శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం సామర్లకోట | Samalkot Sri Kumararama Bhimeswara Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం | Pancharama Temples


శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి 
దేవాలయం

ఆలయ చరిత్ర:

సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.

చాళుక్య రాజు అయిన భీముడు సామర్లకోటలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామ భీమేశ్వర ఆలయం అని పిలుస్తారు. ద్రాక్షారామంలో ఉన్న పంచారామ క్షేత్రం కూడా ఈ రాజుచే నిర్మించబడినట్లు చెబుతారు. అందుకే ఈ రెండు క్షేత్రాల నిర్మాణ శైలి ఒకే రీతిలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 892 నుంచి క్రీస్తు శకం 922 మధ్య కుమార భీమేశ్వర ఆలయ నిర్మాణం జరిగింది.

 1340 - 1466 మధ్య కాలంలో కాకతీయ పాలకులు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు. దీని నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరిచే విధంగా ఉంటుంది. పరమేశ్వరుడు ఇక్కడ ఆత్మలింగ రూపంలో బాలాత్రిపురసుందరి దేవి సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తాడు. ఆలయ సమీపంలో పెద్ద కోనేరు కూడా ఉంటుంది. ఇందులో భక్తులు స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు.

పురాణ కధనం:

పురాణ కధనం ప్రకారం తారకాసురుడు అనే అసురుడు శివుని ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేస్తాడు. అతడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్ష్యమై ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు. బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావు లేకుండా తారకాసురుడు మరో వరాన్ని కూడా పొందుతాడు.

 పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని కంఠంలో ఉంచుకుని ఆ శక్తితో దేవతలను ముప్పు తిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు. దీంతో దేవతలంతా విష్ణువును కాపాడాలని వేడుకోగా ఆయన ఓ పరిష్కారాన్ని సూచిస్తాడు. పరమేశ్వరుడి తేజోరూపంతో జన్మించే కుమారుడు తప్ప మరెవ్వరూ తారకాసురున్ని అంతం చేయలేరని, ఇందుకోసం పరమేశ్వరున్ని ప్రార్ధించాలని చెబుతాడు.

దేవతలంతా పరమశివుణ్ణి రక్షించాలని వేడుకోవడంతో శివుడు పార్వతీ దేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు. యుద్ధ విద్యలను అభ్యసించిన పిదప కుమారస్వామి దేవతా గణములతో కలిసి తారకాసురున్ని ఎదుర్కొంటాడు. తారకాసురున్ని వధించాలంటే ఆత్మ లింగాన్ని చేధించాలని తెలుసుకుని అతడి కంఠంలోకి బాణ ప్రయోగం చేస్తాడు. దీంతో ఆత్మలింగం చెల్లాచెదురై తారకాసురుడు మరణిస్తాడు. 

ఆ ముక్కలైన ఆత్మలింగం భూమిపై వివిధ ప్రదేశాల్లో పడిందని, అవే ఆంధ్రప్రదేశ్ లోని పంచారామ క్షేత్రాల్లో ఉన్న శివలింగాలు అని చెబుతారు. కుమారరామంలో 14 అడుగుల ఎత్తులో రెండు అంతస్తులలో ఉండే తెల్లని స్పటిక లింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్టించినట్లు పురాణ కధనం. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామం అని పిలుస్తారు.

రావతి సమీప ఆకర్షణలు

ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు.

ఆలయం ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించాగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. 

గర్భగుడిలో రెండో అంతస్తు

దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుదీరు కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు కూర్చుని ఉంటాడు.

నూరు రాతి స్తంభాలు

గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడివున్నది. ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలను కలిగి ఉంది. రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితం

పూజలు, అర్చనలు చేయరాదు

శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేయుదురు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని దర్శించుకొనెదరు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి.

భీమేశ్వరాలయాన్ని పోలివుండును

ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలివుండును. అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివున్న ద్విప్రాకారాపు గోడలు ఇసుక రాయిచే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు.

ఉత్సవాలు పూజలు 

ఇక చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలాత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి.

వసతి 

సామర్లకోట లో యాత్రికులకు వసతి సదుపాయాలు కలవు. హోటళ్ళు, ప్రవేట్ లాడ్జీలలో గదులు అద్దెకు దొరుకుతాయి. అచ్చం మన ప్రాంతంలో ఉండేటట్లు టిఫిన్లు, భోజనాలు రుచికరంగా ఉంటాయి.

రవాణా:

సామర్లకోట కు 60 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి సామర్లకోట చేరుకోవచ్చు. సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉన్నది. ఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఆగుతాయి. రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ దూరంలో ఉన్న కుమారారామము క్షేత్రం చేరుకోవచ్చు. 

సామర్లకోట కు రాజమండ్రి, కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం కలదు. అంతేనా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్ర టిక్కెట్టు 350 రూపాయలు.

TempleTimings

Morning : 7am to12pm

Evening : 4pm to 8pm

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : sri kumara rama bhimeshwara swamy temple samarlakota history in telugu, samarlakota famous temples,east godavari famous temples, kakinada famous temples,andhra pradesh famous temples,india famous temples,world famous temples, Samalkot Sri Kumararama Bhimeswara Swamy Temple, SRI CHALUKYA KUMARARAMA SRI BHIMESWARASWAMY temple, samalkot bhimeswara temple history in telugu, samalkot kumara bhimeswara temple timings, samarlakota temple history, draksharamam temple, samarlakota famous temple, samalkot pancharama temple timings, samarlakota temple phone number, pancharamalu names list, pancharamalu names and places, pancharamalu tour plan, pancharamalu list in andhra pradesh, pancharamalu tour from vijayawada, Pancharamalu names in Telugu list, Draksharama Bhimeswara Swamy Konaseema district, Somarama Someswara Swamy West Godavari district, Ksheerarama Ksheera Ramalingeswara Swamy West Godavari district, Kumararama Kumara Bhimeswara Swamy Kakinada district, Pancharama Kshetras history in telugu, Pancharama Temples history in telugu

Comments