శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయం పిఠాపురం | Pithapuram Sri Kunthi Madhava Swamy Temple History In Telugu | Bhakthi Margam | భక్తి మార్గం
పిఠాపురం లో ఉన్న ప్రసిద్ద ఆలయాలులో పాదగయ , అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైనా 10 వ శక్తి పీఠంపురుహూతికా అమ్మవారి ఆలయం , పంచ మాధవ క్షేత్రలో ఒక్కటైనా కుంతీ మాధవ స్వామి ఆలయం , వేణుగోపాల స్వామి ఆలయం , దత్త పీఠం , దత్తాత్రేయుని ఆలయం.
శ్రీ కుంతీ మాధవ స్వామి
ఆలయం చరిత్ర
కాకినాడకు దగ్గరలో ఉన్న పిఠాపురంలో ఉన్న ఈ ఆలయం చరిత్ర చూసినట్లయితే వేదవ్యాస మహార్షి పిఠాపురం లోని కుక్కుటేశ్వర స్వామిని దర్సిన్చుకోవటానికి ఇక్కడికి వచ్చి దర్శనం పూర్తీ చేసుకుని తిరిగి వెళుతూ ఈ కుంతీ మాధవ ఆలయానికి వస్తాడట.
తన దివ్య దృష్తితో ఈ ఆలయం ఇంద్రుడు నిర్మించాడని, పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడకి వచ్చి ఉన్నారని, ఆ సమయంలో కుంతీదేవి ఈ మాధవునికి విశేష పూజలు చేసిందని చెప్పారట. కుంతీదేవి వనవాస కాలంలో నిరంతరం ఈ స్వామిని పూజించటం వలన ఈ ఆలయానికి కుంతీ మాధవ ఆలయంగా పేరు వచ్చిందని చెపుతుంటారు.
కుంతీ మాధవుడి పట్టపురాణిని రాజ్యలక్ష్మి అమ్మవారట. ఈవిడకి ప్రతి శుక్రవారం విశేష పూజలు చేస్తారట. ఈ ఆలయంలోని స్వామివారి లీలలు ఎంతో మంది ప్రత్యక్షంగా చూసారని చెపుతుంటారు.
ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా రావు గంగాధర రామారావుగారికి స్వామివారు కలలో కనిపించేవారని ప్రతీతి.ఏ రోజైనా ఆలయంలో ప్రసాదం రుచిగా లేకపోతే కృష్ణుడు ఈయన కలలో కనిపించి ప్రసాదం ఏమి బాలేదని చెప్పేవారట. రాజా వారు మరునాడు ఆలయానికి వెళ్లి ప్రసాదం ఎంతో రుచిగా వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకునేవారట.
ప్రత్యేకత
మన దేశంలో కృష్ణుడి ఆలయాలకు కొదవే లేదు. వెన్నదొంగకి ఊరూరా ఆలయాలే. అయితే పిఠాపురంలో ఉన్న కుంతీ మాధవ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. కొందరు ఈ ఆలయం ఇంద్రుడు ప్రతిష్టించాడని అంటారు, మరికొందరు కుంతీ దేవి ప్రతిష్టించిందని అంటారు.
ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరిస్తాడు. వృత్తాసురుడు అసురుడైనా పుట్టుకతో బ్రాహ్మణుడు అందువల్ల బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమి పైన ఐదు వైష్ణవాలయాలను నిర్మించాడు. అవే "పంచ మాధవ క్షేత్రాలు"గా ప్రసిద్ధి చెందాయి. అవే బిందు మాధవ ఆలయం - వారణాసి, వేణీ మాధవ ఆలయం - ప్రయాగ, కుంతీ మాధవ ఆలయం - పిఠాపురం, సేతు మాధవ ఆలయం - రామేశ్వరం, సుందర మాధవ ఆలయం - తిరువనంతపురం.
వృత్తాసురుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకుందికి ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించేడు.
ఐదు వైష్ణవాలయాలు
కాశీ లో బిందు మాధవ స్వామి.
ప్రయాగ లో వేణు మాధవ స్వామి.
పిఠాపురంలో కుంతి మాధవ స్వామి.
తిరుచునాపల్లి లో సుందర మాధవ స్వామి.
రామేశ్వరం లో సేతు మాధవ స్వామి.
ప్రయాగ లో వేణు మాధవ స్వామి.
పిఠాపురంలో కుంతి మాధవ స్వామి.
తిరుచునాపల్లి లో సుందర మాధవ స్వామి.
రామేశ్వరం లో సేతు మాధవ స్వామి.
ఉత్సవాలు
ఇక ఈ అమ్లొ జరిగే ఉత్సవాల విషయానికొస్తే మాధవస్వామికి మాఘశుద్ధ ఏకాదశి నాడు కళ్యాణోత్సవం జరుపుతారట. చతుర్దశి నాడు రథోత్సవము కూడా అత్యంత వైభవంగా జరుగుతుందిట. మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసం నెలరోజులు భక్తులు తిరుప్పావై విన్నవిన్చుకుంటారని ఆలయ వర్గాలు చెప్పాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గోదామ్మవారు, లక్ష్మీ అమృతవల్లి తాయారు, ఆళ్వారుల సన్నిధి ఉన్నాయట.
s
Poojas /Sevas
Morning:- Suprabhatam, Teerthapu Binde, Archana, Sahasranamarchana and Balabhogam .
Afternoon:- Archana and Balabhogam.
Evening:- Archana, Dhoopa Seva, Asthana Seva, Bhajan and Pavalimpu Seva .
రవాణా:
By Road
Pithapuram to kakinada : 15kms,
Pithapuram to Rajamundry :76kms,
Pithapuram to Samarlakota :21kms,
Pithapuram to Vizag :137kms.
Pithapuram to Rajamundry :76kms,
Pithapuram to Samarlakota :21kms,
Pithapuram to Vizag :137kms.
By Air
The nearest International airport is at Vijayawada which is 142 km away.
The nearest domestic airport is at Rajahmundry which is 56 km away.
The nearest domestic airport is at Rajahmundry which is 56 km away.
By Train
The nearest railway station is at Pithapuram which is 1.7 km away.
Temple Timings:
Morning: 5am to 12pm
Evening: 4pm to 8pm
Temple Address :
Sri Kunthi Madhava Swamy Temple,
Pithapuram,East Godavari,
Andhra Pradesh 533450,
India.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Tags : sri kunthi madhava swamy temple pithapuram history in telugu, pitapuram famous temples, east godavari famous temples, kakinada famous temples, andhra pradhesh famous temples, india famous temples,world famous temples,kukkuteshwara swamy temple history in telugu, Pancha madava Temple, Tags : sri kukkuteshwara swamy temple history in telugu, pittapuram sri kukkuteshwara swamy temple, east godavari famous temples, kakinada famous temples, pithapuram famous temples, andhra pradesh famous temples, india famous temples, world famous temples,lord shiva famous temples, padagaya temple pithapuram, pithapuram Temples, pithapuram Pada Gaya Khestram, padagaya Kukkuteswara Swamy Temple Pitapuram, Shri Puruhutika Shaktipeeth Pithapuram, Dattatreya Birth Temple Pithapuram, Sripada Srivallabha Temple Pithapuram, Top Temples in Pithapuram, pithapuram puruhutika devi temple timings, Puruhutika Devi 10 th Shakthi Peetham Pithapuram,kunthi madhava swamy temple pithapuram history in telugu, pancha madhava kshetras in telugu, Lord vishnu pamcha madhava temple in india
Comments
Post a Comment