శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామి దేవాలయం మందపల్లి | Kothapeta Sri Mandeswara Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం


శ్రీ మందేశ్వర  (శనేశ్వర) స్వామి దేవాలయం

శ్రీ మందేశ్వర  (శనేశ్వర) స్వామి 

మందేశ్వర (శనేశ్వర) స్వామి దేవాలయం, మందపల్లి, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలంలో ఉన్న దేవాలయం. హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శని గ్రహం "నవగ్రహాలలో" ఒక భాగంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్క శనిని మాత్రమే పూజించే మందిరాలలో మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి.

ఆలయ చరిత్ర

పూర్వం అశ్వత్థ, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి భక్షించేవారు. అప్పుడు వారంతా వెళ్ళి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారు. వారి మొరను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడు. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకొనేందుకు మందపల్లిలో శివాలయాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడు. అప్పట్నుంచీ ఆ ఆలయం శనైశ్చరాలయంగా ప్రసిద్ధి గాంచింది.

శనిత్రయోదశి నాడు, మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చేస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.

స్థలపురాణం

పూర్వకాలం అగస్త్యమహర్షి దక్షిణ దిక్కున సత్రయాగంను చేయుటకై గౌతమీ నదీ తీరానికి చేరి సంవత్సరం సత్రయాగం చేయుటానికి దీక్షితుడయ్యాడు. ఆ సమయాన కైటభుడనే రాక్షసుని కొడుకులగు ధర్మకంటకులయిన అశ్వర్ధుడు, పిప్పలుడు యను యిరువురు రాక్షసులు దేవలోకంలో కూడా ప్రసిధ్ధి చెందినవారై యుండిరి. 

వారిరువురిలో అశ్వర్ధుడు రావిచెట్టు రూపములోనూ, పిప్పలుడు బ్రాహ్మణరూపములోను యుండి సమయము జూసి యజ్ఞమును నాశనం చేయుటకుపక్రమించిరి. వారిలో రావిచెట్టు రూపములోనున్న అశ్వర్ధుడు ఆ వృక్షం నీడలో ఆశ్రయం పొందు బ్రాహ్మణులను దినుచుండెను.

పిప్పలుడు సామవేదము నేర్చుకొనుటకు వచ్చిన శిష్యులను తినుచుండెను. అంతట దిన దినము బ్రాహ్మణులు క్షీణించుటను చూచి వృద్ధులగు మహర్షులు గౌతమీ దక్షిణ తటాకమున నియత వ్రతుడై తపస్సు నాచరించుచున్న సూర్యపుత్రుడగు శనిని చూచి ఈ ఘోరమగు రాక్షస కృత్యములను నివేదించి, ఈ రాక్షసుల నిరువురిని వధించమని కోరిరి. అప్పుడు ఆ శని ఋషులతో నిట్లు పలికెను. దానికి శనిదేవుడు తన తపస్సు పూర్తి కాగానే వారిని వధించెదనని మాట యిచ్చెను. 

దానికి మహర్షులు తమ తపస్సును శనికి యిచ్చెదమని సంహరించమనీ ప్రార్థించిరి. అంతట శని బ్రాహ్మణ వేషమున దాల్చి వృక్షరూపముగ నున్న అశ్వర్ధుని వద్దకు వెళ్ళి ప్రదక్షిణములు చేయనారంభించెను. అంతట అశ్వర్ధుడు రాక్షసుడు ఈ శనిని మామూలు బ్రాహ్మణుడే యనుకుని అలవాటు చొప్పున మ్రింగివేసెను. అప్పుడు శని ఆ రాక్షసుని దేహమున ప్రవేశించి రాక్షసుని ప్రేవులను త్రెంచివేసెను. 

వెంటనే అతడు భస్మీభూతుడయ్యెను.ఆ వెంటనే బ్రాహ్మణ వేషమున గల రెండవ రాక్షసుడగు పిప్పలుని వద్దకు సామవేదము అభ్యసించుటకు వచ్చినానని బ్రాహ్మణ వటరూపమున శిష్యుని వలె వినయపూర్వకముగా వెళ్ళెను. అంతట ఆ పిప్పలుడు ఈ సూర్య పుత్రుడగు శనిని అలవాటు ప్రకారముగా భక్షించెను. అంతట శని ఆ రాక్షసుని ప్రేవులు కూడా చూచిన మాత్రముననే ఆ రాక్షసుడు భస్మమాయెను.

