తిరుమల అంగప్రదక్షిణ | Tirumala Angapradakshinam Tickets Full Details In Telugu | Bhakthi Margam


తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ

మొదటిసారిగా తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేసేవారు పూర్తి వివరాలు తెలుసుకోవడం వలన అంగప్రదక్షిణ సులభంగా చేయవచ్చు.. ఈరోజు అంగప్రదక్షిణ టికెట్లు ఎక్కడ ఇస్తారు.. ఆలయానికి ఎప్పుడు ఏ సమయంలో చేరుకోవాలి.. ఏ విధమైన నియమాలు పాటించాలి తెలుసుకుందాం..

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రం.. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం.. తెలుగు రాష్ట్రాల సహా దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తారు. అయితే స్వామివారి సన్నిధిలో అంగప్రదిక్షణ చేయాలనుకునే భక్తులు కూడా అధికంగా ఉంటారు. శ్రీవారి సన్నిధిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. ఆ అనుభూతిని వర్ణించడానికి కూడా మాటలు చాలవు అని భక్తులు అంటారు.

అంగప్రదక్షిణ చేసే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అంగప్రదక్షిణ చేసే భక్తులు రాత్రి 12 గం. సమయంలో శ్రీవారి పుష్కరిణిలో ఒంటిమీద బట్టలతోనే మూడు మునకలు వేసి అలాగే తడి బట్టలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా వెళ్ళాలి.  రిపోర్టింగ్ సమయం.. రాత్రి.. ఒంటి గంట.. కనుక ఆ సమయానికే క్యూ లైన్ దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ టికెట్, ఐడిని చెక్ చేసిన అనంతరం.. సెక్యూరిటీ భక్తులను ఆలయం లోపలి అనుమతిస్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్లో కి ప్రవేశం ఉంటుంది.

వేంకటేశ్వరునికి సుప్రభాత సేవ మొదలైన తరవాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు. దాదాపు తెల్లవారు జాము 2:45 గంటల సమయంలో మొదట స్త్రీలను అంగప్రదక్షిణకోసం పంపుతారు. తరువాత పురుషులకు అనుమతి ఉంటుంది. సుప్రభాతం జరుగుతున్న సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తి అవుతుంది. తర్వాత భక్తులను స్వామివారి వెండి వాకిలి ముందు ఉన్న ధ్వజస్తంభం దగ్గర కూర్చోబెడతారు. స్త్రీలందరూ ప్రదక్షిణ పూర్తి చేసి వెండి వాకిలి దగ్గరకు రాగానే పురుషులను అంగప్రదక్షిణకు అనుమతి ఉంటుంది. అంగప్రదక్షిణ పూర్తి చేసిన పురుషులను  వెండి వాకిలి బైట కళ్యాణ మండపం వద్ద కూర్చోబెడతారు.

ఇంతలో శ్రీవారి సుప్రభాత సేవ పూర్తవుతుంది. దర్శనం చేసుకొన్న భక్తులు బైటకు రాగానే అంగప్రదక్షిణ భక్తులు స్త్రీలను దర్శనం కోసం అనుమతించిన వెంటనే పురుషులకు అనుమతిస్తారు.

అయితే అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణ ధరించాల్సి ఉంటుంది. స్త్రీలు భారతీయ సాంప్రదయాన్ని అనుసరిస్తూ.. చీరలు, లంగా వోణీ వంటివి ధరించాల్సి ఉంటుంది. పురుషులు పంచె పైన కండువా ధరించాల్సి ఉంటుంది.  షార్ట్, ట్రాక్ ప్యాంట్, టి షర్ట్, చొక్కా, జీన్స్ ప్యాంట్ వంటి దుస్తులను ధరించి వెళ్లే భక్తులను అంగప్రక్షిణకు అనుమతించరు.

ప్రదక్షిణ స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకుని అలాగే శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ  శ్రీవారి హుండీ (ధనలక్ష్మి విగ్రహం వరకు) చేరుకోవాలి. అప్పుడు ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ప్రదక్షిణలు చేయడం (దొర్లడం)లో ఇబ్బంది కలగకుండా (స్త్రీలు) శ్రీవారి సేవకులు పర్యవేక్షణ చేస్తారు.. కనుక ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు.

