కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం | kashi vishwanath temple history in telugu | 12 jyothirlingas | bhakthi margam | భక్తి మార్గం
కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం
కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం.
వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం ఉంది. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది.
16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి ఆక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి మరియు విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి.
పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి మందిరం నిర్మించాడు. శివ - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది.16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది.
ఆలయ పురాణం
సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది.
వారాణసి నగరం సుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.
1922లో వారణాసి (బెనారస్).
18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివసిస్తున్నాడు.
కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి.
ఇది ఆర్యౌల మత, తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది.
అధర్వణవేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైనగురువు, ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.
ఆలయ పూజ సమయాలు
మంగళ హారతి: 3:00 AM నుండి 4:00 AM (ఉదయం)
భోగ ఆరతి: 11:15 AM నుండి 12:20 AM (రోజు)
సంధ్యా ఆరతి: 7:00 PM నుండి 8:15 PM (సాయంత్రం)
శృంగార ఆరతి: 9:00 PM నుండి 10:15 PM (రాత్రి)
శయన ఆరతి: 10:30 PM నుండి 11:00 PM (రాత్రి)
ఎలా చేరుకోవాలి ?
by air
by rail
by road
kashi viswanath temple-contact information
Address :
Chief Executive Officer
Shri Kashi Vishwanath Temple Help Desk
CK 37/40,41,42 Bansphatak, Varanasi-221 001
Phone :
0542- 2392629, +91-6393131608
Email :
shrikashivishwanathtempletrust@gmail.com
support@shrikashivishwanath.org
Comments
Post a Comment