ద్వారపూడి అయ్యప్పస్వామి వారి దేవాలయం (మండపేట) | Dwarapudi Ayyappa Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం


అయ్యప్పస్వామి వారి దేవాలయం

 ద్వారపూడి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 20 కి.మీ. ల దూరంలో ద్రాక్షారామం వెళ్ళే తోవలో వున్న ద్వారపూడిలో వెలిసిన ఈ ఆలయ సముదాయంలో అయ్యప్ప దేవాలయంతోబాటు, సాయిబాబా, శివాలయాలు కూడా వున్నాయి. విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ దేవాలయాలు దర్శకులను అమితంగా ఆకర్షిస్తాయి. అయ్యప్ప దీక్ష తీసుకున్నవారిలో కొందరు కారణాంతరాలవల్ల శబరిమలదాకా వెళ్ళి స్వామి దర్శనం చెయ్యలేకపోవచ్చు.  అలాంటివారు  ఇక్కడికి వచ్చి స్వామికి ఇరుముడి సమర్పించుకుంటారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలనుంచేకాక ఒరిస్సానుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.  ఇక్కడ ప్రతిష్టింపబడ్డ అయ్యప్పస్వామి విగ్రహం పంచలోహాలతో తయారు చేసినది.  1989 లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిచే ప్రతిష్టింపబడినది.

ఈ స్వామి సన్నిధికి చేరటానికి ఏర్పాటు చేసిన పధ్దెనిమిది  మెట్లకి కూడా ఒక విశేషం వున్నది.  ఈ పధ్దెనిమిది  మెట్లనూ తమిళనాడులోని తురుమూరునుంచి తెప్పించిన ఏక శిలపై చెక్కి, బంగారంతో తాపడం చేయించారు.  ఇరుముడితో వచ్చిన భక్తులను మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అనుమతిస్తారు.  ఆలయ ప్రాంగణంలో వున్న హరిహరుల విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.

అయ్యప్ప దేవాలయంలో క్రింది భాగంలో వర్తులాకార హాలులో దుర్గ, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వేమన వగైరా గురువర్యుల విగ్రహాలు చుట్టూ వున్నాయి. పై అంతస్తులో హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నిత్య పూజలందుకుంటున్నాడు. అయ్యప్ప స్వామి ఆలయంలోంచి ప్రక్కనే వున్న సాయిబాబా ఆలయానికి త్రోవ వున్నది. బాబా దర్శనమైనాక వెనుక వైపు వెళ్తే శయనించివున్న పెద్ద రంగనాధ స్వామి విగ్రహం కనబడుతుంది.

ఆస్వామిని సేవించుకుని బయటకు వస్తే ఆ మార్గం ఎత్తుగా వున్న పెద్ద నందీశ్వరుని దగ్గరకు తీసుకు వెళ్తుంది. నందీశ్వరునికి ఎదురుగా పాలరాతితో నిర్మించబడిన నాలుగంతస్తుల శ్రీ ఉమా విశ్వేశ్వరస్వామి ఆలయం దర్శించుకోవచ్చు.  

ఈ ఆలయానికీ కొన్ని విశేషాలున్నాయి.  ఇక్కడి శివ లింగం చాలా పొడుగ్గా పై అంతస్తు దాకా వుంటుంది. అమ్మవారు అఖిలాండేశ్వరి.  అంతేకాదు .. గంగోత్రి, యమునోత్రి, కేదారనాధ్, బదరీనాధ్, బ్రహ్మకపాలం, అమరనాధ్, ఓంకార్, కాశీ, ఋషికేశ్, హరిద్వార్ మొదలగు క్షేత్రాలనుంచి తెచ్చిన 18 శివలింగాలను అన్ని అంతస్తులలో ప్రతిష్టించారు.  పై అంతస్తులోని చతుర్మఖ శివలింగానికి అభిషేకం చేస్తే ఒకేసారి ఈ 18 శివలింగాలపై ఆ అభిషేక ద్రవ్యాలు పడి కన్నుల పండుగగా గోచరిస్తుంది.  

