శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం-పెనుగొండ | Penugonda Sri Vasavi Kanyaka Parameshwari Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం
కన్యకా పరమేశ్వరి
వాసవీ మాత
'వాసవి కన్యకా పరమేశ్వరి' లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్‌లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది. ఇక్కడ వైశ్యులు అధికం.మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921, 1931 మధ్య కాలంలో ఒక కమిషన్ వేసాడు. దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి వైశ్య అసోసియేషన్ (1905) వారు తమ పేరును గొమతి నుండి ఆర్యవైశ్యగా మార్చుకున్నారు.
వీరు గోమాతను పూజించుట వల్ల వైశ్యులకు గోమతి అను పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా వైశ్యులకు గోమతి అను పేరు ఉంది. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్ధం. దీన్ని ఒక జాతికి సంబంధించిన పదంగా పరిగణించరాదు. వీరంతా ద్రావిడ సంతతికి చెందిన వారు. వీరిలో చాలామంది ద్రవిడ భాష అయిన తెలుగు మాట్లాడుతూ ద్రావిడ సంస్కృతిని పాటిస్తారు.
వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.
ఈకథను గూర్చి కన్యకా పురాణములో మిక్కిలిగా ప్రస్తావించబడింది.దీని కర్త శ్రీ గురు భాస్కరాచార్యులు.ఈ పురాణము ముఖ్యముగా పెనుగొండ వైశ్యుల కుల ధర్మముల కట్టడి యొనర్చుట కుద్దేశించబడిన గ్రంథముగా కనబడుచున్నది.ఇందు చెప్పబడిన కథ సూక్ష్మముగా చెప్పబడింది.భగవంతుడైన శివుని ప్రేరణచే వైశ్యులు భూలోకమందలి పదునెనిమిది పట్టణములలో ఆవర్భవించిరి.
పెనుగొండ వారిముఖ్య పట్టణము.మిగిలిన పదుహేడు పట్టణములు వరుసగా, ధర్మ, ధనద, పాంచాల, నిరవద్య, జననాధ, క్షీరకాసార, దెందులూర, ఏలూర, ఘంటశాల, త్రిగుణిత, ఘనభీమ, విశాఖ, కళింగ, నృశింహ, వీరనారాయణ,అచంట, సగరము. ఈ పురాణములో, కొన్ని శాసనముల ఉదహరించబడినాయి. వాటిలో తామరాడ శాసనము, బాపట్ల తాలూకాలోని పెదచెరుకూరు శిలాశాసనము, విష్ణువర్ధనుని ఇక్షుగ్రామ తామ్రశాసనములు చాళుక్యా కాలమునకు చెందిన విష్ణువర్ధనుని గురుంచి తెలుపుట వలన, ఈ కథకు సంబంధిన కాలము సా.శ.10-11వ శతాబ్దము అయివుండవచ్చును.
స్థల పురాణం
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం ఒకటి ప్రాచుర్యంలో ఉంది.పెనుగొండలో పూర్వం వైశ్యులే అత్యధికంగా ఉండేవారు. ఆ గ్రామంలో ఉండే కుసుమ శ్రేష్టి దంపతుల కూతురు వాసవి. ఆమె గొప్ప గుణవంతురాలే కాకుండా సౌందర్య తునకలా ఉండేది. వాసవి ముగ్ధమోహన సౌందర్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులయ్యేవారు.
ఒక సందర్భంలో రాజు విష్ణువర్ధనుడు వాసవిని చూశాడు. ఆమె అందాన్ని చూసి మోహించాడు. తాను వాసవిని పెళ్ళి చేసుకుంటానని ఆమె తండ్రితో చెప్పాడు. కానీ వైశ్యులెవరూ అందుకు అంగీకరించలేదు. దాంతో రాజు ఆగ్రహించాడు. మొత్తం ఊరినే నాశనం చేసేందుకు సిద్ధమయ్యాడు.
రాజుతో వాసవి వివాహాన్ని వ్యతిరేకించిన వైశ్యులు రాజును ఎదిరించలేకపోయారు. అలాగని వాసవికి రాజుతో వివాహం జరిపించేందుకు దిగి రాలేదు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా నడచుకోలేక, రాజుతో పోరాడలేక విరక్తి చెంది అందరూ మూకుమ్మడిగా మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు.
అదంతా చూసిన వాసవి హృదయం రగిలిపోయింది. రాజును నిందిస్తూ, శాపవచనాలు పలుకుతూ ఆమె కూడా అగ్నిలో దూకేసింది. రాజు జరిగినదానికి దుఃఖిస్తూ వెనుతిరిగి వెళ్ళాడు.
పెనుగొండలో అప్పటికే ఉన్న మహిషాసుర మర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దర్శనమిచ్చింది. గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆనందపరవశులయ్యారు. వైశ్య కులస్తులు ఆత్మాహుతి చేసుకున్న వాసవి అమ్మవారి రూపంలో అవతరించిందని భావించారు. వెంటనే వాసవికోసం ఒక ఆలయం కట్టించారు. అదే ప్రసిద్ధ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం.
