త్రిమూర్తులు కొలువైన త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రం | trimbakeshwar jyotirlinga history in telugu | bhakthi margam | 12 jyothirlingas
పురాణ ఇతిహాసం
త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.ఆలయ విశేషాలు
పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో చత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం హేమంత్‌పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చతుర్స్రాకారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.కుశావర్తనం, గోదావరి పుట్టుక
గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంటే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడిందని పురణాల ప్రకారం కథనం.త్రయంబకేశ్వరుని దర్శనానంతరం దక్షిణగంగగా పిలువబడే గోదావరి పుట్టిన చోటికి వెళ్లే దారిమీదుగా బ్రహ్మగిరి చేరుకొని కొండపై నున్న గోవు ముఖాన్ని అందులోంచి బొట్టు బొట్టుగా పడే గోదావరిని దర్శించుకోవచ్చు . కొండదారి యెత్తైన మెట్లు , బ్రహ్మగిరి పైన యెప్పుడూ చినుకులు పడుతూనే వుండటం వల్ల పాకు పట్టి జారుడుగా వుండి దారి కష్టంగానే వుంటుంది . మరాఠీలు , గుజరాతీలు మాత్రం యీ కొండను యెక్కి గోదావరి పుట్టిన ప్రదేశాన్ని సందర్శించు కుంటున్నారు . వర్షాకాలంలో ఈ యాత్రను మూసివేస్తున్నారు . మేం 1979 లో బ్రహ్మగిరి యెక్కి గోముఖాన్ని దర్శించుకున్నాం . తరవాత యెక్కే సాహసం చెయ్యలేదు .
త్రయంబకేశ్వరం , గోదావరి లను గురించి పురాణాలలో వివరించబడ్డ కథ యీవిధంగా చెప్పబడింది .
సత్యయుగంలో ఈప్రాంతం లో గౌతమముని ఆశ్రమం వుండేది . ఒకానొక సమయంలో భరతఖండం లో యిరవైనాలుగు సంవత్సరాలుగా వర్షాలులేక కఱువు తాండవమాడసాగింది . ఎక్కడా పంటలులేక త్రాగు నీరులేక ప్రజలు , పశువులు అలమటించసాగేయి . గౌతమ మహర్షి చేసిన పుణ్యము వలన అతని ఆశ్రమంలో మాత్రం వర్షాలు పడేవి . విషయం తెలుసుకున్న మునులు ఋషులు తమతమ పరివారాలను పశువులనూ తీసుకొని గౌతమ ముని ఆశ్రమంలో వుండసాగేరు .
గౌతమ ముని వరుణుని సహాయమతో పొద్దున్న విత్తులు నాటి మద్యాహ్నమునకు పంట కోసి అథిధులకు ఆకలి తీర్చి మరింతపుణ్యము పొందసాగెను . అతని పుణ్యము వలన తన యింద్రపదవికి ముప్పు వచ్చునేమో అనే సందేహముతో యింద్రుడు వరుణుని భరతఖండమంతటా వర్షాలుకురిపంచ వలసిందిగా ఆజ్ఞాపిస్తాడు . అయిననూ మునులూ , ఋషులూ గౌతముని ఆశ్రమములో వుండసాగిరి .
ఇంద్రుడు ఒక మాయా గోవును సృష్టించి గౌతముని పంటను నాశనము చేయవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు . మాయా గోవు పంటను నాశనము చేయుట సహించని గౌతముడు గోవును దర్భతో అదిలించగా గోవు మరణిస్తుంది .
గోహత్యాపాతకం చుట్టుకున్న గౌతముని ఆథిధ్యం స్వీకరింపలేమని మునులు , ఋషులు ఆశ్రమాన్ని విడిచి పెట్టి వెడలిపోతారు . గౌతముడు గోహత్యా దోష పరిహారార్ధం శివుని కొరకై ఘోర తపస్సుచేసి శివుని ప్రసన్నుని చేసుకొని పాపవిముక్తుడిని చేయవలసినదిగా వేడుకొనగా శివుడు గంగను విడిచి పెట్టేందుకు జడ విప్పుతాడు . గౌతముని పై అలిగిన గంగ దేవలోకానికి వెడలిపోతుంది .
