అన్నమయ్య కీర్తన సతులాల చూడరే | annamayya keerthana sathulala chudarey in telugu | bhakthi margam | భక్తి మార్గం

 

అన్నమయ్య కీర్తన సతులాల చూడరే

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు ।
పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు ।
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు ॥

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు ।
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు ॥

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు ।
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు ॥
tags:annamayya keerthana sathulala chudarey benefits,annamayya keerthana sathulala chudarey lyrics in telugu,annamayya keerthana sathulala chudarey in telugu with meaning,annamayya keerthana sathulala chudarey in telugu by spb mp3 free download,annamayya keerthana sathulala chudarey in telugu pdf,annamayya keerthana sathulala chudarey in telugu with meaning pdf,annamayya keerthana sathulala chudarey in telugu mp3 free download,annamayya keerthana sathulala chudarey lyrics telugu,annamayya keerthana sathulala chudarey meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, 

Comments