తిరుమల శ్రీవారి నిజపాద సేవ దర్శనం | Tirumala Nijapada Darshanam Seva deatils in Telugu | Bhakthi Margam
తిరుమల శ్రీవారి నిజపాద సేవ దర్శనం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన భారత దేశం లో అత్యంత ప్రసిద్ద పుణ్య క్షేత్రం మరియు అతి ఎక్కువ జన ఆదరణ కలిగినది. ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు. నిత్యకళ్యాణం పచ్చతోరణం అంటువంటి పండగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. భక్తులు ప్రతి రోజు విరివిగా స్వామి వారి దర్శనం చేసుకుంటారు. ఒక రోజులో షుమారు 90 వేల నుండి 2లక్షల మంది జనం తిరుమల కొండ మీదకు వస్తుంటారు. ఇంతటి మహా పుణ్యక్షేత్రం నిర్వహణ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానమ్స్) బోర్డు సమర్ధవంతంగా నడుపుతుంది.
శ్రీనివాసుని ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొనటానికి ఎక్కువ మక్కువ చూపుతుంటారు. ప్రతినిత్యం ఆగమ శాస్త్రము ప్రకారం శ్రీవారి మూలవిరాట్టుకు, భోగ శ్రీనివాసమూర్తికు, శ్రీదేవి-భూదేవి సామెత మలయప్ప స్వామికు వివిధ ఆర్జిత సేవలు కైంకర్యం చేస్తుంటారు. ఆర్జిత సేవల టికెట్స్ ఆన్లైన్ ద్వారా భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైటులో బుక్ చేసుకోగలరు.
శ్రీవారికి ఆర్జిత సేవల్లో మరో క్క అద్భుతమైన సేవ శ్రీవారి నిజపాద దర్శనం. ఎన్నోజన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప మనం ఈ సేవ సేవ చేసుకోలేము. వెంకట చలపతి పాదాలు ధరించిన వారి సమస్త పాపాలు తొలగిపోతాయి. అలాంటి మహాభాగ్యాన్ని శ్రీవారి ఆర్జిత సేవా ద్వార మనకు TTD అందిస్తోంది.ప్రతి శుక్రవారం జరిగే ఈ నిజపాద దర్శనం ఎలా ఉంటుందో , ఎలా ఈ సేవ book చేసుకోవాలో ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం
శ్రీవారి ఆర్జిత సేవలో ఈ నిజపాద సేవ కూడా ఒక్కటి . ఈ సేవా ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 5.30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. అంటే సుమారుగా 30 నిమిషాలు ఉంటుంది.ఈ నిజపాద సేవలో శ్రీనివాసుడి పాదాలకు తొడిగిన బంగారము కవచంతో కుడినా పాదాలను తొలగించి భక్తులకు ధర్శనం ఇస్తారు.
తిరుమలలో శ్రీనివాసునికి ప్రతివారం జరిగే ఆచారాలలో నిజపాద దర్శనం సేవ ఒకటి. ఈ నిజపాద సేవ ఎటువంటి ఆభరణాలు లేకుండా వేంకటేశ్వర స్వామి పాదాలను చూడటానికి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ప్రతి శుక్రవారం, భగవంతుని ప్రధాన విగ్రహం తెల్లటి ధోతీతో పాటు సరళంగా చూడవచ్చు.శుక్రవారం అర్చన అనంతర దర్శనాన్ని నిజపాద దర్శనం అంటారు. సాధారణంగా భగవంతుని పాదాలు తులసి ఆకులతో కప్పబడి ఉంటాయి. కానీ శుక్రవారం వేంకటేశ్వరునికి అభిషేకం చేసిన తరువాత పాదాలకు తులసి ఆకులు లేకుండా వదిలివేస్తారు, ఈ సమయంలో నిజపాద దర్శనం జరుగుతుంది, ఇది భక్తులకు భగవంతుని పాదాలను చూడటానికి అనుమతిస్తుంది.
తిరునామం లేకుండానే భగవంతుడు భక్తులకు దర్శనం ఇవ్వగలడు. నిజపాద సేవ తర్వాత తిరునామం కర్పూరం. హిందూ మతంలో విష్ణు పాదానికి ప్రత్యేక స్థానం ఉంది.
