పెద్దాపురం పాండవుల మెట్ట శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం | Peddapuram Pandavula Metta History In Telugu | Peddapuram Sri Suryanarayana Swamy Temple | Bhakthi Margam | భక్తి మార్గం


పాండవుల మెట్ట

పాండవుల మెట్ట చరిత్ర

1952లో ఈ ప్రాంతంలో నివసించిన శ్రీ సాలూరి వెంకట సుబ్బారావు అనే పుణ్యాత్ముడు ఇక్కడ ఛాయా, పద్మినీ, ప్రభా, ప్రజాదేవీ సమేత శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం నిర్మించారు. పల్లె ప్రజల నమ్మకాలకు, విశ్వాసానికీ ఒక మచ్చు తునక....వేసవికాలంలో పాండవుల గుహ దగ్గర వరద పాయసం చేస్తారు.  ఆ పాయసం ఎటు పొంగితే అటు వానలు బాగా పడతాయని ఇక్కడివారి నమ్మకం.

ఇక్కడ వున్న అర్ధ నారీశ్వర శివలింగం కాశీనుంచి తెచ్చి ప్రతిష్టించారు.  ఇంకా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వరస్వామి, కృష్ణుడు, గాయత్రి వగైరా దేవతలకు చిన్న చిన్న ఉపాలయాలు వున్నాయి.

పిఠాపురానికి దగ్గరలో వున్న పాండవులమెట్టకి సామర్లకోట నుంచీ, పిఠాపురంనుంచీ కూడా ఆటోలో వెళ్ళిరావచ్చు.  సామర్లకోట వెళ్ళినవారు పిఠాపురం, పాండవుల మెట్ట కూడా చూసి రావచ్చు.  ఏదో ఒకదానికే సమయంవుంటే మాత్రం పిఠాపురమే వెళ్ళిరండి.అవకాశం వున్నవారు సందర్శించదగ్గ ప్రదేశం.

చాలామందికి తెలియని ఈ క్షేత్రంలో పాండవులు తమ అరణ్య వాసంలో కొంతకాలం గడిపారని కధనం. ఒక చిన్న గుట్టమీద చిన్న చిన్న ఆలయాల సముదాయం వున్నది.  పాండవుల పట్ల గౌరవసూచకంగా ఈ గుట్టమీద ఒక చిన్న ఆలయం, గుట్టమీదకు తేలికగా వెళ్ళటానికి మెట్ల మార్గం నిర్మించారు.

ఈ  గుట్టమీద వున్న రెండు గుహలలోనే పాండవులు నివసించారంటారు.  వారు ఇక్కడనుంచి రాజమండ్రిలోని గోదావరిదాకా ఒక సొరంగమార్గంద్వారా వెళ్ళి రోజూ గోదావరిలో స్నానంచేసి వచ్చేవారంటారు.  దానికి నిదర్శనంగా ఇక్కడవున్న ఒక సొరంగ మార్గాన్ని చూపిస్తారు.  ఇది రాజమండ్రిలోని సారంగధర మెట్టదాకా వుందిట.

ప్రస్తుతం ఈ మార్గం రాజమండ్రివైపు మూసివేయబడి అడ్డంగా ఇళ్ళు కట్టారన్నారు.
గుట్టమీద వున్న పెద్ద పాదం గుర్తుని భీముని పాదంగా చెబుతారు. ఇక్కడ పోలియోబారిన పడినవారు తమ ఆరోగ్యంకోసం పూజలు చేస్తారు.   పూర్వం ఈ ప్రాంతంలో కోయవారు ఎక్కువగా నివసించేవారు.  ఇప్పటికీ వారు తమ పిల్లలకి పాండవుల పేర్లు, ద్రౌపది పేరు పెట్టుకుంటారు.

పాండవుల మెట్ట: ఇచ్చట భీముడు (పాండవులు) పాద ముద్రలు, పురాతన గుహలు, సూర్యనారాయణ స్వామి దేవాలయం

ఇది భీముడు ఘుమఘుమలాడే వంటలు చేసిన గుహ !


పాండవుల మెట్ట చేరుకోవాలంటే ముందుగా పెద్దాపురం చేరుకోవాలి. ఈ ప్రదేశం చుట్టూప్రక్కల ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ విగ్రహం ఆసియా ఖండంలోనే అతి పెద్దది. ఇక్కడ పాండవులు రాళ్ళను తొలిచి గుహలుగా ఏర్పరుచుకొని నివాసయోగ్యంగా మలుచుకున్నారు. ఇక్కడ ఉన్న గుహలలో ఒకటేమో భీముడు వంట చేసే వంటశాలగా, మరొకటేమో నివాసానికి అనుకూలంగా చేసుకున్నారు. ఇక్కడున్న గుహలను చూస్తుంటే పాండవులు ఎలా వీటిని తొలిచి అందంగా తీర్చిదిద్దారో తెలుస్తుంది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పాండవుల మెట్ట అనే ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం రాజమండ్రి నగరానికి అటు ఇటు సుమారుగా 40 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ పాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు కొన్ని రోజుల పాటు నివసించారు. ఇది ఒక ఎత్తైన కొండ మీద ఉంది. చుట్టూ ప్రకృతి ఆస్వాదించదగినదిగా, చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

భీముని పాద ముద్రికలు


పాండవ వనవాస సమయంలో భీముడు తొలిసారిగా ఈ ప్రదేశాన్ని సందర్శించి కొండ అగ్రభాగాన్ని చేరి ప్రకృతి పరికించిన సమయంలో ఆ ప్రదేశం భీముని పాదాల ఒత్తిడికి కొంత కృంగిందని చెబుతారు. సుమారు 15 అంగుళాల పొడవున్న భీముడి ఒక్కొక్క పాదాన్ని చూస్తే ఆయనెంత ధృఢకాయడో తెలుస్తోంది. తన గద తాలూకు గుర్తు కూడా ఇక్కడ ఉండటం విశేషం.

