కార్తీక మాసంలో శు"" విదియ. నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక. అన్నా చెల్లెలు పండుగ అంటారు. ఇది ఈ సంవత్సరం 29-10-2019 మంగళవారం వచ్చినది.
కారణం
సూర్య భగవానికి ఒక కుమారుడు ఒక కుమార్తె.
వారి పేర్లు "" యమధర్మరాజు & యమున. యమునకు అన్నగారు అనగా విపరీతమైన. అభిమానం.
అమె అన్నగారు " యమధర్మరాజు"" గారిని ఎన్నో సార్లు తన ఇంటికి భోజనము నకు రమ్మని పిలిచేది.
కాని ఆయనకు తీరిక ఉండేది కాదు. యమలోకంలో పాపులను శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు. పాపం చెల్లెలు కోరిక. తీర్చలేదని భాధపడేవాడు. కాలము గడచిపోతూఉంది. అనుకోకుండా ఒకనాడు ఆయనకు చెల్లెలు ఇంటికి వెళదామని అనకున్నాడు. ఆ రోజు కార్తీక శుద్ద విదియ
"' యమధర్మరాజు "" చెల్లెలి ఇంటి వచ్చాడు. రాక రాక వచ్చిన అన్నయ్య ను చూచి
చెల్లెలు "" యమున"" సంతోషంగా అన్నయ్య. కు ఇష్టమైన. పదార్థాలు వండి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. "" యమధర్మరాజు "" త్రుప్తిగా భోజనము చేసి చెల్లెలు తో ప్రేమగా చెల్లీ నాకు ఇషమైన పదార్థములు తో భోజనము పెట్టావు. నీకు ఏదైనా వరం ఇస్తానని చెప్పగా " యమున" అన్నయ్యా లోకకల్యాణము కోసం నాకు ఒక వరము ఇవ్వు.
ఈ రోజు న ఎవరైనా అక్క& చెల్లెలు ఇంటికి ఏ అన్నయ్య & తమ్ముడు భోజనంచేస్తాడో నీవు ఎట్టి పరిస్థితి లో వారి జోలికి వెళ్ళవద్దు. ఇది నా కోరిక అనగా "" యమధర్మరాజు ""
లోకకల్యాణం కోసం అడిగావు కనుక " తధాస్తు"
అని చెల్లెలు ను దీవించి వెళ్ళాడు. అనగా రేపటి రోజున.
అక్క & చెల్లెలు చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషములను ఉండవు.
కనుక అందరు సోదరి చేతి భోజనం చేసి కనుమరుగై న బంధుత్వాన్ని కలుపుకొని సుఖముగా ఉండాలని కోరుకుంటూ
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords:
anna chellelu bhojanam,Karthika Masam anna chellelu bhojanam,Karthika Masam Pooja Vidhi
Significance of Bhaginihastha Bhojan,Bhagini Hastha Bhojanam Benefits,Karthika masam importance,Chaganti kartheeka Anna chelli bhojanalu,Bhagini Hastha Bhojanam Story Sri Chaganti,Yama Dwitiya,Thobuttuvulaki Bhojanam,Dhana Trayodasi,DharmaSandehalu,brothers and sisters relationship,anna chellelu bojanam In Karthika Masam,Anna Chellelu Bojanam In Karthika Masam 2nd Day, Karthika Masam Pooja Vidhi, Tulakota Pooja Vidhanam
Comments
Post a Comment