్త కోటికి శుభం కలుగుతుందని మరో అర్థం

తిరుమలలో ప్రతిరోజూ ప్రప్రథమంగా శ్రీ వారి దర్శన భాగ్యాన్ని పొందే వ్యక్తి 'సన్నిధి గొల్ల'. ఆదిలో శ్రీ వేంకటేశ్వర స్వామి మొదటి దర్శన భాగ్యాన్ని వరంగా పొందిన ఆనాటి గోపాలకుని (యాదవుని) సంతతికి చెందిన వ్యక్తే ఈ గొల్ల. తిరుమల స్వామి వారి సన్నిధి సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి 'సన్నిధి గొల్ల' అని అంటారు. 

ప్రతి దినం బ్రాహ్మ ముహూర్తంలో (తెల్లవారు జామున 2-30 నుండి 3-00 గంటల ప్రాంతంలో) సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గోవింద నామాన్ని పఠిస్తూ దివిటీ (కాగడా) పట్టుకొని తిరుమల ఉత్తర మాడవీధిలోని శ్రీవారి నిత్యసేవా కైంకర్యపరులైన శ్రీ వైఖానస అర్చకుల తిరుమాళిగకు (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాములను ఆలయానికి ఆహ్వానిస్తాడు.

శ్రీవారి అర్చకులు శుచిస్నాతులై, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలను (12 నామాలు) ధరించి, సంధ్యానుష్టానాదులు పూర్తి చేసి ఆలయానికి బయలుదేరుతారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున వున్న చిన్న మంటపం (నగారా మంటపం లేదా నౌబత్ ఖానా) లో అర్చకుల రాకను తేలియజేయడానికన్నట్టు పెద్ద పలక గంటను మోగిస్తారు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారువాకిలి వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరవడానికి సిద్ధంగా వుంటారు.

ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులను 'వైకుంఠం క్యూ' ద్వారా ఆలయం లోనికి అనుమతిస్తారు. వీరంతా బంగారువాకిలి ముందు - దక్షిణం వైపు పురుషులు, ఉత్తరం వైపు స్త్రీలు - వరుసగా నిలిచి వుంటారు.

ఇలా అందరూ సిద్ధంగా ఉండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' మొత్తం 29 శ్లోకాలు ఉంటాయి. మొదటి శ్లోకంలో కౌసల్య పుత్రుడు రాముడికి, రెండవ శ్లోకంలో గోవిందుడికి, మూడో శ్లోకంలో అమ్మవారికి, మిగిలిన 24 శ్లోకాలను ఏడుకొండల వాడిని వేడుకుంటూ స్తుతిస్తారు. చివరి శ్లోకంలో భక్తులకు మోక్షం ప్రసాదించాలని కోరుతారు.

అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల, వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. 

వీరితోపాటు తాళ్ళపాక అన్నమయ్య వంశీయు లొకరు అన్నమయ్య కీర్తన నొకదానిని ఆలపిస్తూండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పు పై పవళించి వున్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధిలో శ్రీవారికి మొట్టమొదటి నివేదనగా పాలు (పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. 

తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరపు చుక్కను అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచపాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్థం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు మొదలైన వాళ్ళు, భక్తులు లోనికి వచ్చి శ్రీవారిని విశ్వరూప దర్శనం చేసుకుంటారు.

ముందురొజు రాత్రి బ్రహ్మ స్వామీని అర్చించి వెతాడని భక్తుల నమ్మకం.

సుప్రభాత సేవ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులు సేవలో పాల్గొనవచ్చు.

ఈ సేవకు రుసుము రూ.120-00.

ఆర్జిత సేవా టికెట్ల‌ను భ‌క్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చని టీటీడీ ప్రకటించింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, నిజ‌పాద ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆన్‌లైన్ ఎల‌క్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు.

ఈ శ్రీవారి ఆర్జిత సేవాలను ఎలక్ట్రానిక్ DP పద్ధతి అంటే లక్కీ ట్రిప్ ద్వార శ్రీవారి భక్తులను ఎంపిక చేస్తారు.మీరు మరో విధంగా కూడా ఈ టికెట్ పొందవచ్చును.

