శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం | Sri Mahalakshmi Stotram in Telugu | Bhakthi Margam

 

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం


జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే |

జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ ||

మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ |

హరిప్రియే నమస్తుభ్యం దయానిధే ||

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే |

సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు ||


జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే |

దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే ||

నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ |

వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ ||


రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే |

దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి ||


సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే |

అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా ||


అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః |

చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః||

నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః |

పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ ||


శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే కమలాలయే |

త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే ||


పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే |

శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా ||


తావ ద్విరాజతే రూపం తావ చ్చీలం విరాజతే |

తావద్గుణా నరణాం చ యావ ల్లక్ష్మీః ప్రసీదతి ||


లక్ష్మిత్వయాలంకృత మానవా యే |

పాపై ర్విముక్తా నృపలోక మాన్యాః ||


గుణై ర్విహీనా గుణినో భవంతి |

దుశ్శీలనః శీలవతాం పఠిష్టః ||


లక్ష్మీ ర్భూషయతే రూపం లక్ష్మీ ర్భూషయతే కులమ్ |

లక్ష్మీ ర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీ ర్విశిష్యతే ||


లక్ష్మీ త్వద్గుణ కీర్తనేన కమలా భూర్గ్యాత్యలం జిహ్మాతాం |

రుద్రాద్యా రవిచంద్ర దేవపతయా వక్తుంచ నైవ క్ష్మాః |

అస్మాభి స్తవ రూప లక్షణ గుణాన్వక్తుం కథం శకృతే |

మాత ర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వా మహేష్టం ధ్రువమ్ ||


దీనార్తి భీతం భ్వతాప పీడితాం ధనై ర్విహీనం తవ పార్శ్వ మాగతమ్ |

కృపానిధిత్వా న్మను లక్Sమి నత్వరం ధనప్రదానాద్దననాయకం కురు ||

మాం విలోక్య జననీ హరిప్రియే నిర్దనం తవ సమీప మాగతమ్ |

దేహి మే ఝుడతి లక్ష్మీ కరాంబుజం వస్త్ర కాంచన వరాన్న మద్బుతమ్ ||


త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ |

భ్రాతా త్వం చ సభా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ ||


త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి |

త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః ||


నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః |

ధర్మాధారే నమ స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ ||


దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే |

మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్ ||


కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః |

అనన్యే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే ||


ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా |

ఉవా చ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా ||

య త్త్వ యోక్త మిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః |

శృణోతి చ మహాభాగః తస్యాహం పశవర్తినీ ||


నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీ స్తస్య నశ్యతి |

ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి ||


యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః |

గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ ||


పుత్త్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభక్తా చ మానవః |

ఇదం స్తోత్రం మహా పుణ్యం లక్ష్మ్యాగస్థ్య ప్రకీర్తితమ్ ||


విష్ణు ప్రసాద జననం చతుర్వర్గ ఫలప్రదమ్  ||


రాజద్వారే జయశ్చైవ శత్రో పరాజయః |

భూత ప్రేత పిశాచినాం వ్యాఘ్రాణాం న భయం తథా ||


న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే |

దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్ ||

మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః |

పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్ ||


సర్వ సౌఖ్యకరం నౄణా మాయు రారోగ్యదం తథా |

అగస్త్య మునిన ప్రోక్తం ప్రజానాం హిత కామ్యయా ||

Related Postings:

1. Stotras In Telugu

Comments