అయోధ్య - బాబ్రీ మసీదు వివాదం శతాబ్దాల నాటిది.
స్వాతంత్రానంతరం కూడా ఈ వివాదం కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో 2.77 ఎకరాల స్థలం పైనే వివాదం. అదే రాముడు పుట్టిన స్థలం. మసీదు నిర్మించిన స్థలం. 16వ సెంచరీలో... అక్కడ ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చివేసి, మసీదును నిర్మించారు. దీంతో వివాదం ప్రారంభమైంది.
1528లో ఆలయాన్ని కూల్చి, మసీదును నిర్మించారు. ఆ తర్వాత 1949లో హిందువులు అందులో రాముడు - సీతదేవీల విగ్రహాలను ఉంచారు. మొఘలలు, బ్రిటిష్ వారి హయాంలోను ఈ వివాదం కొనసాగింది. ఇప్పటికీ కొనసాగుతోంది. రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి.. మసీదును నిర్మించారనే ఆగ్రహంతో 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. దీంతో ఇది మరింతగా చర్చనీయాంశమైంది. 1949 డిసెంబర్‌లో మసీదులో రాముడు - సీతాదేవిల విగ్రహాలు కనిపించాయి. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాటి యూపీ సీఎంతో మాట్లాడారు. దీనిపై మాట్లాడాలని, అలాగే విగ్రహాలు మసీదు నుంచి తొలగించాలని చెప్పారు. అయితే, దీనిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలు తొలగించేందుకు నిరాకరించారు. దీంతో అప్పుడు మసీదు గేట్లు మూసుకున్నాయి. ఆ తర్వాత 40 ఏళ్లకు.. అంటే 1989లో రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారనే వాదనలు ఉన్నాయి. మసీదు గేట్లు ఓపెన్ చేయాలని చెప్పారు. దీంతో విహెచ్‌పీ, ఆరెస్సెస్ వంటి హిందుత్వ సంస్థలు, బీజేపీ పార్టీ.. అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అద్వానీ రథయాత్ర, ఆ తర్వాత మసీదు కూల్చివేత ఘటనలు చోటు చేసుకున్నాయి. 400 ఏళ్ల నాటి మసీదును కూల్చేశారు. అక్కడ అంతకుముందు ఉన్న రామాలయాన్ని కట్టాలని డిమాండ్ చేశారు. 1992లో ప్రభుత్వం మసీదు కూల్చివేత ఘటనపై లిబర్హాన్ కమిటీని వేసింది. అందులే పలువురు బీజేపీ నేతల పేర్లు ఉన్నాయి.
వివాదం ఈనాటిది కాదు:
అప్పుడే తొలిసారి ఘర్షణలు 1528వ సంవత్సరంలో మొగల్ రాజు అప్పటికే అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని హిందువులు ఆరోపిస్తారు. అయోధ్య రాముడి పుట్టిన స్థలంగా కొలుస్తారు. అలాంటి అయోధ్యలో ఆలయాన్ని కూల్చేసి బాబర్.. మసీదును కట్టాడని చెబుతారు. అయోధ్యలో మసీదు కట్టిన కారణంగా ఘర్షణలు ఇటీవలి కాలంలోనే కాదు. ఆనాడే జరిగాయి. తొలిసారి 1853లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నట్లుగా చెబుతారు. అంతకుముందు కూడా జరిగాయని అంటారు. కానీ 1853లో ఘర్షణలు జరిగినట్లుగా రికార్డులు ఉన్నాయని తెలుస్తోంది.
ఫెన్సింగ్ వేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ స్థలం గురించి దశాబ్దాలుగా వివాదం ఉండంతో 1859లో బ్రిటిష్ ప్రభుత్వం రెండుగా చేసి, ఫెన్సింగ్ వేసింది. లోపలి స్థలం మసీదు కోసం, బయటి స్థలం హిందువుల కోసం ఉద్దేశిస్తూ విభజించింది. 1885లో ఈ స్థల వివాదం తొలిసారి కోర్టుకు వెళ్లింది. ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించాలని మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ న్యాయస్థానంలో అప్పీల్ చేశారు.
