దీపావళి రోజున ఈ పనులు పొరపాటున కూడా చేయద్దు | Deepavali Pooja Niyamalu | Diwali Pooja Vidhi In Telugu

దీపావళి.. లక్ష్మీదేవినే ఎందుకు పూజించాలి?

నాలుగు యుగాల్లోనూ దీపావళి పండుగను ఆనందోత్సహాలతో జరుపుకున్నారనేందుకు చరిత్ర వుంది. శ్రీమహా విష్ణువు వామనావతారుడై కృతయుగంలో రాక్షసరాజు బలి చక్రవర్తిని పాతాళానికి అణచివేశాడు. అది బలిపాలన అంతమైన రోజు.
ఆ రోజున దీపావళిని జరుపుకున్నారు. అలాగే  త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించి తిరిగి ఆ రోజు అయోధ్యలో ప్రవేశించిన శుభదినం. 


ఇక ద్వాపర యుగంలో నరకాసురుణ్ణి వధించిన రోజునే దీపావళిగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఇక కలియుగంలో విక్రమశక స్థాపకుడైన విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా దీపావళి నాడేనని పురాణాలు చెప్తున్నాయి. ఇలా నాలుగు యుగాల్లోనూ సంభవించిన వివిధ రకాల కారణాలతో ఈ విజయాలకు సూచికగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్నట్లు ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

అలాగే దీపావళి పర్వదినం రోజు ఆ జగన్మాత మహాలక్ష్మీదేవిని సర్వోపచారాలతో పూజిస్తారు. దీపావళి పర్వదినం రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజించడానికి గల కారణాలు ఏంటంటే?
పూర్వం దుర్వాస మహాముని ఇంద్రుడి ఆతిథ్యానికి సంతోషించి మహిమగల ఒక హారం అతడికి బహూకరించాడు. కానీ ఇంద్రుడు ఆ హారం మహిమను, గొప్పతనాన్ని గుర్తించకుండా దాన్ని తన వాహనమైన ఐరావతం మెడలో వేశాడు. ఆ హారాన్ని ఐరావతం కాలితో తొక్కేసింది. ఆ పాపానికి ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు. 

ఈ దీనస్థితి నుంచి గట్టెక్కేందుకు ఇంద్రుడు శ్రీహరిని స్తుతించగా.. ఒక దీపాన్ని వెలిగించి దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించమని చెప్పాడు. ఆ పూజలు ఆచరించిన దేవేంద్రునిపై లక్ష్మీదేవి కరుణాకటాక్షం లభించింది. దీంతో ఇంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంకా దేవలోకాధిపత్యం లభించింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎవరైతే దీపావళి రోజున దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారో ఆ భక్తుల ఇంట లక్ష్మీదేవి స్థిరంగా వుంటుందని విశ్వాసం.

దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే.. కలిగే ప్రయోజనాలు

దీపావళి పండున మతభేదాలు లేకుండా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ పూజ జరిపించుకుని రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తపరచుటకై దీపాలంకరాలు చేసి టపాసులు కాలుస్తారు. అసలు దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలని.. పూజిస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
పూర్వం దుర్వాస మహర్షి దేవేంద్రుని ఆతిధ్యానికి సంతసించి అతనికి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు ఇంద్రుడు దానిని తనవద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేశాడు. మరి ఆ ఏనుగేమో ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. ఈ ఘటనను చూసిన దుర్వాసుడు కోపంతో దేవేంద్రుని శపిస్తాడు. దేవేంద్రుడు దాని ఫలితంగా రాజ్యాధిపత్యం కోల్పోయి దిక్కుతోచక శ్రీవారిని ఆరాధిస్తాడు. 

దేవేంద్రుని బాధను గమనించిన విష్ణువు అతనికి ఓ జ్యోతిని వెలిగించి లక్ష్మీదేవి స్వరూపంగా తలచుకుని ఈ జ్యోతిని పూజించమంటారు. ఆ జ్యోతి తృషి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొంది దుర్వాసుని పాదాలపై పడతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి రాజ్యము, సంపదలను పొందిన దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మితో తల్లీ నీవు శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా.. నీ భక్తులను కరుణించవా అంటూ అడిగాడు. 