ఆ యిరువురు రాక్షసులను సంహరించిన శనికి మహర్షులందరూ వరములనిచ్చిరి. సంతుష్టుడై శని గూడ బ్రాహ్మణులతో నిట్ల పలికెను.

నా వారము ఏ జనులైతే నియతవ్రతులై అశ్వత్ధవృక్షమునకు ప్రదక్షిణము చేయుదురో వారి కోరికలన్నియు నీరేడును. వారికి నా పీడ కలగదు. ఈ అశ్వత్థ తీర్థమున ఈ శనైశ్చర తీర్ధమున ఎవరైతే స్నానము చేయుదురో వారు సమస్త కార్యములు తీర్ధములు నిర్విఘ్నముగా కొనసాగును. శని వారము రోజున అశ్వద్ధ ప్రదక్షిణములు చేసిన వార్కి గ్రహపీడ కలుగదు.

ఈ తీర్ధమునందు స్నానదానము చేసిన హేమదాన ఫలము లభించును అని శని వరములను యిచ్చెను. అప్పటి నుండి ఈ ప్రదేశములో అశ్వత్థ తీర్థము, పిప్పళ తీర్ధము, సానుగ తీర్ధము, అగస్త్యతీర్ధము, సాత్రికతీర్ధము, యగ్నిక తీర్ధము, సాముగ తీర్ధము నొదలగుగా గల పదునాలుగువేల నూట ఎనిమిది తీర్ధములు అనేకమంది ఋషులచేతను, దేవతల చేతను, కల్పించబడి ప్రసిద్ధి చెందిన స్నాన జపపూజాదులను స్వల్ప భక్తజనులకు సమస్త కార్యసిద్ధులు చేకూర్చిన సతయాగ ఫలము లభింపచేయుచున్నవి.

యిచ్చట ఈశని సామగాన కోవిదులగు బ్రాహ్మణ సంతతి వారగు రాక్షసులను సంహరించి బ్రహ్మ హత్య దోష పరిహారముకై లోక సంరక్షణకై సర్వలోకేశ్వరుడగు సర్వదురిత సంహారకుడగు, కరుణామయుడగు శివుని ప్రతిష్ఠ చేసెను. తనచే ప్రతీష్టింపబడిన శివునికి నువ్వులను అభిషేకము జరిపించిన వార్కి సమస్త కోరికలు నీడేరునట్లుగను తన బాధ యితర గ్రహపీడ మొదలైనవిలేకుండునట్లగను శని వరములు నిచ్చెను. అంతట శనిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరునికి శనేశ్వరుడనియు కూడా ప్రసిద్ధ నామాంతరము కలిగెను. పిమ్మట ఈ మందేశ్వరునికి ప్రక్కనే సప్తమాత్రుకలు వచ్చి శ్రీ పార్వతిదేవిని ప్రతిష్ఠించిరి.

 ఈ ఈశ్వరునికి బ్రహ్మేశ్వరుడని పేరు

దీనికి ప్రక్కనే అష్ట మహానాగులలో ఒకడగు కర్కోటకుడను నాగుచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరునికి నాగేశ్వరుడని పేరు. ఈ పక్కనే సప్త మహర్షులలో నొకడగు గౌతమి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ వేణుగొపాలస్వామి మూర్తి ఉంది. మొత్తము మీద ఒకే పెద్ద ప్రాకారములో వరుసగా ఐదు దేవాలయములు కలిగి భక్తి జనాహ్లాదకరముగా నుండును. పూజాతత్పరులకు సమస్త భక్తులకు సమస్త కోరికలు నీరేడుటయే గాక అంత్య కాలములో మోక్షసామ్రాజ్యము నొందెదురు.

ఈ క్షేత్రంలో శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయం ఉంది

ఇలా శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం చాలా అరుదైన విషయం. ఇక ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్టించాడని విశ్వసిస్తారు. ఇక్కడ శని త్రమోదశి రోజు పూజలు జరిపించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా జాతకంలో శని దోషాల నివారణకు ఈ దేవాలయంలో కచ్చితంగా పరిహారం దొరుకుతుందని భక్తులు నమ్ముతారు.

ఇక్కడ శనిదేవుడికి ప్రత్యేక ఆలయం  హిందూ దేవాలయాల్లో అనేక చోట్ల శని గ్రహము నవగ్రమాల్లో ఒక భాగంగా ఉంటుంది. అయితే శని దేవుడిని మాత్రమే పూజించే మందిరాలను వేళ్ల పై లెక్కపెట్టుకోవచ్చు. అటువంటి దేవాలయాల్లో మందేశ్వర (శనేశ్వర) స్వామి దేవాలయం ఒకటి.

