తిరుమల శ్రీవారి తోమాలసేవ | Tirumala Srivari Thomala Seva Full Information In Telugu | TTD Arjitha Sevas | Bhakthi Margam


తిరుమల 
శ్రీవారి తోమాలసేవ

తిరుమల సాక్షాత్తు కలియుగ వైకుంఠం. ఇక్కడి ఆనందనిలయంలోని శ్రీవారికి ప్రతినిత్యం అనేక కైంకర్యాలు. అనేక విశేష అర్చనలు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారికి జరిగే ఆర్జిత సేవాలో అతి ముఖ్యమైనది. బ్రహ్మోత్సవాల పవిత్రవేళ ఆ సేవలలో ఒకటైన

తోమాలసేవ గురించి తెలుసుకుందాం

సుప్రభాత సేవతో నిద్ర నుంచి మేల్కొలిపిన తర్వాత స్వామి వారికి నిర్వహించే సేవ ఇది. తోమాల అంటే పూల దండ. రకరకాల పూలు, తులసి దళాలతో కట్టిన దండను స్వామి వారికి అలంకరిస్తారు. యమునాదురై నుంచి పూల దండలను ఆలయానికి చెందిన పెరియ జీయర్ తీసుకుని వస్తారు. వాటితో సేవ జరుగుతుంది. ఈ సేవ సమయం 30 నిమిషాలు. ఈ సేవ మంగళ, బుధ, గురువారాల్లోనే జరుగుతుంది.

పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసుని దివ్యమంగళమూర్తికి అనేక పుష్పమాలికలతో, తులసిమాలలతో చేసే అలంకారమే తోమాలసేవ. సుప్రభాగం తరువాత ఉదయం మూడు గంటలకు ప్రారంభమవుతుంది. జియ్యంగార్ తెచ్చిన మాలలను అర్చకస్వాములు నీళ్ళుచల్లి శుద్ధిచేసి తీసుకుంటారు. 

భోగశ్రీనివాసమూర్తికి అభిషేకం తరువాత, శ్రీవేంకటేశ్వరుని నిజపాదాలపై ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి ఆకాశగంగ జలాన్ని మాత్రమే వాడతారు. అనంతరం మూలమూర్తికి, వక్షస్థల లక్ష్మికి, శ్రీదేవి, భూదేవి సామెత మలయప్పస్వామికి, ఉగ్ర శ్రీనివాసమూర్తికి, ఇలా సన్నిధిలో ఉన్న పంచబేరాలకు అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగ తీర్థాన్ని సంప్రోక్షిస్తారు. అభిషేకానంతరం భోగశ్రీనివాసమూర్తికి వస్త్రాలంకరణ, తిలకధారణ చేసి, మిగిలిన ఉత్సవమూర్తులకు షోడశోపచారాలు సమర్పిస్తుండగా, "తిరుప్పళ్ళీ ఎళుచ్చి'' అను అరువది పాశురాలను పారాయణం చేస్తారు.

జియ్యంగార్లు శ్రద్ధాభక్తులతో అందించే పూలమాలలను అర్చకస్వాములు శ్రీవారికి అలంకరిస్తారు. ఈ పుష్పాలంకరణ శ్రీవారి పాదాలతో ప్రారంభమవుతుంది. ఆపాదమస్తకం అలంకరించే ఈ పూలమాలలకు కొన్ని స్థిరమైన పేర్లు ఉన్నాయి. శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కొక్క మూరగల రెండు పుష్పమాలలను "తిరువడి దండలు'' అని శ్రీవారి కిరీటం మీదుగా రెండు భుజాల వరకు అలంకరించబడే ఎనిమిది మూరాలకు గల పూలమాలలను "శిఖామణి'' అని, శ్రీవారి భుజాలనుంది ఇరువైపులా పాదాలవరకు వ్రేలాడుతున్నట్టు అలంకరించే పొడవాటి మాలలను "సాలగ్రామమాల'' అని, శ్రీవారి మెడలో రెండు పొరలుగా భుజాలమీడకి అలంకరించబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని "కంఠంసరి'' అని అంటారు.

శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు ఒక్కటిన్నర మూరల పుష్పమాలికలను అలంకరిస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను శంఖచక్రాలకు అలంకరిస్తారు. శ్రీవారి నందకఖడ్గానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను "కఠారిసరం'' అంటారు. రెండు మోచేతులు కిందనుండి పాదాల వరకు హారాలుగా వ్రేలాడదీసే మూడు పుష్పమాలలను "తావళములు'' అంటారు. పుష్పాలంకరణ పూర్తీ అయిన తరువాత వేదపండితులు మంత్రపుష్పాన్ని పఠిస్తారు. ధూప, దీప, నక్షత్ర కర్పూర హారతులు ఇస్తారు. ఈ కార్యక్రమం అంతా పూర్తికావడానికి సుమారు అరగంటకుపైగా పడుతుంది.

