Atla Taddi Vratha Vidhanam in Telugu | Atla Taddi Pooja Vidhanam In Telugu | Atla Thaddi


అట్లతద్ది నోము ఎలా చేసుకోవాలి? 
అట్లతద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఆడవారి ఆనందాల వేడుక అట్లతద్ది. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. “అట్లతద్ది ఆరట్లు ముద్దపప్పు మూడట్లు” అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి.


అట్లతద్ది రోజున తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకున్నాక ముందుగా చద్ది అన్నం తినాలి. ముందురోజు రాత్రే సిద్ధంచేసి ఉంచిన ఉల్లిపాయ పులుసు, గోంగూర పచ్చడి, పెరుగు వేసుకుని అన్నం తినాలి. చెట్లకు ఊయలలు కట్టి ‘‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్’’ అంటూ సరదాగా ఊగటం, మనకు ఇష్టమైన ఆటలు ఆడడం చేయాలి. అంటే తిన్న అన్నం అరిగిపోయేలా ఆటలు ఆడాలన్నమాట. అంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆటలాడుకునే రోజు అట్లతద్ది. తరువాత ఇంటికి వచ్చి సూర్యోదయం సమయానికి తలస్నానం చేసి పూజాగదిని సిద్ధం చేసుకోవాలి. తరువాత దీపాలు వెలిగించి గౌరీపార్వతులను పూజించాలి. సాయంత్రం వరకూ ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని మనం సిద్ధంగా ఉంచిన అట్లపిండిలో కొద్దిగా బెల్లం కలిపి మందంగా ఉండేలా అట్లను సిద్ధం చేయాలి.
పదకొండు(11) అట్లు అమ్మవారికి నైవేద్యానికి, మరో పదకొండు (11)ముత్తయిదువకు వాయినానికి సిద్ధం చేసుకోవాలి. చంద్రోదయం అయిన తరువాత గౌరీదేవిని పూజించాలి. పూజాద్రవ్యాల్లో భాగంగా వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, మూడు తోరాలు సిద్ధం చేయాలి. ఈ తోరాలను పదకొండు ముడులు వేసి తయారుచేయాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, మరొకటి నోము చేసుకునేవారికి వేరొకటి ముత్తయిదువకు.

తరువాత పసుపు ముద్దలతో గణపతిని, గౌరీదేవిని చేసి షోడశోపచారాలతో పూజించాలి. గణపతి పూజ అనంతరం వివిధ రకాల పుష్పాలు, పసుపు, కుంకుమలతో ఆ తద్దిగౌరీ దేవిని అర్చించాలి. 
తరువాత ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పించాలి. అట్లపైన బెల్లంముక్క, నెయ్యి వేసి, దీనితోపాటు ముద్దపప్పు, వరిపిండితో తయారుచేసిన పాలలో ఉండ్రాళ్ళు కూడా నివేదించాలి.

అట్లతద్ది పూజలో భాగంగా అమ్మవారి ఎదురుగా ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెంలో బియ్యం పోసి మన చేతులను ఎడమచేయిపై కుడిచేతిని పెట్టి రెండు చేతులతో బియ్యం తీసుకుని అత్తపోరు, మామపోరు, ఆడపడుచు పోరు, మగనిపోరు, ఇరుగుపొరుగు పోరు తనకు లేకుండా చూడాలంటూ ఆ గౌరీదేవిని ప్రార్థిస్తూ చేతులను మామూలు స్థితికి తెచ్చి బియ్యాన్ని ఆ పళ్ళెంలో తీస్తూ వదులుతూ ఉండాలి.

తరువాత మనం ముందుగా తయారు చేసి ఉంచిన తోరాలను అమ్మవారి వద్ద ఒక తమలపాకులో ఉంచి పూజించాలి. పూజ పూర్తయిన తరువాత ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పించి మరొకటి తాము ధరించాలి. తోరబంధనం తరువాత అట్లతద్దె నోము కథను చదివి అక్షతలు తలపై వేసుకోవాలి. తరువాత అమ్మవారికి ఉద్వాసన చెప్పి అక్షతలు, నీళ్ళు ఒక పళ్ళెంలో వదలాలి. ఉద్వాసన అనంతరం మరునాడు గణపతితో పాటు గౌరీదేవిని దగ్గరలో ఉన్న నూతిలో కానీ, కాలువలో కానీ కలుపవచ్చు, లేదా నీటిలో కలిపి చెట్టుకు పోయవచ్చు, లేదా గుమ్మానికి అలంకరించవచ్చు లేదా ముఖానికి రాసుకోవడానికి వినియోగించవచ్చు.

