Secrets About the Srikalahasti Temple Revealed In Telugu | Srikalahasti Temple History In Telugu

క్షేత్ర చరిత్ర/ స్థలపురాణం: 
ఇక్కడ కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకుంటోంది. బ్రహ్మదేవుని చేత పూజలందుకుంటున్న ఈ శైవక్షేత్రం ఏటికేడు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ (సాలెపురుగు), కాళం(పాము), హస్తి(ఏనుగు)ల పేరిట ఏర్పడ్డ ఈ క్షేత్రం... ఆ మూడు మూగజీవుల దైవభక్తికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ మూడు జీవులు ఇక్కడి శివయ్యను ఆరాధించి.. చివరకు ఆయనలోనే ఐక్యమయ్యాయి. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. కుజదోష నివారణ పూజలు.. నాగదోష నివారణ పూజలు.. నవగ్రహ దోష నివారణ పూజలు ఈ క్షేత్రంలో ప్రత్యే ప్రభావం కనబరుస్తాయన్నది భక్తుల విశ్వాసం. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది!
ఆలయ దర్శన వేళలు: 
ఉదయం 4.30 గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామిని మేల్కొలుపుతారు. అప్పటినుంచి రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ ముగిసే వరకూ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఎలాంటి విరామం లేకుండా సర్వదర్శనం ఉంటుంది! రూ. 50 ప్రత్యేక దర్శన టికెట్టుకూ ఇదే వర్తిస్తుంది! గ్రహణ కాలాల్లోనూ స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది!ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో వెలసిన శ్రీ కాళహస్తీశ్వరాలయం.. భక్తుల పాలిట భూకైలాసంగా.. వాయులింగ స్థానంగా ప్రఖ్యాతి గాంచింది. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైంది.  ఈ క్షేత్రం రాహు,కేతు, సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతోంది.

శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం భారతదేశంలో అత్యంత పురాతన మరియు చారిత్రక శైవ ఆలయాలలో ఒకటి. శ్రీకాళహస్తీశ్వర స్వామి, వాయు శివుని అవతారముగా పూజలు అందుకుంటున్నాడు.
పార్వతి దేవి ఇక్కడ జ్ఞానప్రసూనాంభికగా పూజలు అందుకుంటుంది. శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నందలి చిత్తూరు జిల్లా లో ఉంది. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం పశ్చిమ ముఖంగా, కొండ పక్కన మరియు స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. కొన్ని చోట్ల ఆలయానికి గోడలాగా కొండ ఉంటుంది, అందువల్ల దేవాలయ ఆకృతి ప్రణాళికను అనుసరించలేదు. ఆలయానికి ఉత్తరాన దుర్గాంభికా కొండ, దక్షిణాన కన్నప్పార్ కొండ మరియు తూర్పున కుమారస్వామి కొండ ఉంది.
రాహు-కేతు పూజ శ్రీ కాళహస్తిలో చాలా ప్రసిద్ధి చెందింది. రాహు కేతు పూజ, రాహు కాల సమయంలో చేయబడును. భక్తులు రాహు కాల సమయంలో ఆలయంలో ఉండేలా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. శ్రీ కాళహస్తి ఆలయం ఎల్లప్పుడూ రాహు-కేతు పూజలకు వచ్చిన భక్తులతో నిండిపోయి ఉంటుంది.
తమిళ పురాణాల ప్రకారం సుమారు 2000 సంవత్సరాల క్రితం నుండి శ్రీ కాళహస్తి ని దక్షిణ కైలాసంగా మరియు శ్రీ కాళహస్తి ఏ నది ఒడ్డున అయితే కలదో ఆ నదిని దక్షిణ గంగగా పేరుకొన్నారు. కైలాసాన్ని అత్యంత ఆధ్యాత్మిక ప్రదేశంగా చెప్పుకుంటారు, అదే మహా శివుని నివాసం. శాస్త్రాల ప్రకారం శివుని తలపై నుండి ప్రవహిస్తుండడంవలన గంగని అన్ని ప్రదేశాల్లో, అన్ని సమయాల్లో మరియు అన్ని స్థితుల్లో పవిత్రమైనదిగా మరియు ఆధ్యాత్మికంగా భావిస్తారు. ఆధ్యాత్మికంలో ఉండే బుద్ది చాలా గొప్ప శక్తి మరియు మంచి జీవితాన్ని ఇస్తుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా పేర్కొనడంవలన దేవాలయం పక్కనే ఉండే చిన్నపాటి కొండని హిమాలయగా ఆధ్యాత్మికరిస్తున్నారు.
