శ్రీ పురుహూతికా దేవి ఆలయం
పురుహూతికా దేవి శక్తి పీఠం
కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు.
ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు
శ్రీ పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం
10వ శక్తిపీఠం
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Sakti Peethas) అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.
10వ శక్తిపీఠం 'పురుహూతికాదేవి శక్తిపీఠం' పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు, పురుహూతికాదేవి: పురాణ ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠబాగం పడిన చోటు కాబట్టి, ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణలు తెలుపుతున్నాయి.
పురూహుతికా క్షేత్రం
పురూహుతికా క్షేత్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉంది. దక్షిణ కాశీగా ఈ క్షేత్రం పిలవబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరింది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం
చరిత్ర
దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవీ ఆ యజ్ఞవాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయ తాండవం చేశాడు మహేశ్వరుడు.
లయకారకుడైన ఆయన తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువయింది. దీన్ని గమనించిన ఆది పరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీమహావిష్ణువుని ఆజ్ఞాపించింది.
అమ్మ ఆనతిమేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా, అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయనీ, ఇలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తిపీఠాలుగా పూజలందుకుంటున్నాయనీ పురాణాలు తెలియజేస్తున్నాయి. వీటిలో పిరుదుల భాగం పడిన ప్రాంతం పిఠాపురం. మిక్కిలి ప్రసిద్ధిచెందిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది పదవది. పురూహుతికా దేవిగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటోంది.
ఆలయ వివరాలు
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా శక్తి పీఠం పిఠాపురం
పురుహూతికా అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి గుడిలో ఈశాన్యభాగంలో ఉంది.
పురుహూతికా అమ్మవారి గుడి చిన్నదైననూ అష్టాదశ శక్తిపీఠాల శిల్పాలు చెక్కపడి చాలా అందంగా ఉంటుంది. పురుహూతికా విగ్రహం నాలుగు చేతులు కలిగి ఉంటుంది.
ఆ నాలుగు చేతులలో విత్తనాల [బీజాలు] సంచి , గొడ్డలి [పరశువు], కమలం, మధుపాత్ర ఉంటాయి.
ఈ ఆలయం లో మనం ఇంకా కాశి అన్నపూర్ణ , అయ్యప్ప , నవ గ్రహాలు , శ్రీ రాముడు , శ్రీ కృష్ణా , కామాక్షి , ఆది శంకరాచార్యులు , శ్రీ సాయి బాబా , దత్త త్రేయ స్వామి వార్ని దర్శించవచ్చు .
ప్రత్యేక ఉత్సవాలూ, పండుగలూ
పురూహుతికా శక్తిపీఠంలో ప్రతి శుక్రవారం రోజూ, పర్వదినాల్లోనూ కుంకుమార్చనలను విశిష్టంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రోజూ శత చండీయాగాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే వేదపారాయణం కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీంతోపాటు పిఠాపురం పట్టణంలో వేణుగోపాలస్వామి, గుడివీధిలో శ్రీపాదవల్లభుడి ఆలయం కొలువుతీరాయి.
రవాణా:
అన్నవరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సామర్లకోటకు 11 కి.మీ
రాజమహేంద్రవరానికి 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రైలు, రోడ్డుమార్గాలు ఉన్నాయి.
హైదరాబాదు నుంచి వచ్చేవారు సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రైలు సౌకర్యం ఉంది.
Temple Timings
Morning : 5am to 12pm
Evening : 4pm to 8pm
Temple Address
Sri Puruhuthiga Devi Temple,
Pithapuram,
East Godavari District,
Andhra Pradesh,
India.
Related Postings:
Tags : sri puruhuthika devi temple pithapuram history in telugu, pithapuram famous temples, east godavari famous temples, kakinada famous temples, kukkuteshwara swamy histoory in telugu , sri padha vallabha swamy temple history in telugu, sri kunthi mandhava swamy temple history in telugu, padha gayya temple history in telugu,andhra pradesh famous temples,india famous temples,world famous temples,,lord shiva famous temples, padagaya temple pithapuram, pithapuram Temples, pithapuram Pada Gaya Khestram, padagaya Kukkuteswara Swamy Temple Pitapuram, Shri Puruhutika Shaktipeeth Pithapuram, Dattatreya Birth Temple Pithapuram, Sripada Srivallabha Temple Pithapuram, Top Temples in Pithapuram, pithapuram puruhutika devi temple timings, Puruhutika Devi 10 th Shakthi Peetham Pithapuram,kunthi madhava swamy temple, pithapuram history in telugu, pancha madhava kshetras in telugu, Lord vishnu pamcha madhava temple in india ,Puruhutika Devi Shakthi Peetham Pithapuram,Sri Puruhutika Devi 10th Shakti Peetham Pithapuram
Comments
Post a Comment