శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం శ్రీకూర్మం | Srikurmam Sri Kurmanatha Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం


శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం

శ్రీకూర్మం చరిత్ర

శ్రీకూర్మం ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. కానీ పురాణాల కధనం ఈ విధంగా ఉంది. పూర్వం శ్వేతచక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురమనే పట్టణంను పరిపాలించేవాడు. అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు. ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది. శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం శ్రీకూర్మం

ఓ వైపు భర్త.. మరో వైపు భక్తి.. ఈ సంకట స్థితి నుంచి తనను బయట పడేయాలని విష్ణువును వేడుకుంటుంది. క్షీరసాగర మదనంలో కూర్మరూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆడుకోమని ప్రార్ధిస్తుంది.

ఆమె మొర విన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ ఉధృతంగా రాజు వైపు రావడంతో అతడు భయంతో పరుగిడి ఓ పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు. తనకు మరణమే శరణ్యమని దుఖిఃస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపించమని చెబుతాడు.

ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు. శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటూ విష్ణువును పూజించగా ఓ రోజు మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్ధ గుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు. దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగము చేసి ఓ వటవృక్షం వద్ద క్షీర జలంతో కూడిన కూర్మగుండంను సృష్టిస్తాడు. చక్రం వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్ష్యమైన శ్రీమహాలక్ష్మితో కలిసి లక్ష్మి సమేత శ్రీకూర్మనాధునిగా స్వామి వారు అక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు.

స్థలపురాణము

శ్రీకాకుళం, గార మండలంలో ఉన్న ఆలయం 2 వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది నమ్ముతారు. నిజానికి ఆలయము నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే, ఈ ఆలయం చోళ, కళింగ రాజా రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు.7 వ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసునని ఉంది.

తరువాత ఈ ప్రాంతాన్నిపాలించిన వివిధ రాజవంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో చేశారు. దేవాలయ మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్ప సంపాద అని పిలవబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు, కీర్తిని చాటి చెప్తాయి. గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగభీముడు ఆలయం చుట్టూ నేల, పైభాగాన్ని నిర్మించారు.

దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. 

అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. 

శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను.
అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. 

ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను. రాజు వంశధారలో స్నానమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని, సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావిష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండము నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమిచ్చెను. 

స్వామి నాలుగు చేతులతో, శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధింపగా శ్రీమహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు, నారదునితో కలసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్రయోగము చేసెను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించెను. 

ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగములో వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్యనివాసమేర్పరుచుకొనెను.
ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్త్రీ కూర్మగుండములో దాహముతీర్చుకొని, శ్రీకూర్మనాథుని దర్శించుకొని, తన భర్త అయిన భిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, ఆతను వచ్చి చూడగా ఆ గుండముపైన చక్రాకారములో తేజము కనుపించెను.

ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాల్చెను. భిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ, మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తుండగా, అక్కడకు వచ్చిన శ్వేతమహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు, కూర్మరూపములో నీకు సులభముగానే దర్శనమిచ్చాడు అని చెప్పెను. అంత భిల్లురాజు సంతోషముతో స్వామిని పూజించెను.

స్వామి సంతోషించి, భిల్లురాజును కూర్మగుండమునకు కట్టడము, సోపానములు కట్టించవలసిందిగానూ, శ్వేతమహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసిందిగానూ ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. భిల్లురాజును, స్వామి, పశ్చిమదిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపములో నివాసమేర్పరుచుకోమని ఆజ్ఞాపించెను. అంతట భిల్లురాజు, తనవైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. శ్రీకూర్మనాథుడు అట్లే ఆభిల్లురాజుకు వరమిచ్చెను. అప్పటినుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగెను.

ఒకనాడు నారదుడు కూర్మనాథుని సేవించుటకు రాగా, శ్వేతమహారాజు, స్వామిని అర్చారూపమున ఆరధించుటకు ఏ మంత్రముతో ప్రతిష్ఠించవలెనని అడిగెను. అంతట నారదుడు, బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడే శ్రీకూర్మనాథుని, సుదర్శన మంత్రముతో ప్రతిష్ఠించెను. అప్పుడు స్వామి అగ్నిజ్వాలలచే భయంకరముగా ప్రకాశిస్తున్న శ్రీకూర్మనాథుని చూసి దేవతలందరూ భయకంపితులైరి. 