మానవుడు తన సంతోషం కోసం నాలుగు రకాలుగా పోరాడతాడని వేదాల్లో పేర్కొన్నారు, అవి: ఆనందం(కామ), రక్షణ లేదా సంపద (అర్థ), బాధ్యత(ధర్మ), మరియు స్వేచ్ఛ(మోక్ష). వాటిని విశ్వంలో ఎన్నో రకాలుగా పొందుతారు, వీటి గురించి ప్రపంచానికి చాటడానికి శ్రీ కాళహస్తి దేవాలయ సాహిత్యంతో ఆధ్యాత్మికంగా చెప్పబడింది. అవి నాలుగు దిక్కులను సూచించే విధంగా నలుగురు దేవతామూర్తులను ప్రతిష్టించారు. శివుణ్ణి దక్షిణామూర్తి అవతారంలో విముక్తి కోరికకు ప్రతీకగా, అంటే సాధారణంగా మనలో ఉన్న మనల్ని గుర్తిస్తే వచ్చే అనుభూతి సంపద(దక్షిణ)గా పేర్కొంటారు. ఇక్కడ దేవతామూర్తి అయిన జ్ఞానప్రసూనాంబ సంపదకు (జ్ఞానాన్ని ప్రసాదించే లేదా జ్ఞాన దేవతగా) ప్రతీకగా నిలుస్తుంది.
శ్రీ కాళహస్తీశ్వరుడు (శ్రీ కాళహస్తి) దక్షిణాభి ముఖంగా ఉండడం, ఉదారభావాన్ని సూచిస్తుంది. భూమధ్యరేఖ దగ్గర, చివరగా కనిపించకుండాపోయే ముందు సూర్యుడు ఎలా అయితే అస్తమయం అవుతారో అలానే మనం మన ఆత్మని శోధించే క్రమంలో అహాన్ని విడనాడాలని తెలుపుతుంది. తమిళ చోళులు మరియు విజయనగర రాజులు ఈ ఆలయానికి ఎన్నో నిర్మాణాలు చేశారు. ఈ ఆలయాన్ని, అది శంకరాచార్యులు సందర్శించి పూజలు చేసినట్టుగా చెప్పుకుంటారు. శ్రీ కాళహస్తి శతకం అనే తెలుగు పద్యంలో, ఈ ఆలయ వివిష్టతను వివరించారు, మరియు కర్నాటిక సంగీత విద్వాంసుడు అయిన ముత్తుస్వామి దీక్షితార్ తన కృతి 'శ్రీ కాళహస్తీశ'లో ఈ ఆలయ గొప్పదనాన్ని పాడారు.
1516వ సంవత్సరంలో శ్రీ కృష్ణదేవరాయలు దేవాలయ ప్రవేశ మార్గాన్ని, ప్రవేశ మార్గానికి ఒక చిన్న కోటను(బురుజు) నిర్మించారు. దేవాలయ ప్రాకారానికి బయట కొద్దిగా భూమిలోపలకి (భూగర్భంలో) గణపతి ప్రతిమ ఉన్నది మరియు దేవాలయంలో శివపార్వతులు కొలువైయున్నారు. ప్రధాన తలుపు దగ్గరి ప్రాచీనమైన గోపురం 36.5 మీటర్లు (120 అడుగులు) ఎత్తు కలదు మరియు దేవాలయం మొత్తం శిల్పాలు చెక్కారు.