వాయిన విధానం

అట్లతద్ది రోజు సాయంత్రం గౌరీ పూజ పూర్తయిన తరువాత ముత్తయిదువను అమ్మవారి ఎదురుగా ఒక ఆసనంపై కూర్చోబెట్టి ఆమెకు కాళ్ళకు పసుపు రాసి, కుంకుమ, గంధం అలంకరించాలి. తరువాత పదకొండు అట్లు, ముద్దపప్పు, పాలలో ఉండ్రాళ్ళ తో పాటు మంగళద్రవ్యాలు, రవికలగుడ్డతో పాటు వాయినం సమర్పించాలి. వాయినం తీసుకోవడానికి వచ్చే ముత్తయిదువలు కూడా ఉపవాసం ఉండాలన్న నియమం లేదు కానీ ఉండగలిగే వారు ఉంటే మంచిదే. వాయినం ఇచ్చేవారు ఒకరితో ఒకరు
ఇస్తినమ్మవాయినం
పుచ్చుకొంటినమ్మ వాయినం
నాచేతి వాయినం ఎవరు అందుకున్నారు
నేనమ్మా తద్ది గౌరీదేవి
కోరితిని వరం
ఇస్తినమ్మా వరం

అని పరస్పరం అనుకుంటూ వాయినం ఇచ్చి పుచ్చుకోవాలి. తరువాత ఆమె పాదాలకు నమస్కారం చేసి అక్షతలు వేయించుకోవాలి. ఇలా సాంప్రదాయం ప్రకారం ఈ నోమును పదకొండు సంవత్సరాల పాటు ఆచరించి ఆఖరు ఏడాది ఉద్యాపన చేసుకోవాలి.

అట్లతద్ది ఉద్యాపన విధానం

ఉద్యాపన కోసం అట్లతద్ది ముందురోజు పదకొండు మంది ముత్తయిదువలను వాయినం తీసుకోవడానికి రమ్మని పిలవాలి. అట్లతద్దెరోజు ఉపవాసం ఉండి 11 మంది ముత్తయిదువలను ఆసనాలపై కూర్చోబెట్టి వారికి పదకొండేసి అట్లు, బెల్లం ముక్క, ముద్దపప్పు, పాలలో ఉండ్రాళ్ళు, రవికెలగుడ్డ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, నల్లపూసలు, నక్కజోళ్ళు, వాయినంతోపాటు ముత్తయిదువలకు అందరికీ అందించి వారిచే అక్షతలు వేయించుకోవాలి. ఈ అట్లను పలుచగా కాకుండా మందంగా వేయాలి. ఈ ఉద్యాపనతో అట్లతద్దె నోము పూర్తయినట్లు అవుతుంది.

పూజ అనంతరం చంద్రుని దర్శనం చేసుకుని మనం అమ్మవారికి నివేదించిన అట్లనే భుజించాలి. ఈ అట్లను నోము చేసుకున్న వారు మాత్రమే తినాలి.

Keyworlds:
చంద్రోదయ ఉమావ్రతం ,అట్లతద్ది ,Importance of Atla Taddi Celebrations,అట్లా తద్ది పూజ విధానం, అట్లా వాయనం, Atla Pooja Vidhanam Telugu, Importance of Gowri pooja,Atla Taddi pooja Vidhi In Telugu,atla taddi,అట్లతద్ది నోము (Atla Taddi Nomu),Atla Taddi 2018 photos And Images,atla taddi pooja vidhanam,Atla Thadiya Vratha Vidhanam ,అట్ల తద్ది లేదా అట్ల తదియ పూజా విధానము మరియు అట్ల తద్ది వ్రత కధ,atla taddi pooja procedure,atla taddi pooja procedure in telugu,Atla Tadhiya,Atla Taddi Pooja Vidhanam And Pooja procedure,Atla Tadde,Atla Tadde Quotes In Telugu,Significane Of Atla Taddi,atla taddi 2018,atla taddi 2018 date,atla taddi songs in telugu,ATLA TADDI FESTIVAL POOJA VIDHI,అట్ల తద్ది యొక్క విశిష్టత ఏమిటో తెలుసా ...? , Atla Taddi , Atla Taddi Vratha Katha , Atla Thadiya,అట్లా తద్ది పూజ విధానం ,అట్లా వాయనం , Atla Pooja Vidhanam, TeluguNew, Importance of Gowri pooja,atla taddi,atla tadde,atla taddi Images,atla tadde images

Comments