VIP కోటాలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి తదితరులు ఇచ్చిన latter ద్వారా కూడా ఈ శ్రీవారి సేవలు చేసుకోవచ్చు.ఇలా చేసుకో వారికి శ్రీవారి సేవా టిక్కెట్ ధర ఎక్కువ ఉంటుంది. మీరు ఈ సేవకు పూర్తిగా సంప్రదాయ వస్తాలతోనే చేసుకోవాలి

ఈ సుప్రభాత సేవ టిక్కెట్లు book చేసుకున్నవారు తెల్లవారు జామున 2 గంటలకు Report చెయ్యాలి ఇలా సుప్రభాత సేవా ద్వార వెళ్ళినవారికి స్వామి వారిని మొదటి గడప వరకు వెళ్లి శ్రీనివాసుని దర్శించవచ్చును. అందుకనే వీటీని మొదటి గడప ధర్శనం టిక్కెట్లు అని కూడా అంటారు. ఇలా ఆర్జిత సేవ చేసుకునే శ్రీవారి భక్తుల ఒక్క లడ్డూను ప్రసాదంగా కూడా ఇస్తారు.

ఈ సేవకు వెళ్లే శ్రీవారి భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషుడు: ధోతీ, చొక్కా,  స్త్రీ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. వస్త్రాన్ని ధరించండి

టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చిన ID ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. మీరు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ పిల్లల మీతో తీసుకొని వెళ్ళవచ్చు.

THOMALA SEVA DETAILS FOR GRIHASTAS

  • Reporting Time:- 2:00 AM
  • Seva Time:- 3:00 AM to 4: 00 AM
  • Day of Seva:- Tue-Wed-Thu
  • Price of a Ticket (INR):- 120.00
  • No. of Persons allowed:- One
  • Prasadam / Bahumanam Single Laddu

Suprabhata seva Reporting Times 2:00 AM Daily at VQC-1 and will be performed from 03:00 – 04:00 AM.

Gathering Point

Devotees should gather at VQC-I.

  • Suprabatha Seva Timings

Suprabatha Seva will be performed from 03:00 – 04:00 AM. Devotees should gather one hour before the Seva time at VQC-I.

Booking

Suprabatha Seva Ticket cost is Rs.120.

Max of 2 Persons can book in a single ticket.

Only one Seva ticket booking will be allowed with in 6 months. Suprabatha Seva can be booked online.

Important Information to the Pilgrims:

1. The reporting point for availing Seva is at VQC-1, Tirumala.

2. At the time of entry, the pilgrim shall produce the same original Photo ID used during booking. Age proof shall be produced for children

below 12 years to gain entry free of cost.

3. The pilgrims shall wear Traditional Dress only. Male: Dhoti, Shirt Female: Saree / Half Saree / Chudidar with Dupatta. Grihasthas should

wear dhoti and upper cloth for Kalyanotsavam which involve Sankalpam.

4. All the Pilgrims in group tickets have to report together.

5. Entry with chappals/shoes is not permitted into the queue lines, mada streets and Temple.

6. The pilgrims should not carry any luggage/cell phones/electronic gadgets while reporting.

7. All bookings are FINAL: Postponement/advancement/cancellation/refund is not allowed.

8. TTD reserves the right of cancellation of the Seva under any Special Circumstances.

9. Please contact our 24/7 help desk for queries at 1 800 425 333333 and 1 800 425 4141.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags:  Tirumala Suprabhata Seva tickets complete details Telugu, Tirumala Tirupati Updates, ttd online booking, tirumala suprabhatam seva experience, seva electronic dip ttd, suprabhatam in telugu, ttd suprabhata seva tickets availability 2023, ttd suprabhata seva tickets cost, ttd suprabhata seva tickets online booking, suprabhata seva online booking timings, ttd suprabhata seva tickets availability 2023, ttd suprabhata seva tickets price 2023, ttd online booking for suprabhata seva, ttd free darshan online booking availability,, bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, Telugu bhakthi margam, bhakti margam telugu, bhakthi margam telugu

Comments