శివాలయం ముందు పెద్ద ఆంజనేయస్వామి, నటరాజు విగ్రహాలున్నాయి. అయ్యప్ప దేవాలయానికి ఈశాన్యంగా భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం వున్నది.  ఇక్కడ వెండి శివలింగాన్ని ప్రతిష్టించారు.  ఈ ఆలయ ప్రవేశానికి భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి. ఇంతకీ ఈ ఆలయ నిర్మాత గురించి కూడా తెలుసుకోవాలికదా.  

1969లో తమిళనాడునుంచి శ్రీ ఎస్.ఎల్. కనకరాజు అనే ఆయన వస్త్ర వ్యాపారం నిమిత్తం ద్వారపూడి వచ్చి స్ధిర పడ్డారు.  ఆయన అయ్యప్పస్వామికి మొక్కుకున్న ఫలితంగా తనకి కొడుకు పుట్టాడని సంతోషంతో ఇక్కడ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంకల్పించారు.  ఆయన సంకల్పానికి భక్తులూ, దాతలూ ఇచ్చిన విరాళాలు తోడయి 1983 లో ఆలయ శంకు స్ధాపన జరిగింది. అతి విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందచందాలతో పోటీపడుతూ ఆకర్షణీయంగా వున్న ఈ దేవాలయ సమూహం చూసి తీరవలసినదే.

ద్వారపూడి విశేషాలు

ఒకప్పుడు సాధారణ గ్రామంగానే అందరికీ తెలిసిన ద్వారపూడి తర్వాత కాలంలో అయ్యప్పస్వామి దివ్యక్షేత్రంగా దినదిన అభివృద్ధి చెందింది. ఈ ఊరిలోని అయ్యప్పస్వామి గుడిలోని విగ్రహాన్ని 1989 లో కంచి కామకోటి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి ప్రతిష్టింపజేశారు. అయితే  ఇక్కడ ఉన్న అయ్యప్పస్వామి ఆలయానికి 1983లోనే శంకుస్థాపన జరిగింది. స్థానికంగా ఉండే ఓ తమిళ వ్యక్తి తన కోరిక నెరవేర్చినందుకుగాను అయ్యప్పస్వామికి ద్వారపూడిలో దేవాలయాన్ని కట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇలా ద్వారపూడిలోని అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి బీజం పడింది.

సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ పరిహరాదుల దేవాలయాలతో పాటు మరెన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడి అయ్యప్పస్వామివారి దేవాలయానికి ఉన్న పద్దెనిమిది మెట్లను తమిళనాడు నుంచి తెప్పించిన ఏకశిలపై నిర్మించడం విశేషం.

అయ్యప్పస్వామి వారి దేవాలయం

అయ్యప్ప దేవాలయం:ద్వారపూడిలోని అయ్యప్ప దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణంలో శబరిమలైలోని అయ్యప్పగుడి తరహలో నిర్మించారు. ఈ దేవాలయము రాజమండ్రి-కాకినాడ రహదారికి చేరువగా ఉండుటవలన ప్రయాణికులకు శోబాయమానముగా కనువిందు చేస్తూ ఉంటుంది. 

రోడ్దుకు అటువైపున ధవలేశ్వరం-కాకినాడ గోదావరికాలువ ఉంది. వచ్చిన భక్తులు ఈ కాలువలో కాళ్ళు, చేతులు కడుగుకొనుటకు, స్నానాలు చేయుటకు అనుకూలంగా కాలువ వడ్దున మెట్లు నిర్మించారు. గుడి ప్రాంగణం వెలుపల వరుసగా పూజసామాగ్రి, దేవతచిత్రపటాలు ఆటబొమ్మలు ఆమ్మే దుకాణాలు హోటళ్ళు ఉన్నాయి. బయట భక్తుల పాదరక్షలను ఉచితంగా భద్రపరచే గదివున్నది. ప్రాంగణం ముఖద్వారానికి ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరహరి (సగం శివరూపం,సగంవిష్ణురూపం) విగ్రహం దర్శనం యిస్తుంది.

విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయక మూర్తికి చిన్న ఆలయము కలదుత్. లోనికి వచ్చిన భక్తులు మొదట గణపతి ఆతురువాత హరహరి దర్శనంచేసుకుంటారు. ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్పస్వామి గుడివున్నది .అయ్యప్పగుడి రెండు అంతస్తులగా నిర్మించబడి పై అంతస్తులో అయ్యప్పస్వామి వున్న మందిరమున్నది. క్రింది అంతస్తులో వున్న మందిరంలోకి ప్రవేశమార్గం తెరచుకున్న సింహముఖరూపంలో నిర్మించారు. 

పై అంతస్తులో వున్న అయ్యప్పస్వామి మందిరానికి వెళ్ళుటకు రెండు మార్గాలున్నాయి మాల ధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మాములు భక్తులు వెళ్ళూటకు మరో మార్గం ఉంది. అయ్యప్ప విగ్రహం వున్న మందిరం (గర్భగుడి) పైభాగాన గోపుర నిర్మాణమున్నది. పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్యఘట్టాలను బొమ్మలరూపంలో నిర్మించబడివున్నాయి. 

ఆయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా షణ్ముఖ ఆంజనేయుని భారి విగ్రహంవున్నది. అయ్యప్పగుడిలో నిత్యాన్నదానం అమలులోవున్నది.సబరిమలై వెళ్లెలేని కొందరు భక్తులు ఇక్కడే ఇరుముడులు సమర్పిస్తారు. ఈ దేవాలయం ఆంధ్ర శబరిమలగా పిలువబడుతుంది.

అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం ద్వారపూడి

అయ్యప్పస్వామి దేవాలయం అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కేరళ రాష్ట్రంలోని శబరిమల దేవస్థానమే ఏడాదిలో కొద్దిరోజులు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయానికి ఆ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల నుంచి దీక్ష పూనిన అయ్యప్పస్వాములు లక్షలాదిగా తరలిరావడం అందరికీ తెలిసిందే.

అయితే ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ అయ్యప్పస్వామి ఆలయం ఉండడం విశేషం. తూర్పు గోదావరిజిల్లాలోని ద్వారపూడిలో గల ఈ అయ్యప్పస్వామి క్షేత్రానికి భక్తులు తరలి వస్తుంటారు. అంతేకాదు కేరళలోని శబరిమల క్షేత్రానికి వెళ్లలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా ద్వారపూడి క్షేత్రానికి వచ్చి తమ దీక్షను విరమించడం గమనార్హం

ద్వారపూడి అయ్యప్ప స్వామి పుణ్య క్షేత్రం

ఇది అయ్యప్ప స్వామి దీక్షల సమయం. భక్తులు అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం కొరకు నిష్టగా దీక్షలు చేసి సంక్రాంతి సమయంలో కేరళలోని మకరజ్యోతి దర్శనం తో దీక్ష విరమిస్తుంటారు. మన రాష్ట్రంలో భక్తులు ఆలయాల్లో భజనలు, కీర్తనలు చేస్తుంటారు. ఈ ఆలయాన్ని విశాలమైన మైదానంలో నిర్మించినారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందనేగా మీ సందేశం .. ఇది కూడా చదవండి : రాజమండ్రి నగరంలోని సందర్శనీయ ప్రదేశాలు !

ద్వారపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం రాజమండ్రి నగరానికి 18.6 కిలోమీటర్ల దూరంలో ఉండి, కేవలం అర్ధగంటలో(30 నిమిషాల్లో) చేరుకొనే విధంగా ఉంటుంది. రాజమండ్రి నుండి ద్వారపూడి కి ఏ పి ఎస్ ఆర్ టీ సి బస్సులు నిత్యం తిరుగుతుంటాయి. 

ద్వారపూడి గ్రామంలో ఫెమస్ ఏంటిది అంటే ఆది అయ్యప్ప స్వామి ఆలయమనే చెప్పాలి. అందుకే ద్వారపూడి అయ్యప్ప స్వామి పుణ్య క్షేత్రం గా వెలుగొందుతుంది. ఇక్కడున్న అయ్యప్ప ఆలయం గర్భగుడి, కేరళ లోని శబరిమలై తరహాలో అచ్చుగుద్దినట్టు ఉంటుంది. ఇక్కడున్న ఆలయ విశేషాలు మరియు పరిసరాలు ఎలా ఉంటాయో ఒకసారి వీక్షిస్తే ..

