శ్రీ జగన్మోహిని కేశవ మరియు వేణు గోపాల స్వామి దేవాలయం ర్యాలి | Ryali Sri jaganamohani Kesava And Gopala Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం|


శ్రీ జగన్మోహిని కేశవ మరియు వేణు గోపాల స్వామి దేవాలయం

మీకు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారా? ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న స్ధాన చలనం ఎంతకీ రావటం లేదా? అయితే మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం ర్యాలీ. ర్యాలీ వెళ్ళొచ్చినవాళ్ళకి బదిలీ తొందరలో తప్పకుండా వస్తుందని భక్తుల నమ్మకం. తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం దగ్గర అందమైన ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించాలంటే వెలుతురుండగా వెళ్ళండి. మేము ర్యాలీ వెళ్ళేసరికి చీకటిపడటంవల్ల దోవలో ప్రకృతి అందాలు చూడలేకపోయాం.

ఆలయ నిర్మాణం

ర్యాలి ప్రాంతం 11వ శతాబ్దంలో పూర్తిగా అరణ్యం. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ చక్రవర్తి రాజా విక్రమ దేవుడు, ఈ ఆలయాన్ని నిర్మించా డు. తరువాతి రోజులలో దీనిని పునరుద్ధరించారు.ర్యాలిని దర్శించడానికి ఉత్తర భారతంనుంచి వచ్చే యాత్రికులు విశాఖపట్నం మీదుగా (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి) తుని, అన్నవరం, రాజమండ్రి చేరు కోవాలి.

రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా వెళ్ళి, బొబ్బర్లంక దగ్గర ఎడమవైపు తిరగాలి. బొబ్బర్లంక మీదనుంచి లొల్లమీదుగా మెర్లపాలెం దగ్గర కుడివైపుకి తిరిగితే ర్యాలి చేరుకుంటాం.విజయవాడ వైపు నుంచి వచ్చేవారు రావులపాలెం (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి), దగ్గర కుడివైపుగా తిరిగి మెట్లపాలెం దగ్గర ఎడమవైపు తిరిగితే ర్యాలి చేరుకోవచ్చు.

శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే అపురూపమయిన ఆలయం ఇది. విష్ణుదేవుడు ఈ రూపంలో పూజలందుకోవటం బహుశా ఇంకెక్కడా లేదేమో. ఆలయం చిన్నదేకానీ, జగన్మోహినీ కేశవస్వామి శిల్పం మాత్రం అద్భుతం. భోళా శంకరుడు వరాలివ్వటం, శ్రీ మహావిష్ణువు ఆ వరాలవల్ల వచ్చే ఉత్పాతాలనుంచి అందరినీ కాపాడటం .. మనం చదువుకున్న కధలే కదండీ. అలాంటి అవతారమే మోహినీ రూపం. ఈ మోహినీ భస్మాసురుల కధ అందరికీ తెలిసి వుండవచ్చుగానీ, మోహినీ శంకరుల కధ తెలుసా? అదే ర్యాలి ఆవిర్భావానికి కారణం అంటారు కొందరు. 

మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలోపడి ఆవిడని వెంబడించాడు. శంకరుణ్ణి తప్పించుకుంటూ మోహిని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తలలోనుంచి ఒక పువ్వు ఇక్కడరాలి పడిందిట. దానిని వాసన చూసిన శివుడుకి మాయ వీడిపోయ ఎదురుగా విష్ణు భగవానుడు కనబడ్డాడు. మోహిని తలలోంచి పువ్వు రాలి పడ్డదిగనుక ఆ స్ధలం పేరు రాలి, క్రమంగా ర్యాలి అయిందంటారు. ఆ కధకి నిదర్శనంగానే శ్రీ మహావిష్ణు విగ్రహం ముందునుంచి పురుష రూపం, వెనుకనుంచి మోహినీ రూపంతో వున్నదంటారు.

విష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశం 

ఆ ఆలయంలో శివలింగం కంటికి కనపడదట 

విష్ణు భగవానుడు ఎటువంటి అవతారంలోనైనా సులువుగా పరకాయప్రవేశం చేయగల దిట్ట. అటువంటి ఒక అవతారమే ఇప్పుడు మనకు ఇక్కడ చెప్పుకోబోతున్నాం. అదే జగన్మోహినీ అవతారం. విష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహినీ అవతారం ఎత్తినట్లు శ్రీమహాభాగవత ఇతిహాసంలో పేర్కొన్నారు. విష్ణువు ఆ జగన్మోహినీ అవతారం ఎత్తిన ప్రదేశం ర్యాలీ.

ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' ! ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం కలదు. రాజమండ్రి కి 40 కి. మీ ల దూరంలో, కాకినాడ కు 74 కి. మీ ల దూరంలో, అమలాపురం కు 34 కి.మీ ల దూరంలో వశిష్ట, గౌతమీ అనే గోదావరి ఉప పాయల నడుమ ర్యాలీ గ్రామము కలదు. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఎదురెదురుగా ఉండటం.

అమృతం 

ర్యాలీ స్థలపురాణం గురించి శ్రీ భాగవత ఇతిహాసంలో పేర్కొనబడింది. అదేమిటంటే క్షీరసాగరమధనం సమయంలో అమృతం ఉద్భవించినపుడు దేవదానవులు పోట్లాడుచుండగా శ్రీ మహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహినీ అవతారం ఎత్తి అమృతం అందిస్తాడు.

అయ్యప్ప జననం

జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణువును చూసి పరమేశ్వరుడు మోహితుడై ఆమె వెంట పడగా ... వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. జగన్మోహిని శిరస్సు నుండి పుష్పం రాలి కింద పడుతుంది. ఆ పుష్పం పడిన ప్రాంతం ఇప్పటి ర్యాలీ (ర్యాలీ అంటే పడటం అని అర్థం) అని చెబుతారు.

చోళరాజు 

క్రీ.శ. 11 వ శతాబ్దంలో అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేటకై వచ్చి అలసి పోయి ఒక చెట్టుకింద సేద తీరుతాడు. ఆయనకు మహా విష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు కింద పడిన ప్రదేశం వద్ద తనకు గుడి కట్టించాలని చెబుతాడు.

విగ్రహం

వెంటనే రాజు కలలో నుంచి తేరుకొని ఆ ప్రదేశాన్ని వెతికి తవ్వించగా అక్కడ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయటపడుతుంది. రాజు వెనువెంటనే అక్కడ దేవాలయ నిర్మాణం కావించాడు. గుడి ప్రాకారాలు 1936 లో పునః నిర్మించారు.

జగన్మోహనుని రూపం

ఇంకో కద ప్రకారం, 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు. అప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యాలు వుండేవి. చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు.

కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు. ఆ విగ్రహాన్ని కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు. 

విక్రమదేవుడు భగవత అదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించాడు. ఇక్కడ రధ శీల రాలి పడిపోయిందిగనుక రాలి, ర్యాలి అన్న పేరు వచ్చింది. ఏ ఆలయంలోనైనా గర్భ గుడిలో మనం సాధారణంగా విగ్రహానికి వెనుక పక్కకి వెళ్ళం. ఇక్కడ కూడా అదే అలవాటుగా ముందునుంచి దణ్ణం పెట్టుకుని వచ్చేయకండి. విగ్రహం వెనుకపక్కకి వెళ్ళి పద్మినీజాతి స్త్రీని వెనుకవైపునుంచి చూస్తే ఎలా వుంటుందో చూడండి. 

ఐదు అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది. విగ్రహం ముందునుంచీ చూస్తే కేశవస్వామి, వెనుక మోహినీ రూపం. మకరతోరణంమీద దశావతారాలు, నారద, తుంబురులు, ఆదిశేషు, పొన్నచెట్టు, గోవర్ధనగిరి, మహర్షులు, అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి. ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా కనిపిస్తాయి. వెనుకవైపునుంచి చూస్తే పద్మినీజాతి స్త్రీ అలంకరణ. శిల్పం మొత్తం ప్రతి అణువూ అద్భుతంగా, అన్ని అలంకరణలూ స్పష్టంగా తెలిసేటట్లు మలచబడ్డది.

అమృతం పంచిన తర్వాత మోహినిని శివుడు మోపిస్తాడు. అతని నుండి తప్పించుకునేందుకు మోహిని రథం ఎక్కి వేగంతో వెళ్ళిందట. అలా వేగంగా వెళుతున్నప్పుడు రథం శీల రాలి పడిపోతుందట. అక్కడే విష్ణువు జగన్మోహనునిగా ఉండిపోయాడట.

