The shocking history of Kanipakam Vinayaka Temple | kanipakam vinayaka temple history in telugu

కాణిపాకం-వినాయకుడు
కాణిపాకం దేవస్థానం చిత్తూరు జిల్లా లో కాణిపాకం అనే గ్రామము లో ఉంది. ఈ పురాతన వినాయక ఆలయాన్ని కాణిపాకం వినాయక ఆలయం అంటారు. ఈ ఆలయం లో ప్రధాన దేవుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఒక స్వయంభు విగ్రహంగా అవతరించబడింది అని భక్తుల నమ్మకం.సత్య ప్రమాణాలకు నెలవుగా..అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.
క్షేత్రచరిత్ర/ స్థలపురాణం: 

సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. 
ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.

ఈ దేవాలయం లో ఒక ఆసక్తికరమైన నిజం ఉంది ఎందుకంటే వినాయక స్వామి వారి పరిమాణం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ విగ్రహం కలియుగం ముగింపు వరకు పరిమాణం పెరుగుతు ఉంటుంది అని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. ఇప్పుడు కూడా శ్రీ వినాయక స్వామి విగ్రహం చుట్టూ బావిని చూడవచ్చు. ఎల్లప్పుడూ విగ్రహం చుట్టూ నీళ్లు ప్రవహించడం కనపడుతుంది. ఈ పవిత్ర జలం భక్తులకు తీర్థంగా ఇవ్వబడుతుంది. ఈ దేవస్థానం, 800 పాత సంవత్సరాలు క్రిందట 11 వ శతాబ్దంలో చొళ రాజుచే కట్టబడింది. పాత రోజుల్లో కాణిపాకం గ్రామం పేరు "విహారపురి” అని పిలిచేవారు.

"కానీ" అనగా ఒకటిలో నాల్గవ వంతు భూమి అని అర్తం."పాకం" అనగా నీరు పారే భూమి(నీటిపారుదల). ఈ సూచన "కాణిపారకం" గా గుర్తింపు పొందింది. చివరికి "కాణిపాకం" తమిళ అతీతంగా (ఉత్పన్నమైన)పదంగా గుర్తించబడింది.

విగ్రహంలో మరో వింత లక్షణం ఏమిటంటే, బావి నుండి పవిత్ర జలం పొంగి విగ్రహం ఇప్పటికీ పరిమాణం పెరుగుతోంది. ఈ విగ్రహం కలియుగం ముగింపు వరకు పరిమాణం పెరుగుతుందని ఆపై శ్రీ వినాయక స్వామి వ్యక్తి రూపం లో దర్శనం ఇస్తారని భక్తుల నమ్మకం. 

