Alipiri to Tirumala Srivari Temple By FootPath |Tirupati Alipiri Metlu | Best Place to Visit in Tirumala Hills
అలిపిరి (Alipiri) తిరుపతి నుండి 4-5 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడనుండి తిరుమలకు కాలిబాట మరియు రెండు ఘాట్ రోడ్లు మొదలు అవుతాయి. అలిపిరి సముద్రమట్టానికి 200 మీటర్లు (656 అడుగుల) ఎత్తులో ఉంది.
అలిపిరి చరిత్ర
పూర్వం అలిపిరిని అడిపుళీ అని పిలిచేవారు. అడి అంటే పాదం పుళ అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు వున్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. ఈచెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. మధ్యాహ్నాపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంభి తపనని తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్ష మయ్యాయట. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంభి వేంకటేశ్వరుని నైవేద్యం కోసం మట్టికుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదులకు అర్పణ చేసేవాడు. నంభి కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు శిలాఫలకాలుగా రెండవ గాలి గోపురం మెట్ల ప్రక్కన ఉన్నాయి.
1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలావుండేదో వ్రాశారు. గాలిగోపురం వరకూ ఎక్కడం, దిగడం బహు ప్రయాస అని వ్రాసుకున్నారు. అక్కడ నుంచి కొంత భూమి సమంగా ఉండేదని, మళ్ళీ ఎక్కిదిగాల్సిన ప్రాంతాలున్నా ఆపై ప్రయాణం అంత ప్రయాసగా ఉండేది కాదన్నారు. దారిలో నిలిచేందుకు జలవసతి గల మంటపాలు చాలా ఉండేవి. గాలిగోపురం వద్ద ఒక బైరాగి శ్రీరామవిగ్రహాన్ని పూజిస్తూ, యాత్రికులకు మజ్జిగ వంటివిచ్చి ఆదరించేవాడని వ్రాశారు.
తిరుమలకు కాలి బాటలు
ప్రాచీన కాలంలో అలిపిరి నుంచి సామాన్యప్రజలకు కొండ ఎక్కడానికి గుర్తుగా అలిపిరిలో మానవకృత బాట గుర్తులు ఏర్పాటు చేశారు, ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడ అలిపిరిలో పాదాల మంటపం కనిపిస్తుంది.
పూర్వకాలంలో ఇంకో కాలిబాట మార్గం తిరుచానురు నుండి బయలు దేరి కపిలతీర్థం మెకాలి మిట్టకు చేరేవారనిపిస్తుంది.
మంగళం దగ్గర చలివేంద్రం ఉందని ఇక్కడ నుండి కూడా కొండ ఎక్కడానికి ఒక మార్గం ఉందని చెబుతారు.
రామాముజుని కాలం నుండి అలిపిరి కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
అలిపిరి మెట్ల దారిలో సాష్టాంగ నమస్కార ముద్రలో శిల్పం, అలిపిరి వద్ద తీసిన చిత్రం
తిరుమలకు కాలిమార్గాన చేరటానికి ప్రస్తుతం ఉన్న రెండు సోపాన మార్గాలలో అలిపిరి మార్గము ప్రాచుర్యమైనది. ఇది 11 కిలోమీటర్ల పొడవున బాగా అభివృద్ధి చెందినది. రెండవ మార్గము చంద్రగిరినుండి బయలుదేరుతుంది. ఇది కేవలం 6 కిలోమీటర్ల దూరమే ఉన్నా అలిపిరి మార్గము కంటే కష్టతరమైనది. కాబట్టి దీన్ని కేవలం స్థానికులు మరియు వర్తకులు మాత్రమే ఉపయోగిస్తారు. అలిపిరి నుండి గాలిగోపురం వరకున్న సోపానమార్గాన్ని మట్లి అనంతరాజు నిర్మించాడని భావిస్తారు.
అలిపిరి నుండి తిరుమలకు ఉన్న రెండు తారు పరచిన ఘాట్ రోడ్డులలో పాత దాన్ని 1945లో వేశారు. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని ఇప్పుడు కేవలం తిరుమల నుండి వాహనాలు దిగిరావటానికే ఉపయోగిస్తున్నారు. 1974లో కొత్తగా నిర్మించిన రెండవ ఘాట్ రోడ్డును తిరుమల కొండ పైకి వాహనాలు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు.
