ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు (Geographical Patent) లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం.
తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసేరోజుల్లో 19వ శతాబ్ది మధ్యభాగంలో తీపిబూందీ ప్రవేశపెట్టారు. 1940ల నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు సంపాదించుకుంది, ఇప్పుడు లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది.
ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు.
లడ్డూ ప్రసాదంగా
ఒకప్పుడు బియ్యప్పిండితో చేసిన లడ్డూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. బియ్యప్పిండి, బెల్లం కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. కర్ణాటక మెల్కోటే దేవాలయంలో మనోహరం ప్రసాదాన్నే పెడతారు. మధుర మీనాక్షి దేవాలయంలో బియ్యప్పిండి, మిన్నప్పిండి, పెసరపిండి కలిపి, లావు కారప్పూస వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలోవేసి, ఉండ కట్టి నైవేద్యం పెడతారు. దీన్ని మనోహరం అంటారు. మన మిఠాయి లడ్డూ ఇలాంటిదే!మనోహరాల గురించి హంసవింశతి కావ్యంలో కూడా ప్రస్తావన ఉంది. అంటే మూడువందల యాభయ్యేళ్ళ క్రితంవరకూ మనోహరం ఒక ప్రసిధ్ధమైన తీపి వంటకం
లడ్డూలలో రకాలు
ఆస్ధానం లడ్డూ - ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీటిని ప్రత్యేక వుత్సవాలు సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మాత్రమే వీటిని అందజేస్తారు.
కళ్యాణోత్సవ లడ్డూ - కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు భక్తులకూ కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు
ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.
భౌగోళిక గుర్తింపు
'తిరుపతి లడ్డు'కు భౌగోళిక కాపీరైట్ (పేటెంట్) హక్కు లభించింది. దీని వలన తిరుమలలో తయారయ్యే లడ్డు ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. దీనివల్ల ఇలాంటి లడ్డును తయారుచేయడానికి గాని, దాని పేరును వినియోగించుకునేందుకు కాని ఇతరులకు ఎలాంటి అవకాశం ఉండదు. ఈ భౌగోళిక హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చైన్నైలోని కార్యాలయంలో దరఖాస్తు చేసింది. దానిని పరిశీలించిన కార్యాలయం భౌగోళిక కాపీరైట్ ను నిర్ధారిస్తూ ధ్రువీకర పత్రాన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కార్యాలయానికి చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్ మార్క్ జిఎల్ వర్మ టిటిడి అధికారులకు అందజేశారు.
పోటు(లడ్డూ తయారీ శాల)
తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు (వంటశాల) కు ముందు వకుళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించినచోట పోటు ప్రసాదాలు తయారుచేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డు, వడలు మొదలైన పనియారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారుచేస్తారు. వాటిని కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950 లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం (శ్రీవారి స్టోర్) నుంచి వస్తువులు ఇస్తారు. దీని ప్రకారం 5100 లడ్డూలు మాత్రమే తయారుచేయడానికి ఇన్నేసి కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు.
1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలయినపుడు మనం ఇపుడు చూసే లడ్డూ తయారి మొదలైంది. దీన్ని తయారుచేయడానికి ప్రత్యెక పద్ధతి అంటూ ఒకటి ఉంది.లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈదిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తులతాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు.ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. -
ఆవు నెయ్యి - 165 కిలోలు
శెనగపిండి - 180 కిలోలు
చక్కెర - 400 కిలోలు
యాలుకలు - 4 కిలోలు
ఎండు ద్రాక్ష - 16 కిలోలు
కలకండ - 8 కిలోలు
ముంతమామిడి పప్పు -30 కిలోలు
ఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి.శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.తొలి రోఅజుల్లో లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలను ప్రవేశపెట్టారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల ఉంది. ఇక్కడ అత్యాధునికమైన వంట సామగ్రి సహాయంతో రోజూ లక్షల లడ్లు తయారీ జరుగుతున్నది.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords:
Tirupati Laddu Secret Recipe Revealed , Tirumala Laddu Story Something Special,Advance Booking,Tirumala Tirupati Devasthanams,tirupati temple,tirupati temple darshan online booking,Preparation And Recipe of Srivari Laddu in Tirumala Tirupati Temple ,Tirupati Laddu In Telugu,Tirumala Laddu,Tirumala Tirupathi Temple,Tirupati Laddu Special in Telugu,Tirumala Laddu Making Video,how to preserve tirupati laddu in home,Tirupati Rooms,Tirupati Online Rooms,Alipiri Footpath,Srivari Metlu,Tirumala,Tirupati,Lord Balaji Temple,TTD Online,Kapila Theertham,Tirupati Laddu in Telugu,Venkateswara Swamy Laddu,tirupati temple,tirupati temple darshan online booking,Tirumala Tirupati Devasthanams,Tirupati History In Telugu,Tirupati Laddu
Comments
Post a Comment