Navaratri Pooja Vidhanam at Home In Telugu | Vijaya Dasami (Dasara) Pooja Vidanam | First Day Pooja Vidhanam

నవరాత్రులు – పూజావిధి 

మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత, (చైత్రపాడ్యమి మొదలు నవమి వరకు) శరన్నవ రాత్రులలో (ఆశ్వయుజ పాడ్యమి మొదలు నవమి వరకు) ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. 
చేయగల్గిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి, పూజావిధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం (పగలు పూజానంతరం భుజించడం)గానీ, నక్షం (రాత్రి భుజించడం) గానీ చేయవచ్చును. ‘ఉపవాసేవ నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః

ఈ వీడియో చూడడానికి ఈ లింకు పైన క్లిక్ చేయండి :

నవరాత్రులు – పూజావిధి 
పూజారి లేకుండానే స్వయంగా మీరే నవరాత్రుల అమ్మ వారి పూజ చేసుకోండి . 
నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలో...తెలుసా ?
ఈ వీడియో చూడడానికి ఈ లింకు పైన క్లిక్ చేయండి :

మొదటి రోజు: 

రెండో రోజు :

మూడో రోజు:

నాలుగో రోజు :

అయిదో రోజు: 

ఆరో రోజు: 

ఏడో రోజు:

ఎనిమిదో రోజు: 

తొమ్మిదో రోజు: 

పూజాస్థలం

దేవీపూజకి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కాకుండా పూజాగృహంలోగానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా వుండేట్లు సమప్రదేశం చూసుకుని, అక్కడ కడిగి పసుపునీళ్ళతో శుద్ధిచేసి ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం పదహారు హస్తాల మానము, ఏడు హస్తాల వెడల్పు, తొమ్మిది హస్తాల పొడుగు వుండటం మంచిదని పురాణోక్తి. ఆ ప్రదేశం మధ్యలో ఒక హస్తం వెడల్పు, నాలుగు హస్తాలు పొడుగు వుండేలా వేదికనమర్చి పూలమాలలతో, మామిడాకులతో తోరణాలతో అలంకరించాలి.

దేవి విగ్రహ ప్రతిష్ట


అమావాస్య రాత్రి ఉపవాసం వుండి మరునాడు (పాడ్యమి తిథి) వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్టించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి, మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్టించి పూజించడం పరిపాటి. నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్టించవచ్చు. సింహవాహనారూడురాలైన దేవీమాత విగ్రహం నిండుగా, కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది.
ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ‘ఐం హ్రీం క్లీం చాముందాయై విచ్చే’ అనేది రాగి రేకుమీద లిఖించబడినది వుంచి యంత్రాన్ని పూజించవచ్చును.
దసరా నవరాత్రుల్లో... దుర్గామాతని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో కొలుస్తాం. ఈ సందర్భంగా నవరాత్రులు నడిచే తొమ్మిదిరోజులకూ భక్తులు ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తుల్ని ధరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుందాం... 

మొదటి రోజు: నవరాత్రులు ప్రారంభమైన మొదటిరోజు శైలపుత్రిగా మనం దుర్గమ్మను ఆరాధిస్తాం. ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది.

రెండో రోజు : బ్రహ్మచారిణిగా శక్తిని కొలుస్తాం. కనుక ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలి. 

మూడో రోజు: అమ్మవారి అవతారం ఈ రోజు చంద్రఘంట. బూడిద రంగు దుస్తులు ధరించాలి. 

నాలుగో రోజు : దుర్గమ్మను కూష్మాండ అవతారంగా కొలుస్తాం. నారింజ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది. 

అయిదో రోజు: స్కంద మాతగా పూజలందుకుంటుంది తల్లి. తెలుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు ధరించి పూజచేయాలి.

ఆరో రోజు: కాత్యాయనీ మాతగా అమ్మవారు కొలువుదీరే ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. 

ఏడో రోజు: కాళరాత్రి అవతారంతో అమ్మవారు ఆపదల నుంచి కాపాడుతుంది. ఈ రోజున నీలం రంగు దుస్తులు వేసుకోవాలి. 

ఎనిమిదో రోజు: మహాగౌరీ మాతగా దుర్గమ్మని గులాబీ రంగు వస్త్రాల్లో కొలవాలి. 

