కేదార్‌నాథ్‌ జ్యోతిర్లింగం రహస్యం | kedarnath jyotirlinga history in telugu | 12 jyotirlingas | bhakthi margam | భక్తి మార్గం


కేదార్‌నాథ్‌ జ్యోతిర్లింగం

ఈ కేదార్‌నాథ్‌ మహా పుణ్య క్షేత్రాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి  తప్పక మోక్షం కలుగుతుంది. “కేదార్‌నాథ్” అనే పేరుకు “క్షేత్ర ప్రభువు” అని అర్ధం వస్తుంది: ఇది కేదర (“క్షేత్రం”) మరియు నాథ (“ప్రభువు”) అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది నామం.

కేదార్‌నాథ్‌ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం (పుణ్యక్షేత్రం). మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్‌నాథ్ భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. 

తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ఏప్రిల్ (అక్షయ తృతీయ), నవంబరు (కార్తీక్ పూర్ణిమ, శరదృతువు పౌర్ణమి) మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. శీతాకాలంలో కేదార్‌నాథ్‌ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలలవరకు పూజలు నిర్వహిస్త్తారు. కేదార్‌నాథ్‌ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు. ఈ ప్రాంతం చారిత్రక పేరు కేదార్‌ఖండ్ ప్రభువు.

ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుండి 22 కి.మీ ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్‌నాథ్‌ ఆలయం చేరుకోవచ్చు. అలా చేరుకోలేనివారి కోసం డోలీ సేవ అందుబాటులో ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం, ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని, శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటిని భక్తులు నమ్ముతారు. కేదార్‌నాథ్‌లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు. ఉత్తర హిమాలయాల చోటా చార్ ధామ్ తీర్థయాత్రలోని నాలుగు ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి.

భక్తులు ఈ పుణ్య క్షేత్రానికి వెళ్ళే మెట్లపై పాళీ భాషలో రాసిన శాసనాలు ఎన్నో ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే ముందు భాగంలో ఒక చిన్న ముఖమంటపం ఉంది. ముఖ మంటపం దాటి లోపలకు వెళితే గర్భాలయం వస్తుంది. ఈ గర్భాలయం సుమారు 25 అడుగుల చదరంగా విశాలంగా ఉంది.ఎడమవైపు గోడలో బదరీనారాయణుని యొక్క మూర్తి ఉన్నది. స్థలపురాణం ప్రకారం ఈ కేదార్ నాథ్ ఉన్న ప్రదేశానికే కాక, బదరీ నాథ్ ఉన్న ప్రదేశానికి కూడా ఈ కేదార్ నాథుడే అధిపతి.

దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరుపొందిన 12వ శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్ నాథ్. కేదార్ నాథ్ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపైన గాంధీసరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడి నుండి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్ నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్చుకుంటాయి. అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. ఈ శివాలయంలో ఎద్దు పృష్ఠభాగం రూపంలో ఉండే శివలింగం అత్యంత పవిత్రమైనది.

ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారు ఈ కేదారేశ్వర ఆలయం మేష సంక్రమణం రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు. ఇది వైశాఖమాంలో అనగా ఏప్రిల్లో నెల ఆఖరున లేదా మే మొదటి వారంలో వస్తుంది. తిరిగి వ్రుశ్చిక సంక్రమణం రోజున, అంటే సూర్యుడు వ్రుశ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మసి వేస్తారు. ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరు వారంలో గాని, నవంవబర్ నెల మొదటి వారంలోగాని వస్తుంది. ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు.

గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు కేదార్ నాథ్ యాత్రకు 

గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు కేదార్ నాథ్ యాత్రకు పయనమవుతారు. గంగోత్రి నుండి ఉత్తర కాశీ మీదుగా వాహనాల్లో రుద్రప్రయాగ చేరుకోవచ్చు. కేదార్ నాథ్ వెళ్లే వార్గంలో మోటార్ వాహనాలు వెళ్ళగల చివరి ప్రదేశం గౌరీకుండ్. ఇక్కడి నుండి నడిచి లేదా గుర్రాల మీదగానీ కేదార్ నాథ్ కు చేరుకోవచ్చు. గౌరీ కుండ్ నుండి కేదార్ నాథ్ కు సుమారు 14 కి.మీ దూరం.

బృష్టా భాగం శివలింగం:-

అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికమైన దృశ్యం ఏమిటంటే ఇక్కడ ఉండే శివలింగం అన్ని శివలింగాల మాదిరి  కాదు చాలా ప్రత్యేకంగా వేరేగా అన్నిటి కన్నా బిన్నంగా ఉంటుంది. అయితే ఈ శివలింగం ఎద్దు వెనక భాగం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో లింగం మనకు  కనిపిస్తుంది. ఈ శివలింగం ఇలా ఎద్దు వెనక భాగం వాలె కనపడటానికి ఒక పురాణం కథనం ఉంది.

కురుక్షేత్రం తర్వాత పాండవులు వాళ్ళ బందుజనాన్ని హతమారుస్తారు ఆ పాపం నుంచి వారు బయట పడడానికి  కేదారేశ్వరుని దర్శించుకోవడనికి వెళ్లారు అప్పుడు శివుడు ఆ పాండవులను పరీక్షించడానికి ఒక చిన్న మహిషం (దున్నపోతు) రూపములో అటు వైపు పరిగెత్తారు అపుడు ఆ పాండవులు ఆ మహిషాన్ని అటు వైపు వెళ్ళడం గమనించారు.

ఇక్కడికి మహిషం ఎందుకు వచ్చింది. అది కచ్చితంగా ఆ పరమేశ్వరుడే అయి ఉంటాడు అని భావిస్తారు ఆ మహిషం కళ్ళు ఎలాగైనా పట్టుకోవాలి అని ఆ మహిషం వద్దకు వెళ్ళారు  అయితే వాళ్ళకి కళ్ళు మాత్రం అందలేదు తోక అందింది .

దాన్నే ఈశ్వర స్వరూపంగా భావించి తోక పట్టుకున్నారు పాండవులు. వాళ్ళ భక్తి కి మెచ్చిన పరమేశ్వరుడు తన బృష్ట భాగాన్ని అక్కడే విడిచి పెట్టి దానినే శివలింముగా మార్చేశాడట. అదే ఇప్పుడు మనం  దర్శించుకుంటున్న కేదారేశ్వరుని శివలింగం.

ఈ ఆలయం వెనుకనే ఆదిశంకరాచార్యుల సమాధి మందిరం ఉంటుంది. శంకరాచార్య ప్రముఖ హిందూ మత మహర్షి అద్వైత వేదాంత యొక్క అవగాహన వ్యాప్తి కొరకు కృషి చేసారు. అయన చార్ ధామ్‌ కనుగొన్నతరువాత ఈ నిర్దిష్ట ప్రదేశంలో 32 ఏళ్ల వయస్సులో సమాధి అయ్యారు.

స్థల పురాణం

ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగం. నరనారయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలపై బదరీక్షేత్రమున తపస్సు చేసినప్పుడు ద్యోతకముయిన శివలింగము. కేదారము నందు ఉన్న శివలింగంను దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే!

అయితే ఇక్కడ  ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏంమిటంటే అంత మంచు తో ఉన్నపటికీ అక్కడ ఆ ఆలయం ఇసుమంత కూడా  చెక్కు చెదరలేదు. ఆ హిమాలయ పర్వతాల వద్ద మహానుభావుడు ఆ కేదారేశ్వరిలో ప్రతిరోజూ కూడా ఆ నారాయణులు ఒక పార్థివ లింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివ లింగాన్ని ఆరాధన చేస్తూ ఉండేవారు.  వారు చేస్తున్నది పార్థివ లింగానికే పార్థివ లింగం అంటే మట్టితో చేసిన శివ లింగం కానీ వారు మేము  మట్టితో చేసిన శివలింగమే కదా అని తక్కువగా  అనుకునే వారు కాదు.

