తిరుమల శ్రీవారి అర్చన సేవ | Tirumala Srivari Archana Seva Full Information In Telugu | Tirumala Arjitha Sevas Tickets | Bhakthi Margam
తిరుమల శ్రీవారి అర్చన సేవ
తిరుమల శ్రీవారికి జరిగే ఆర్జిత సేవాలో మరొక్కటి అర్చన సేవా కూడా అతి ముఖ్యమైనది. ఈ అర్చన సేవ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీవారి ఆర్జిత సేవలో ఒక్కటైనా ఈ అర్చన ఎలా ఉంటుంది. ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోల వివరాలు తెలుసుకుందాం
వెంకటనాధుడికి నిత్య జరిగే సేవల్లో ఈ సేవా కూడా మంగళ, బుధ , గురువారాల్లో అర్చన సేవ నిర్వహిస్తారు.
సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు. స్వామివారికి సమర్పించిన పువ్వులను ఆ తర్వాత ఎవరూ ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు. దీనిని నిర్మాల్య శోధన అంటారు.
అర్చన: శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు.
ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.
తిరుమల కొండ పైన శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవా ల్లో ఈ అర్చన సేవా ఒక్కటి. ఈ సేవకి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందువలన ఈ అర్చన సేవాలో పాల్గొన్నలని శ్రీవారి భక్తులు కోరుకుంటారు.
ప్రతిరోజు వేంకటేశ్వర స్వామికి మూడుసార్లు అర్చన చేస్తారు - ఉదయం ఒకటి (ఉదయం అర్చన సమయంలో మాత్రమే, శుక్రవారం, శనివారం, ఆదివారం మరియు బ్రహ్మోత్సవాలలో మినహా అన్ని రోజులలో భక్తులు పాల్గొనడానికి అనుమతించబడతారు). సేవా టికెట్ విలువ రూ.220/-. మధ్యాహ్న సమయంలో ఏకనాథంలో రెండో అర్చన, సాయంత్రం మూడో అర్చన నిర్వహిస్తారు.
అర్చన సమయంలో, భక్తులు దాదాపు అరగంట పాటు శ్రీవేంకటేశ్వరుని ముందు కూర్చుని, కన్నుల పండువగా ఉండే అర్చనను వీక్షించడానికి అనుమతించబడతారు. భగవంతుని 1,008 నామాలను పండిట్ నెమ్మదిగా మరియు స్పష్టంగా పఠిస్తారు. గర్భగృహం లోపల, వేంకటేశ్వరుని పవిత్ర పాదాల వద్ద మరొక పూజారి పుష్ప అర్చన చేస్తారు.
ఇది అత్యధికంగా కోరుకునే సేవాస్‌లో ఒకటి .
అర్చనను 'సహస్రనామార్చన' (1008 భగవంతుని అద్భుతమైన నామాలు) అని కూడా పిలుస్తారు. ఇది ప్రతిరోజూ నిర్వహించబడుతుంది, భక్తులు అవసరమైన మొత్తం రూ.220 చెల్లించి ఈ సేవలో పాల్గొనడానికి అనుమతించబడతారు. యాత్రికులకు వారి పేరు మరియు గోత్రంపై ఆశీర్వాదాలు అందించబడతాయి. అర్చన అనేది భగవంతుని వివిధ పేర్లను పఠించడం మరియు మొత్తం మానవాళి యొక్క శ్రేయస్సు కోసం అతని దైవిక ఆశీర్వాదాలను కోరడం.
అర్చన సేవా వారంలో మూడు రోజులు జరుగుతాయి మంగళ-బుధ-గురు, అర్చనసేవా టికెట్ ధర 220 రూ.., రిపోర్టింగ్ సమయం 4:00AM, Vaikunta Q complex 1 ధగ్గరకు శ్రీవారి భక్తులు వెళ్ళాలి.అర్చన సేవ తెల్లవారు జామున 4.40 ప్రారంభం అవుతుంది
ఈ సేవకు వెళ్ళిన శ్రీవారి భక్తులకు రెండు లడ్డు ప్రసాదాలను ఇస్తారు.
మీరు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ పిల్లల మీతో తీసుకొని వెళ్ళవచ్చు.
భక్తులు ఒక గంట ముందుగా సుపాదం వద్ద ఉండాలి.
ఈ సేవకు వెళ్లే శ్రీవారి భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషుడు: ధోతీ, చొక్కా, స్త్రీ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. వస్త్రాన్ని ధరించండి
టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చిన ID ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. మీరు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ పిల్లల మీతో తీసుకొని వెళ్ళవచ్చు.ఈ శ్రీవారి ఆర్జిత సేవాలో ఈ నిజపాద సేవను ఎలక్ట్రానిక్ DP పద్ధతి అంటే లక్కీ ట్రిప్ ద్వార శ్రీవారి భకుతులను ఎంపిక చేస్తారు.మీరు మరో విధంగా కూడా ఈ టికెట్ పొందవచ్చును.
VIP కోటాలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి తదితరులు ఇచ్చిన latter ద్వారా కూడా ఈ శ్రీవారి సేవలు చేసుకోవచ్చు.ఇలా చేసుకో వారికి శ్రీవారి సేవా టిక్కెట్ ధర ఎక్కువ ఉంటుంది. మీరు ఈ సేవకు పూర్తిగా సంప్రదాయ వస్తాలతోనే చేసుకోవాలి.
ఈ అర్చన సేవ టిక్కెట్లు book చేసుకున్నవారు తెల్లవారు జామున 4.00 గంటలకు Report చెయ్యాలి. ఇలా నిజపాద సేవా ద్వార వెళ్ళిన శ్రీవారి భక్తులు ఆనంద నిలయం లోపల కూర్చున్ని స్వామి వారికి జరిగే సేవలను చూడవచ్చు . ఈ అర్చన సేవ సుమారు 30 నిమిషాలు ఉంటుంది .తరువాత ఒకొక్కరిగా స్వామి వారిని మొదటి గడప వరకు వెళ్లి శ్రీనివాసుని దర్శించవచ్చును.... అందుకనే వీటీని మొదటి గడప ధర్శనం టిక్కెట్లు అని కూడా అంటారు. ఇలా ఆర్జిత సేవ చేసుకునే శ్రీవారి భక్తుల 2 లడ్డూను ప్రసాదంగా కూడా ఇస్తారు.
Archana Seva Timings and Ticket Booking
- Reporting Time :- 4:00 AM
- Seva Time :- 4:30 AM
- Day of Seva :- Tue-Wed-Thu
- Price of a Ticket (INR) :- 220.00
- No. of Persons allowed One
- Prasadam / Bahumanam Single Laddu
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu

Comments
Post a Comment