తిరుమలలో అష్టదళ పాదపద్మరాధన సేవ ఎలా చేస్తారు? | Tirumala Ashtadala Pada Padmaradhana Seva Full Details in Telugu | Bhakthi Margam | భక్తి మార్గం


తిరుమలలో  అష్టదళ పాదపద్మరాధన సేవ ఎలా చేస్తారు? 

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.

ఇక ప్రతి మంగళవారం అష్టదళపాద పద్మరాధన‌ సేవను 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడమే ఈ సేవ విశేషం.

సేవ కోసం చెల్లించిన ఆర్జిత భక్తులను బంగారు వాకిలి మరియు కులశేఖరప్పడి మధ్య మండపంలోకి వెళ్లి కూర్చోవడానికి అనుమతిస్తారు.


శ్రీవారికి ఆర్జిత సేవల్లో మరో క్క అద్భుతమైన సేవ శ్రీవారి అష్టదళ పాదపద్మరాధన సేవ దర్శనం. ఎన్నోజన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప మనం ఈ సేవ సేవ చేసుకోలేము. వెంకట చలపతి పాదాలు ధరించిన వారి సమస్త పాపాలు తొలగిపోతాయి. అలాంటి మహాభాగ్యాన్ని శ్రీవారి ఆర్జిత సేవా ద్వార మనకు TTD అందిస్తోంది.ప్రతి శుక్రవారం జరిగే ఈ అష్టదళ పాదపద్మరాధన సేవ ఎలా ఉంటుందో , ఎలా ఈ సేవ book చేసుకోవాలో ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం..

శ్రీనివాసుని ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొనటానికి ఎక్కువ మక్కువ చూపుతుంటారు. ప్రతినిత్యం ఆగమ శాస్త్రము ప్రకారం శ్రీవారి మూలవిరాట్టుకు, భోగ శ్రీనివాసమూర్తికు, శ్రీదేవి-భూదేవి సామెత మలయప్ప స్వామికు వివిధ ఆర్జిత సేవలు కైంకర్యం చేస్తుంటారు. ఆర్జిత సేవల టికెట్స్ ఆన్లైన్ ద్వారా భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైటులో బుక్ చేసుకోగలరు.

తిరుమల కొండ పైన శ్రీవారికి ప్రతి నిత్యం నిర్వహించే ఆర్జిత సేవా ల్లో ఈ అష్టదళ పాద పద్మరాధన సేవ ఒక్కటి. ఈ సేవకి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందువలన ఈ అష్టదళ పాద పద్మరాధన సేవలో పాల్గొన్నలని శ్రీవారి భక్తులు కోరుకుంటారు. 

ఈ అష్టదళ పాద పద్మరాధన సేవ వారంలో ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తారు. ప్రతి మంగళ వారం ఉదయం 6 గంటల నుండి 7 వరకు జరుతుంది.  అష్టదళ పాద పద్మరాధన సేవ అంటే స్వామీ వారికి 108 బంగారు పువ్వులతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారు. శ్రీవారి పాదాల వద్ద ఈ 108 స్వర్ణ పుష్పాలను  అలంకరిస్తారు. ఈ సేవ ప్రతి నిత్యం నిర్వహించే శ్రీవారి ఆర్జిత సేవల అనంతర ఈ సేవ  స్వామీ వారి బంగారు వాకిల్లో ఈ సేవను బుక్ చేసుకున్న  శ్రీవారి భక్తులు చూస్తుండగా ఈ అష్టదళ పాద పద్మరాధన సేవ  జరుగుతుంది.


శ్రీ వారి సేవలలో ఎన్నో అపూర్వమైనవి, విశేషమైనవి, ఆనందదాయకమైనవి, అఖండ పుణ్య ప్రదాయమైనవి, సకల పాప హరణమైనవి. వాటిల్లో విశిష్టమైనది మంగళవారం స్వామి వారికి చేసే అష్టదళ పాదపద్మారాధనము.

మన మనస్సునే పద్మముగా చేసి, స్వామి వారి పాదపద్మాలకు సమర్పణ చేస్తున్నామా అనేటువంటి భక్తి భావం, భక్తులను పరవశింపు చేస్తుంది. గర్భాలయం లో జరిగేటువంటి ఈ అష్టదళ పాదపద్మారాధన ప్రముఖమైనదిగా అఘమ శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

అష్టదళ పాదపద్మారాధన లో భక్తులందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే..మీ మనస్సుని స్వామి వారి పాదాలకు సమర్పించటం. స్వామి వారి పాదాలు పద్మాలు, చేతులు పద్మాలు, స్వామి వారి ముఖము పద్మము, స్వామి వారి యొక్క నేత్రాలు పద్మదళాయ నేత్రాలు, పద్మం లో ఉండేట్టు వంటి లక్ష్మి అమ్మవారు ఈ విధము గా సమస్తము పద్మ మయమే…కాబట్టి మన మనస్సులలో ఆ పద్మ తత్త్వం వెంకటేశ్వర స్వామి వారి దివ్య భావన మనలో అంతర్లీనంగా ఉండి మనల్ని ధర్మ మార్గము వైపు నడిపించేటు వంటి అద్భుతమైన శ్రీవారి సేవ ఈ ‘అష్టదళ పాదపద్మారాధన’.