తొమ్మిదో రోజు: చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందు కుంటారు. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం. 

తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవి  అలంకారిన్ని,  అవతారాన్ని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను. ఆ పేజీకి వెళ్లి చూడండి.

నవరాత్రులు – పూజావిధి 
పూజారి లేకుండానే స్వయంగా మీరే నవరాత్రుల అమ్మ వారి పూజ చేసుకోండి . 
నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలో...తెలుసా ?

మొదటి రోజు:  శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి 
రెండొవ రోజు:  శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి
నాల్గొవ రోజు:    శ్రీ అన్నపూర్ణా దేవి 
ఐదొవ రోజు:     శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి 
ఆరొవ రోజు:     శ్రీ మహాలక్ష్మీ దేవి 
ఏడొవ రోజు:      శ్రీ సరస్వతీ దేవి 
ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) 
తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి  ( మహర్నవమి )
పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )

తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును
దసరా నైవేద్యములు :

నైవేద్యములు ఇవే పెట్టాలి అని నియమము ఏమీ లేదు కానీ ఒక పధ్దతిగా ఈ నైవేద్యములు పెట్టచ్చు.

1.పాడ్యమి రోజు  శ్రీ దుర్గాదేవి  -  చలిమిడి, వడపప్పు, పాయసం
2. విదియ రోజు  శ్రీ బాలా త్రిపుర సుందరి - తీయటి బూంది, శనగలు
3. తదియ రోజు  శ్రీ గాయత్రీ దేవి - రవ్వకేసరి, పులిహోర
4. చవితి రోజు  శ్రీ అన్నపూర్ణాదేవి- పొంగలి
5. పంచమి రోజు  శ్రీ లలితా దేవి- పులిహోర పెసరబూరెలు
6. షష్టి రోజున  శ్రీ మహాలక్ష్మి దేవి - బెల్లం లేదా పంచధార తో చేసిన క్షీరాన్నం
7. సప్తమి రోజు  శ్రీ సరస్వతి దేవి  (మూలా నక్షత్రం రోజున) - అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లం
8. అష్ఠమి రోజు  శ్రీ దుర్గాదేవి  (దుర్గాష్ఠమి) - గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు
9. నవమి రోజు  శ్రీ మహిషాసురమర్ధిని  - (మహర్నవమి) చక్రపొంగలి
10. దశమి రోజు  శ్రీ రాజరాజేశ్వరీదేవి -  (విజయ దశమి-దసరా) పులిహోర, గారెలు

Keywords:
Navaratri Pooja Vidhanam, Devi Navaratri Pooja Vidhanam in telugu,Navaratri Pooja Vidhanam In Telugu, Navaratri Pooj,The Significance of Devi Navaratri,dasara festivals in telugu,dasara,దసరా,Vijayadasami,dasara festival story,dasaraImages,dasara Quotes,Dasara navaratri in telugu,Dasara Navaratri Astotharams ,dasara significance in telugu,dasara significance in telugu ,9 Different Avatars of Goddess Durga,దసరా వైభవం,Devi Navaratri Pooja Vidhi,Pooja Vidhanam,విజయదశమి,dasara festivals in telugu,vijayadashami pooja vidhi in telugu,Dasara Puja, Durga Puja Vidhanamu,Vivaramulu in Telugu,Navaratri Pooja Vidhanam , Vijaya Dasami (Dasara) Puja,పూజావిధి (Navaratrulu  Poojavidhi),durga devi pooja vidhanam telugu pdf,dasara puja vidhi in telugu,durga devi nitya pooja vidhanam in telugu,అమ్మవారి నవరాత్ర పూజా విధి: పూజకు ఉపయోగించాల్సిన సామాగ్రి,Dasara Puja, Durga Puja Vidhanamu, Vivaramulu,Telugu,శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం ,devi navaratri pooja vidhanam in telugu,durga devi nitya pooja vidhanam in telugu pdf,Navratri Puja Procedure.durga devi pooja vidhanam in telugu pdf,navaratri pooja vidhanam telugu pdf,devi navratri pooja vidhanam,Dasara  pooja vidhanam,devi navratri pooja vidhanam in telugu, 9 days devi navratri pooja vidhanam, 9 days devi navratri pooja vidhanam in telugu

Comments