పురాణ గాథలు, ఆచారాల పరంగా లయకారకుడైన పరమ శివుడి అర్ధాంగి పార్వతిదేవిని ఆరాధించే ఆలయాలు ఉన్న మహిమాన్విత ప్రదేశాలను శక్తి పీఠాలుగా పేర్కొంటారు. అసలు శక్తి పీఠాలు ఎన్ని? మనదేశంలో చాలామందికి తెలిసిన శక్తి పీఠాలు 18. అయితే, ‘ప్రాణేశ్వరీ ప్రాణధాత్రీ పంచాశత్పీఠరూపిణీ’ అని లలితా సహస్రనామావళి 51శక్తి పీఠాలు ఉన్నట్లు చెబుతోంది. పురాణ గ్రంథాలను పరిశీలిస్తే, 108 శక్తి పీఠాలు ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. కాళీ పురాణంలో 18 శక్తి పీఠాల గురించి చెబితే, దేవీ భాగవతంలో 66 శక్తి పీఠాలు ఉన్నట్లు చెప్పారు.
శక్తి పీఠాలను అర్థం చేసుకోవడానికి పురాణ ప్రాతిపదిక కొంత మేరకు ఉపయోగపడితే, ఉపాసన పరమైన శాస్త్రం మరికొంత ఉంటుంది. యోగశాస్త్రంలోనూ, మంత్రశాస్త్రంలోనూ ఈ శక్తి పీఠాల ప్రస్తావనం ఉంది. చైతన్యానికి ఆవాసం మానవ దేహం. 51 శక్తులు మన శరీరంలో అంతర్లీనమై ఈ దేహాన్ని నడిపిస్తున్నాయని చెబుతారు. కళ్లు, చెవులు, పాదాలు, చేతులు ఇలా ప్రతిది ఒక శక్తికి ప్రతీక. అవన్నీ కలిసిన దేహమే శక్తి రూపం.
సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది. సతీ దేవి బ్రహ్మరంధ్రం ఇక్కడ పడినట్టు చెప్పుకుంటారు. ఇక్కడ భైరవుడు భీమలోచనుడనే పేర పిలువబడుతున్నాడు.
రామాయణం ప్రకారం, రావణ వధ తర్వాత రాముడు బ్రహ్మహత్యదోష నివారణ కోసం హింగ్లాజ్ దేవిని సందర్శించాడు.
హింగుళా దేవికి చెందిన ఈ మంత్రం దధీచీవిరచితంగా భావిస్తారు.
ఓం హింగుళే పరమ హింగుళే అమృతరూపిణీ తనుశక్తి
మనః శివే శ్రీ హింగుళాయ నమః స్వాహా
పాకిస్తాన్ 1947లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అంతకు ముందు ఇది భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది. వేదకాలం నుండి ఇక్కడ హిందూమతం విలసిల్లుతోంది. ముల్తాన్ ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. వేద సంస్కృతి పంజాబుకు చెందిన తక్షశిలలోని గాంధారం వద్ద వికసించింది.ఇక్కడ హైందవ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబించించే దేవాలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని దేవాలయాల వివరాలు ఇలా ఉన్నాయి.
హింగ్లజ్ మాత మందిరం
హింగ్లజ్ మాత, హింగ్లజ్ దేవి లేదా హింగుళాదేవి మందిరం 51 శక్తిపీఠాలలో ఒకటి.హింగ్లాజ్ అనునది పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలోని జిల్లాలో హింగోల్ నేషనల్ పార్క్ మధ్యలో నెలకొని ఉంది. ఈ ఆలయం హింగోల్ నదీతీరంలోని ఒక కొండగుహలో ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మరియు శక్తిపీఠం. పాకిస్తానీయులు ఈ ఆలయాన్ని నానీమందిరంగా పిలుస్తారు. హింగ్లాజ్ లేదా హింగుళ దేవి భారతదేశంలోని చాలామంది క్షత్రియులకు, ఇతర తెగలకూ కులదేవత. ఇది బెలూచిస్తాన్ రాష్ట్రంలో కరాచీ నుండి 250 కి.మీ దూరంలో ఉన్నది.