ఆలయం బయట

గుడి బయట పూజసామాగ్రి, దేవుళ్ళ ఫోటోలు, పిల్లలు ఆడుకొనే బొమ్మలు వంటి ఆమ్మే దుకాణాలు, ఆకలి వేస్తే తినటానికి హోటళ్ళు వున్నాయి.

ఆలయ ముఖద్వారం

గుడి ముఖ ద్వారం కు చేరుకోగానే ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరహరి (సగం శివరూపం, సగం విష్ణు రూపం) విగ్రహం కనపడుతుంది. విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయక మూర్తికి చిన్న ఆలయము కూడా ఉంది.

ఆలయం లోపలికి వచ్చే భక్తులు

గుడి లోపలికి వచ్చే భక్తులు మొదట గణపతి ఆలయాన్ని, ఆతరువాత హరహరి విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్పస్వామి గుడి వున్నది .

అయ్యప్ప గుడి(ప్రధాన ఆలయం)

అయ్యప్పగుడి రెండు అంతస్తులగా ఉంటుంది. పై అంతస్తులో అయ్యప్పస్వామి మందిరం ఉన్నది. క్రింది అంతస్తులో వున్న మందిరంలోకి ప్రవేశమార్గం తెరచుకున్న సింహముఖరూపంలో నిర్మించారు.

ప్రధాన ఆలయంలోకి ఎలా వెళ్ళాలి?

పై అంతస్తులో వున్న అయ్యప్పస్వామి మందిరంకు వెళ్ళుటకు రెండు మార్గాలున్నాయి ఒకటి మాల ధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మాములు భక్తులు వెళ్ళూటకు మరో మార్గం వున్నది.

గర్భగుడి 

అయ్యప్ప విగ్రహం వున్న మందిరం అదేనండి గర్భగుడి పైభాగంలో గోపురం ఉన్నది. పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్యఘట్టాలను బొమ్మలరూపంలో నిర్మించబడివున్నాయి.

ఆంజనేయ విగ్రహం

య్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఉన్నది. అయ్యప్పగుడిలో నిత్యాన్నదానం జరుగుతుంది. శబరిమలై వెళ్లెలేని కొందరు భక్తులు ఇక్కడే ఇరుముడులు సమర్పిస్తారు.

సాయిబాబా ఆలయం 

ప్రధాన ఆలయమైన అయ్యప్ప స్వామి ఆలయానికి ఎడమవైపు కింది భాగాన సాయిబాబా ఆలయం ఉన్నది. ఇక్కడ ప్రతి గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు సాయిబాబా ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.

శివాలయం

అయ్యప్ప స్వామి ఆలయానికి పక్కనే శివాలయం కలదు. దేవాలయ ముఖద్వారం లో ఏనుగులు తోండంతో పూలహారాన్ని పట్టుకొని నిలబడి ఉన్న బొమ్మలు ఉన్నాయి. శివాలయానికి ఒక పక్క నంది విగ్రహం, ఎదురుగా నటరాజ విగ్రహం మరియు వెనకవైపున యగ్ఞాలు, యాగాలు నిర్వహించుకొనేందుకు యాగశాల ఉన్నాయి.

వెంకటేశ్వర స్వామి వారి ఆలయం

వెంకటేశ్వర స్వామి ఆలయం అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే ఉన్నది. ఈ ఆలయం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆలయ గోపురాలకు నలువైపుల ఉన్న గోడలకు రంగు అద్దాలను బిగించి కట్టారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక పక్క గుండె చీల్చి సీతారాముల ను చూపిస్తున్న ఆంజనేయుని విగ్రహం ఉంది.