అప్పుడు లక్ష్మీదేవి... నన్ను త్రికరణ శుద్దిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీగా, విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా.. వారి సమస్త కోరికలను నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలౌతానని చెప్పారు. అందుచేతనే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సమస్త సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. 

దీపావళి రోజున ఆ మంత్రాన్ని జపిస్తే..?

దీపావళి శుభాకాంక్షలు ఎలా చెప్పాలంటే.. ఉదయాన్నే లేచి స్నానమాచరించి బంధువులకు, సన్నిహితులకు పిండివంటలతో పాటు శ్రీ లక్ష్మీ స్తోత్ర పుస్తకాలు ఇవ్వాలి. దీపావళి నాడు ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం వనగూరుతుందని విశ్వాసం. బాకీల నుండి విముక్తి పొందాలంటే.. ఈ పండుగ నాడు శ్రీలక్ష్మీదేవికి నిత్యపూజలు లేదా శ్రీ ధనలక్ష్మీ నిత్య పూజలు చేయవలసి వుంటుంది.
 
ఈ రోజు లక్ష్మీదేవి కుబేర వ్రతాన్ని ఆచరించి సుమంగళి స్త్రీలకు ఇంటికి విచ్చేసే వారికి పసుపు, కుంకుమలతో పాటు వస్త్రాదులను దానం చేయాలి. ఇలా చేయడం వలన సకల సంపదలు, సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఇక.. దీపావళి రోజు ఆలయాల్లో జరిపే శ్రీ మహాలక్ష్మీ కోటి కుంకుమార్చన, శ్రీ మహాలక్ష్మీకి 108 కలువ పువ్వులతో పూజలు చేస్తే పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.
వెండితో తయారుచేసిన ద్వీపాలలో ఆవునెయ్యి వేసి తామరవత్తులతో ద్వీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 

ఇదే రోజున సాయంత్రం ఆరుగంటల సమయంలో నుదుట కుంకుమను దిద్దుకుని, పూజగదిలో రెండు పంచముఖ దీపపు సెమ్మెలలో తామర వత్తులను అమర్చి వెలిగించాలి. తరువాత ఇంటి నిండా ద్వీపాలు వెలిగించి ఓం మహాలక్ష్మీ దేవ్వ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని స్మరించడం వలన ఆ గృహం ఎల్లప్పుడూ ఆనందాలలో వెల్లువిరుస్తుందని చెప్తున్నారు.
Keywords:
History and Significance Diwali,Deepavali Mistakes,Deepavali pooja vidhanam in Telugu 2019,Deepavali Pooja Vidhanam At Home,deepavali pooja 2019,Deepavali Pooja Niyamalu
Deepavali lakshmi pooja vidhanam In Telugu,Diwali Pooja Vidhi In Telugu,Deepalu ekkada Petali,Pooja Niyamalu In Telugu,Deepavali In Telugu,Deepavali Dhana LakshmiPooja,Deepavali Lakshmi Pooja Vidhanam in Telugu,Karthika Masam Pooja Vidhanam,Sumangali Pooja,Sowbhagya Lakshmi Pooja Vidhanam,sumangali vratham in Telugu,Dharma Sandehalu,How To Do Evening Puja on Diwali,Deepavali pooja procedure in telugu,Deepavali Pooja Niyamalu,Deepavali lakshmi pooja vidhanam In Telugu,Diwali Pooja Vidhi In Telugu,Deepalu ekkada Petali,Pooja Niyamalu In Telugu,Deepavali In Telugu,Deepavali Dhana Lakshmi Pooja,Deepavali Lakshmi Pooja Vidhanam in Telugu,Karthika Masam Pooja Vidhanam,దీపావళి పూజా విధానం,Deepavali Pooja Vidhi In Telugu,diwali history in telugu,diwali festival in telugu,diwali festival songs in telugu,deepavali,deepavali festival songs in telugu, diwali narakasura vadha significance festivals , diwali significance in telugu,What Is Diwali,Festival of Lights Diwali

Comments