అన్నమయ్య కీర్తన చందమామ రావో | annamaya keerthana chandamama ravo in telugu | bhakthi margam | భక్తి మార్గం
అన్నమయ్య కీర్తన చందమామ రావో
చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో ॥
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో ॥
నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టించిన తండ్రికి
నిగమము లందుండే యప్పకు మా నీల వర్ణునికి ।
జగమెల్ల నేలిన స్వామికి ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికిమా ముద్దుల మురారి బాలునికి ॥
తెలిదమ్మి కన్నుల మేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకుమా కతల కారి ఈ బిడ్డకు ।
కుల ముద్ధించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండు వొయ్యారికి నవ నిధుల చూపుల జూసే సుగుణునకు ॥
సురల గాచిన దేవరకు చుంచు గరుడుని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి ।
విరుల వింటి వాని యయ్యకు వేవేలు రూపుల స్వామికి
సిరిమించు నెరవాది జాణకు మా శ్రీ వేంకటేశ్వరునికి ॥
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags: annamaya keerthana chandamama ravo benefits, annamaya keerthana chandamama ravo in telugu, annamaya keerthana chandamama ravo in telugu with meaning, annamaya keerthana chandamama ravo in telugu by spb mp3 free download, annamaya keerthana chandamama ravo in telugu pdf, annamaya keerthana chandamama ravo in telugu with meaning pdf, annamaya keerthana chandamama ravo in telugu mp3 free download, annamaya keerthana chandamama ravo lyrics telugu, annamaya keerthana chandamama ravo meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in,

Comments
Post a Comment