అప్పుడు శ్వేతమహారాజు, స్వామిని, గోపాలమంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అట్లే శ్రీకూర్మనాథుని గోపాలమంత్రంతో పునహ ప్రతిష్ఠచేసెను. అప్పుడు స్వామి శాంతరూపములో దర్శనమిచ్చి, తనకు నారాయణ మంత్రముతో అభిషేకము, సంకర్షణ మంత్రముతో వస్త్ర సమర్పణ, వాసుదేవ మంత్రముతో ఏక హారతి, అనంత మంత్రముతో ధూపము, పద్మనాభ మంత్రముతో పంచహారతి సమర్పించవలెనని బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ స్వామిని అట్లే ఆరాధించెను. 

శ్రీకూర్మనాథుడే ప్రాకారాది దేవతా స్థాపనకు ఆజ్ఞనిస్తూ, తూర్పున పార్వతీ సమేతంగా శివుని, ఆగ్నేయమున నరశింహుని, దక్షణమున గోపాలమూర్తిని, నైరుతి దిక్కున వైకుంఠనాథుని, వాయవ్యమున వైష్ణవీ దుర్గను, ఆమెకు ముందు భాగమున విశ్వక్షేసులను, తరువాత అనంతుని స్థాపించమనగా, బ్రహ్మ అట్లే చేసెను.
తిలోత్తమ స్వర్గము నుండి శ్రీకూర్మనాథుని పూజించుటకు వచ్చి అక్కడనే ఉండిపోయింది. 

బ్రహ్మ, స్వామికి నివేదించిన ప్రసాదము ఆమెకు లభించకపోవుటచే దుఖితురాలై, వక్రాంగ మహామునిని ఆశ్రయించగా, ఆయన, తిలోత్తమకు నారశింహమంత్రమును ఉపదేశించెను. ఆమె ఆమంత్రముతో తపమాచరించగా, ఆమె కాలిబొటనవ్రేలు దగ్గర ఒక గుండమేర్పడింది. అందుండి, శ్రీకూర్మనాథుడు, నరశింహరూపమున ఉద్భవించి, ఆమెకు దర్శనమిచ్చెను.

తిలోత్తమ ఆనందంతో స్వామిని అక్కడ అట్లే వెలయవలసిందిగా కోరగా స్వామి అక్కడ అలాగే వెలసెను. ఆకుండము, నరసింహతీర్థమని, అక్కడ వెలసిన స్వామి, పాతాళ నరసింహుడని అందురని స్వామి చెప్పెను. అంత తిలోత్తమ తనకు ప్రసాదము లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తికు మెచ్చి, తన ప్రసాదముపై శాశ్వత ఆధిపత్యమును ఆమెకు ప్రసాదించెను. అప్పటినుండి స్వామివారి ప్రసాదమును తిలోత్తమే అందరికీ పంచేదట.

ఆలయ విశిష్టతలు

శ్రీకూర్మంలో స్వామి వారి విగ్రహం పడమటి ముఖంగా ఉండడం విశేషం. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం 4వ శతాబ్ధానికి ముందే ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. కళింగ, ఆంధ్ర, చోళ వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. 7వ శతాబ్ధం నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు. గాంధర్వ శిల్ప సంపాద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు, కీర్తిని చాటిచెబుతాయి.

ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది. అద్భుతమైన వాస్తు కళతో కనిపించే ఈ ఆలయంలో 108 ఏక శిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి. అయితే వీటికి ఒక దానితో ఒకటి పోలిక లేకపోవడం విశేషం. ఆలయంలో ఒక రాతి పీఠంపై కూర్మనాధస్వామి దర్శనమిస్తారు. అడుగు ఎత్తు, ఐదడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో స్వామి వారి విగ్రహం ఉంటుంది. నిత్యం స్వామి వారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపు పూతతో కనిపిస్తుంది. ఆలయ పరిసరాల్లో శ్రీవరదరాజ స్వామి, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉంటాయి.