మానవాళి అవతరించే ముందుగా, వాయు కర్పూర లింగానికి వెయ్యి సంవత్సరాలకు పైగా తపస్సు చేసెను. అతని తపస్సుకి మెచ్చిన మహా శివుడు ప్రత్యక్షమై, " ఓ వాయు దేవా! విశ్వమంత ఉండే నీవు, ఎటు కదలకుండా ఇక్కడే ఉండి నాకోసం తపస్సు చేసావు కావున నేను నీ తపస్సుకి మెచ్చి మూడు వరాలు ప్రసాదిస్తున్న కోరుకొనుము" అని అన్నారు. అప్పుడు వాయు దేవుడు "స్వామి! నేను ఈ విశ్వమంత ఉండాలి అనుకుంటున్నా, ప్రతి జీవంలోనూ అంతర్లీనంగా పరమాత్మ కాకుండా ఇంకోలా ఉండాలి అనుకుంటున్నా మరియు నా తదనంతరం నిన్ను స్మురించే ఆ కర్పూర లింగానికి నామకరణం చేయాలనుకుంటున్న" అన్నారు. సాంబశివుడు,"నీ కోరికలు మన్నించాను, నీవు విశ్వమంత ఉంటావు మరియు నీవు లేకుంటే జీవరాశి మనుగడ ఉండదు, నీ ద్వారా ఈ లింగం విశ్వమంత వ్యాపిస్తుంది మరియు సురులు, అసురులు, గరుడ, గంధర్వలు, కిన్నెరలు, కింపురుషులు, సిద్దులు, సాధులు, మనుషులు మరియు చరాచర జీవరాశి ఈ లింగాన్ని పూజిస్తారు" అని చెప్పి అదృశ్యం అయ్యెను. ఆ తర్వాత విశ్వమంతా ఈ లింగాన్ని ఆరాధిస్తున్నారు.
ఈ ఆలయ వైభవాన్ని చాటుటకు చాలా పురాణాలు ఉన్నాయి, అందులో ప్రధానమైనది మహా శివుని శాపగ్రస్తమై, పార్వతీదేవి దేవరూపం నుండి మానవరూపం ధరించడం. ఆ పాప పరిహారంకోసమై పార్వతీదేవి తప్పస్సు ఆచరించి తన దేవదేవుడు అయిన మహా శివుని మెప్పించి తన పూర్వరూపంకు వెయ్యి రెట్లు గొప్పదైన రూపాన్ని పొందెను మరియు వివిధ రకాలైన మంత్రాలను (పంచాక్షరీ మంత్రం) ప్రారంభించారు. దీనికి ప్రతిఫలంగా పార్వతిదేవిని శివ-జ్ఞానం, జ్ఞాన ప్రసూనాంబ లేదా జ్ఞాన ప్రసూనాంబిక దేవి అని పిలుస్తున్నారు. శాపఫలంగా రాక్షషిగా మారిన ఘనకల, శ్రీకాళహస్తిలో 15 సంవత్సరాలు మహా దేవుణ్ణి ప్రార్ధించి, భైరవ మంత్రాన్ని పటించి తన పూర్వ రూపాన్ని పొందెను. మయూర, చంద్ర మరియు దేవేంద్రలు కూడా ఇక్కడి స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి కాళహస్తిలో ప్రార్ధించడం ద్వారా తమ పాపాలను పోగొట్టుకున్నారు. శ్రీ కాళహస్తిలో మహాశివుడు భక్త మార్కండేయకి దర్శనమిచ్చి, గురువు ఒక్కరే ఎంత గొప్ప విద్యనైనా బోధించగలరు, కావున గురువు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరునితో సమానము అని ప్రభోదించెను.

ఆలయ చరిత్ర
శివానందైక నిలయము (కైలాస పర్వతము):
శివానందైక నిలయము అనే పర్వతము ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రము నందు కలదు. ఈ శివానందైక నిలయము కైలాస పర్వతము గల పంచశిఖరములలో ప్రశిద్ధమనే శిఖరము. బ్రహ్మదేవుడు సృష్టికార్యము చేయు శక్తిని కోరి శివుని ప్రార్ధించగ బ్రహ్మదేవునికి శివుడు ఈ శిఖరం నీవు ఓర్వలేని బరువుతో భూమి మీద ఎక్కడ జారవిడిచెదవో అదియే దక్షిణ కైలాసము గా ప్రసిద్ధి పొందును. ఆ క్షేత్రమున నీవు తపమాచరించిన, స్వర్ణాభిష్టములు పొందగలవని పరమశివుడు బ్రహ్మదేవునకు వరమొసంగెను. ఆనాడు బ్రహ్మ దేవునకు పరమశివుడు అనుగ్రహించిన పర్వత శిఖరమే నేడు శ్రీకాళహస్తీలోని శివానందైక (కైలాస పర్వతము ) నిలయముగా కొలువుధీరియున్నది. ఇందుకు చిహ్నంగానే ఈ యొక్క క్షేత్రము నందు బ్రహ్మదేవుని ఆలయము కూడా కలదు. ప్రస్తుతము దక్షిణ కైలాసములోని శివానందైక నిలయ పర్వత శిఖరమునే కన్నప్ప కొండగా పిలువబడుచున్నారు. కావున ఈ క్షేత్రమును సిద్ధ క్షేత్రమని ప్రసిద్ధి పొందినది.