ద్వారపూడి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలానికి చెందిన ఒక చిన్న గ్రామం.[1].. పచ్చని పొలాలతో, తోటలతో కనులవిందుగా వుంటుంది. ముఖ్యంగా ఈ గ్రామం అయ్యపస్వామి వారి దేవాలయం, ఇతర పెద్ద ఆలయాల ద్వారా బహుళ ప్రఖ్యాతిగాంచింది.ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 6 కి. మీ. దూరంలో ఉంది.

హరిహరసుతుడు శ్రీ అయ్యప్ప కొలువైన ద్వారపూడి

అయ్యప్ప దీక్షలు ముమ్మురంగా జరిగే రోజులు ఇవి.  నిష్టాగరిష్టులైన భక్తులు గజగజ వణికించే చలిని కూడా లెక్కచేయక తెల్లవారుఝామునే లేచి, చన్నీటి స్నానం చేసి ఆ అయ్యప్పస్వామి కరుణా కటాక్షాలకోసం భక్తితో ఆయనను పూజిస్తారు. దీక్షాకాలంలో కఠోర నియమాలు పాటించి, భగవన్నామస్మరణతో గడిపి దీక్ష పూర్తయ్యే సమయానికి శబరిమల యాత్ర సాగిస్తారు.

అయ్యప్పస్వామి దీక్షేకాక శివ దీక్ష, ఆంజనేయ దీక్ష, భవానీ దీక్ష ఇలా అనేక రకాల దీక్షలతో భక్తులు తమ ఆరాధ్య దైవాలను సేవిస్తున్నారు.  ఏ దీక్ష అయినా, మన మనసు, శరీరం పవిత్రంగా వుంచుకోవటానికి చేసేదే.  దీక్షాకాలంలో దైవానుగ్రహం కోసం పాటించే నియమాలలో  కొన్నయినా అందరూ తర్వాత కూడా పాటిస్తే ప్రపంచంలో అశాంతి అడ్రసు లేకుండా పోతుందికదా.

అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల యాత్ర ప్రారంభించే ముందు ఇరుముడి కట్టుకోవటానికి సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయానికి గానీ, ఇంకేదయినా ఆలయానికిగానీ చేరుకుంటారు.  మరి మనంకూడా ఈ సమయంలో  శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం దర్శించాలికదా.  తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గరలో వున్న ద్వారపూడిలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శిద్దామా?  ఇది కేవలం అయ్యప్పస్వామి ఆలయమే కాదు.  విశాలమైన ప్రాంగణంలో అనేక దేవీ దేవతలు ఇక్కడ కొలువుతీరి వున్నారు.  ప్రశాంతమైన పరిసరాల్లో వున్న ఈ ఆలయ సమూహాన్ని దర్శించినవారికి మనసు సేద తీరుతుంది.

రవాణా:

By Road

Dwarapudi - Samalkota : 32kms
Dwarapudi - Kakinada : 46kms
Dwarapudi - Rajamundry : 15kms
Dwarapudi - Annavaram : 86kms

By Train

Dwarapudi - Rajamundry : 20kms
Dwarapudi - Visakhapatnam : 181kms

By Air 

Dwarapudi - Rajamundry : 20kms

Temple Timings

Morning : 5am -12pm

Evening : 4pm - 8pm

Temple Address

Ayyappa Swamy Temple,

Dwarapudi,

Konaseema District,

East Godavari ,

Andhra Pradesh,

India.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : ayyappa swamy temple dwarapudi history in telugu, dwarapudi famous temples, kerala ayyyappa swamy history in telugu, ayyappa swamy famous temples in ap,ayyapppa swamy famous temples, konaseema famous temples, andhra pradesh famous temples, india famous temples, world famous temples, sabarimala famous temples, andhrasabarimala famous temples, esat godavari famous temples, dwarapudi shiva temple history in telugu, dwarapudi  venkateshwara swamy famous temple history in telugu, dwarapudi sai baba temple history in telugu,dwarapudi anjaneya swamy temple history in telugu, sabarimala temple,dwarapudi ayyappa swamy temple story in telugu, dwarapudi ayyappa swamy temple timings, dwarapudi ayyappa swamy temple route map, dwarapudi temple distance

Comments