అంగప్రదక్షిణ టిక్కెట్: స్వామివారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు దీని టిక్కెట్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనవసరం లేదు. ఆన్లైన్ ద్వారా ఈ www.tirupatibalaji.ap.gov.in website . నా ఫోన్ నంబర్ ద్వార ఈ టికెట్ పొందొచ్చు. ఈ అంగప్రదక్షిణ టిక్కెట్లు ఒక్క నేల ముందుగానే  టీటీడీ విడిదల చేస్తుంది. అంగప్రదక్షిణ టిక్కెట్ ఉచితంగా పొందొచ్చు. మోబైల్ నెంబర్ తో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం, 1 ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు.

వరాహస్వామి దర్శనం చేసుకోండి. ( స్వామి దర్శనానికి ముందే వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. లేక పోతే దర్శన ఫలం ఉండదు ) చుట్టుప్రక్కల ఉన్న మిగతా దేవాలయాలు,ఆశ్రమాలు దర్శించుకోండి.  ఆరోజు రాత్రికి భారీ ఆహారం తీసుకోకండి. అలా తీసుకుంటే ప్రదక్షిణలు మనం మూడు గంటల సమయంలో చేస్తాం కనుక ఆహారం సరిగా అరుగదు. మనం పొర్లడం వలన వాంతులు అవుతాయి కనుక అల్పాహారం తీసుకోవడం మరవద్దు.  రూము దొరికితే ఫర్వాలేదు. 

దొరక్క పోయినా మరేమీ కంగారు పడనవసరం లేదు. రాత్రి పన్నెండైనా ఇంకా భజనలు, హరికథలు సాగుతుంటాయి దేవాలయం చుట్టుప్రక్కల.  రాత్రి పన్నెండున్నరకు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఒంటిగంట కల్లా అంగప్రదక్షిణకు వెళ్లే లైన్ వద్ద నుంచోవాలి. లైనులో మొగవారైతే దాదాపు రెండుగంటలు వేచి ఉండాలి. ఆడవారు గంటన్నర. ఆసమయం వృధా చేయకుండా స్వామి మనకిచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి.

అందుకని చేతిలో గోవిందనామాల కాగితం పెట్టుకుని బిగ్గరగా మీరు చెప్తూ మీస్నేహితుల చేత చెప్పించండి. అది విని మిగతావారు చెప్తారు. చక్కగా లైన్ లో ఉన్నంత సేపూ మొహమాటపడకుండా భగవన్నామాన్ని పలకండి. స్వామికి అంగ ప్రదక్షణ చేసి, స్వామిని మనసారా దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి ఉదయం ఆరవుతుంది. లడ్డులు కొనుక్కుని బయటకు వచ్చి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని కాసేపు ధ్యానం చేయండి.  సంధ్యావందనాదికాలు ముగించుకుని అల్పాహారం సేవించి, ఆరోజు దర్శనం జరిగిన విధివిధానాన్ని నెమరు వేసుకుంటూ  క్రిందకు రండి.

Reporting Time: 1 AM

No.of Tickets to be issued : 750 (Angapradakshinam not available on Friday due to Poorabhishekam)

Reporting place : Supadam, 1 am (Near Vaikuntam I queue Complex)

ఈ సేవకు వెళ్లే శ్రీవారి భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషుడు: ధోతీ, చొక్కా,  స్త్రీ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. వస్త్రాన్ని ధరించండి.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags: Angapradakshinam in Tirumala, angapradakshinam benefits, angapradakshinam experience, angapradakshinam meaning, angapradakshinam ttd, angapradakshinam by ladies, angapradakshinam tickets offline, angapradakshinam online booking for tirumala, how to do angapradakshinam, Angapradakshinam reporting time, angapradakshinam online booking for tirumala, tirumala angapradakshinam in telugu, angapradakshinam ticket price in tirumala in telugu, angapradakshinam in tirumala timings, how to book angapradakshinam in tirumala online, angapradakshinam in tirumala video,  bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, Telugu bhakthi margam, bhakti margam telugu, bhakthi margam telugu, Tirumala Angapradakshinam Tickets Complete Details in Telugu  

Comments