ప్రపంచ ముదయించిన మొదటి రోజుల్లో వాయు దేవుడి కర్పూర లింగాన్ని భక్తి శ్రద్దలతో పూజించి అనేక వేల సంవత్సరములు తపస్సు చేశాడని తెలియచున్నది. ఆయన తపస్సు కు సాక్షాత్కరించిన పరమేశ్వరుడు ‘వాయుదేవా ‘ నీవు చలనం గలవాడవయ్యును చలనం లేని భక్తితో నన్నింత కాలం ధ్యానించి చేసిన తపస్సుకు ఆనందించాను. భక్తుడవు కనుక నీకు కావలసిన వరాలు ఇవ్వడానికి వచ్చాను. నీకు కావలసిన వరాలు ఏమిటో కోరుకో యిస్తా అన్నాడు. అందుకు వాయు దేవుడు ‘స్వామి’ నేని ప్రపంచము నందు లేని తావంటూ లేకుండగను, పరమాత్మ చందంబున ప్రతి జీవి యందు నేను ప్రధానమై యుండు లాగునను, నీ ప్రతిరూపమైన ఈ కర్పూర లింగము నా పేరు పిలువబడునట్లు నాకు వరములను ప్రసాదింపు ‘అని దోసిలి పట్టాడు. సాంబ శివుడు సంతోషించి ‘ఓయీ ! నీవు అభిలషించిన ఈ మూడు వరములను కోరదగినవే. నీ అభిమతము ననుసరించి నీవీ ప్రపంచమంతటను వ్యాపించి వుండువు. నీవు లేక జీవరాశి బ్రతుక జాలదు. నా యీ లింగము ఇక మీద నీ పేరున వాయు లింగమని ప్రఖ్యాతి గాంచి సమస్త సుర అసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధి సాధ్వి నరముని వరుల చేతను పూజాలందుకొని నని’ వరములిచ్చి అదృశ్య మయ్యెను. నాటి నుండి ఈ క్షేత్ర మందలి కర్పూర లింగం వాయు లింగమను పేరున సమస్త లోకాల వారిచే పూజ లందుకోoటుంది.
శ్రీ జ్ఞానప్రసూనాంబ :
దక్షయజ్ణ సమయమున ద్రాక్షాయణి దేవి యాగాగ్ని యందు దగ్దమైన పిదప మరల హిమవంతుని పుత్రికగ గౌరీ దేవి గా జన్మించి, పరమశివుని కళ్యాణమాడ పూనెను. అందులకు గాను పరమేశ్వరుడు ఈ యొక్క శక్తిని నీవు తిరిగి పరిపూర్ణముగా పొందిన గాని వివాహమాడుటకు వీలుపడదని చేప్పెను. అందులకు పరమేశ్వరి తక్షణ కర్తవ్యము ఏమని పరమేశ్వరుని కోరగ అప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరికి (పంచాక్షరి) మంత్రోపదేశము ఉపదేశించెను. తదుపరి పరమేశ్వరి ఈ యొక్క క్షేత్రమునందు తన స్వహస్తము తో శ్రీచక్ర స్థాపన కావించుకొని అనుష్టించి తన శక్తిని తాను తిరిగి పొంది పరమేశ్వరుని కళ్యాణముచేసుకొని శ్రీచక్ర బిందు స్థాపనమున నిలచి తాను సాధించిన జ్ఞాన శక్తిని సమస్త జీవరాసులకు పంచి పెడుతూ వున్నది. కావున ఈ క్షేత్రము యందు జ్ఞానప్రసూనాంబికగ వ్యవహరించి పూజాలందుకొనబడుచున్నది. తనచే మంత్రోపదేశము పొందినటువంటి భరద్వాజ మహాముని (మహర్షి) మొదలు ఇప్పటి వరకు భరద్వాజ వంశీకులే ఈ క్షేత్రము యందు షడ్ కాల పూజలు నిర్వహించడం జరుగుచున్నది.