అలిపిరి
పూర్వం రవాణా సౌకార్యాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో తిరుమల పైకి వెళ్ల డానికి కేవలం ప్రస్తుతం ఉన్న మెట్ల దారె శరణ్యం. సుధూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ వున్న సత్రాలలో కొద్ది సేపు సేదతీరే వారు. అక్కడి నుండి మెట్ల దారి గుండా నడచి వెళ్లే వారు. నడవ లేని వారికి డోలీలు వుండేవి. వాటిని మనుషులు మోసే వారు. అప్పుడప్పుడే తయారయిన మట్టి రోడ్డు ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడా భక్తులు పైకి వెళ్ళేవారు. అలా ఎద్దుల బండ్లను నడిపేవారు తిరుపతిలో ఎక్కువగా వుండే వారు. వారు నివసించిన ప్రాంతం పేరు బండ్ల వీది అది ఈ నాటికి ఉంది. ఆ విధంగా ఆరోజుల్లో సుదూర ప్రాంతాలనుండి వచ్చే యాత్రీకులు ఈ తిరుమల కొండ పాద బాగాన ఆగి .అక్కడ వున్న వనరులను ఉపయోగించుకొని అలసట తీసుకునే వారు. అందుకుకే దీనికి అలిపిరి అని పేరు. అలిపిరి అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం. ఇక్కడి ఇంకో విశేషం ఏమంటే.... గతంలో దళితులు అనగ అంటరాని వారికి ఆలయ ప్రవేశం వుండేది కాదు. వారు కనీసం ఈ కొండలపైన కాలు కూడా మోపే వారు కాదు. అది పెద్ద అపచారం. ఎవరూ వీరిని కట్టడి చేయకున్న స్వచ్ఛందంగా వీరు కొండ పైకి ఎక్కే వారు కాదు. అలా కొండ పై కాలు మోపితే మహా పాతకం చుట్టు కుంటుందని వారి నమ్మిక. అలాంటి వారి కొరకు ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద గుండు ఉంది. వారు ఈ గుండుకు తల తాకించి ఆ దేవ దేవుని అనుగ్రహం పొందే వారు. ఆలా వారు తర తరాలుగా తలలు ఆ గుండుకు తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. ఆ గుండు ఈ నాటికి ఉంది. దానిని తల తాకుడు గుండు తల యేరు గుండు అని అంటారు. ఇక్కడి నుండి మెట్ల దారి చాల కష్టంగా వుంటుంది. మోకాళ్లు పట్టు కోకుండా ఆ కొండను ఎక్కలెరు. మోకాళ్లు నెప్పులు రాకుండా వుండాలంటే ఆ తలయేరు గుండుకు మోకాలును తాకించి మెట్లెక్కితే మోకాళ్లు నెప్పి వుండదని పూర్వీకుల నమ్మకం: అలా భక్తులు తమ తలలను, మోకాళ్లను ఆ గుండు తర తరాలుగా తాకించి నందున దానికి గుంటలు పడి ఉన్నాయి. దానిని ఈ నాటికి చూడ వచ్చును. ఆ తర్వాత కాలంలో కూడా కొందరు భక్తులందరు అలవాటుగా ఆ గుండుకు తల తాకించి తమ ప్రయాణాన్ని కొన సాగించేవారు. ఒక పాత సినిమాలో ఈ పాట తిరుమల యాత్రను గుర్తుకు తెస్తుంది. తిరుపతి వెంకటేశ్వరా దొరా నివె దిక్కని నమ్మినామురా...కాలి నడక మారిపోయి కార్ల వసతి కలిగింది.... వచ్చి పోయె వారికెల్ల వనరు బాగ కుదిరింది.... బిచ్చగాళ్ల బొచ్చలోన గచ్చకాయ పడింది..తిరుపతి వెంకటేశ్వరా దొరా నివే దిక్కని నమ్మినామురా.. ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు, ద్వారాలు, అందమైన ఉద్యాన వనాలు, ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలు జరుగు తున్నాయి. ఇక్కడ శ్రీ వారి పాద మండపం అని ఒక ఆలయమున్నది. ఇక్కడ శ్రీ వారి వెండి పాదుకలను తలమీద పెట్టుకొని తమ భక్తిని చాటు కుంటారు. దానికి కొంత రుసుమును వసూలు చేస్తారు.
అలిపిరి వద్ద తలయేరు గుండు, శతాబ్దాల నుండి భక్తులు ఈ గుండుకు తమ తలను, మోకాళ్లను తాకించి మొక్కినందున దానికి గుంటలు పడి వున్నాయి గమనించ వచ్చు.