ఈ నిజపాద దర్శనం కోసం దాదాపు 1000 మంది భక్తులను శ్రీనివాసుని దర్శనానికి అనుమతిస్తారు.నిజపాద దర్శనం సేవా సమయము
సేవ పొందేందుకు భక్తులు రిపోర్టింగ్ పాయింట్ వైకుంట క్యూ కాంప్లెక్స్ 1 తిరుమలలో ఉంది.
నిజపాద సేవా సమయాలు: 05:30 AM నుండి 06:30 AM వరకు.
భక్తులు ఒక గంట ముందుగా సుపాదం వద్ద ఉండాలి
నిజపాద దర్శనం టిక్కెట్ ధర
నిజపాద సేవా టిక్కెట్ ఒక వ్యక్తికి రూ. 200.
నిజపాద సేవా సమయాలు: 05:30 AM నుండి 06:30 AM వరకు.
భక్తులు ఒక గంట ముందుగా సుపాదం వద్ద ఉండాలి
నిజపాద దర్శనం టిక్కెట్ ధర
నిజపాద సేవా టిక్కెట్ ఒక వ్యక్తికి రూ. 200.
ఈ సేవకు వెళ్లే శ్రీవారి భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషుడు: ధోతీ, చొక్కా, స్త్రీ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. వస్త్రాన్ని ధరించండి
టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చిన ID ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. మీరు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ పిల్లల మీతో తీసుకొని వెళ్ళవచ్చు.
ఈ శ్రీవారి ఆర్జిత సేవాలో ఈ నిజపాద సేవను ఎలక్ట్రానిక్ DP పద్ధతి అంటే లక్కీ ట్రిప్ ద్వార శ్రీవారి భకుతులను ఎంపిక చేస్తారు.మీరు మరో విధంగా కూడా ఈ టికెట్ పొందవచ్చును.
VIP కోటాలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి తదితరులు ఇచ్చిన latter ద్వారా కూడా ఈ శ్రీవారి సేవలు చేసుకోవచ్చు.ఇలా చేసుకో వారికి శ్రీవారి సేవా టిక్కెట్ ధర ఎక్కువ ఉంటుంది. మీరు ఈ సేవకు పూర్తిగా సంప్రదాయ వస్తాలతోనే చేసుకోవాలి.
ఈ నిజపాద సేవ టిక్కెట్లు book చేసుకున్నవారు తెల్లవారు జామున 4.30 గంటలకు Report చెయ్యాలి. ఇలా నిజపాద సేవా ద్వార వెళ్ళిన శ్రీవారి భక్తులు ఆనంద నిలయం లోపల కూర్చున్ని స్వామి వారికి జరిగే సేవలను చూడవచ్చు . ఈ నిజపాద సేవ సుమారు 30 నిమిషాలు ఉంటుంది .తరువాత ఒకొక్కరిగా స్వామి వారిని మొదటి గడప వరకు వెళ్లి శ్రీనివాసుని దర్శించవచ్చును.... అందుకనే వీటీని మొదటి గడప ధర్శనం టిక్కెట్లు అని కూడా అంటారు. ఇలా ఆర్జిత సేవ చేసుకునే శ్రీవారి భక్తుల 2 లడ్డూను ప్రసాదంగా కూడా ఇస్తారు.
Related Postings:
1. Stotras In Telugu
tags : tirumala angapradakshinam details in telugu, tirumala nijapada seva in telugu, nijapada darshanam timings, nijapada darshanam booking online, nijapada darshanam tirumala, nijapada darshanam tickets price, ttd nijapada darshanam video, lord venkateswara nijaroopa darshanam photos, ttd nijapada darshanam online booking, ttd arjitha seva information in telugu, ttd arjitha seva tickets availability, ttd arjitha seva tickets availability 2023, tirumala arjitha seva booking, Telugu bhakthi margam, bhakti margam, bhakthi margam telugu, bhakthimargam, bhaktimargam

Comments
Post a Comment