ఇదే ఈశ్వరుని ఈశ్వర స్వరూపం అని నమ్మారు. నమ్మి నర నారాయణులు అర్చనలు చేసేవారు.. అప్పుడు ఆ శివ లింగం నుండి  ఆ పరమశివుడు ఆవిర్భవించి  పరవశించిపోయి ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత ఖటోర తపస్సుతో ఆ పార్థివ లింగానికి  మీరు చేసిన పూజలకి నేను ఎంతో సంతోషించాను మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. 

అయితే అప్పుడు ఆ నర నారాయణులు ఇక్కడే  స్వయంభువు లింగ మూర్తిగా వెలసి లోకాలను కాపడమని కోరారు. వారి కోరిక మేరకు స్వామి అక్కడ వెలిశారు.

ఆలయ పూజ సమయాలు

ప్రత్యేక పూజ.

4:00 A.M TO 20:00 P.M.

రోజంతా పూజ.

07:30 A.M TO 12:00 NOON & 03:00 P.M TO 06:00 P.M.

సాయంత్రం ఆరతి/పూజ/మార్గం

06:00 P.M TO 07:45 P.M.

ఎలా చేరుకోవాలి ?

వాయుమార్గం

కేదార్ నాథ్ కు సమీప ఎయిర్ పోర్టు సుమారు 183 కి. మీ. ల దూరం లోని డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. ఈ ఎయిర్ పోర్టు నుండి రుద్రప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి.

రైలు మార్గం

కేదార్ నాథ్ కు ఋషి కేష్ రైలు స్టేషన్ సమీపం. ఇక్కడకు కొన్ని రైళ్లు మాత్రమే వస్తాయి. అయితే 24 కి.మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.

రోడ్డు మార్గం

కేదార్ నాథ్ కు నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గంలో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవిలో న్యూఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగానే వెళతాయి.

by Air

The nearest airport, Jolly Grant, is situated at a distance of about 239 km from Kedarnath. People can reach by road covering 225 km and the remaining 14 km on foot. Domestic flights are available from this place to several other locations. There are also chopper services available from Rishikesh and Kedarnath.

by Rail

Rishikesh is the nearest railway station that is situated at a distance of about 221 km from Kedarnarth. Taxi as well as bus facilities are available from the rail head. There is as such no problem regarding how to reach Kedarnath.

by Road

Kedarnath is easily reachable from Gaurikund by foot. The place is further connected with the major cities like Chandigarh (387km), Delhi (458km), Rishikesh (223km), Dehradun (221km) and Haridwar (123km). There are bus services from the city to various other cities of the state.

kedarnath temple-contact information

Office related Enquiry - 0135-2741600

 General Enquiry & Online Prasad Services - +91-7302257116

 Pilgrims Help Line for Shri Kedarnath Temple - +91-8534001008

 Pilgrims Help Line for Shri Badarinath Temple - +91-8979001008

 Online Services/International Pilgrims Help Line +91-7302257116

 Media Related Quarry - +91-7302257115

 Publicity Office Rishikesh - +91-7302257115

 Shri Narsing Temple Joshimath - +91-8979001008

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags:kedarnath jyotirlinga story, kedarnath jyotirlinga story in telugu, kedarnath jyotirlinga accommodation booking, how to reach kedarnath from hyderabad, chardham yatra, kedarnath temple history in telugu, kedarnath temple distance, lord shiva famous temples, top 10 temples in india, dwadasa jyothirlingalu, 12 jyotirlinga images with name and place, 12 jyotirlinga list, 12 jyotirlinga temples history, 12 jyotirlingas in india, 12 jyotirlinga temple in india,  bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in

Comments