ఉగాది విశిష్టత | Significance of Ugadi Festival In Telugu | Telugu New Year Ugadi 2023 | Ugadi Panchangam in Telugu | Bhakthi Margam
ఉగాది ఎందుకు జరుపుకుంటారు?
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయని బలంగా విశ్వసిస్తారు. తెలుగుదనం ఉట్టిపడేలా పండుగను జరుపుకుంటారు.
చైత్ర శుద్ధ పాడ్యమి నాడి బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెపుతున్నాయి.
ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను దొంగిలించాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం వెళ్లి సోమకారుణ్ణి వాదించి వేదాలను తీసుకొని వచ్చి, బ్రహ్మ దేవుడికి అప్పగించాడట. ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలు చెపుతున్నాయి.
ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి తెలుగు వారి మొదటి పండుగ, ఇల్లు, వాకిలి, శుభ్రపరుచుకోవటం, తలంటుస్నానాలు, కొత్తబట్టలు ధరించటం జరుగుతుంది. ఈ రోజున కొత్త పనులను ప్రారంభిస్తారు.
ఉగాదిలో ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం.
ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.
ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు.
శోభకృత్ నామ సంవత్సరంలో చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు.
సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది.
అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. 'ఉగాది', 'యుగాది' అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత
వసంతఋతు ఆగమనం ప్రారంభమైన రోజు. ఈ రోజున షడ్రుచులు కలిపిన పచ్చడి తయారు చేసి తింటారు.
షడ్రుచులు గల ఈ పచ్చడిని తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు గల బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేపపువ్వు, మామిడికాయలు తగిన మోతాదులో మన రుచికి తగినట్టుగా కలిపి తయారు చేస్తారు.
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి.
షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.
బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు - కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు.
పంచాంగ శ్రవణం
తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవొచ్చు. మరియు ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా అలోచించి తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావిస్తారు.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags: Ugadi Panchangam in Telugu,ugadi 2023 telugu date, ugadi wikipedia in telugu, Importance Of Ugadi Festival 2023,Significance & Importance of Ugadi,Telugu New Year Ugadi 2023 , Bhakthi Margam telugu, Bhakthimargam.in, bhakthi margam, bhakti margam, bhaktimargam, bhakti margam telugu, telugu bhakthi margam,





Comments
Post a Comment