ఈ ఆలయం యొక్క పెద్ద ప్రాకారా నికి వెలుపల ‘శ్వేత పుష్కరిణి’ ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రిక ఆధారాలు స్పష్టం చేస్తు న్నాయి. ఈ ఆలయంలోని ప్రతీ శిల్పం ఒక అపూరూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమై పోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్యా ధారాలుగా నిలుస్తాయి. 

అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరా రుతూ ఉంటుంది. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపు దిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమ ణీయంగా మలిచారు.

ప్రతీ ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్‌ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భ గుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాధుని ఆవతారంలో శ్రీమహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరి స్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, ఐదడు గుల పొడవు, నాలుగడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠం పై కూర్మనాథస్వామి దర్శనమిస్తారు. 

రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమా భిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కన్పిస్తుంది. మధ్య తక్కు వ ఎత్తులో శిరస్సుకలిపి ఒకటిగా కన్పిస్తా యి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరి స్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు.

ఆలయ ప్రత్యేకతలు

విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది. ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం. ఇక్కడికి వారణాశికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని, ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

పద్మపురాణము లోని శ్వేతగిరి మహత్యమను 30 అధ్యాయములో చెప్పబడిన విశేషముల ప్రకారము

శ్రీకూర్మక్షేత్రమునకు వంశధారానదీ తీరములో శ్రీకూర్మశైలమను పర్వతము ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభంచును.

ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానముచేసి, శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది. ఇక్క డ ఉన్న చక్రతీర్థము, నారదతీర్థము, కౌటిల్యతీర్థము, మాధవతీర్థము, నరసింహతీర్థము, కూర్మతీర్థము, వంశధార నది, లాంగలీనది, సముద్రములో మూడురోజులుగానీ, ఎనిమిదిరోజులు గానీ ఈ క్షేత్రములో ఉండి, స్నానములాచరిస్తూ, స్వామిని కొలుచుట ఒక ఆచారము.

ఈ శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము (ఐదుగురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము) తూర్పున వంశధారాసాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున (సింగుపురపుకొండ) హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళీ తీరమున శ్రీకాకుళ పట్టణములో కోటీశ్వరుడు, ఉత్తరమున (పిప్పల) ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్రమున సుధాకుండతీరమున సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.

బలరాముని శాపం

ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగిం చాడు. దాంతో అతడు భైరవుని పై ఆగ్రహంతో ఆతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాధ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఆయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు ‘కూర్మావతారం’లో ఆలయం భూమి పై మరెక్కడా ఉండకూడదని శపించాడు. 

అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాధస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈఆలయా నికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగుభాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణీలో జలక్రీడలాడుతూ కన్పించాడట. అందు వల్లే ఆ పుష్క రిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని ‘గోపీ చందనం’ అని కూడా అంటారు.

ఆలయానికి శాపం

ద్వాపర యుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన బైరవుడు ఆయనను లోనికి అనుమతించడు. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు.

పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు

కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాలలో మూలాలు.

మహావిష్ణువు కూర్మావతారము రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం (తాబేలు) అవతారం.

విష్ణు ప్రముఖ దశావతారాలలో 2 వ అవతారం.

విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంది, రెండు ద్వజస్థంబాలతో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలులో ఒకటి.

రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలులో ఒకటి.

అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడ్య చిత్రాలతో ఉన్న దేవాలయాలులో ఒకటి.

దుర్గా మాత వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచ రెండవ ఆలయం., ఇతర వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది.

దీని శిఖరం రాతి శిల్పం - గాంధార శిల్పకళా అని అంటారు., ఇతర స్తంభాలతో పోలిక లేకుండా కొన్ని స్తంభాలు క్రింద వృథాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్తంభాలు ఉన్నాయి.