సువర్ణముఖి నది : - ( దివ్య గంగా)
అగస్త్య మహా ముని తన శిష్య గణంబుతో దక్షిణ దిగ్భాగమునకు వచ్చి తపము చేయుచుండెను. అప్పుడు వారికి నీరు లభింపకుండుటచే బ్రహ్మను గూర్చి ఘోర తపమాచరిoచెను. బ్రహ్మ ప్రత్యక్షమై తపమునకు మెచ్చి వర ప్రసాదముగా ముని కోరిన విధముగా ఆకాశ గంగను నియోగించెను. గంగా దేవి సువర్ణముఖరీ స్రవంతి రూపమును అగస్త్య పర్వతములో అవతరించి శ్రీకాళహస్తి మీదుగా ఉత్తర వాహినియై తూర్పు సముద్రమున కలియుచున్నది. ఈనాడు నదిలో అనేక తీర్ధ రాజములు విలసితములై దక్షిణ కైలాసమునానుకొని ప్రవహించు చున్నది. సువర్ణముఖి ఈ క్షేత్రము న ఉత్తర వాహిని గా ప్రవహించుచున్నది. ఇది గంగా నదికి సమానమైనదిగా పురాణ ప్రసిద్ధినొంది యున్నది. గంగాధి నదులకు పన్నెండు సంవత్సరములకు ఒకమారు మాత్రమే పుష్కరములు వచ్చును. కానీ ఈ దక్షిణకైలాస క్షేత్రములోని సువర్ణముఖి నదికి మాఘమాసమున మఖా నక్షత్రముతో కూడిన పౌర్ణమి రోజున విశేషముగా పుష్కరము జరుగుచున్నది.
కృత యుగంలో చెలిదీవుర్వు(సాలి పురుగు) తన శరీరము నుండి వచ్చు సన్నని దారముతో కొండపై నున్న శివుడునకు గుళ్ళు గోపురములు, ప్రాకారములు కట్టి శివుని పూజించు చుండెను. గాలి విచినప్పుడేల్లా తెగిపోయిన దారములను మరల అంటించుచు ఏమరపాటు లేక శివ సేవ చేయు చుండెను. ఒక నాడు శివుడు పరీక్ష చేయదలచి అక్కడ మండుచున్న దీపములో తగిలి సాలీడు కట్టిన గుడి, గోపురములు తగలబడ పోవుచున్నట్లు చెసేను. ఇది చూసి సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రత్యక్షమై దని భక్తికి మెచ్చి వరము కోరుకొనుమనెను. అప్పుడు సాలీడు మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనేను. అందుకు శివుడు సమ్మతించి సాలీడు తనలో ఐక్యమై పోవునట్లు చేసెను. ఈ విధముగా సాలీడు శివసాయిజ్యము పొంది తరించినది.
త్రేతా యుగములో ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను. త్రేతా యుగము ముగిసి ద్వాపర యుగము వచ్చినది. అప్పుడు ఏనుగు శివ లింగమును సేవింప జొచ్చును. అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వ దళములు తెచ్చి పాము తెచ్చిన మణులను త్రోసివేసి తాను తెచ్చిన నీటితో అభిషేకించి పుష్పములను అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను. మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గాక వానికి బదులు బిల్వములు, పుష్పములు పెట్టియుండుట గాంచెను. అది అప్పుడు త్రోసి వేసి,తాను తెచ్చిన మణులను పెట్టి పూజించి వెళ్ళేను. తరువాత ఏనుగు వచ్చి యధా ప్రకారము తన పూజ గావించుకొని వెళ్ళేను. ఇట్లు కొంత కాలము తమ తమ ఇష్టాను సారముగా పూజ చేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి. తాను అర్పించిన మణులను ఎవరో ఉద్దేశ్య పూర్వకముగా తీసివేయుచున్నారని సందేహించిన పాము ఒక చాటున ఉండి గమనించ సాగెను, యధావిధిగా