కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వాడపల్లి | Vadapalli Sri Venkateshwara Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం

 
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణాన్ని గోవింద నామస్మరణతో మారుమోగాయి.

ఇక్కడ వేంకటేశ్వరుడు రాయితో కాకుండా ఒక చెక్కలో స్వయంభువగా కొలువై ఉన్నాడు. అసలు నారదుడే విష్ణువుకు ఇక్కడ వేంకటేశ్వరుడిగా నామకరణం చేసినట్లు చెబుతారు. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ ఏడు వారాల శనివారం వ్రతం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెబుతారు.

 అందువల్లే ఈ క్షేత్రంలో శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందమైన ప్రకృతి కి నిలయమైన తూర్పగోదావరి జిల్లాలో, తెలుగువారి వంట పూతరేకులకు ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురానాకి కూత వేటు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.

వాడపల్లి 'శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం చాలా పురాతన ప్రసిద్ధ హిందూఆలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం స్వామి వారి తీర్థం దగ్గర వార్షిక వేడుకలను మార్చ్-ఏప్రిల్ నెలల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది మరియు వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. 

వాడపల్లి, తూర్పు గోదావరి జిల్లానందు గోదావరి నది ఒడ్డున రావులపాలెంకి 10 కి. మీల దూరంలో కలదు. రావులపాలెంకు అన్ని ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. ఎర్ర చందన కొయ్యలో వెలసిన స్వయంభూ క్షేత్రం వాడపల్లి, 'శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 'కళ్యాణ వేంకటేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. 
ప్రతి శనివారం చాలా ప్రాంతాల నుండి ఇక్కడకు భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరుపబడును. ఈ క్షేత్రం 'కోనసీమ తిరుపతిగా' ప్రఖ్యాతి గాంచినది.

ఆలయ సమయాలు:

ఆదివారం నుండి శుక్రవారం వరకు ఉ.6:00 గం. ల నుండి మ.12:00 గం. ల వరకు మరియు సా.4:00 గం. ల నుండి రా.8:00 గం. ల వరకు తెరచి ఉంటుంది.

శనివారం: ఉ.4:00 గం. ల నుండి మ.2:00 గం. ల వరకు మరియు సా.4:00 గం. ల నుండి రా.8:00 గం. ల వరకు తెరచి ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గల తూర్పు గోదావరి జిల్లానందు గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం 'వాడపల్లి'. ఈ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రసిద్ధి చెందినది, ఈ దేవస్థానాన్ని 'వాడపల్లి వెంకటేశ్వర స్వామి' దేవస్థానం అని కూడా పిలుస్తారు.

ఈ ఆలయం, చాల గొప్ప చరిత్ర కలిగి ఉంది మరియు తదనంతర కాలంలో విశాలమైన ప్రాంగణంలో అభివృద్ధి చే శారు. ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు భాగాన 'గోవిందనామాలు' ముద్రించారు, ఆ నామాలు ప్రదక్షిణ చేసే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి శనివారం ఆలయానం దగ్గర సుమారు అర్ధ కిలోమీటరు పొడవున మేళగా అన్ని దుకాణాలు ఏర్పాటుచేస్తారు. ఈ క్షేత్రం లో ఏడు శనివారాలు దర్శించుకొని, పదకొండు ప్రదక్షణలు చేసిన భక్తుల కోరికలు స్వామి వారు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తారు. కావున శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఎర్ర చందన కొయ్యలో వెలసిన 'స్వయంభూ' క్షేత్రం 'వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 'కళ్యాణ వేంకటేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. స్వామి వారి 'బ్రహ్మోత్సవం' పది రోజులపాటు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ప్రతి రోజు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు స్వామి వారి దర్శించుకుంటారు మరియు బ్రహ్మోత్సవ సమయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ ఆలయంలో 'గోదా దేవి' కళ్యాణం నిర్వహిస్తే అవివాహితులకు వివాహం అవుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం.

నారదుడి ఆధ్వర్యం

నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలం పై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకొంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు.

ప్రజలతో నిత్యం పూజలు

ఇప్పటి వరకూ ఏదేని ఒక ఉపద్రవం సంభవించినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక రూపంలో అవతారాన్ని ఎత్తాను. అయితే ఆ అవతారంలో తనకు అర్చనలు జరగలేదు. అయితే ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకొంటానని చెబుతాడు.చివరికి అశరీర వాణి రూపంలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెలితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టే కనిపిస్తుంది.భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తాడు. దీనిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్షీ దేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడకు నారదుడు వచ్చి జరిగిన కథ మొత్తం వారికి చెబుతాడు.

వేం-కట

అంతేకాకుండా ఆ మూర్తికి ‘వేం' అంటే ‘పాపాలను' ‘కట' అంటే పోగొట్టేవాడు. అని నామకరణ చేసి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వేంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. అటు పై అక్కడ ఉన్నవారంతా కలిసి అక్కడ ఆలయం నిర్మింపజేశారు.

తుఫాను

అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఓకసారి తుఫాను సంభవించగా అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోయాయి.

ఆలయం నిర్మాణం

దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని చెప్పాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతాయి.

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం సేవలు

1) గోత్రనామం / Gotranaman

2) కేశఖండన / Kesakandana(Head Shaving)

3) అష్టోత్తరం / Ashtothram

4) సహస్రనామం / Sahasranamam

5) వాహన పూజ: 4 చక్రాలు / 4 Wheeler Pooja

6) వాహన పూజ: ద్వి చక్రాలు / 2 Wheeler Pooja

7) కళ్యాణం / Kalyanam

8) తులాభారం / Thulabharam

9) స్పెషల్ దర్శనం / Special Darshan

10) విశిష్ట దర్శనం / Visesha Darshan

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం సమయాలు

Sunday to Friday: 6:00 AM to 1:00 PM and 4:00 PM to 8:00 PM

Saturday: 4:00 AM to 2:00 PM and 4:00 PM to 8:00 PM

శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

Day 1 – From 3.00 AM Darisanam Sri Vari Dwajaarohanam(flag-hoisting festival), Ankurarpanam, Nithya Baliharam.

Day 2 – From 3.00 AM Darisanam, Afternoon Edurukolu, 7.00 PM Kalyanam.

Day 3 – From 3.00 AM Darisanam, పొన్నవాహన మహోత్సవము, పూజలు, భోగములు.

Day 4 – From 6.00 AM Darisanam, నిత్యబలిహరణ, భోగములు, and Homam.

Day 5 – From 6.00 AM Darisanam, నిత్యబలిహరణ, భోగములు, andHomam.

Day 6 – From 6.00 AM Chakrasnanam in goutami River and darisanam.

Day 7 – From 6.00 AM Darisanam, మరియు శ్రీపుష్పోత్సవము.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags: sri venkateshwara swamy temple history vadapalli in telugu, konaseema famous temples, east godavari famous temples, andhra pradesh famous temples,lord vishnu famous temples, india famous temples, world famous temples, edu varala venkateswra swamy, edu varala vratham , Konaseema tirupati, vadapalli venkateswara swamy temple online booking,vadapalli venkateswara swamy temple address,vadapalli venkateswara swamy temple timings, vadapalli temple history in telugu,rajahmundry to vadapalli temple distance,ravulapalem to vadapalli distance,amalapuram to vadapalli distance,kakinada to vadapalli distance,edu sanivarala vadapalli venkateswara swamy,7 shanivarala vadapalli venkateswara swamy, konaseema tirupati, ఏడు శనివారాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి

Comments