ముసలి బ్రాహ్మణుడి రూపంలో

ఈ ప్రతిపాదనకు అంగీకరించిన శనీశ్వరుడు అశ్వర్థుడు, పిప్పలుడులను సంహరించడానికి అంగీకరిస్తాడు. ప్రథకం ప్రకారం మొదట శనీశ్వరుడి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో రావి చెట్టు రూపంలో ఉన్న అశ్వర్థుడి వద్దకు వచ్చినవాడు సాధారణ బ్రాహ్మనుడేననని బ్రమించిన అశ్వర్థుడు శనీశ్వరుడిని అమాంతం మింగేస్తాడు. దీంతో శనీశ్వరుడు ఆ అశ్వర్థుడి కడుపులోకి వెళ్లి అతని ప్రేగులను తెంపేస్తాడు. దీంతో అశ్వర్థుడు విలవిలాడుతూ ప్రాణాలు వదిలేస్తాడు.

 పూజా విధానం

ఈ ఆలయ నిర్మాణంతో పాటు ఇక్కడి పూజా విధానాలు కూడా కొంత విభిన్నంగా ఉంటాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. వీరిలో జాతక చక్రంలో శని వల్ల సమస్యలున్నవారే ఎక్కువ.

శనిత్రయోదశి  శనివారం వచ్చే త్రయోదశి, మహాశివరాత్రి, శనివారం రోజున వచ్చే అమావాస్య రోజున ఈ క్షేత్రంలో విశేష పూజలు చేస్తారు. ఆ రోజుల్లో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్యల లక్షల సంఖ్యకు చేరుతుంది. ఆ రోజుల్లో శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేస్తారు.

బ్రాహ్మణ యువకుడి రూపంలో 

అటు పై పిప్పలుడి వద్దకు శనీశ్వరుడు బ్రాహ్మణ యువకుడి రూపంలో వెళ్లి తనకు వేదాలు నేర్పించాల్సిందిగా కోరుతాడు. పిప్పలుడు కూడా వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడే అని భావించి శనీశ్వరుడిని మింగేస్తాడు. ఇక్కడ కూడా శనీశ్వరుడు పిప్పలుడి కడుపులోకి వెళ్లి అతని ప్రేగులను తెంపి సంహరిస్తాడు.

బ్రహ్మహత్యాపాతకాన్ని

ఇక అసర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకొనేందుకు మందపల్లిలో ఆ శనీశ్వరుడు ఒక లింగాన్ని ప్రతిష్టించి దానికి సోమేశ్వరుడని పేరు పెడుతాడు. అయితే ఈ శివలింగం శనీశ్వరుడు ప్రతిష్టించడం వల్ల అదే పేరుతో అంటే శనేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.

శనిత్రయోదశి

శనివారం వచ్చే త్రయోదశి, మహాశివరాత్రి, శనివారం రోజున వచ్చే అమావాస్య రోజున ఈ క్షేత్రంలో విశేష పూజలు చేస్తారు. ఆ రోజుల్లో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్యల లక్షల సంఖ్యకు చేరుతుంది. ఆ రోజుల్లో శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేస్తారు.

ప్రాముఖ్యత

మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. ఏటా శ్రావణ మాసం లోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

రవాణా

By Road

మందపల్లి గ్రామం - రాజమహేంద్రవరంకి 38 కి.మీ,

మందపల్లి గ్రామం - కాకినాడకు 60 కి.మీ,

మందపల్లి గ్రామం - అమలాపురంకు30 కి.మీ,

మందపల్లి గ్రామం - రావులపాలెంకు 9 కి.మీ.

Festivals

Kalyanam of Sri Swamivaru (Magha Bahula Ekhadasi) (February/March every year)

Devi Navaratrulu (Aswayuja Masam Nine days) (September/October every year)

Karthika Masam (November/December every year)

Lakshapatri Puja (Karthika Masam) (November/December every year)

Temple Address

Sri Mandeswara Swamy Temple,

Mandapalli (V),

Kothapeta Mandal,

East Godavari District.

Pin - 533 223

Tel: 08855-243208

Temple Timings

Morning : 5am to 12pm

Evening : 4am to 8pm

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : sri mandheswara swamy temple mandhapalii history in telugu, mandhapalli famous temples,east godavari famous temples, konaseema famous temples, andhra pradesh famous temples, india famous temples,world famous temples,sri sheneshwara swamy kothapeta temple history in telugu, lord shiva famous temples

Comments