సంక్రాంతి విశిష్టత | సంక్రాంతి రోజున ఏమి దానం చేస్తారు? | Makar Sankranti history in telugu | Bhakthi Margam
సంక్రాంతి రోజున ఏమి దానం చేస్తారు?
మకర సంక్రాంతి రోజున చేసే స్నానానికి, దానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుందని విశ్వాసం. ఈ ప్రత్యేకమైన రోజున సూర్య భగవానుని పూజిస్తే అన్ని రకాల కష్టాలు తీరుతాయి. సూర్య భగవానుని ఆరాధించడం వల్ల గౌరవం, సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం.
సూర్యభగవానుడు ఒక రాశిని విడిచిపెట్టి మరొక రాశిలోకి ప్రవేశించే క్రియను సంక్రాంతి అని అంటారు. వీటన్నింటిలో మకర సంక్రాంతి అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.
మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయం కేవలం పండగలా మాత్రమే చూడము.
అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండగ సూచిస్తుంది. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.
సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు. ఉత్తర భారతంలో నివసించే హిందువులు, సిక్కులు సంక్రాంతి పండగను మాఘీ అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్రీ జరుపుతారు. గోవా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మకరసంక్రాంతిగా పిలుస్తారు. మధ్యభారత దేశంలో సుకరాత్ అని అస్సాంలో మఘ్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. గుజరాత్‌లో గాలి పటాలను ఎగురవేస్తారు.
సంక్రాంతి
రెండవ రోజయిన సంక్రాంతి నాట పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.
ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి కానీ, మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం, గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి.
ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యం ఇస్తాము.
హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ, కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.
ప్రతి వ్యక్తి పాటించవలసిన ముఖ్యమైన కొన్ని ప్రత్యేక నియమాలు గ్రంధాలలో చెప్పబడ్డాయి. మకర సంక్రాంతి రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం.
మకర సంక్రాంతి నాడు చేయాల్సిన పనులు:
మకర సంక్రాంతి రోజున సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సూర్య భగవానుని ఆరాధించడం వలన విశిష్ట ప్రయోజనాలు లభిస్తాయని గ్రంధాలలో చెప్పబడింది. అందుకే సూర్యోదయ సమయంలో అర్ఘ్యం సమర్పించండి.
ఈ ప్రత్యేకమైన రోజున చేసే దానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే మకర సంక్రాంతి రోజు నిరుపేదలకు కిచడీ, నువ్వులు, బెల్లం దానం చేయండి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడు సంతోషిస్తాడు.
తర్పణం మొదలైన వాటికి కూడా ఈ రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే మకర సంక్రాంతి రోజున పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణం ఇవ్వండి. మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల పితృ దోషం కూడా పోతుంది.
వీలైతే, పవిత్ర నదిలో స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల సర్వ పాపాల నుండి విముక్తి పొంది మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే, ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు నీటిలో కొన్ని చుక్కల గంగాజలాన్ని కలుపుకోండి.
మకర సంక్రాంతి నాడు చేయకూడని పనులు:
మకర సంక్రాంతి రోజున ఒక వ్యక్తి కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలలో చెప్పబడింది.
వాటిలో ముఖ్యమైనది ఈ రోజున తామసిక ఆహారం తీసుకోవడం నిషిద్ధం.. అలాగే మాంసాహారం, ఆల్కహాల్ వంటివి తీసుకోవద్దు.
రాత్రి నుంచి నిల్వ ఉన్న ఆహారాన్ని మకర సంక్రాంతి రోజున తీసుకోకండి. ఇలా నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం వలన ప్రతికూల శక్తి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయిస్తుంది.. ఆ వ్యక్తి కోపంతో ఉంటాడు.
ఈ రోజున పేద లేదా నిస్సహాయ వ్యక్తిని గౌరవించండి. తగిన విధంగా సాయం అందించండి.
ఈ రోజున అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఆకలి అంటూ ఇంటి వద్దకు భిక్ష కోసం వస్తే.. అతన్ని ఖాళీ చేతులతో తిరిగి పంపించకండి.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags: bhogi in telugu, bhogi wishes in telugu, bhogi story in telugu,bhogi muggulu, bhogi subhakankshalu in telugu, bhogi history in telugu,sankranthi history in telugu, sankranti history in telugu, సంక్రాంతి విశిష్టత, Makar Sakranti significance, bhakthi margam, daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam, Bhakthi Margam, bhakthimargam.in, sankranthi muggulu, sankranti wishes in telugu, sankranti story in telugu, sankranti puja vidhanam in telugu, makar sankranti date, Makar Sankranti 2021 date, sankranti time and significance



.jpg)

Comments
Post a Comment