ఒక పాత పురాణంలో బహుదా నది గురించి చెప్పబడి ఉంది కాణిపాకం లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభుగా వెలసిన తరువాత, ఇద్దరు సోదరులు “సంకుడు” మరియు “లిఖితుడు” స్వయంభూగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కాలినడక ద్వారా దర్శించుకోవలని కోరుకున్నారు. సుదీర్ఘమైన ప్రయాణం తరువాత “లిఖితుడు” చాలా అలిసిపోయి ఆకలిగా ఉండడం వలన మామిడి చెట్టు నుండి మామిడి పండు తీసుకోవాలని కోరుకున్నాడు మరియు అతనికి సహాయపడటానికి తన సోదరుడు కోరాడు. అప్పుడు అన్నయ్య అది రాజుకు చెందిన చెట్టు ఎవరు కోయరాదని హెచ్చరించాడు. కానీ చాలా అలిసిపోయి ఆకలితో మరియు ఎక్కువ ఆశ ఉండటం వలన మామిడి పండుని తీసుకోని తిన్నాడు. అపుడు అన్నయ్య అయిన “సంకుడు” రాజు దగ్గరికి తీసుకోని వెళ్లి సోదరుడు యొక్క దొంగతనం గురించి చెప్పాడు మరియు శిక్ష విధించవలసినదిగా అభ్యర్తించాడు. దురదృష్టవశాత్తు, రాజు కోపముతో అనుమతి లేకుండా పండు అపహరించినందుకు తమ్ముడి రెండు చేతులు నరికమని ఆజ్ఞపించారు మరియు శిక్ష అమలు చేసారు.
దురదృష్టకర సంఘటన వలన తన సోదరుడికి జరిగిన నష్టం గురించి విచారిస్తూ, స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ సమీపంలో ఉన్న నదిలో స్వామి వారిని ప్రార్థిస్తూ ఇద్దరు సోదరులు మునిగినారు. ఆశ్చర్యకరంగా “లిఖితుడు” కోల్పోయిన తన రెండు చేతులు తిరిగి పొందెను. అపుడు ఇద్దరు సోదరులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని, వారిని ఆశీర్వదించమని కోరుకున్నారు. ఆ తరువాత పొరుగు గ్రామాల్లో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహిమ గురించి, మరియు లిఖితుడుకు ఆ నదిలో మునిగినందువలన కోల్పోయిన చేతులు (బహుదా) తిరిగిపొందటం గురించి ప్రచారించసాగెను, నాటినుండి ఆ నదిని "బహుదా నది " అని పిలుస్తారు.
వివాదాలను పరిష్కరించడం: 
ఇక్కడ మరొక ఆసక్తికరమైన సంగతి ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ప్రత్యేక సంఘటన గురించి "సత్య ప్రమాణం" చేస్తే, అది 'సత్యం' గా భావిస్తారు అని ఒక నమ్మకం. చాలా వివాదాలను ఈ పద్ధతి ద్వారా పరిష్కరిస్తారు. ఈ తీర్పుని కోర్ట్ తీర్పుకంటే ఎక్కువగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడితే, శ్రీ వినాయక స్వామి అతనిని శిక్షిస్తారని ప్రజల నమ్మకం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రూ. 516 /- మొత్తాన్ని ఆలయ అధికారులు సేకరిస్తారు. ఈ వేడుక ప్రతి రోజు జరుగుతుంది. అందువలన ప్రజలకు ఇక్కడ న్యాయం దొరుకుతుంది.

ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!

నిత్యం పెరిగే స్వామి: 
వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.

కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.

బ్రహ్మహత్యా పాతక నివారణార్థం:
స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు: 
మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.
సర్పదోష పరిహారార్థం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం:  స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550
సేవాఫలితం: స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.
గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500
సేవాఫలితం: ‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.
గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300
సేవాఫలితం:
గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.
సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58
సేవాఫలితం: ‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.
మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300
సేవాఫలితం: 
వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.
సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151
సేవాఫలితం: 
గణేశ పురాణంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.
పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000

సేవాఫలితం: వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.

అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116
సేవాఫలితం: చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.

అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116
సేవాఫలితం: 
పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.
వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51
సేవాఫలితం: వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.

వసతి - రవాణా సౌకర్యాలు:  
కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి నుంచి చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

keywords:
The shocking history of Kanipakam Ganesha Temple ,Mystery Behind Kanipakam Vinayaka Temple, kanipakam vinayaka temple history in telugu ,Kanipakam Vinayaka Temple History And Importance,Kanipakam - History of Kanipakam Vinayaka In Telugu ,Kanipakam Sri Varasiddhi Vinayaka Temple Entry Fee. Entry Fee: Aksharabhyasam: Rs.116/- Namakaranam: Rs.116/- Balasara: Rs.116/- Anna Prasana,kanipakam temple timings. Darshan Timings. Seva and Pooja TImings. Kanipaka Vinayaka Temple Opening and Closing Hours. Daily Pooja details and sevas,TOURIST PLACES TO VISIT & TOUR PACKAGES,kanipakam temple timings,kanipakam temple accommodation,kanipakam vinayaka original images,srikalahasti temple history in telugu,kanipakam videos,kanipakam matter in english,kanipakam meaning,Page navigation,Darshan & Sevas. - Kanipakam Vinayaka Vari Devasthanam

Comments