ఏనుగు వచ్చి మణులను తోసివేసి తన వెంట తెచ్చిన పుష్పములను ఉంచగా పాము ఆగ్రహించి ఏనుగు ను సంహరించే నెపముతో దాని తొండములోనికి దూరి బాధించసాగెను. బాధను తట్టుకోలేక ఏనుగు ఒక బండరాయికి తన తలను పదే పదే మోదగా ఏనుగు తొండములోని పాము మరియు ఏనుగు మరణించి శివసాయుజ్యము పొందెను. ఈ స్మృతి చిహ్నముగా కాళము పంచముఖి ఫణాకారముగా, శిరో పరిభాగమునకు ఏనుగు సూచకముగా రెండు దంతములను, సాలెపురుగు అడుగు భాగములోను, తన లింగాకృతిలో ఐక్యమొసరించుకొని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ఇచ్చట దర్శనము ఇచ్చుచున్నాడు. ఆనాటి నుండి ఈ కేత్రమును శ్రీకాళహస్తి అని పేరు వచ్చినది
భక్త కన్నప్ప :
అర్జునుడు పరమేశ్వర సాయిజ్యము పొందుటకు తిన్నడుగా కలి యుగమున జన్మించెను. పొత్తి పినాడు అని తెలుగు దేశంలోగల ప్రాంతమునందు ఉడుమూరు పల్లె కలదు. అందు నాధనాధుడు తండే అని బోయ దంపతులకు శివాను గ్రహముతో ఒక మగ శిశువు జన్మించెను. ఆ బాలునకు తిన్నడు అని పేరు పెట్టిరి. అతడు విలు విద్యలో దిట్ట అయ్యెను. ఒకనాడు అతడు వేటాడి అలిపి పోయి చెట్లు క్రింద నిద్రించు చుండుతరి శివుడు సాక్షాత్కారించి ఇట్లనేను. ఇక్కడి కొండ దగ్గర మొగలేటి యొడ్డున శివుడున్నాడు. పోయి అతనిని కొలువుము. వెంటనే మేల్కోంచి చూడా ఒక అడవి పంది కనిపించెను. దానిని వెంటాడుతూ వెంట పడగ అది శివుడు ఉన్న చోటికే వానిని తెచ్చును. అప్పుడు తిన్నడు అచ్చటనే శివుని సాన్నిధ్యమున నిలిచిపోయి తన్మయుడై శివుని పరిపరి విధముల తన నివాస గృహమునకు రమ్మని ప్రార్ధించెను. కాని తన వేడుకోలు ఫలించక పోగా అతడు ఇచ్చటనే శివుని వద్ద నిలిచిపోయెను.
ప్రతి దినము అరణ్యమునకు వెళ్ళి పందిని వేటాడి చంపి, కాల్చి మాంస కండముల రుచి చూచి పక్వమైన వాటిని యేరి ఆకు దొప్పల యందుంచుకొని ఫల,పుష్ప బిల్వ దళములను శిరస్సు పై మోపి చంక యందు వింటివి, విపున నమ్ముల పొదియు, పుక్కిట సువర్ణముఖి నది తీర్ధమును కొని తన ఆరాధ దైవమునకు అందించెను. నోటితో తెచ్చిన గంగతో శివునికి అభిషేకించి, ఆకు దిప్పలతో తెచ్చిన మాంస శకలంబులను మహా నైవేద్యము గా నిడి శివుడు ప్రీతి చెందగా తిన్నడు ఆనందించెను.
ఆ సమయమున శివ గోచరడును సదాచార సంపన్నుడైన నొక బ్రాహ్మణుడు కూడ వచ్చి స్వామిని ప్రతి దినము అర్చించి పోవు చుండెను. చాలా కాలము నుండి పూజించుచున్న ఆ బ్రహ్మనునికి కొత్తగా చేయుచుండిన తిన్నని పూజలు ఎంగిలి మంగలముగా కనపడెను. దానికి అతను విచారించి,’ స్వామి మీ ఆలయం ఇటీవల కొన్ని దినములుగా నిరీతిగా మారుటకు కరణమేమని ‘ ప్రార్ధించి తెలపకున్న ప్రాణములు విడుతునని శపదంబు చేసెను. అప్పుడు స్వామి వాక్కుగా ఇట్లు వినబడెను. ఒక చెంచు నన్నిట్లు పూజ చేయుచున్నాడు. అతడు గొప్ప భక్తుడు, వాని భక్తికి ఎంత మహిమ కలదో నీవు కూడ చూతువు గాక యని అతనిని తన వెనుక దాగి యుండి అంతయు గాంచమనెను.