తలయేరు గుండు
మెట్ల దారినే సోపానమార్గం అంటారు.
పాదాలమండపం
ఇక్కడి నుండి కొండపైకి మెట్లు మొదలవుతాయి (అలిపిరి అంటే మెదటి మెట్టు అని ఒక అర్దం) . ఇక్కడ వేంకటేశ్వరుని మరియు జయవిజయుల విగ్రహాలు ఉన్నాయి.1990 వ దశకం వరకూ ఇక్కడ స్వామివారి పాదాలు మాత్రమే వుండేవి. స్వామి కొండ పైకి ఎక్కేప్పుడు మెదటి అడుగు ఇక్కడ పెట్టారని ఒక ప్రతీతి. ఇక్కడి పాదాల మడపంలో స్వామివారు కొండకు ఎక్కేప్పుడు పాదరక్షలతో వెళ్ళకూడదని తన పాదరక్షలు ఇక్కడ వదలి వెళ్ళారని అంటారు.నేటికీ ఇక్కడ స్వామివారి పాదరక్షలని చెప్పబడే తోలు చెప్పులు, వాటికి నకళ్ళు అని చెప్పబడే ఇత్తడి చెప్పులూ ఉన్నాయి.
తలయేరుగుండు
కొండ ఎక్కేవారు తలయేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను, మోకాళ్లను తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో వాటిని చాల స్పష్టంగా చూడవచ్చు. గతంలో అంట రాని వారు తిరుమలేసుని గుడి లోనికి వచ్చేవారు కాదు. కనీసం ఏడు కొండలను కూడా ఎక్కేవారు కాదు. అలా చేస్తే అది మహా పాపమని భావించే వారు. అలాంటి వారు ఈ తలయేరు గుండు వరకే వచ్చి తమ తలను ఈ గుండుకు తాకించి అక్కడి నుండే స్వామి వారికి నమస్కరించే వారు. అంతకు మించి వారు ముందుకి వెళ్లె వారు కారు. అంట రాని వారు ఇక్కడ మెట్లమీద సాస్టాంగ పడి స్వామి వారికి నమస్కారం చేసే వారు. అలాంటి సాస్టాంగ నమస్కార ముద్రలో వున్న అంట రాని వారి శిల్పాలు ఇప్పటికి అక్కడ మెట్లపై ఉన్నాయి. మెట్ల దారిలో వెళ్లె వారికి ఇవి సుపరిచితమె. ఇక్కడి నుండి పైనున్న గాలి గోపురం వరకు మెట్లు చాల ఎత్తుగా వుంటాయి. వాటిని ఎక్కే టప్పుడు మోకాళ్ల నెప్పులు పుట్టేవి. మెట్లు ఎక్కే భక్తులు తమ మోకాళ్లను ఈ గుండుకు తాకించి ఎక్కితె మోకాళ్లు నెప్పులు వుండవని భక్తులు నమ్మె వారు. దానికి మోకాళ్ల మెట్లు, లేదా మోకాళ్ల కొండ అని పిలిచే వారు. ప్రస్తుతం మెట్ల దారి ద్వారా వెళ్లె భక్తులకు కొంత వెసులు బాటు ఉంది. వారి సామానులను ఉచితంగా వాహనాల ద్వారా పైకి చేర్చడము, నడచి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడము వంటివి అమలులో ఉన్నాయి. అదియును గాక ఎండకు వానకు రక్షణగా మెట్ల దారి వెంబడి పైకప్పు నిర్మించి ఉన్నారు. అక్కడక్కడా త్రాగు నీటి వసతి, విశ్రాంతి కొరకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
గాలి గోపురం
ఈ కొండ కొన బాగాన వున్న ఒక గోపురానికి విద్యుత్తు దీపాలతో తిరు నామం ఆకారంలో నిర్మించారు. అది రాత్రులందు చాల దూరం వరకు కనిపిస్తుంది. తిరుపతికి ఇదొక అలంకారం.
