Sri Garikipati Narasimha Rao Comments on Sri Chaganti Koteswara Rao | Sri Garikipati vs Sri Chaganti

చాగంటి కోటేశ్వరరావు
జననం: చాగంటి కోటేశ్వరరావు
నివాసం: కాకినాడ
ఇతర పేర్లు: ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర
వృత్తి: ప్రభుత్వ ఉద్యోగి
యజమాని: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
మతం: సనాతన ధర్మం
జీవిత భాగస్వామి: సుబ్రహ్మణ్యేశ్వరి
పిల్లలు: షణ్ముఖాంజనేయ సుందర శివ చరణ్ శర్మ ,
నాగ శ్రీ వల్లి
తల్లిదండ్రులు:
చాగంటి సుందర శివరావు (తండ్రి)
సుశీలమ్మ (తల్లి)

చాగంటి కోటేశ్వరరావు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; ఆయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, మరియు 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన
శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు.

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

ఆయన ధారణాశక్తి గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.

ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.

చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.
ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!!

ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.

చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణములోని భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతము లోని అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృష్ణావతారం యొక్క పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రథమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరికి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. 
ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకథారాస్తోత్రం, గోమాత విశిష్టత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్థం, శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు.

చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. చాగంటివారు ఆఫీసుకు సాధారణంగా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు. కానీ ప్రవచనాలకు ఆయన పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు.

శారదా జ్ఞాన పుత్ర:
జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, ప్రవచన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేసారు. 2015 విజ్ఞాన్ విశ్వ విద్యాలయము వారు గౌరవ డాక్టరేట్ బహుకరించారు.

వాచస్పతి పురస్కారం:
మన దేశంలోని ప్రతిష్ఠాత్మక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014) నాడు గౌరవ పురస్కారమైన వాచస్పతి (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రధానం చేశారు.

పిన్నమనేని పురస్కారం:
డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ సీతాదేవి ఫౌండేషన్‌ 26వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయనకు డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కారం అందజేసారు.

గరికిపాటి నరసింహారావు
గరికిపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో: 
ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశాడు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశాడు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నాడు.
జననం ;1958 సెప్టెంబరు 14
పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం
వృత్తి : ఉపాధ్యాయుడు
ప్రసిద్ధి : ధారణాబ్రహ్మరాక్షసుడు
మతం : హిందూ
భార్య : శారద
పిల్లలు : శ్రీశ్రీ, గురజాడ
తండ్రి : గరికిపాటి వెంకట సూర్యనారాయణ
తల్లి  : వెంకట రమణమ్మ

జీవిత విశేషాలు:
నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958, సెప్టెంబర్ 14వ తేదీకి సరియైన విలంబి నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమినాడు జన్మించాడు. ఇతడు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశాడు. ఇతని భార్య పేరు శారద. ఇతనికి ఇద్దరు కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని నామకరణం చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.

అవధానాలు;
ఇతడు అవధానిగా సుప్రసిద్ధుడు. సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించాడు. మొదటి అవధానం 1992 సంవత్సరం విజయదశమి రోజు చేశాడు. 2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.

పురస్కారాలు:
1.ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)
2.కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)
3.సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)
4.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)
5.2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం
6.2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి
7.2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)
8.2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి
9.భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం
10.2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం
11.2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం
12.సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)
13.తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012
14.2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.

బిరుదులు:
1.శతావధాన గీష్పతి
2.అవధాన శారద
3.ధారణ బ్రహ్మ రాక్షస
4.అమెరికా అవధానభారతి

Comments