కొంత సేపటికి వాడుక మేరకు తిన్నడు యధా ప్రకారముగా వచ్చి స్వామికి అభిషేకమాచరించి తెచ్చిన మాంసపు ముక్కలు తినమనేను. కానీ స్వామి తినలేదు. ఇంతలో స్వామికి ఒక కన్ను వెంట నీరు కారునారంభించేను. క్రమముగా అది అధిక మయ్యెను. తీన్నడది గాంచి స్వామి కంటి జబ్బు వచ్చినదని చాలా భాధపడెను. గుడ్డను చుట్టగా చుట్టి నోటి ఆవిరి పట్టి కంటికి అద్దినాడు. తంగేడాకు మెత్తినాడు. నిమ్మరసముతో నూరి పోసినాడు. కలువ పువ్వు తెచ్చి కంటి రుద్దినాడు. అడవి అంతయు తిరిగి వెదకి వెదకి ఎన్నో మందులు తెచ్చి వేసినాడు. లాభము లేక పోయేను. ఇంతలో కంటి నుండి రక్తం కూడా కారనారంభించేను. చివరకు కంటికి కన్నె మందు అనుకోని బాణముతో తన కంటి నొకదానిని పెకిలించి స్వామి కంటిపై నంటి పెట్టినాడు. దానితో స్వామి కన్ను నెమ్మిదించేను. కానీ విను వెంటనే రెండవ కన్ను నుండి కూడా రక్తము కారనారంభించేను. తిన్నడు నవ్వి ‘ఓ స్వామి ని దయ చేత కంటి మందున్నది’ అని కాలితో నెత్తురు కారుచున్న స్వామి వారి రెండవ కంటిని గుర్తుకై అదిమి పట్టి తన రెండవ కంటిని పెకలించ పోయేను. వెంటనే శివుడు తిన్నని భక్తికి పారవశ్యమునకు మెచ్చి సతీ సమేతుడై ప్రత్యక్షమై తిన్ననుకి, ఆ బ్రాహ్మణునికి శివ సాయుజ్యము నొసగెను. ఆనాటి నుండి శివునికి కన్నిచ్చి సార్థకముగా కన్నప్ప అను పేరు వడసి లోకులకు భక్తి మార్గ ప్రదీపకుడను శ్రీకాళహస్తి క్షేత్రములో భక్తి శిరోధార్యమై వెలుగొందుచున్నాడు.
వసతి రవాణా సౌకర్యం: 
విజయవాడ-రేణిగుంట మార్గంలో శ్రీకాళహస్తి క్షేత్రం వుంది. రైలు.. రోడ్డు మార్గాల్లో చేరుకోవచ్చు. ప్రతి 15 నిమిషాల‌కో సర్వీసు చొప్పున బస్సులు ఉన్నాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా శ్రీకాళహస్తికి నేరుగా బస్సు సౌకర్యముంది. సమీపంలోని రేణిగుంటలో తిరుపతి విమానాశ్రయముంది.
ఇక ఇక్కడకు శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ఆలయం తరఫున పలు అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు అద్దెలతో భక్తులు ఇక్కడ వసతి పొందవచ్చు. అలాగే పట్టణంలోనూ పలు ప్రభుత్వ/ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు.. అద్దెగదులు లభిస్తాయి.

ఆ వివరాలతోపాటు.. ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు... ముందస్తు బుకింగ్‌ల కోసం... 08578- 222240 నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Keywords:
Srikalahasti Temple Rahu Ketu Pooja Darshan Change,Timings, Tirupati,srikalahasti temple history in telugu,srikalahasti temple history in tamil,srikalahasti temple secrets,srikalahasti charitra,srikalahasti temple timings online booking,indian temples history in telugu pdf,kanipakam temple history in telugu,srikalahasti temple pooja online booking,kalahasti temple kala sarpa dosha,srikalahasti temple darshan timings,srikalahasti temple Room Booking,srikalahasti temple Kalahasti Rahu Ketu Pooja Timings and Rahu Ketu Pooja Ticket cost provided,SriKalahasti Temple Timings- Abhishekam, Darshan, Sevas,Srikalahasti Temple Pooja Timings and Cost Temple Abhishekam - 6:00 AM, 7:00 AM, 10:00 AM and 5:00 PM, Monday to Sunday - INR 600.Sri Kalahasti Temple Timing, Prasadam, Accommodation Details,Lord Shiva Temple,God Siva Temples,Ap temples

Comments