ఆగ్రహించిన శివుడు రుద్రతాండవమాడుతూ బ్రహ్మగిరి చేరి తనజడను బ్రహ్మగిరి పై విసిరి కొడతాడు . శివుని వుగ్రరూపానికి భయపడ్డ గంగ శివుని జడతగిలిన ప్రదేశంలో ప్రత్యక్షమైంది . కాని గౌతముడు స్నానమాచరించి పాపవిముక్తుడగుటకు సహకరించదు
అతని నుండి తప్పించుకొనుటకై గంగాద్వార్ , వరాహతీర్థం , రామలక్ష్మణ తీర్ధం , గంగాసాగర్ తీర్ధం మొదలయిన చోట్ల పత్యక్షౌతుంది . గౌతముడు అక్కడకు చేరేసరికి గంగ మాయం కాసాగింది . అప్పుడు గౌతముడు గడ్డిపరకలతో వృత్తాకారము యేర్పరచి ఆ వృత్తములో గంగను బంధంచి అక్కడ స్నానం చేసి గోహత్యాపాతకం పోగట్టుకుంటాడు . దీనిని కుశ తీర్థము అని అంటారు . సింహగ్రస్థ కుంభమేళా స్నానాలు యీ కుశ తీర్థం లో చేసుకోడం అనాదిగా హిందువులు ఆచరిస్తున్న విధి .
గోదావరి యీ కుశ తీర్థమునుండి ప్రవహించి రాజమండ్రి దగ్గర బంగాళాఖాతం లో కలిసేంత వరకు వేల యెకరాలలో ప్రవహించి వేల యెకరాల పంటభూములకు సాగునీటిని అందించి , కోట్లాది ప్రజల అవసరాలను తీరుస్తోంది .
గౌతముని వలన వచ్చింది కాబట్టి గోదావరిని గౌతమి అని కూడా అంటారు .
గౌతమ మహర్షి శివుని కొరకై తపస్సు చేసుకున్న ప్రదేశం లోనే కోవెల నిర్మింప బడింది .
ఈ కోవెలలో ముఖ్యంగా కాలసర్పశాంతి , మృత్యుంజయ హోమం , త్రిపిండి విధి , నారాయణనాగబలి పూజలు జరుపుతారు . నారాయణ నాగబలి పూజ యీమందిరంలో మాత్రమే నిర్వహిస్తున్నారు . ఈ పూజ మూడురోజులు నిర్వహిస్తారు . అనారోగ్య సమస్యలు , గృహశాంతి , వంశాభివృధ్దికి , నాగదోష నివారణార్ధం యీ పూజ చేయించుకుంటారు .
రామభక్త హానుమాన్ గా పేరుపొందిన ఆంజనేయుని జన్మస్థలం నాసిక్ నగరం నుంచి త్రయంబకం వెళ్లే దారిలో త్రయంబకానికి ఆరు కిలోమీటర్ల ముందు వచ్చే అంజనేరి గ్రామం .
త్రయంబకం లో వున్న త్రయంబకేశ్వరుడు జ్యోతిర్లింగం . జ్యోతిర్లింగంలో శివుడు అగ్ని రూపంలో కొలువై వుంటాడు . దీనికి ఆధారంగా సత్యయుగములో బ్రహ్మ విష్ణువులకు ఒకానొక సమయంలో యెవరుగొప్ప అనే విషయమై వాదనచెలరేగగా శివుడు తనఆది అంతములను తెలుసుకొమ్మని యెవరైతే తెలుసుకుంటారో వారే గొప్పని చెప్పి తాను ఆదీఅంతములేని జ్వలితస్థంభము వలె అవతరిస్తాడు . ఆది తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరహములు వలె భూమిని దొలచి పాతాళము యింకా కిందకుచేరుకొని కూడా ఆది కానరాక వెనుతిరుగుతాడు .
బ్రహ్మ అంతం తెలుసుకొనేందుకు పక్షి అవతారము దాల్చి పైకి పైకి అంతరిక్షమనకు చేరుకొని అంతము కానరాక అసత్య మాడదలచి కేతకి పుష్పమును రుజువునకై తనకూడా తీసుకొని వస్తాడు . విష్ణుమూర్తి తాను ఆది తెలుసుకొనలేదని సత్యము పలుకగా బ్రహ్మ తాను అంతము కనుగొంటినని దానికి కేతకి పుష్పం సాక్షమని అసత్యము పలుకుతాడు .