బంగారు వాకిలికి ఆనుకుని లోపల ఉన్న గదిని "స్నపన మండపం'' అంటారు. అక్కడే ప్రతిరోజూ శ్రీవారికి ఆస్థానం జరుగుతుంది. ఈ సేవ పూర్తిగా ఏకాంతం. ఆలయ అధికారులు, అర్చకులచే నిర్వహించబడుతుంది. ఉదయం 4-30 లకు ప్రారంభమవుతుంది. 

స్వామికి షోడశోపచారాలు నిర్వహించిన తరువాత, ఆస్థానసిద్ధాంతి శ్రీనివాసునికి పంచాంగ శ్రవణం చేస్తూ, తిథి, వార, నక్షత్ర, యోగా, కారణాలను వినిపిస్తారు. నిత్యాన్న ప్రసాద పథకంలో విశేషమైన విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను శ్రీవారికి వినిపిస్తారు. బొక్కసం (లెక్కల) గుమస్తా, శ్రీవారికి సమర్పించబడిన ముందునాటి ఆదాయ వివరాలను ఆర్జితసేవలవల్ల, ప్రసాదాల విక్రయం వల్ల, హుండీద్వారా, కానుకలుగా వచ్చిన బంగారు, వెండి, రాగి, ఇతర లోహపాత్రాలు, నగలు, వగైరాల ద్వారా వచ్చిన నికర ఆదాయాన్ని పైసలతో సహా లెక్కగట్టి శ్రీనివాసునికి వివరంగా వినిపించి, భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుంటాడు.

కలియుగ ప్రత్యక్ష దైవలం తిరుమల శ్రీవారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. అలాంటిది శ్రీవారి సేవల్లో పాల్గొనే భాగ్యం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందుకో టీటీడీ స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాత సేవ, తోమాల సేవ వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఆర్జిత సేవా టికెట్ల‌ను భ‌క్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చని టీటీడీ ప్రకటించింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, నిజ‌పాద ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆన్‌లైన్ ఎల‌క్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు.

ఈ శ్రీవారి ఆర్జిత సేవాలను ఎలక్ట్రానిక్ DP పద్ధతి అంటే లక్కీ ట్రిప్ ద్వార శ్రీవారి భకుతులను ఎంపిక చేస్తారు.మీరు మరో విధంగా కూడా ఈ టికెట్ పొందవచ్చును.

VIP కోటాలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి తదితరులు ఇచ్చిన latter ద్వారా కూడా ఈ శ్రీవారి సేవలు చేసుకోవచ్చు.ఇలా చేసుకో వారికి శ్రీవారి సేవా టిక్కెట్ ధర ఎక్కువ ఉంటుంది. 

ఈ తోమాల సేవా టిక్కెట్లు book చేసుకున్నవారు తెల్లవారు జామున 3 గంటలకు Report చెయ్యాలి ఇలా తోమల సేవా ద్వార వెళ్ళినవారికి స్వామి వారిని మొదటి గడప వరకు వెళ్లి శ్రీనివాసుని దర్శించవచ్చును.

అందుకనే వీటీని మొదటి గడప ధర్శనం టిక్కెట్లు అని కూడా అంటారు. 
ఈ సేవకు వెళ్లే శ్రీవారి భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషుడు: ధోతీ, చొక్కా,  స్త్రీ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. వస్త్రాన్ని ధరించండి.
టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చిన ID ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. 
మీరు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ పిల్లల మీతో తీసుకొని వెళ్ళవచ్చు.
ఇలా ఆర్జిత సేవ చేసుకునే శ్రీవారి భక్తుల ఒక్క లడ్డూను ప్రసాదంగా కూడా ఇస్తారు.

Gathering Point
Devotees should gather at VQC-I .
Only one person per ticket will be allowed.

THOMALA SEVA DETAILS FOR GRIHASTAS
  • Reporting Time:- 3:00 AM
  • Seva Time:- 3:30 AM
  • Day of Seva:- Tue-Wed-Thu
  • Price of a Ticket (INR):- 220.00
  • No. of Persons allowed One
  • Prasadam / Bahumanam Single Laddu
tags: Tirumala Srivari Thomala Seva details In Telugu, thomala seva details, thomala seva timings and details, thomala seva tickets booking, how to get thomala seva tickets in tirumala, what is thomala seva in tirumala, thomala seva tickets availability, thomala seva benefits, thomala seva ticket price, TTD thomala seva ticket booking, arjitha seva tickets online booking, arjitha seva tickets cost,TTD arjitha seva tickets online booking, Tirumala arjitha seva tickets online booking, Bhakthi Margam, Bhakti Margam, Telugu Bhakthi Margam, Bhakthimargam, Bhaktimargam, Bhakthi margam telugu, Bhakthi margam.in

Comments