మెట్ట ప్రాంతమంతా రాతితో వుండడంవలన పాద ముద్రికలు రాతిపై చాలా స్పష్టంగా ముద్రితమై సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పాండవుల మెట్ట దర్శించే వారిలో ఎక్కువ భాగం భీముని పాదాలను చూడాలనుకునేవారే ఉండడం విశేషం!

ద్రౌపది రజస్వల చాప

చతురస్రాకారంలో చాప మాదిరి రాతి నిర్మాణం మనకు ఇక్కడ కనిపిస్తుంది. వనవాస సమయంలో ద్రౌపది రజస్వల అయినప్పుడు ఈ ప్రాంతంలోనే కూర్చున్నదని చెబుతారు. సాధారణ వయసులో సంభవించే రజస్వల సంభవించని ఆడపిల్లలను పాండవుల మెట్ట ఈ ద్రౌపది రజస్వల చాప వద్దకు తీసుకువచ్చి దాని పై కూర్చుండబెడితే వారు రజస్వల అవుతారన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది.

నివాసము

పాండవుల మెట్టపైనున్న ఈ గుహకు సంబంధించి అనేక కథనాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. వనవాస సమయంలో పాండవులు ఈ గుహలో జీవించుటయే కాక గుహ మధ్యభాగాన గల జల ప్రాంతంలో స్నానాలు ఆచరించేవారని చెబుతారు. ఈ జల ప్రాంతం దాటి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తే రాజమండ్రి చేరకునేవారని అంటారు.

నలభీమపాకాల వంటశాల

గుహకు అతి దగ్గరగా గుహ మాదిరిగా రాతిని వొలిచిన ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ పాండవులు భోజనాల తయారీకి వాడుకున్నారని చెబుతారు. ఈ ప్రాంతంలో కనిపించే డొప్ప వంటి భాగాన్ని ‘గంజి వార్చే భాగము' గా వర్ణిస్తారు. నల భీములు అత్యంత రుచికరమైన వంటలు వండి వార్చేవారని చారిత్రక కథనం.

సూర్యనారాయణ స్వామి ఆలయం 

ఈ మెట్టపైన ముఖ్యమైనది శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం. ఈ ఆలయం పక్కనే పంచముఖి గాయత్రి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వినాయకుడు, వెంకటేశ్వరస్వామి, చంద్ర, నవగ్రహాల ఆలయాలు నిర్మించారు. ఉత్సవాల దినాల్లో ఈ మెట్ట జనంతో కళకళలాడుతూ వుంటుంది.


వరదపాసం

సకాలంలో వర్షాలు కురవకపోతే పట్టణంలోని అన్ని వీధులకు చెందిన రైతులు పాండవుల మెట్ట పై వరదపాసం నిర్వహిస్తారు. పట్టణంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, అధికంగా నివసించే ప్రాంతాలవారు కోడెగిత్తలను, ఆంబోతులను అలకరించి భజనలు చేస్తూ, పాటలు పాడుకుటూ పాండవుల మెట్టపైకి ఊరేగింపుగా వెళ్లి మెట్టపై పాలు పొంగించి పరమాన్నం వండి వరుణ దేవుడికి నైవేద్యం పెడతారు.sss

జీవ వైవిధ్యం

ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా భాసిల్లిన పాండవుల మెట్ట ప్రాంతంలో రకరకాల కీటకాలు, పక్షులు, జంతువులు కనిపించేవి. ప్రస్తుతం నేడు పాము, ముంగిస వంటివి అడపా దడపా కనిపిస్తూనే వుంటాయి.

రవాణా

By Road

Peddapuram - Kakinada : 20kms
Peddapuram - Rajamundry: 42kms

By Train

Peddapuram - Samarlakota : 5kms

Peddapuram - Gudaparthi : 6kms

By Air

Peddapuram - Rajamundry : 37kms

Peddapuram - Vizag : 127kms

Temple Timings

Morning : 4am to 12

Evening : 3pm  to 5pm

Temple Address

Sri Suryanarayana Swamy Temple,
Pandavula Metta,
Peddapuram,
East Godavari District,
Andhra Pradesh,
India.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags  : sri suryanarayana swamy temple peddapuram history in telugu,peddapuram pandavula metta history in telugu, peddapuram famous temples,east godavari famous temples, kakinada famous temples, andhra pradesh famous temples, india famous temples,world famous temples,
suryanarayana swamy temple in ap , Pandavula Metta story in telugu, Pandavula Metta Peddapuram East Godavari, peddapuram maridamma temple story , peddapuram maridamma temple history in telugu, peddapuram maridamma temple , peddapuram temple, east godavari temple , mahabharata stories in telugu , mahabharatham story in telugu, mahabharata story in telugu ,pandavulu kauravulu story in telugu, pandavula story in telugu, pandavula Metta story in telugu, Pandavula Metta Peddapuram East Godavari, bhakthimargam, bhaktimargam, bhakti margam, Bhakthi Margam, bhakthimargam.in,  
,

Comments