అందుకు ఆగ్రహించిన శివుడు బ్రహ్మకు భూలోకంలో పూజలందుకునే అర్హత లేకుండునట్లు శపించి విష్ణుమూర్తి కి శివునితో సమానంగా పూజార్హతను కలుగజేస్తాడు . ఆది అంతము లేని అనంతమయిన జ్వలితలింగమే జ్యోతిర్లింగము . విష్ణుమూర్తి కోరిక మేరకు భూలోకంలో 64 ప్రదేశాలలో జ్యోతిర్లింగంగా శివుడు అవతరించినట్లుగా శివపురాణం లో వుంది . వాటిలో పన్నెండింటిని ముఖ్యమైనవిగా ఆదిశంకరులు గుర్తించేరు . వాటిని మనం ద్వాదశ జ్యోతిర్లింగాలని పిలుస్తున్నాం .
శహ్యాద్రి పర్వతశ్రేణులలోని బ్రహ్మగిరి పర్వత పాదాలదగ్గర వున్న పురాతనమైన మందిరం త్రయంబకేశ్వరం . ఎందరో రాజులచేత నిర్మింపబడి క్షతికి గురై ప్రస్తుతం వున్న నల్లరాతి కట్టడం పేష్వా బాలాజీ బాజీరావు ( నాన్నా సాహెబ్ ) ద్వారా నిర్మింపబడింది .
చుట్టూరా ప్రహారీ గోడతో పెద్ద పెద్ద తలుపులతో ముఖ్యద్వారం , లోనికి వెళితే లోపల విశాలమైనప్రాకారం అందులో శివలింగాలు , సోమరసం నుంచి వచ్చే అభిషేక తీర్థం వచ్చే ప్రదేశం , స్థలవృక్షం , మందిరం నమూనా , మూలవిరాట్టు నమూనాలు వుంటాయి . స్థలవృక్షం పక్కనుంచి వెళ్లేటట్టుగా క్యూ ని నియంత్రించేరు .
ఈ మందిరాన్ని మేము మొదటిసారి 1979 లో దర్శించుకున్నాం తరవాత ఆ ఈశ్వరుని కృప వల్ల లెక్కకు మించిన సార్లు దర్శించుకొనే అవకాశం లభించింది . యేటికేడాది భక్తుల రాక పెరగడం దాంతోపాటు గ్రామం అంచలంచలుగా పెరగడం చూసేం , గత కొన్ని సంత్సరాలుగా క్యూ దారి యేర్పరచి , భక్తులను ముందుగా మందిరానికి వెలుపల వున్న నంది మండపాన్ని దర్శించుకొని నందికి తెల్లని పుష్పాలతో పూజించుకున్న తరువాత పెద్ద పెద్ద రాతి మెట్లు యెక్కి సభా మంటపం లోనికి ప్రవేశంచేటట్టుగా యేర్పరచేరు . .
సభా మంటపం చక్కని శిల్ప సంపదకలిగిన రాతి స్థంభాలతో నిర్మింపబడింది . సభా మండపంలో వివిధ శాంతిపూజలు జరుగుతూ వుండడం కనిపిస్తుంది . అభిషేక వేళలలో తప్ప మిగతా సమయాలలో వెండి ముఖాలంకరణలో శివుడిని దర్శనం లభిస్తుంది . గతకొద్ది సంవత్సరాలుగా ఆడవారికి గర్భగుడిలోకి ప్రవేశం రద్దుచేసేరు . అంతకముందు లోనికి వెళ్లి శివలింగాన్ని చేత్తో తాకి లింగానికి సదా అభిషేకం చేసుకొనే గోదావరి నీటిని తలపై జల్లుకున్న అనుభవం వుంది .
ఇప్పుడు రద్దీ తక్కువ వున్నప్పుడు మన వయసువారిని లోనికి అనుమతించడం వుంది . మొగవారు పంచకట్టుకుని వచ్చిన వారిని శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకోడానికి అనుమతిస్తారు . దర్శనానంతరం సభామంటపం లో వున్న పాలరాయి తాబేలుని పూజించుకొని బయటకి వస్తాం .
అక్కడ బిల్వ చెట్టు కోవెల పుష్కరిణి లను దర్శించుకొని చిన్న తలుపు గుండా బయటకి వెళితే అక్కడ ప్రవహిస్తున్న గోదావరి ని చూడొచ్చు . అక్కడవున్న లక్ష్మీనారాయణ మందిరం , గోపాలకృష్ణ మందిరం చూసుకొని గాయత్రీదేవి స్వయంభూ విగ్రహం దర్శించుకొని బయటకి వస్తే గోశాలమీదుగా బజారులోంచి ముఖ్యద్వారం చేరుకుంటాము . రద్దీ తక్కువగా వున్న రోజులలో తిరిగి మందిరంలోనికి వెళ్లి మృత్యుంజయ లింగం మొదలయిన లింగాలను దర్శించుకొని ముఖ్యద్వారం గుండా బయటకి రావొచ్చు .