ప్రతిరోజు స్వామి వారికి ఏకాంతంగా పరమ పవిత్రమైన, పుణ్యప్రదమైన తులసీదళాలతో స్వామి వారి పాదాలకు ఏకాంతంగా అర్చన జరుగుతుంది. అంటే ఎవరు చూసేట్టు వంటి అవకాశం ఉండదు. కానీ మంగళవారం నాడు మాత్రం ప్రత్యేకించి భక్తుల సౌలభ్యం కోసం భక్తులకు పుణ్యం ప్రసాదింప చేయటం కోసం ఆ ఒక్క రోజు మాత్రం అష్టదళ పాదపద్మారాధనగా ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది.

శ్రీ స్వామి వారి అష్టోత్తర శతనామాలను ఉచ్చరిస్తూ స్వామి వారి పాదాలకు అర్చన ప్రారంభిస్తారు. ఒక్కో నామానికి ఒక్కో పద్మాన్ని శ్రీవారి పవిత్ర పాదాలకు సమర్పిస్తారు. మూల విరాట్టుకు అర్చన పూర్తయిన తరువాత అమ్మవార్లు లక్ష్మి దేవి, పద్మావతి దేవి కి అర్చన చేస్తారు.


తిరుమలో శ్రీవారికీ ప్రతి మంగళవారం జరిగే ఆరాధన అష్టదళపద పద్మారాధన ఇది రెండోవ అర్చన.

108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవలోని విశేషం.భక్తులు దీనిని ఆర్జిత సేవగా జరుపుకోవచ్చు.

సహస్రనామార్చనలో 1008 నామాలకు ప్రాదాన్యం.అష్టోత్తరంలో 108 నామాలకు ప్రాదాన్యం.

108 బంగారు పద్మాలతో అర్చకులు స్వామివారి పాదాల చుట్టూ ఉన్న పీఠంపై శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరం చదువుతూ సమర్పిస్తారు. 

ఈ సేవను  తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వర్ణోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టారు.గుంటూరు కు చెందిన మొహమ్మదీయ భక్తుడు దీనికి అవసరమైన 108 బంగారు పద్మాలను శ్రీవారికి కానుకగా సమర్పించాడు. ఆ పువ్వులనే ఈనాటికీ అష్ట దళ పాదపద్మారాధన సేవకు వినియోగిస్తున్నారు ... తరువాత ఇది ఆర్జిత సేవగా రూపుదిద్దుకుంది.


ఈ శ్రీవారి ఆర్జిత సేవాలో ఈ అష్టదళ పాదపద్మరాధన సేవను ఎలక్ట్రానిక్ DP పద్ధతి అంటే లక్కీ ట్రిప్ ద్వార శ్రీవారి భకుతులను ఎంపిక చేస్తారు.మీరు మరో విధంగా కూడా ఈ టికెట్ పొందవచ్చును.

VIP కోటాలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి తదితరులు ఇచ్చిన latter ద్వారా కూడా ఈ శ్రీవారి సేవలు చేసుకోవచ్చు.ఇలా చేసుకో వారికి శ్రీవారి సేవా టిక్కెట్ ధర ఎక్కువ ఉంటుంది. మీరు ఈ సేవకు పూర్తిగా సంప్రదాయ వస్తాలతోనే చేసుకోవాలి.

ఈ  అష్టదళ పాదపద్మరాధన సేవ టిక్కెట్లు book చేసుకున్నవారు తెల్లవారు జామున 5 గంటలకు Report చెయ్యాలి.  ఇలా అష్టదళ పాదపద్మరాధన సేవా ద్వార వెళ్ళిన శ్రీవారి భక్తులు ఆనంద నిలయం లోపల కూర్చున్ని స్వామి వారికి జరిగే సేవలను చూడవచ్చు . ఈ అష్టదళ పాదపద్మరాధన సేవ  సుమారు 30 నిమిషాలు ఉంటుంది .తరువాత ఒకొక్కరిగా స్వామి వారిని మొదటి గడప వరకు వెళ్లి శ్రీనివాసుని దర్శించవచ్చును.... అందుకనే వీటీని మొదటి గడప ధర్శనం టిక్కెట్లు అని కూడా అంటారు. 

టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చిన ID ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. మీరు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ పిల్లల మీతో తీసుకొని వెళ్ళవచ్చు.

రిపోర్టింగ్ సమయం కోసం - 05:00 AM

అష్టదళ పాద పద్మారాధన 06:00 AM– 07:00 AM వరకు ప్రారంభమవుతుంది.

అష్టదళ పాద పద్మారాధన టిక్కెట్టు ధర రూ. 1250/-.

2 పెద్ద లడ్డూలు మరియు 2 వడలు ప్రసాదంగా, వస్త్ర బహుమానం (పురుషులకు పై వస్త్రం (ఉత్తరీయం) మరియు మహిళలకు 1 బ్లౌజ్ పీస్) టిక్కెట్ హోల్డర్‌లకు ఇవ్వబడతాయి.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags: astadala pada padmaradhana seva in telugu, ashtadala pada padmaradhana seva tickets price, how to book astadala pada padmaradhanamu, Tirumala ashtadala pada padmaradhana seva tickets, TTD ashtadala pada padmaradhana seva complete details in telugu, Tirumala srivari Arjitha Seva Details in telugu, astadala pada padmaradhanamu seva tirumala, thomala seva in tirumala, archana seva in tirumala, suprabatha seva in tirumala, how to book arjitha seva tickets online, Bhakthi Margam telugu, Bhakthimargam.in, bhakthi margam, bhakti margam, bhaktimargam, bhakti margam telugu, telugu bhakthi margam, tirumala latest updates, tirumala tirupati latest news, Tirumala srivari astadala pada padmaradhana seva complete details in telugu

Comments