శ్రీ రామస్వామి వారి దేవస్థానం , రామతీర్థం | Ramatheertham Sri Rama Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం
శ్రీ రామస్వామి వారి దేవస్థానం
శ్రీ రామస్వామి వారి దేవస్థానం, రామతీర్థం
శ్రీ రామస్వామి వారి దేవస్థానం విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలో రామతీర్థం గ్రామంలోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శ్రీరాముడు చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు. ఇది ఉత్తరాంధ్ర భద్రాద్రిగా ప్రశస్తి పొందింది. ఇది విజయనగరం నకు ఈశాన్యంగా 12 కి.మీ దూరంలో ఉంది.
శ్రీ రామచంద్రస్వామి కొలువుదీరిన దివ్యక్షేత్రం శ్రీరామతీర్థం, సుందర ప్రకృతి లోగిలిలో అలరారుతోంది. చంపావతీ నదీసమీపాన నెలకొన్న ఈ ధామం నీలాచలం అను కొండను ఆనుకుని విరాజిల్లుతోంది. నీటిలో లభించటంవలన ఈ క్షేత్రానికి రామతీర్థం అని పేరొచ్చిందని కథనం. అతి ప్రాచీనమైన ఈ ఆలయం మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ సా.శ 469-496 మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఈ శాసనం వేసినట్లు, చరిత్ర కథనం.
ఆలయ చరిత్ర
రామతీర్థం రామచంద్రస్వామి దేవాలయం 1000 సంవత్సరాల క్రిందటిది. ఇది చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్షేత్రంలో రాముల వారి విగ్రహం తీర్థంలో దొరకడం వల్ల ఈ ప్రాంతానికి రామతీర్థం అని పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో జైనులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నవి. ఈ ప్రాంతంలోని కొండలలోని గురుభక్తకొండ, దుర్గకొండ అనే కొండలపై ప్రాచీనమైన బౌద్ధాలయాలు ఉన్నట్టుగా, వాటికి చారిత్రిక ప్రాధాన్యత ఉన్నదని చరిత్రకారులు పేర్కొన్నారు. ఇచట కొన్ని శిథిలా వస్థలో గల దేవాలయాలు కూడా కనిపిస్తాయి. రామచంద్రమూర్తి దేవాలయం ప్రక్కన 2007 లో శివాలయం కూడా కట్టబడింది.
స్థల పురాణం
భక్తుల విశేష పూజలను అందుకుంటూ రెండో భద్రాదిగా వాసికెక్కిన రామతీర్థం స్థల పురాణం విషయానికి వస్తే.. 15వ శతాబ్దంలోనే ఇక్కడ రామతీర్థం ఆలయాన్ని నిర్మించారు. పాండవులు తమ అరణ్యవాసంలో భాగంగా రామతీర్థం చేరుకొని కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్లు స్థల పురాణం. దీనికి నిదర్శనంగా భీముని గృహం ఇప్పటికీ అక్కడ ఉంది.
రామతీర్థం చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గృహాన్ని కూడా సందర్శిస్తుంటారు. పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణ విగ్రహాలను వేదగర్భుడు అనే వైష్ణవ భక్తుడికి ఇవ్వగా... వేదగర్భుడు ఆ మూలవిరాట్‌ను నలభై సంవత్సరాలపాటు కంటికి రెప్పలా కాపాడి ఆ తరువాత భూగర్భంలో ఎవరికంటా పడకుండా దాచిపెట్టాడట. ఆయన తరువాత ఈ విగ్రహాల జాడ ఎవరికీ తెలియదట.
ఒకరోజు ఓ వృద్ధురాలికి స్వప్నంలో లక్ష్మణుడు కనబడి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దాచిపెట్టిన భూగర్భం వివరాలను తెలియజేశాడట. పుట్టు మూగతనంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలు లక్ష్మణుడి దర్శనంతో మాటలు వచ్చి, ఆయన చెప్పినట్లుగా విగ్రహాలను వెలికితీసి. ఈ మొత్తం వృత్తాంతాన్ని అప్పటి రాజు పూసపాటి మహారాజుకు తెలియజేసి విగ్రహాలను అందజేసిందట.
ఆ తరువాత పూసపాటి మహారాజు ఆ విగ్రహాలను రామతీర్థంలో ప్రతిష్ఠింపజేసి, ఆలయాన్ని నిర్మించి, ఆలయ నిర్వహణకుగానూ కొన్ని భూములను ఇనాంగా ఇచ్చాడట. అప్పటినుంచి ఆయన ఇచ్చిన భఊముల ఆదాయంతోనే ఇప్పటివరకూ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తున్నారని పూర్వీకుల కథనం.
సీతారామ లక్ష్మణులు రామతీర్థం ప్రాంతంలో కొంతకాలం గడిపారన్నదానికి నిదర్శనంగా శ్రీరాముని పాద ముద్రికలు, ఆంజనేయస్వామి అడుగులు ఈ కొండపై ఇప్పటికీ కనిపిస్తాయి. మరోవైపు పాండవుల సంచారానికి నిదర్శనంగా భీముని గృహం ఉందన్న సంగతి తెలిసిందే.
ఆలయ విశేషాలు
ఈ క్షేత్రాన్ని రెండవ భద్రాద్రిగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడి రాముడ్ని వనవాస రామునిగా పిలుస్తారు
చంపావతి నదికి సమీపంలో ఉంది.
తీర్థంలో దొరకడం వల్ల "రామతీర్థం" అనిపేరు వచ్చింది.
శ్రీకృష్ణుడు సృష్టించిని విగ్రహాలు.
సీతారామచంద్ర గజపతిచే నిర్మాణం.
శైవ పర్వదినాలు కూడా నిర్వహణ.
కొండపైన రాముని పాదముద్రికలు.
కొండపై భీముని గుహ ఉంది.
గుహలో పైన పర్వతానికి బొరియ ఉంది.
కొండపై ఎల్లప్పుడు నీరుండే కోనేరు ఉంది.
మెట్ల ఉత్సవం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థా నం సమీపంలోని మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న నీలాచలం కొండ వద్ద 2015 జనవరి 1 న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మెట్ల ఉత్సవం నిర్వహించబడింది.రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగింది.
ఆ రోజు వేకువజామున మూడు గంటలకు స్వామి వారికి ఆరాధ న కార్యక్రమం, 4 గంటలకు తిరుప్పావై సేవా కాలము, మంగళా శాసనం, తీర్థ గోష్ఠి నిర్వహించారు.. 5 గంటల నుంచి 6 గంటల వ రకు వైకుంఠ ద్వార దర్శనం జరిగింది. 7 గంటలకు స్వా మి వారి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. 8 గంటలకు భక్తులతో భజన కార్యక్రమాలతో పాటు కోలాట, కీర్తన బృందాలతో కొండ మెట్ల వద్ద మెట్ల ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరు అయినారు.
రవాణా
By Road
Nellimarla : Rajamundry - 245kms
Nellimarla: Kakinada - 206kms
Nellimarla : Visakhapatnam - 69kms
Nellimarla : Vijayawada - 397kms
By Train
Nellimarla : Visakhapatnam - 53ms
Nellimarla : Srikakulam - 57kms
Nellimarla : Rajamundry - 179kms
By Air
Nellimarla : Visakhapatnam - 15kms
Nellimarla : Rajamundry - 42kms
Temple Timings
Morning : 5am to 11am
Evening : 4pm to 8pm
Temple Address
Sri Rama Swamy Temple ,
Ramathirdam Village,
Nellimarla Mandal,
Vizianagaram District ,
Andhra Pradesh State ,
India .
Comments
Post a Comment