ప్రతీ సోమవారం మధ్యాహ్నం జరిగే అభిషేకానంతరం నాలుగు నుంచి ఐదు గంటలవరకు వెండి తొడుగుకు వజ్రాలు , పచ్చలు , కెంపులు పొదిగిన బంగారు కిరీటాన్ని అలంకరిస్తారు . ఈ కిరీటం త్రేతాయుగంలో పాండవులు స్వామివారకి సమర్పించుకున్న కానుక . ఇక్కడ మరో వజ్రం గురించి చెప్పుకోవాలి . దీనిని ' నాసక్ వజ్రం ' అని వ్యవహరిస్తారు . ఈ వజ్రం త్రయంబకేశ్వరునకు చెందినది . సుమారు 15 వ శతాబ్దం లో తెలంగాణాకు చెందిన మహబూబ్ నగర్ లో దొరికింది . దీని బరువు సుమారు 90 కేరట్లు , ఫ్లాలెస్ నీలిరంగు వజ్రం , ప్రిన్స్ కట్ దీనిని అప్పటిరాజులు ( పేరు లభించలేదు ) త్రయంబకేశ్వరునకు కానుకగా యిచ్చేరు .
నాసిక్ నగరంలో చూడదగ్గ ప్రదేశాలు కుశతీర్థం , గోదావరి మాత మందిరం , కపాలేశ్వర మందిరం పంచవటి , సీతాదేవి గుహ , గోరారామ మందిరం , కాలారామ మందిరం ముఖ్యంగా చూడతగ్గవి .
రవాణా మార్గాలు
నాసిక్ నుండి దేవాలయానికి 28 కిలోమీటర్లు. ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి. అలాగే రైల్వే స్టేషను నుండి దేవాలయం నలభై కిలోమీటర్లు. ఇక్కడి నుండి ప్రవేట్ వ్యాన్లు బస్సులు ఉంటాయి.
మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో నాసిక్ నగరానికి సుమారు 28 కిలో మీటర్లదూరంలో వుంది త్రయంబకేశ్వరం . ఈ వూరు వేద అధ్యయనం వృత్తిగా స్వీకరించిన అధిక బ్రాహ్మణకుటుంబాలు గల వూరని చెప్పడంలో అతిశయోక్తి లేదు .
ఈనాటికి యిక్కడ వేద గురుకుల పాఠశాలలు , అష్టాదశ యోగ సాధనా ఆశ్రమాలు , మఠాలు వున్నాయి .
నాసిక్ , త్రయంబకం ప్రదేశాలు సత్యయుగమునకు చెందినవని మన పురాణాలలో వివరించేరు . ద్వాపరయుగం లో శ్రీరాముడు , సీతా లక్ష్మణ సమేతుడై నివసించిన పంచవటి నాసిక్ నగరానికి 3,4 కిలోమీటర్ల దూరంలో వుంది . లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం , రావణాసురుడు సీతను అపహరించుకు పోయిన ప్రదేశం కూడా యిదే .
CONTACT US
Shri.Trimbakeshwar Devsthan Trust.
Trimbakeshwar, Nashik.
Contact No. :
Trust Office : +91-2594-233215
Bhaktnivas : +91-2594-234251
LOCATION
Trimbakeshwar is a city and a municipal council in Nashik District situated at 28 km away from Nashik at the foothills of Brahmagiri hills of Sahyadri ranges. Trimbakeshwar is located at 19.56°N 73.32°E. It has an average elevation of 720 metres (2362 feet).
HOW TO REACH
Trimbakeshwar is connected to Nashik by four lane road. One can also reach to Trimbakeshwar by leaving N.H.3 (Mumbai- Agra) near Ghoti village (next to Igatpuri while coming from Mumbai). Trimbakeshwar is also connected via road from Charoti naka (90 Km) on Mumbai - Ahmedabad highway. (NH8)
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags:trimbakeshwar jyotirlinga temple, trimbakeshwar jyotirlinga story in telugu, trimbakeshwar jyotirlinga history in telugu, trimbakeshwar jyotirlinga accommodation, top 10 temples in india, dwadasa jyothirlingalu, 12 jyotirlinga images with name and place, 12 jyotirlinga list, 12 jyotirlinga temples history, 12 jyotirlingas in india, 12 jyotirlinga temple in india, bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in
.jpg)
Comments
Post a Comment