వారణాసి (కాశి) వెల్లడానికి సొర్ంగ మార్గం ఉంది, ప్రస్తుతం దీన్ని మూసివేసారు.
వారణాసి / పూరీ (ఒడిషా) ల వలె, మరణించినవారి అంతిమ కర్మలు, మోక్ష స్థానం ఇక్కడ నిర్వహిస్తారు .

ఆది శంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ, చైతన్య మహా ప్రభు అనేక గొప్ప రాజులు, సెయింట్స్ ఋషులు దేవాలయాన్ని సందర్శించారు .--కె.యల్.రావు

ప్రపంచంలోనే విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది

మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది. కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు. క్షీరసాగర మధనంలో కూర్మావతారం ధరించిన
ఎన్నో అరుదైన ప్రదేశాలకు, విశేషాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఇక్కడి అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి. 

ఆ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశం 'శ్రీకూర్మం'. మహావిష్ణువు కూర్మ రూపంలో ఉన్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది. గర్భగుడిలో కొలువైన కూర్మనాధస్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపల గల నిర్మాణాల వరకూ ఇక్కడ ప్రతీదీ ప్రత్యేకమే. అసలు శ్రీకూర్మం యొక్క చరిత్ర ఏమిటి? అక్కడి విశేషాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే..ఇక్కడే శ్రీకృష్ణుడు

విష్ణువు దశావతార రూపుడన్న విషయం మనకు తెలిసిందే. ప్రతి రూపానికి సంబంధించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేవాలయాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఒకే ఒక రూపానికి సంబంధించి ప్రపంచంలో ఒకే దేవాలయం ఉంది. అదే కూర్మావతారానికి సంబంధించిన దేవాలయం.మేరు పర్వతంతో సముద్రాన్ని చిలికే సందర్భంలో ఆ పర్వతం సముద్రంలో మునగకుండా కాపాడటానికి విష్ణువు కూర్మం (తాబేలు) రూపం దరించాడని చెబుతారు.
 
ఆ కూర్మం రూపానికి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది. ఇందుకు కారణం ఈ కథనంలో తెలుస్తుంది. అదే విధంగా ఈ దేవాలయంలోని పుష్కరిణిలో శ్రీకృష్ణుడు స్నానం చేశాడని ఆ పుష్కరిణిలో మనం కూడా స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్మకం.

రెండో అవతారం 

శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో కూర్మావతారం (తాబేలు) రెండోది. మిగిలిన అన్ని అవతారాలకు సంబంధించిన ఆలయాలు ప్రపంచం అంతటా ఉన్నాయి. అయితే కూర్మావతారానికి సంబంధించి ప్రపంచంలో ఒకే ఒక ఆలయం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది.

స్వామిని వేడుకుంటుంది 

‘స్వామీ అటు నా భర్తను కాదనలేను. ఇటు నీ వ్రతాన్ని భంగపడనివ్వలేను. నన్ను నీవే కాపాడాలి.' అంటూ వేడుకుంటుంది. దీంతో శ్రీమన్నారయణుడు దర్శనమిచ్చి అక్కడ గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వైపు ప్రయాణిస్తుంది. దీంతో రాజు భయపడి శ్రీ కూర్మం దగ్గరగా ఉన్న ఒక పర్వత పై భాగానికి చేరుకుంటాడు.

నారదుడు సహాయం చేస్తాడు

అనంతరం తన తప్పును తెలుసుకుని అటుగా వచ్చిన నారదుడిని సహాయ అడుగుతాడు. నారదుడు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశిస్తాడు. దీంతో రాజు మంత్రాన్ని పట్టించి గంగను శాంతిపజేసి సముద్రంలో వంశధార పేరుతో కలిసి పోతుంది. అలా కలిసే సాగర సంగమంలో రాజు స్నానం చేసి విష్ణువును ప్రార్థించగా స్వామి నాలుగు చేతులు, శంఖం, చక్రం, గద, పద్మములతో ప్రత్యక్షమవుతాడు. 