ప్రత్యేకత 

శ్రీ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం శ్రీమహా విష్ణువు ప్రత్యక్ష రూపం. ఈ విగ్రహం ఏకసాలిగ్రామ శిలతో తయారైంది. ముందువైపు విష్ణువు, వెనకవైపు జగన్మోహిని రూపం కలిగి ఉండటం విగ్రహం ప్రత్యేకత.

విగ్రహ లక్షణాలు 


స్వామి పాదపద్మాల మధ్య చిన్న గంగా దేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. విగ్రహం ముందువైపు విష్ణువు శంఖం, చక్రం, గద మరియు అభయహస్తం కలిగి ఉండి, విగ్రహం పై భాగాన ఆదిశేషుడు పడగవిప్పి నీడనిస్తున్నట్లు ఉండటం విశేషం.

పద్మిని జాతి స్త్రీ లక్షణాలు

విగ్రహం వెనుక భాగంలో రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి వంటివి కలిగి ఉండి పద్మిని జాతి స్త్రీ లక్షణాలు కలిగి ఉంటుంది. స్వామివారికి జరిగే అన్ని పూజలు, హారతులు విగ్రహం వెనుకల కూడా జరుగుతాయి.

పరమేశ్వరుడు

శ్రీ జగన్మోహిని కేశవ స్వామి తూర్పు వైపున ఉండగా ఆయనకు ఎదురూగా పరమేశ్వరుడు పశ్చిమ ముఖం తిరిగి ఉంటాడు. శివలింగాన్ని బ్రహ్మ కమండలంచే పావనం చేయబడినందున పరమేశ్వరుడిని శ్రీ ఉమా కండలేశ్వర స్వామి అని పిలుస్తారు.

ఇతర విగ్రహాలు

దేవాలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబర, రంభ, ఊర్వశి, శ్రీకృష, ఆదిశేషుడు, గంగా, గరుడ విగ్రహాల శిల్పకళాచాతుర్యం ఉట్టిపడుతుంది.

పండుగలు

జగన్మోహిని కేశవ కళ్యాణం, శ్రీ రామ సత్యనారాయణ పరిణయం, వేణుగోపాలస్వామి కళ్యాణం, జన్మాష్టమి, కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, దేవి నవరాత్రులు.

వసతి

రావులపాలెం వసతికి మరియు భోజన సదుపాయాలకు సూచించదగినది. రావులపాలెం - ర్యాలీ మధ్య దూరం కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే.

Festivals

1. Sri Jaganmohini kesava Swamy kalyanam which is from Chaitra Shudha Navami to Pournami which is during March/April.

2. Sri Rama Satyanarayana Swamy kalyanam which is from Vishakha Sudha Ekadasi to Pournami.

3. Sri Venugopala Swamy kalyanam which is from Jyestha Sudha Ekadasi to Pournami in the month of June.

4. Shravana Bahula Ashtami which also known as Sri Krishnastami in August.

5. Karthika Shuddha Dwadasi which is also known as Ksheerabdhi Dwadasi held in November.

6. Devi Navaratris in October.

7. Mukkoti Ekadasi.

8. Bheeshma Ekadasi.

Address

Sri Jaganmohini Kesava & Gopala Swamy Temple,

Ryali,

East Godavari District, pin-533236.

Temple Timings

Morning : 6am to 12pm 
Evening : 3pm to 8pm.

By Road 

kakinada to ryali 
2 hr 17 min (69.4 km) via Kakinada - Ramachandrapuram Rd/Ramachandrapuram Penuguduru Rd
2 hr 30 min (99.2 km) via Chennai - Kolkata Hwy/Chennai - Srikakulam Hwy

rajahmundry to ryali 
54 min (38.5 km) via Chennai - Kolkata Hwy/Chennai - Srikakulam Hwy

ravulapalem to ryali 
15 min (6.3 km) via Amalapuram - Bandarulanka Rd/Amalapuram Bobbarlanka Rd and Ubalanka - Ryali Rd


Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : sri jaganamohani kesava and venu gopala swamy temple ryali history in telugu, ryali famous temples, sri jaganamohini kesava ryali temple history in telugu, venu gopala swamy temple ryali history in telugu, east godavari famous temples, rajamundry famous temples, andhra pradesh famous temples, india famous temples,world famous temples ,sri jaganmohini kesava swamy temple history in telugu, konaseeema famous temples

Comments