అన్నమయ్య కీర్తన అందరికి ఆధారమైన | annamaya keerthana andhariki adharamyna in telugu | bhakthi margam | భక్తి మార్గం

 

అన్నమయ్య కీర్తన అందరికి ఆధారమైన

అందరికాధారమైన ఆది పురుషుడీతడు
విందై మున్నారగించె విదురునికడ నీతుడు ॥

సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజ భవాదులకును దైవంబై నతడీతడు ।
ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ॥

సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు
ధరనావుల మందలలో తగ జరించె నీతడు ।
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ॥

పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు
సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు ।
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు
వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ॥
tags: annamaya keerthana andhariki adharamyna benefits, annamaya keerthana andhariki adharamyna in telugu, annamaya keerthana andhariki adharamyna in telugu with meaning, annamaya keerthana andhariki adharamyna in telugu by spb mp3 free download, annamaya keerthana andhariki adharamyna in telugu pdf, annamaya keerthana andhariki adharamyna in telugu with meaning pdf, annamaya keerthana andhariki adharamyna in telugu mp3 free download, annamaya keerthana andhariki adharamyna lyrics telugu, annamaya keerthana andhariki adharamyna meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, 

Comments