శ్రీ కూర్మం రూపంలో 

రాజు తన తప్పును మన్నించాల్పిందిగా కోరడమే కాకుండా ఇక పై ఇక్కడే కూర్మం రూపంలో ఉండిపోవాలని అభ్యర్థిస్తాడు. దీంతో విష్ణువు శ్రీ కూర్మ రూపంలో మహాలక్ష్మి సమేతుడై ఇక్కడ ఉన్న పుష్కరిణిలో ఉండిపోతాడు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఓ బోయ యువతి ఆమె భర్త బిల్లురాజు అటుగా వచ్చినప్పుడు పుష్కరిణిలో దివ్వమైన వెలుగు కనిపిస్తుంది.

వారికి కూడా 

అంతలోనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ దంపతులకు దర్శనమిస్తాడు. అటుఅక్కడకు వచ్చిన శ్వేతరాజు జరిగిన విషయం బిల్లురాజుకు తెలియజేస్తాడు. దీంతో తమ జీవితం ధన్యమయినట్లు ఆ దంపతులు భావిస్తారు. అటు పై పుష్కరిణికి పశ్చిమదిక్కులో నివాసం ఏర్పరుచుకొని స్వామికి సేవలు చేయడం ప్రారంభిస్తాడు.

అందువల్లే పశ్చిమాభిముఖంగా

అంతే కాకుండా తన నివసం పశ్చిమ దిక్కుగా ఉంది కాబట్టి మీరు కూడా పశ్చిమాభిముఖంగానే ఉండాలని స్వామిని దంపతులు వేడుకుంటారు. అందువల్లే స్వామి పశ్చిమాభిముఖంగా ఉంటాడని పురాణ కథనం వివరిస్తుంది.

ఎన్నో విశిష్టతలు

ఇక ఈ ఆలయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ గర్భగుడి మధ్యభాగంలో మూలవిరాట్ ఉంటాడు. అయితే ఈ ఆలయంలో మాత్రం గర్భగుడి ఎడమవైపు గోడకు ఒక మూలగా శ్రీ కూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు కనిపిస్తాడు. ఇటువంటి విధానమే మనం తిరుమల గర్భగుడిలో చూడవచ్చు.

విగ్రహం ఇలా

ఆలయంలో ఒక అడుగు ఎత్తు, ఐదు అడుగుల పొడవు, నాలుగుల వెడల్పు ఉన్న రాతిపీఠం పై కూర్మనాథస్వామి దర్శనమిస్తాడు. మొదట తల, మధ్యలో శరీరం చివరగా తోక మూడు భాగాలుగా మనం కూర్మనాథున్ని దర్శించుకోవచ్చు.

నేరుగా గర్భగుడిలోకి

గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోకి భక్తులను అనుమతించడం విశేషం. ఇటు వంటి సంప్రదాయం మరే ఇతర వైష్ణవాలయంలోనూ కనిపించదు. విగ్రహం పశ్చిమాభిముఖంగా ఉండటమే కాకుండా రెండు ధ్వజస్థంభాలు కలిగి ఉంటుంది.

రోజువారీ అభిషేకం

ఈ విధంగా గర్భగుడిలోని మూలవిరాట్టు పశ్చిమాభిముఖంగా ఉండటం, దేవాలయాల్లో రెండు ధ్వజస్థంభాలు ఉండటం ప్రపంచంలో అతి కొన్ని చోట్ల మాత్రమే మనం చూడవచ్చు. రోజు వారీ అభిషేకం నిర్వహించే అతి తక్కువ విష్ణు దేవాలయాల్లో శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం కూడా ఒకటి.

లక్షల ఏళ్లనాటి కుడ్యచిత్రాలు 

సాధారణంగా విష్ణు దేవాలయాలకు రోజు వారి అభిషేకం నిర్వహించడం అరుదుగా జరుగుతుంది. అజంతా ఎల్లోరా గుహల మాదిరిగా ఇక్కడ కుడ్యచిత్రాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా లక్షల ఏళ్ల క్రితం నాటివి. అయినా ఇప్పటికీ చెక్కచెదరకుండా ఉన్నాయి.