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం, వాసవి తల్లిదండ్రులు కుసుమశ్రేష్టి, కౌసుంభిల విగ్రహాలు, నవగ్రహాలు మొదలైనవి ఉన్నాయి.
ప్రస్తుతం వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని మరింత తీర్చిదిద్దారు. స్వర్ణ విగ్రహాన్ని సైతం నెలకొల్పారు. అటు తమిళులు, ఇటు తెలుగువారు కూడా ఈ ఆలయం పట్ల అత్యంత భక్తిప్రపత్తులతో ఉన్నారు.
అప్పటి నురిడియూ ఒక్కోక్క ప్రాంతానికి ఒక్కోక్క గ్రామదేవత వెలసి గ్రామసరిరక్షణార్ధమై గ్రామ పొలిమేరల్లో ఉ౦టూ గ్రామాన్ని దుష్టశక్తుల బారి నుంచి కాపాడి రక్షిసున్నారట. ప్రతీ సంవత్సరం పాల్గుణ శుద్ద అమావాస్య వరకూ ప్రతీరోజూ రాత్రి గ్రామ సంరక్షణార్ధమై ఈ దేవతలు తనకు “ప్రతిరూపమైన గరగలుగా వెళ్ళి ఎక్కేగుమ్మం దిగేగుమ్మంగా వెళ్తూ ఏమైనా దెయ్యాలు- భూతాలు కనిపిరిచినచో తమ తముడైన పోతురాజుకు అప్పగి౦చి వస్తారట.
తన అక్క తనకు అప్పచెప్పిన దుషశక్తులను పోతురాజు బారికోడు (మాదిగవాడు) కి అష్పగి౦చి వస్తాడట. అలా అప్పగి౦చిన దూతలను బారికోడు మరల గ్రామ పొలిమేరకు తీసుకెళ్ళి దిగదుడుపులను వదిలి వస్తు౦టాడు. ఇది అనాదిగా వస్తున్న ఆచార౦గా ఈనాడు పల్లెయ౦దు పట్టణాలయ౦దు కూడా పూర్వపు సంప్రదాయబద్దంగా ఆచరిస్తూ వస్తున్నారు.
ఒక కన్య అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలసిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం-పెనుగొండ
దేవతల లోకకళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుదని చెబుతుంటారు. అలాంటి వాటిలో 'శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి' రూపానికి ఎంతో విశిష్టత వుంది. కన్య పరమేశ్వరి దేవిగా అవతరించి అక్కడి వైశ్యులకి కులదేవతగా మారింది.
ఈ ఆలయ పురాణాగాథ ప్రకారం ఈ ఆలయ పురాణాగాథ ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్రామంలో కుసుమ శ్రేష్టి, కౌసుంబి అనే వైశ్య దంపుతులుండేవారు. వీరికి పెళ్ళై ఎన్ని ఎళ్ళు గడిచినా సంతానం కలగలేదు. అందుకని కుసుశ్రేష్టి యాగం చేశారు.
యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి, రెండు ఫలములను ప్రసాధించి కౌసుంబిన తినమని చెపింది. ఆ ఫలం భుజించిన తర్వాత ఆ దంపతులకు వాసవీ అనే కన్య జన్మించింది. ఆమె ఎంతో గుణవంతురాలు, అపురూప సౌదర్యవతి. అయితే ఆమెని విష్ణువర్డనుడను రాజు చూసి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకు వెళ్ళి కుసుమశ్రేష్టిని కలిసి వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకు వెళ్ళి కుసుమశ్రేష్టిని కలిసి, వాసవిని పెళ్ళి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్థనుడు. అయితే వైశ్యకుటుంబంలో జన్మించిన వాసవికి , క్షత్రియ కులానికి చెందిన రాజుతో వివాహాన్ని నిరాకరించడా కుసుమశ్రేష్టి.
అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు, పెనుగొండ ప్రజలు అయితే ఆవిషయం తెలుసుకున్న విష్ణువర్థనుడు కోపోద్రోక్తుడై, ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికైనా వెనుకాడనని మళ్లీ రాయబారానికి మంత్రిని పంపాడు. అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు, పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు.
రాజుకు వాసవితో వివాహం జరిపించడం కొంత మంది సమర్థించగా, ఎంతటి రాజైనా సరే కులగౌరవం కాపాడుకోవడం కోసం మరోకులానికి చెందని వారికి వాసవిని ఇచ్చి పెళ్లి చేయడం సంప్రదాయ, ఆచారాలను మర్చిపోకూడదన్న అభిప్రాయాన్ని తెలిపారు మరికొందరు. అంతలోనే సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకుని పోయి వివాహానికి సిద్దమయ్యేడు విష్ణువర్థనుడు.
