కార్తీక పురాణం 4 వ అధ్యాయం | karthika puranam day 4 in telugu | bhakthi margam

 
కార్తీక పురాణం 4 వ అధ్యాయం

దీపారాధన మహిమ 

కార్తీక మాసంలో చేసే మంచి పనుల్లో దీపారాధన వొకటి. శివాలయంలో కాని విష్ణాలయంలో కాని సూర్యాస్తమయ సమయమందు సంధ్య వేళ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి పొందెదరు .ఆవునేతితో లేదా కొబ్బరి నూనెతో అవిశ నూనెతో విప్పనూనెతో ఏది దొరకనపుడు ఆముదంతో దీపారాధన చేయవచ్చును .దీపారాధన విశిష్టత తెలియచేసే ఈనాటి నాలగవ అధ్యాయం

శత్రుజి కధ 

పూర్వం పాంచాలదేసాన్ని పాలించు రాజుకు సంతతిలేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుకు చెంది గోదావరి తీరంలో నిష్టగా తపం ఆచరించు నపుడు పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి మహారాజ మీరెందుకు తపమాచారించుచున్నారు మీ కోర్కె ఏమి అని అడుగగా పుత్రసంతానం లేక క్రుంగి ఈ తపం ఆచరిస్తున్నాను అని చెప్పగా ముని వోయి కార్తీక మాసమున శివసన్నిధిన దీపారాధన చేసిన నీ కోరిక నెరవేరును అని చెప్పెను వెంటనే పాంచాలరాజు తన రాజధానికి వెళ్లి పుత్రప్రాప్తికి కార్తీకమాసం నెలరోజులు దీపారాధన చేసి నియమనిస్టలతో దానధర్మాలు చేసి వ్రతాలు చేయడంవలన ఆ పుణ్యఫలంతో వొకనాడు వొక పుత్రుడను పొందెను అతనికి శత్రుజి అని పేరుపెట్టి కార్తీక మాస పవిత్రత గ్రహించినవాడ్యే ప్రతి సమ్వత్చరమ్ కార్తీకమాసంలో వ్రతాలు దీపారాధనలు చెయ్యాలని శాశనం చేసెను .

రాకుమారుడు సకల శాస్త్రాలు చదివి విద్యలన్నీ నేర్చుకొని పలు చెడు సావాసాలు కూడా అలవరచుకొని కంటికి ఇంపుగా వున్నస్త్రీలను చెరపట్టి ఎదిరించినవారిని దండించి కామవాంచ తీర్చుకోనుచు వుండగా తల్లితండ్రులు లేకలేక కలిగిన బిడ్డకాబట్టి ఇలాంటి ఘాతుకాలు చూసి చూడనట్లు వినీవిననట్లు వుండిరి. ఇలాంటి సందర్భంలో రాజకుమారుడు వొక అధ్బుతమైన అందంతో వున్న వొక బ్రాహ్మణుడి బార్యను చూసి ఆమెకు తన కోర్కె తెలియచేసేను.

 ఆమెకూడా అతని సౌందర్యానికి ముగ్ధ అయి శీలం సిగ్గులజ్జ వదిలి అతని చేయి పట్టుకొని శయన మందిరానికి వెళ్లి బోగములు అనుభవించెను. ఇట్లా వొకరి ప్రేమలో వొకరు పరవశలై ప్రతిదినం అర్ధరాత్రివేళ రహస్యంగా కలుస్తూ వుండగా విషయం ఆమె బర్తకు తెలిసెను.

  రాజకుమారుని చంపాలని కడ్గం తో నిరీక్షించెను. కార్తీకశుద్ధ పౌర్ణమినాడు ఇద్దరు శివాలయంలో సుఖించు చుండగా చీకటిగా వున్నది కాంతి వుంటే బాగుండు అని రాజకుమారుడు అనగా ఆమె తన చీర చెంగును చించి వత్తిగా చేసి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించి రతిక్రీడలు సలుపుతూ బాహ్యప్రపంచం తెలియని వార్యే వుండగా అదే అదునుగా ఆమె బర్త వొక్క వేటుతో బార్యను రాజకుమారుని వదించెను. తానుకూడా పొడుచుకొని చనిపోయెను.

 జరిగిన విషయం అశ్లీలం అయిన ఆ కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుటవలన శివదూతలు ప్రేమికులను కొనిపోవగ యమదూతలు బ్రహ్మనునికోరకు రాగా బ్రాహ్మణుడు ఇదేమి విచిత్రం కామాంధకారంతో కన్నుమిన్నుకానని అలాంటి నీచులకు పుణ్యలోక ప్రాప్తినా అనగా... యమకింకరులు వో బ్రాహ్మణుడా ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవార దినమున తెలిసో తెలియకో శివాలయంలో దీపం వెలిగించడంవలన పాపములన్నియు నసించినవి అనగా... బ్రాహ్మణుడు అలా జరగనివ్వను ముగ్గురము వొకే ప్రదేశంలో మరణించాము .

కాబట్టి ముగ్గురుకు పుణ్యప్రాప్తి కలగాలని కోరగా దీపారాధన ఫలాన్ని అతనికి ఇప్పించి ముగ్గురిని శివసానిధ్యానికి చేర్చిరి. ఈ కధలో చేసిన దుస్కర్మకు అనుకోనివిదంగా పుణ్యప్రాప్తి కలిగినా సత్కర్మలతో సదాచారాలతో శరీరాన్ని అపవిత్రం చేసుకోకుండా దీపారాధన చేసిన ఆత్మే కాదు తనువు పునీతమౌతుంది .కార్తీక మాసంలో నక్షత్ర మాలలో దీపమున్చినవారు జన్మ రాహిత్యం పొందెదరు 

ఇది స్కాంద పురాణ అంతర్గత వసిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యమందలి నాలగవ అధ్యాయం నాలుగోరోజు పారాయణం సమాప్తం .ఓం నమః శివాయ 

ఈరోజు వంకాయ ,ఉసిరి.. నిసిద్దములు --నూనె ,పెసరపప్పు.. దానములు --విఘ్నేశ్వరుడు ..పూజించే దైవం --ఓం గం గణపతయే స్వాహా..జపించాల్సిన మంత్రం --సద్బుద్ధి ,కార్య సిద్ది.. ఫలితం పొందవచ్చు

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu

Tags: karthika puranam first day story in Telugu, karthika puranam telugu, karthika masam 2023, karthika masam 2023 start date telugu, karthika puranam story in telugu, karthika masam visistatha by chaganti koteswara rao, karthika puranam by chaganti, karthika masam story in telugu, karthika puranam by bhakthi margam, Importance of Karthika Masam, karthika masam upavasam ela cheyali, karthika masam pooja vidhanam in telugu, karthika masam fasting Rules, karthika puranam full in telugu, కార్తీక పురాణం  4 వరోజు కథ  Karthika Puranam 4th Day Karthika Puranam in Telugu  , Bhakthi Margam, Bhakthi Margam telugu, Telugu Bhakthi margam, Bhakti margam, bhakti margam telugu, bhakthimargam.com, bhakthimargam.in

Comments