శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం తొలి తిరుపతి | Tholi Tirupathi Sri Srungara Vallabha Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం | toli tirupati peddapuram


శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం

9000 సంవత్సరాల నాటి తొలి తిరుపతి

తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల. భక్తులు పెద్ద తిరుపతి చిన్న తిరుపతిగా పిలుచుకుంటూ శ్రీవారిని భక్తు శ్రద్దలతో కొలుస్తున్నారు. అయితే తిరుమల తిరుపతి కంటే.. ఇంకా చెప్పాలంటే పురాతణ క్షేత్రంగా భావిస్తున్న సింహాచలం కంటే అత్యంత పురాతణ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ప్రభుత్వాలు శ్రద్ధపెట్టని ఈ స్వయం భూ క్షేత్రం గురించి ఆలయ విశిష్టత గురించి అనేక కధనాలు ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం కు దగ్గరగా ఉన్నతిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. 6వేలఏళ్ళున్న తిరుమల కంటే 8 వేల ఏళ్ల చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైన క్షేత్రం. ఇంకా చెప్పాలంటే.. దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైంది. 

పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా దివిలి సమీపంలో కొలువుదీరిన దేవాలయానికి 9000 చరిత్ర వుంది. విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందున ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి ఆలయంలోనూ ఆళ్వారులు కొలువుదీరి ఉంటారు. అదే రీతిలో ఇక్కడ గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.

పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కీకారణ్యము

ధ్రువుని తల్లి సునీత. ధ్రువుని సవతి తల్లి ధ్రువుడు సిం హాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది. సునీత, ధ్రువుని పిలిచి నీవు సిం హాసనం అధిష్టించి, రాజ్యపాలన చేయాలి. అందుకు శ్రీ మహా విష్ణువు దర్శన భాగ్యం కలగాలి. ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది. అందుచేత తపమాచరించి, విష్ణు దర్శనం పొంది, రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది.

అలా బయలుదేరిన ధ్రువుడు, ఈ కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నడు. ఇచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉంది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధ్రువుని చూచి, అతని మనసులోని కోరిక తెలిసినవాడై, ముని అతన్ని పిలిచి “నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకొంటూ తపస్సు చెయ్యి. 

స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు. మునీశ్వరులు చెప్పినట్లుగా తపమాచరించుట మొదలుపెట్టినాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత, ధృవుని తపస్సుకి మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు.

దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధృవుడు భయపడ్డాడు. అంతట విష్ణువు “బాలక భయమెందుకు తత్తరపాటు చెందకు నేను నీ అంతే కదా ఉన్నాను” అని నవ్వుతూ పలుకటయే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయము లేకుండా చేసాడు. స్వామి అక్కడే శిలారూపంలో వెలసినాడు

ఎవరు చూస్తే వారి ఎత్తులోనే కనిపించే శ్రీవిష్ణు ఆలయం 

విష్ణువు రూపంలో చిద్విలాసంగా నవ్వుతు ఉండే వేంకటేశ్వరుడు విగ్రహం, ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా

మహా విష్ణు ఇక్కడ స్వయం భవుగా కొలువుదీరాడానికి ధ్రువుడు కారణం అంటూ స్థానికుల కథనం. ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా ఒకానొకప్పుడు కీకారణ్యం. ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు పన్నుతున్న సమయంలో ధృవుని తల్లి సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పింది.

అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట. అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విధానం అడగగా.. ఆ ముని, “నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి” స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేశాడని పూర్వీకుల కథనం

ఆ మహాముని చెప్పినట్లే “దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట” అయితే, ఆ కాంతిని చూడలేక ధృవుడు భయపడ్డాడట. అప్పుడు విష్ణుమూర్తి నాయనా! భయమెందుకు నేనూ నీ అంతే వున్నాను కదా అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట. ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట.

స్వామి నీ అంతే వున్నాను కదా అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు అంటే స్వామి వారు చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా దర్శనమిస్తారు. ఆ అరణ్య ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారని స్థానికులు తమ పూర్వికులు చెప్పారని అంటారు. 

స్వామి వారు ఒంటరిగా ఉంటున్నారని దేవేరి ఐన లక్ష్మీ దేవిని నారద మహర్షి ప్రతిష్టించారనే కథనం. వెంకన్న భక్తుడైన శ్రీ కృష్ణ దేవరాయల ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయ విశిష్టతను తెలుపుతూ నేటికీ అక్కడ శిలా శాసనాలు దర్శనమిస్తాయి.

ఆలయం విశిష్టత 

శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే.. విష్ణువు రూపంలో చిద్విలాసంగా నవ్వుతు ఉండే వేంకటేశ్వరుడు విగ్రహం, ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ, చక్రాల స్థానం మారి వుంటాయి. ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి లబిస్తుంది భక్తుల నమ్మకం. ఈ ప్రధాన ఆలయంలోని ఏకశిలా కళా ఖండాలు, విగ్రహమూర్తి, ఉత్సవ మూర్తి, ప్రదాన ఆకర్షణగా నిలుస్తాయి. 

శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు. ఇక ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.

ఆలయం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నప్పటికీ యాత్రికులకి దర్శనానానికి, బసకి సరైన సదుపాయాలు లేవు అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎంతో ప్రాశస్యం కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధిపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

ఆలయప్రశస్థి

ధ్రువునకు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభస్వామిగా పేరుగాంచాడు. విష్ణువు ధ్రువునితో “నీ అంతే ఉన్నాను కదా” అన్ని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తాడు స్వామి. చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంఖు చక్రములు ఎడమ, కుడిలకు ఉంటాయి. 

స్వామి వారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామి వారికి ఆలయనిర్మాణం చేసారు. తరువాత లక్ష్మీదేవి, నారదుడు. ఈ యుగమున శ్రీ కృష్ణదేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు శిలాశాసనముల ద్వారా తెలియచున్నది. భోజమహారాజు, భట్టివిక్రమార్కులు, రుద్రమదేవి, పెద్దాపురం సంస్థాన మహారాణులు ఈ స్వామిని దర్శించుకొన్నవారిలో కొందరు.

విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచము చేయించినట్లు చెబుతారు. పిఠాపురం రాజులు స్వామి వారికి 600 ఎకరాల భూమిని దానం ఇచ్చారు. కాని ప్రస్తుతం 21 ఎకరాలు మిగిలింది. నిత్య దీపధూప నైవేద్యాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది. అయితే ఈ ఆలయమునకు అంతగా ప్రచారం లేకపోవడం వలన కేవలం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే ఎక్కువగా దర్శించుకొంటారు.

రవాణా:

By Bus

Peddapuram 11 km,
Samarlakota – 14 km, 
Kakinada - 28 km.

By Train

Samarlakota  – 14 km,
Peddapuram – 14 km, 
Kakinada – 28 km. 

By Air

Rajahmundry Airport – 50 km,
Visakhapatnam Airport – 152 km,
Vijayawada Airport, Gannavaram – 184 km.

Temple Timings

Morning : 6am to 11pm
Evening : 4pm to 8pm

Temple Address

Srungara Vallabha Swamy Temple
Tholi Tirupati {Chadalavada Tirupati },
Near Divili Village, 
Peddapuram Mandal,
East Godavari – 533433,
Andhra Pradesh,
India.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : sri srungara vallabha swamy temple tholi thirupathi history in telugu, chinna thirupathi sri srugara vallaba swamy temple history in telugu, east godavari famous temples, kakinada famous temples,chadalada tirupathi sri srugara vallaba swamy temple history in telugu, andhra pradesh famous temples,india famous temples,world famous temples

Comments