ఈ విషయం తెలుసుకున్న కుసుమశ్రేష్టి, ఈ విషయం తెలుసుకున్న కుసుమశ్రేష్టి, పెనుగొండ ప్రజలు వాసవికి అగ్నిప్రవేశం చేయడమే మార్గం అని సూచించారు. ఆ విషయం వాసవికి తెలియజేయగా, అందుకు, తండ్రితో ఇలా అన్నంది. తండ్రి! అంబిక అంశమైన నేను మానవ మాత్రులను వివాహమాడలేను.
అందుకే జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులుపడకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చింది.
భవిష్యత్తులో జరగబోవు దృశ్యాలను కుసుమ శ్రేష్టికి చూపింది వాసవి భవిష్యత్తులో జరగబోవు దృశ్యాలను కుసుమ శ్రేష్టికి చూపింది వాసవి. అగ్నిప్రవేశం, రాజు మరణం, విష్ణువు యొక్క అంశమైన విరూపాక్షుడు పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం కావడం లాంటి దృశ్యాలను చూసిన కుసుమ శ్రేష్టి ఖిన్నుడయ్యాడు.
అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్టి అగ్నిప్రవేశానికి అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్టి అగ్నిప్రవేశానికి హోమగుండాలను తయారు చేయించాడు. అందులో అగ్నిదేవుడిని ఆవాహన చేశారు. రాజుకు వాసవినిచ్చి పెళ్లి చేయడానికి సమర్ధించిన కొంతమంది ప్రజలు రాజు పెనుగొండ వద్దకు వచ్చాడని తెలియగానే ఊరు వదిలి వెళ్లిపోయారు.
కులగౌరవం కాపాడడానికి రాజుతో వివాహం జరగకూడదని చెప్పినవారందరూ అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యారు.
వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనవసరంలేదు. వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనవసరంలేదు. ఒక్కోక్క కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసింది. అందరు అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండం లోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి.
అంబిక తన విశ్వరూపాన్ని చూపింది అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. "ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను, నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టీశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయినవారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోనికి ప్రవేశించాడు. వాసవి అగ్నిప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై, రాజును తన ఖడ్గంతో సంహరించింది.
విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజనరేంద్రుడు క్రుంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సణరించ్బడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్ధించాడు.
విరూపా్క్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. పెనుగొండ ప్రజలు దేవిఉ ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటిచెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేం.
ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా రెండు నందులు. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా రెండు నందులు. ధ్వజస్తంభం. దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగవిగ్రహం ప్రతిష్టించారు. విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు. ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి.
ఆ తర్వాత తోరణమండపం వెనుకవైపు ద్వారం కనిపిస్తుంది. వెంకటేశ్వరస్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్న గోపురం వున్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట చేశారు. పుట్టలో వున్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం.
ప్రధాన మండపంలో మూడు గర్భ గుడులు వరుసగా వున్నాయి ప్రధాన మండపంలో మూడు గర్భ గుడులు వరుసగా వున్నాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువైయ్యాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురమర్ధిని విగ్రహం దర్శించగలం. ఈశ్వరుడికి కుడివైపున వాసవి దేవి కొలువైంది. ఒకచేత చిఉలుక, మరొక చేత వీణ, మరో రెండు చేతులలో తామరపువ్వు పాశము వున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తోంది.
వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి ఆ వాసవి దేవి, వంశప్రతిష్గ్ట కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్దపడిన వాసవిదేవి త్యాగానిరతి కొనియాడబడినది. లక్ష్మీ జనార్ధనస్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి.
ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించిన పురాణకధ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనౌతారు. ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారైన కన్నీటి పర్వంతమౌతారానడం అతిశయోక్తి కాదు.
రవాణా:
By Road
Penugonda - Tanuku : 20 km
Penugonda - Attili : 21kms
By Train
Penugonda - Attili : 21kms
Penugonda - Bhimavaram : 30kms
By Air
Penugonda - Tadepalligudem : 35kms
Penugonda - Vijayawada : 130kms
Temple Timings
Morning : 5am to 11am
Evening : 4pm to 8pm
Temple Address
Sri Vasavi Kanyaka Parameshwari Temple,
Penukonda,
West Godavari District,
Andhra Pradesh,
India.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Tags : sri vasavi kanyaka parameshwari temple penukonda history in telugu,penukonda famous temples, west godavari famous temples, dwaraka tirumula famous temples, sri vasavi mata history in telugu,kanyaka parameshwari history in telugu,eluru famous temples, andhra pradhesh famous temples,india famous temples,world famous temples,west godavari famous temples history in telugu,east godavari famous temples, bhakthimargam, bhaktimargam, bhakti margam, Bhakthi Margam, bhakthimargam.in,

Comments
Post a Comment