పురాణగాథలు
హింగ్లజ్ మాత మందిరం
ప్రజాపతి దక్షుడు తన కుమార్తె సతీదేవి తన ఆకాంక్షలకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుందన్న కోపంతో తాను తలపెట్టిన బృహస్పతియానికి అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు. సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. వాటిలో శిరోభాగం (బ్రహ్మరంధ్రము) ఈ హింగోళ ప్రాంతంలో పడిందని అంటారు.
మరొక స్థల పురాణం:
ప్రకారం త్రేతాయుగంలో విచిత్రుడు అనే సూర్యవంశానికి చెందిన క్షత్రియ రాజుకు హింగోళుడు, సుందరుడు అనే కుమారులు పుడతారు. వీరు ప్రజలను, ఋషులను పీడించి హింసిస్తుంటారు. ఆ రాకుమారుల బారినుండి తమను రక్షించవలసిందిగా ప్రజలు శివుడిని ప్రార్థిస్తారు. శివుని ఆజ్ఞానుసారం గణపతి సుందరుడిని సంహరిస్తాడు. దానితో రెచ్చిపోయిన హింగోళుడు మరింత విజృంభించి ప్రజలపై ప్రతీకారం తీసుకుంటాడు. దానితో బెంబేలెత్తిన ప్రజలు పరాశక్తిని ఆశ్రయిస్తారు. శక్తి అతడిని వెంటాడుతూ ఈ గుహలలో తన త్రిశూలంతో సంహరిస్తుంది. చనిపోయే ముందు హింగోళునికి ఇచ్చిన వరం ప్రకారం ఆ ప్రాంతంలో నెలకొని అతడి పేరుతో హింగుళాదేవిగా ప్రసిద్ధి చెందింది.
మరో ఇతిహాసం ప్రకారం
పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తున్నప్పుడు 12 మంది బ్రాహ్మణులు క్షత్రియులను బ్రాహ్మణ వేషం వేసి పరశురాముడికి వారిని బ్రాహ్మణులుగా నమ్మించి కాపాడతారు. ఆ క్షత్రియుల సంతతి తరువాతి కాలంలో బ్రహ్మక్షత్రియులుగా పిలువబడుతున్నారు. ఈ బ్రహ్మక్షత్రియుల కులదేవత హింగుళాదేవి. మరో కథనం ప్రకారం దధీచి మహర్షి రత్నసేనుడు అనే సింధుదేశ రాజుకు పరశురాముడి బారి నుండి రక్షించడానికి ఆశ్రయమిస్తాడు. దధీచి ఆశ్రమంలో లేని సమయం చూసి పరశురాముడు రత్నసేనుడిని సంహరిస్తాడు. రత్నసేనుడి కుమారులను బ్రాహ్మణ వటువులుగా భావించి వదిలివేస్తాడు. వారిలో జయసేనుడు సింధురాజ్యానికి మరలి వెళ్లి పరిపాలన కొనసాగించాడు. పరశురాముడు అతడిని మట్టుపెట్టడానికి వచ్చినప్పుడు దధీచి మహర్షి ప్రసాదించిన హింగుళా దేవీ మంత్ర ప్రభావంతో కాపాడబడతాడు. ఈ దేవి జయసేనుడిని కాపాడటమే కాక పరశురాముని క్షత్రియవధను నిలిపివేయమని ఆజ్ఞాపిస్తుంది.