1949లో రాముడి విగ్రహం 1949లో మసీదులో శ్రీరాముడు - సీతదేవిల విగ్రహాలు కనిపించాయి. ఈ విషయమై ఇరువర్గాల మధ్య రగడ చోటు చేసుకుంది. ఇరువర్గాలు సివిల్ సూట్‌ను ఫైల్ చేశాయి. వివాదం ఉండంతో ప్రభుత్వం ఈ స్థలం గేటుకు తాళాలు వేసింది. దానిని వివాదాస్థలంగా ప్రకటించింది. 1984లో విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలో పలు హిందూ సంస్థలు, హిందువులు ఓ కమిటీగా ఏర్పడ్డారు. రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయ నిర్మాణమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పడింది. ఆ తర్వాత అది బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ చేతుల్లోకి వెళ్లింది. గేట్లు ఓపెన్ చేయాలని, అక్కడ హిందువులను పూజలు చేయనివ్వాలని 1986లో జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత పలువురు ముస్లీంలు కలిసి బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. పునాది రాయి 1989లో విశ్వహిందూ పరిషత్ నేతలు.. రామాలయ నిర్మాణం కోసం నడుం బిగించారు. మసీదు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రామాలయం కోసం పునాదిరాయి వేశారు. 1990లో నాటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చేశారు. 2002లో వాజపేయి ప్రభుత్వం హిందు - ముస్లీంల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్ ప్రారంభించింది.
కరసేవకులను తగులబెట్టారు, ప్రతిగా గోద్రా అల్లర్లు 2002లో అయోధ్య వెళ్లి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి చేశారు. దానిని తగుల బెట్టారు. ఈ ఘటనలో 58 మంది హిందువులు చనిపోయారు. దీనికి ప్రతిగా గోద్రా అల్లర్లు జరిగాయి. అందులోను వందలాది మంది ముస్లీంలు చనిపోయారు. అయోధ్య - బాబ్రీ స్థలం ఎవరిదో తేల్చేందుకు ముగ్గురు జడ్జిల నేతృత్వంలో హైకోర్టు 2002 నుంచి వాదనలు వినడం ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. 2003లో మసీదు ముందు రాముడి ఆలయం ఉండేదా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు. మసీదు అడుగున ఆలయం ఆనవాళ్లు 2003 ఆగస్టు నాటికి ఆర్కియాలజిస్టు సర్వేలో మసీదు కింద రాముడి ఆలయం ఆనవాళ్లు లభించాయి. మరోవైపు, బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ఏడుగురు నేతలపై విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఏడాదికి మసీదు కూల్చివేత ఘటనలో అద్వానీ పాత్రపై సమీక్షించవలసి ఉంటుందని కోర్టు చెప్పింది.
2005 జూలైలో ఇస్లామిక్ మిలిటెంట్లు వివాదాస్పద భూభాగంపై దాడి చేశారు. ఈ ఘటనలో సెక్యూరిటీ ఫోర్స్ ఐదుగురిని హతమార్చింది. మసీదు 2009 జూన్‌లో లిహర్హాన్ కమిషన్ మసీదు కూల్చివేతపై నివేదిక ఇచ్చింది. ఇందులో బీజేపీ నేతల పేర్లు ఉన్నాయి. వివాదాస్పద భూమిని మూడు ముక్కలు చేస్తూ 2010 సెప్టెంబర్ నెలలో అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఒకటి రామాలయం కోసం, రెండోది మసీదు కోసం, మూడోది నిర్మోహి అఖారాకు కేటాయించింది. దీనిపై మళ్లీ అప్పీల్‌కు వెళ్లారు. 2010లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సస్పెండ్ చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేతపై కేసు వేసిన పిటిషనర్ హష్మీమ్ అన్సారీ 2016లో చనిపోయారు.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords:
Ram Mandir-Babri Masjid issue,Ayodhya Ram Mandir: Latest News & Videos, Photos,Ayodhya Ram Temple ,ayodhya ram mandir history in telugu,ayodhya ram mandir latest news today,ayodhya ram mandir latest update,ayodhya ram mandir uttar pradesh,ram janmabhoomi verdict allahabad high court,2010 allahabad high court judgement on babri masjid,supreme court judgement on babri masjid,Ayodhya Ram Mandir Story in Telugu,Ram temple construction Videos,Ayodhya Ram Mandir construction Videos in Telugu,Ayodhya Ram Mandir Latest News In Telugu,History of Ram Mandir in Ayodhya,Ayodhya Ram temple construction details In Telugu,Ayodhya Temples,Ayodhya Temple In Telugu,Ram Janmabhoomi,Sri Rama Mandiram Ayodhya,Ramayana,Sri Rama Navami Special,What is the Ayodhya dispute all about?,Ayodhya temples Uttarapradesh,Supreme Court Ayodhya Ram Temple
Comments
Post a Comment