పిఠాపురం పురుహూతికా దేవి శక్తిపీఠం | Pithapuram sri puruhutika devi shakthi peetam history in telugu | bhakthi margam | భక్తి మార్గం
పురుహూతికా దేవి శక్తిపీఠం
పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. ఇక్కడ గల కుక్కుటేశ్వర ఆలయం, పురుహూతికా దేవి ఆలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.
ఆలయ పురాణం
పురాణాల ప్రకారం పార్వతి దేవి మరణించిన తర్వాత విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో పార్వతి దేవి శరీరాన్ని ఖండించినపుడు ఆమె శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో ఆలయాలు వెలిశాయని వాటిని శక్తిపీఠాలుగా భావిస్తాము.
ఈ విధంగా వెలిసిన ఆలయాలలో 18 శక్తి పీఠాలు ఎంతో పవిత్రమైనవి.అందుకే వాటిని అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుస్తారు.16 శక్తి పీఠాలు మన దేశంలో ఉండగా రెండు శక్తిపీఠాలు ఒకటి శ్రీలంక ఒకటి పాకిస్తాన్ లో ఉన్నాయి.ఈ 16 శక్తి పీఠాలలో 1 తెలుగు రాష్ట్రంలో వెలిసింది.
కాకినాడకు దగ్గరగా ఉన్నటువంటి పిఠాపురం సంస్థానాదీశుల పాలనలో వైభవముగాను, శోభాయమానంగా విలసిల్లిన రాజక్షేత్రం.నాటి మహారాజుల భవనాలు కట్టడాలు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి.
కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది.పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.
వీటితోపాటు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీపురుహూతిక పీఠం కూడ కాలగర్భంలో కలసి పోయింది.విష్ణుమూర్తి పార్వతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసినప్పుడు అమ్మవారి పిరుదులు ఈ ప్రదేశంలో పడటం వల్ల ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీపురుహూతిక దేవిగా భక్తులు పూజించే వారు.
పురాణాల ప్రకారం ఈ ఆలయంలో వెలసిన అమ్మవారికి ఇంద్రుని చేత పూజింపబడినది.1998 సంవత్సరంలో ఆలయ పునర్నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. కొత్తగా నిర్మించిన ఈ ఆలయంలో అమ్మవారికి నిత్యపూజలు కుంకుమార్చన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.
ముఖ్యంగా ఆశ్వీజమాసంలో నిర్వహించే దేవీనవరాత్రుల ఉత్సవాలను ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.మనదేశంలోనే పిఠాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది.ఈ ఆలయంలో కుక్కుటేశ్వరస్వామి స్వయంభూగా వెలిశారు.
దక్షిణ కాశీ గా పేరుపొందిన ఈ ఆలయంలో హోమాలు, అధ్యయనం, శ్రాద్ధం, దేవతార్చనలు, వ్రతాలు మొదలగునవి చేయటం వల్ల అమ్మవారు అనుగ్రహం చెంది మనకు కోటి రెట్లు పుణ్య ఫలితాన్ని అది ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయ పూజ సమయాలు
5.30 am to 9.00 pm. ,1.00 pm to 4.30 pm.
ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం
విమానాల్లో వచ్చే యాత్రికులు రాజమండ్రి (60 కి. మీ) లేదా వైజాగ్ (180 కి. మీ) ఎయిర్ పోర్ట్ లో దిగి, క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు.
రైలు మార్గం
సామర్లకోట రైల్వే జంక్షన్ పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగుతాయి. స్టేషన్ బయట షేర్ ఆటోలు లేదా బస్టాండ్ కు వెళ్లి ప్రభుత్వ బస్సుల్లో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం
కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు ప్రతిరోజూ తిరుగుతుంటాయి.
puruhutika devi temple - contact number
Pithapuram,
East Godavari District,
Andhra Pradesh – 533450
Phone: 08869 – 251445(office)
Email: eopadagaya@gmail.com
Comments
Post a Comment