వైష్ణోదేవి రూపంలో 

దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచంలోని రెండవ దేవాలయం ఇదే. మరొకటి భారత దేశంలోని జమ్ము కాశ్మీర్ లో ఉంది. ఈ దేవాలయంలో ఉన్న 108 రాతి స్థంభాలు ఒక్కదానికొకటి పోలిక లేకుండా ఉంటాయి. ఏ రెండు రాతి స్థంభాల పై శిల్పాలు కూడా ఒకే విధంగా ఉండవు.

వారణాసికి స్వరంగ మార్గం

శ్రీకూర్మనాథ స్వామి దేవాలయంలో ఒక స్వరంగ మార్గం ఉంది. దీని ద్వారా వారణాసి చేరుకోవచ్చునని చెబుతారు. అయితే దీనిని ప్రస్తుతం మూసి వేశారు. వారణాసి, పూరీల వలే మరణించిన వారి అంతిమ కర్మలను ఇక్కడ నిర్వహిస్తారు. దీని వల్ల వారికి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

బలరాముని శాపం వల్లే 

ప్రపంచంలో మరెక్కడా కూడా కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువునకు దేవాలయం లేకపోవడానికి శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముని శాపమే కారణమి పురాణాలు చెబుతున్నాయి. అందులో ఉన్న వివరాలను అనుసరించి ద్వాపర యుగం చివరిలో బలరాముడు శ్రీకాకుళం దగ్గర్లో ఉమారుద్రకోటేశ్వర లింగం ప్రతిష్టింపచేస్తాడు.

శ్రీ కూర్మం వస్తాడు

అటు పై తీర్థయాత్రల్లో భాగంగా శ్రీ కూర్మం వస్తాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు బలరాముడిని అడ్డగిస్తాడు. దాంతో ఆగ్రహం తెచ్చుకున్న బలరాముడు భైరవుడిని గిరగిర తిప్పి అవతలికి విసిరేస్తాడు. ఇది తెలిసిన కూర్మనాథ స్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యి బలరాముడికి దర్శనభాగ్యం కలిగించాడు.

కోపం తగ్గలేదు

అయినా కోపం చల్లారని బలరాముడు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే శ్రీ మహా విష్ణువుకు దేవాలయం ఉండాలని మరెక్కడా ఉండకూడదని శాపం పెట్టాడు. అందువల్ల ప్రపంచంలో ఇక్కడ మాత్రమే కూర్మావతర రూపంలో శ్రీ మహావిష్ణువు మనకు కనిపిస్తాడు.

శ్రీకృష్ణుడు

ఇక శ్రీ కూర్మంలోని పుష్కరిణిలో అడుగు భాగంలోని మట్టి తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి జలక్రీడలు ఆడారని అందువల్ల ఆ మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనినే గోపీ చందనం అని కూడా అంటారు. దీనిని నుదుట దరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని అందం పెరుగుతుందని స్థానికులు చెబుతారు.

రవాణా

By Road

Srikurmam - Srikakulam : 15kms
Srikurmam - Visakhapatnam : 130kms
Srikurmam - Vijayawada : 458kms
Srikurmam - Vizianagaram : 79kms

By Train

Srikurmam - Vizianagaram : 69kms
Srikurmam - Visakhapatnam : 115kms

By Air

Srikurmam - Hyderabad : 581kms
Srikurmam - Vizianagaram : 52kms

Temple Timings

Morning : 4am to 11am
Evening : 4pm to 8pm

Temple Address

Sri Kurmanadha Swamy Temple,
Sri Kurmam Mandel,
Srikakulam District,
Andhra Pradesh State,
India.

Tags : sri kurmanadha swamy temple srikurmam history in telugu, srikurmam famous temples, sri kurmanadha swamy temple srikakulam history in telugu, srikakulam famous temples, andhra pradesh famous temples, india famous temples, world famous temples, lord vishnu famous temples, srikurmanadha swamy temple timings , sri kurmandha swamy temple address, sri kurmandha swamy temple history in telugu, kord vishnu famous temples history in telugu,arasavalli temple timings, how to reach srikurmam temple , srikurmam temple darshan timings, srikurmam temple history in telugu, srimukhalingam temple history in telugu, srikakulam temples in telugu, శ్రీకాకుళం జిల్లా, 

Comments