తోవ భాష్యకారుల సన్నిధి
కురువ మండపం
ఇక్కడ తొండమాను రాజుల కాలంలో కురువనంబి అనే భక్తుడు శ్రీనివాసుని నైవేద్య వంటకు కావలసిన కుండలు చేసేవాడట. అతను అక్కడే ఒక కొయ్యతో స్వామి వారి విగ్రహాన్ని చేసి, దాన్ని మట్టితో చేసిన పూలతో పూజించేవాడట. అక్కడ తిరుమలలో స్వామి వారిని రాజు బంగారుపూలతో పూజించినపుడు ఆపూలు తొలగి ఈమట్టి పుష్పాలు కనిపించేవట. అన్నమయ్య "కొండలలో నెలకొన్న..."లో "కుమ్మరదాసుడైన కురువరతినంబి" అని రాసింది ఈయన గురించే. స్వామివారు ఈ నంబి వద్ద మట్టి కుండలోని సంగటి తినేవారట. నేటికీ తిరుమలకొండపై స్వామి వారికి (బంగారు పాత్రలు ఎన్ని వున్నా) మట్టికుండలోనే నైవేద్యం సమర్పిస్తారు. ఈకురువ మండపంలో కుండలు చేసే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి.
యోగ నరసింహస్వామి
నామాల గవి
నడక దారిలో వున్న అవ్వాచారికోన దగ్గర వున్న పాతమెట్ల దారి దగ్గర వుంది ఈ 'నామాల గవి' అనే సహజ సిద్దమైన గుహ రామానుజులకు పూర్వం స్వామివారి నామానికి శ్వేతమృత్తిక (నామంసుద్ద) ను ఈ గుహ నుండే తీసుకువచ్చేవారు. రామానుజుల వారి కాలంలో స్వామివారి మతం గూర్చి తగాదా వచ్చిన తరువాత రామానుజులు స్వామివారి నామం దూరం నుండి కూడా స్పష్టంగా కనపడేట్లు పచ్చకర్పూరంతో పెట్టాలని కట్టడి చేసారు.
శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి
ఇక్కడ 30 అడుగుల శీప్రసన్నాంజనేయస్వామివారి విగ్రహం వుంటుంది. ఈస్వామికి రోజూ అర్చన నివేదనలు జరుగుతాయి. హనుమజ్జయంతి రోజున ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ టిటిడి వారు అభివృద్ధి చేసిన ఉద్యానవనాలు ఉన్నాయి.
అలిపిరి వద్ద మెట్లదారిలో శ్రీవారి పాద మండపం అను ఒక ఆలయం ఉంది. ఇక్కడ శ్రీవారి పాదుకలు, బంగారం వి, వెండి వి ఉన్నాయి. కొంత రుసుం చెల్లించి ఆ పాదుకలను భక్తులు తమ తలమీద వుంచుకొని భక్తితో మనస్కరిస్తారు.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords:
Devasthanams,Tirupati Balaji Temple,Tirumala Temple History,tirupati temple history,tirupati accommodation,tirupati Venkateswara Swamy story,tirumala temple secrets,tirupati temple history,tirupati balaji story,tirumala temple secrets,kapileswara swamy temple,lord venkateswara story in telugu,Varahaswamy Temple,tirupati temple darshan online booking,lord venkateswara story in telugu,venkateswara swamy temples,Accommodation in Tirupati,tirupati balaji photos,Pancharama Kshetras,lord venkateswara hd wallpapers,TTD, TTD online Room Booking,TTD Accommodation,Tirumala Accommodation,Tirupati Rooms,Tirumala Rooms,TTD Rooms,Tirupati Loddu,Srivari Metlu,Srivari Padalu,Alipiri,Alipiri Rout,Alipiri Metlu,Venkateswara Swamy Songs.Tourist Places In Tirupati,Kapilatheertham,Most Historical Place Kapila Theertham Temple In Tirupati,Kapila Theertham Tirumala,Kapila Theertham Tirumala information in telugu,Kapila Theertham WaterFalls Tirupati,Sri Kapileswara Swamy Kapila Theertham Temple History ,Kapila Theertham Temple Timings,Kapila Theertham Temple Tirupati , Sri Kapileswara Swamy Temple,Tirupati Balaji Temple,alipiri to tirumala by foot,alipiri to tirumala by foot,By Walk to Tirumala, Alipiri Mettu, Srivari Mettu,alipiri footpath timings,tirumala footpath way,Alipiri Footpath Rout,Silathoranam in Tirumala,Papavinasam Theertham ,Japali Hanuman Temple,Japali Theertham ,SriVari Padalu Tirupati,Akasha ganga Tirumala,kapila theertham, 24 Best Places to Visit in Tirupati
Comments
Post a Comment