హింగ్లాజ్ దేవిని దర్శించుకున్న తర్వాత భక్తులు అక్కడి సమీపంలో ఉన్న చంద్రగప్, కందేవారీ అనే బురదతో కూడిన అగ్నిపర్వతంపైకి వెళ్తారు. ఆ బురదలో పూలు చల్లి, తమ వెంట తెచ్చుకున్న కొబ్బరి కాయలను అందులో ముంచుతారు. బురద అంటిన ఆ కొబ్బరి కాయలను ఇంటిలో పెట్టుకుంటే శుభాలు జరుగుతాయని మరికొందరి నమ్మకం. కొందరు ఆ బురదను శరీరానికి పూసుకుంటారు. మరి కొందరు ఆ బురదతో చిన్న ఇళ్లు కడతారు. అలా చేస్తే వారి సొంత ఇంటి కల నిజమవుతుందని విశ్వాసం.
హింగ్లాజ్ దేవి ఆలయం చుట్టూ గణేశ్‌దేవ, కాళీ మాత, గురుఘోరక్ నాథ్ ధూని, బ్రహ్మకుధ్, తిర్‌కుంద్, గురు నానక్‌రావ్, రామ్‌జరోఖా బేతక్, అనిల్‌కుద్, చౌరాసీ పర్వతం, చంద్రగూప్, అఘోరి పూజ తదితర ఆలయాలు, ప్రార్థనా ప్రదేశాలు ఉన్నాయి.
ఏటా ఏప్రిల్ మాసంలో నాలుగు రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో సాధువులు, హఠయోగులు హింగ్లాజ్ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కు బడులు చెల్లించుకుంటారు. స్థానిక ముస్లింలు ఈ ఉత్సవాలను నానీకీ హజ్ అని పిలుస్తారు. హింగ్లాజ్ దేవి ఉత్సవాలు జరిగే సమయంలో భక్తులు పాదయాత్రగా వెళతారు. ఎందుకంటే ఎడారి ప్రాంతాన్ని తలపించే ఆ రహదారి గుండా వెళ్తే అక్కడ వీచే వేడి గాలులు శరీరాన్ని తాకి చేసిన పాపాలను పోగొడతాయని వారి నమ్మకం. అలా పవిత్రమైన దేహంతో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు. ఒకప్పుడు కేవలం కాలినడకన మాత్రమే అక్కడకు వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత ఒంటెలు, గాడిదలపై ప్రయాణించి ఆలయానికి చేరుకునేవారు. 2004 తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో వాహనాల్లో నేరుగా దేవి ఆలయానికి చేరుకోవచ్చు. అయితే, సంప్రదాయం పాటించే వారు ఇప్పటికీ హింగ్లాజ్ దేవి ఆలయానికి నడిచి వెళ్తారు. అలా ఆలయ సమీపానికి చేరుకున్న భక్తులు అక్కడ ప్రవహించే హింగ్లోజ్ నదిలో స్నానమాచరించి దేవిని దర్శించుకుంటారు.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords:
Unknown Facts About Shakti Peeth In Pakistan ,పాకిస్థాన్లో ముస్లింలు కూడాకొలిచే శక్తిపీఠం,Facts Behind The 18 Shakti Peethas And Their Specialty-PART 2-అష్టాదశ శక్తి పిఠాలు గురించి తెలుసా,Hinglaj Mata పాకిస్తాన్లో హింగ్లాజ్ దేవి ఆలయం ,History Of Hinglaj Devi Temple in Pakistan - Rahasyavaani Unknown Telugu Facts,shakti peeth hinglaj temple in telugu ,hinglaj mata history,shakti peeth hinglaj temple history in telugu,hinglaj devi temple history in telugu,hinglaj mata mandir in rajasthan,hinglaj mata mantra,hinglaj mata mandir in india,hinglaj mata yatra from india,hinglaj devi temple treasure,how many shakti peeth in pakistan,Hinglaj Devi Temple in Pakistan History in Telugu,hinglaj mata mandir in rajasthan,hinglaj mata kuldevi,hinglaj mata mandir ahmedabad gujarat,18 Shakti Peethas,51 Shakti Peethas,shri hinglaj mata shakti peeth mandir. baluchistan, pakistan ,108 Shakti Peethas,Lord Shiva Temple
Comments
Post a Comment